వ్యర్థం..

మాట్లాడని మనస్సు ఎన్ని జాగ్రత్తలు తీసుకునేం ప్రయోజనం
కంటితో చూసి మనసు మాటవినకున్నా జారుతూ ఉంటుంది
కలలరెక్కలు కట్టుకుని ప్రతి మదికొమ్మపై వాలేం ప్రయోజనం
లోన ఇమడలేక గుట్టు అతిరహస్యం బట్టబయలు అవుతుంది
సమీక్ష సుగంధాలుగా వెదజల్లు సౌందర్యం ఉండేం ప్రయోజనం
చుంబన ఆలింగనాలతో అక్కడిక్కడ తాకితే మైల పడిపోతుంది
నియమ నిబంధనల్లేని బాహ్య సరస సయ్యాటలేం ప్రయోజనం
సహన స్వచ్ఛతలేని సల్లాపం బూడిదలో పోసిన పన్నీరౌతుంది
గుప్పిట్లో మేను దాచి నగ్నసొగసు దాచాననుకునేం ప్రయోజనం
తనువుపై తనువు హస్తాక్షరం తామరాకుపై నీటి బొట్టవుతుంది
భగ్గుమంటున్న వ్యధాగ్నిపై గుగ్గిలం చల్లి మాత్రమేం ప్రయోజనం
ఒకక్రుంగిన మనసే మరోమనసుని క్రుంగిపోనివ్వక కాపాడుతుంది 

16 comments:

  1. మనసుని అర్థం చేసుకో కుంటే వ్యర్థం
    మాట పదాలకు పెడదోవ పట్టిస్తే వ్యర్థం
    ఏదేమైనపటికీ అర్థం వ్యర్థం వ్యత్యాసమైతే అనర్థం

    ReplyDelete
  2. అద్భుత వాక్యాలు చిత్రము .

    ReplyDelete
  3. Very hard to get
    Nice art pic.

    ReplyDelete
  4. పద్మా అన్నీ ప్రయోజనం ఆశించి చేసే పనులే ఉంటాయి అనుకుంటే ఎలా...కొన్ని నిస్వార్థంతో చేయవలసి ఉంటుంది.

    ReplyDelete
  5. Beautiful pic and depth meaningful words from you.
    Belated birthday wishes.

    ReplyDelete
  6. భగ్గుమంటున్న వ్యధాగ్నిపై గుగ్గిలం చల్లటమే చాలావరకు లోకం తీరు...మంచి కవిత పద్మార్పితా

    ReplyDelete
  7. ఒకక్రుంగిన మనసే మరోమనసుని కాపాడుతుంది correct

    ReplyDelete
  8. Tough to understand andi
    Picture is extraordinary

    ReplyDelete
  9. కలలరెక్కలు కట్టుకుని ప్రతి మదికొమ్మపై వాలేం ప్రయోజనం-దీని అర్థం మనం కనే కలలు మనమే సహకారం చేసుకోవాలి ఎదుటివారికి చెప్పుకుని ప్రయోజనం లేదనా అండి పద్మార్పితగారు.

    ReplyDelete
  10. గుప్పిట్లో మేను దాచి నగ్నసొగసు దాచాననుకునేం...సుపర్ వ్రాసారు

    ReplyDelete
  11. Kashtamaina padalu jeevitam tho mudipadinayai.

    ReplyDelete
  12. ఇంత భారమైన భావాలను
    నవ్వుతూ ఎలా చెప్పగలిగినారు
    మీరు అర్థం కారు సుమా....

    ReplyDelete
  13. అమూల్య భావవ్యక్తీకరణ. అభినందనలు

    ReplyDelete
  14. అభివందనములు అందరికీ

    ReplyDelete