మనుషుల అస్థిత్వం అబద్ధమై అనుబంధాలు అస్థిపంజరాలౌతున్నాయి
మనుగడకు నాగరికత తోడై రెడీమేడ్ రిలేషన్స్ రాజ్యమేలుతున్నాయి..
మనిషి జీవనశైలి ఆదిమానవుల కాలంనాటికి పరుగులెత్తి పోతున్నాయి!
ఇంట్లోకి బయటగాలి చొరబడకుండా మూసి ఏసీ యంత్రభూతాలున్నాయి
పెరట్లో పెరగాల్సిన మొక్కలు కుండీల్లో చేరి తడారకుండా తడుస్తున్నాయి
అంగట్లో ఆహారానికి బదులుగా ఆర్టిఫిషల్ అనురాగాలమ్ముడౌతున్నాయి..
ముంగిట్లో తచ్చాడాల్సిన చుట్టరికాలు మెస్సేజ్ రూపంలో మెరుస్తున్నాయి!
అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనుకునేమాటలే కరువైనాయి
అందరూ అంటే తాను మాత్రమే అనే స్థాయికి ఆలోచన్లు దిగజారిపోయాయి
అందరూ ఎవరికి వారే గిరిగీసుకుని బ్రతికేలా పధకాలు నిర్మితమైనాయి..
అందరి ఆలోచనా ధోరణిప్పుడు నేను నాదన్నట్లు రూపాంతరం చెందినాయి!
మనం ఎలా అనుకుంటే అలాగే లోకం అనిపిస్తుంది కదండీ.
ReplyDeleteManamoo marali
ReplyDeleteమార్పనేది సహేతుక చర్య కావాలి
ReplyDeleteమార్పనేది మంచికి పునాది కావాలి
మార్పనేది ఎక్కడో ఎప్పుడో మొదలయ్యేది కాదు
మార్పనేది మనలో మన మంచికై పాటుపడే సూచి కద్దు
~శ్రీత ధరణి
మార్పు జీవితంలో తప్పనిసరి. జీవితం అంటే అనుభవాల మార్గనిర్దేశకత్వంలో ముందుకు సాగే వివిధ దశల క్రమం. జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవడం, తదనుగుణంగా అవసరమైన మార్పులతో లక్ష్యాలను ఏర్పరుచుకోవడం, తదనుగుణంగా జీవితాన్ని ముందుకు సాగించటం ప్రధానం...అశీర్వచనాలతో-హరినాధ్
ReplyDeleteఎవరికి వారు స్వార్థంతో మసలే ఈరోజుల్లో మార్పు తప్పదు. దాన్ని వారికి వారు అనుగుణంగా మార్చుకుంటారు. ఇతరులని బాధపెట్టనంత వరకూ మార్పు అంగీకారమే సుఖవంతమైన జీవితం... ఇలాంటివే పూర్తిగా అర్థవంతమైన జీవితమని చెప్పలేము. జీవితం వీటన్నింటికీ మించినది. అందరితో పంచుకోవటం, అందరి పట్ల శ్రద్ధ వహించటం, ప్రేమాభిమానాలు అందరికి పంచడం, ఇతరుల జీవితాలను అదరించటం వంటి అనేక ఇతర సూత్రాల ఆధారంగా ఉన్నతమైన అనుభవాల సమ్మేళనంగా జీవితం ఉండాలి. సంఘ జీవిగా మన భవిష్యత్తు, మనతో కలిసి జీవించే వారందరి సమిష్టి పురోగతి మీద ఆధారపడి ఉంటుంది.
ReplyDeleteమీతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. లోకం మంచి వైపే కదలాలని ఆశ పడేవాళ్ళలో నేను కూడా ఒకణ్ని.ఈ సమాజంలో ఇప్పటికీ మంచి వాళ్ళను వెతికి పట్టుకున్నా వారు కూడా నిస్పృహతో ఇప్పటి పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అని సతమవుతున్నారు.
Deleteనిజమే అనంతు గారు: నిన్నటి నులకలమ్మ నేడు హంసతులితల్పశాయని ఆయే
Deleteఐనను ఆ హంసతులితల్పము దెచ్చి స్థాయి పెంచిన వాడిపై అపుడపుడు కసురుతూనే ఉంటుందిట
నిన్నటి కడుపుబ్బరం కాస్త నేడు అతిసారమై నిలువనీక పరుగులు పెట్టిస్తూనే ఉంటుందిట.
మంచి మార్పును కోరుకుందాం మనం కూడా..
ReplyDeleteఎవరికి వారే గిరిగీసుకుని బ్రతికేలా పధకాలు
ReplyDeleteVery nice and true
Change is an inevitable part of life.
ReplyDeleteIt happens whether we’re ready or not.
అన్నీ నిజాలే
ReplyDeleteLife truth
ReplyDeleteమొదటి రెండు లైన్లు భలేగా నచ్చేసాయి.
ReplyDeleteఅందరికీ వందనములు
ReplyDelete