సౌందర్యమంటే!?


అందం అంటే ఏమిటని కలిగె సందేహం
బహుశా అందమైన శరీర సౌష్టవమేమో
కాదు తెల్లని పాలరాతిలాంటి లావణ్యమా
అంతకు మించి అతిసౌందర్య రూపమా!?

చూసే దృష్టికోణాన్నిబట్టి మారును అందం
అంధుడు చూసే అందానికి కొలమానమేది
మనసుతో చూసి మాటల్లో చెప్పలేనివాడు
మూగసైగల సంకేతాలకు రూపం ఉందా!?

పేదవాడికి శ్రమపడిన ఆదాయమేగా అందం
చెవిటివాడు చూపే కంటి హావభావాల్లో లేదా
ఆలోచిస్తే చూడలేని మనసూ అందమే కదా
తాత్వికవాదంతో కంటికి నచ్చిందే అందమా!?

స్త్రీ సహనశీలతలో దాగుంది బోలెడు అందం
మగవాడి అందం మంచిమానవత్వంలో లేదా
పిల్లల అందం వారి బోసినవ్వుల్లో కనపడదా
జీవిత సౌందర్యం ప్రేమలోనే దాగిందందామా!?

అస్తిత్వంతో కూడి నిగ్రహించుకున్నదేగా అందం
శారీరక సౌందర్య ప్రమాణాలు కేవలం అహ్లాదం
సత్యసంఘర్షణాస్ఫూర్తిసృష్టే సౌందర్య నిర్వచనం
మరణం యొక్క అందం జీవించడమే కదా!? 

31 comments:

  1. గొప్ప తాత్వికత్వాన్ని భోధించారు ....అభినందనలు

    ReplyDelete
  2. అందం అంటే కనులతో చూసేది మాత్రమే కాదు.అంటే పైకి అందంగా ఫేస్ పౌడర్ దట్టించి మేకప్పు చేసుకుని కాదు. హృదయ...అలా మన శరీరాకృతి కాదు, యెదటివారు చూసేది, మన మంచితనం, మాట తీరు, వినయం....మనసులోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు....

    ReplyDelete
  3. Andam aneadi bhautikam
    manasu nirmalam unte lokam anta andame

    ReplyDelete
  4. అన్ని అందాలు కూడా మనిషి కంటి చూపు ముందు దిగదుడుపు మాడంజీ

    ReplyDelete
  5. andam choodamu manasu manchitanam choostam antaru..anta abhadham
    evaraina mundu mukham chustaru adi nachithene matladataru.
    ....
    ....
    ....
    .....
    nenu mundastu mukham chuse matladatanu.

    ReplyDelete
  6. మంచి భావం వ్రాసారు
    వాస్తవాని అందంవైపు మొగ్గుచూపుతారు ఎవరైనా, ఇది నా అనుభవం కూడాను.

    ReplyDelete
  7. అస్తిత్వంతో కూడి నిగ్రహించుకున్నదేగా అందం

    ReplyDelete
  8. సౌందర్యమంటే బాహ్యంగా కనిపించి ఊరించేది కాదు
    సౌందర్యమంటే కాయానికి సంబంధించింది కానే కాదు
    సౌందర్యమంటే పైపైన పూతవేసి మిరుమిట్లు గొలిపేది కాదు

    సౌందర్యమంటే తనువుకు మనసుకు గల ఆత్మీయత
    సౌందర్యమంటే ఆంతరంగిక భావాల కలయిక
    సౌందర్యమంటే వారి వారి అస్తిత్వానికి గల రూపురేఖ

    ~శ్రీత ధరణి

    ReplyDelete
  9. అందం కావాలంటే బాహ్య రూపం చూడు
    మనిషివి అయితే మనసును చూడు...
    మానవత్వం కావాలంటే మంచిని పంచు
    మంచి మానవత్వం కలిపితే దేవుడు చూడు

    ReplyDelete
  10. Andam untene attract chesi love lo padestaru...tokkalo love paddavadu paiki radu :)

    ReplyDelete
  11. అద్భుత భావాలు పలికించారు

    ReplyDelete
  12. andam chudamma andinchamma

    ReplyDelete
  13. అందరిలో ఏదో ఒక సౌందర్యం తప్పక దాగి ఉంటుంది
    దాన్ని వెలికి తీసి ఆనందించడం మనిషి చేయవలసింది

    ReplyDelete
  14. పేదవాడికి శ్రమపడిన ఆదాయమేగా అందం

    ReplyDelete
  15. అధ్భూతాక్షరాల్తో అలరిస్తున్న మీకు నమస్సుమాంజలి....

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అర్పిత గారు.
    https://padmarpitafans.blogspot.com/2020/12/y-birth-day-padmarpita-garu.html

    ReplyDelete
    Replies
    1. అందమైన భావాలకు అక్షర ఆకృతులను చేర్చి
      కనుల సొంపైన బొమ్మలతో విందులు చేసే...
      కవయిత్రి "పద్మార్పిత" కు జన్మదిన శుభాకాంక్షలు

      Delete
  16. సౌందర్యం సంస్కారంలో వెలుగును ఇస్తుందండీ.

    ReplyDelete
  17. అన్ని అందాలు నీ సొంతం కావాలని కోరుతూ...

    ReplyDelete
  18. The life that we left behind was beautiful, benevolent, bewildering and baffling; the life that is in front of us may be frightening, frugal or fabulous; The life in present must be plausible and persuasive.

    ReplyDelete
  19. సత్యసంఘర్షణాస్ఫూర్తిసృష్టే సౌందర్య నిర్వచనం
    వాహ్ వా...అహో అహో

    ReplyDelete
  20. స్త్రీ సహనశీలతలో దాగుంది బోలెడు అందం...అవునా ఇది ఎంతవరకూ నిజం???

    ReplyDelete
  21. అస్తిత్వంతో కూడి నిగ్రహించుకోవడం బహుకష్టం. చాలా అందంగా సెలవిచ్చారు .

    ReplyDelete
  22. జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  23. హృదయపూర్వక అభివందనములు ప్రతీ ఒక్కరికీ _/\_

    ReplyDelete
  24. అందానికే అందం మీ అక్షరాలు పద్మార్పితగారు

    ReplyDelete
  25. టైటిల్ కు జవాబు...మీ కవితలే :)

    ReplyDelete