మనసంతా నింపి మనసులో దాగున్న నన్ను పైకి చూపలేక
అనురాగాన్ని చూపించే అనువైన రోజేదని ఆత్రుతగా అడిగితే
చెంతనలేని మనిషి మనసులో దాగి ఏమిచేయాలో తెలియక
తికమకపడి తీవ్రంగా ఆలోచించి మనసున ఉన్నది చెప్పాను!
మనసు నిండుగా నన్ను నిలుపుకున్న నా మనసైన వాడా
అనురాగానికి ఆదీ అంతమూ అంటూ ఏమున్నది చెప్పు!?
ప్రత్యేకించి చూపాలనుకుంటే నా ఊపిరి ఉండగా వచ్చి చూసి
మరణించే ముందు నాతో ముచ్చటించమని అంటున్నాను!
మనసులో దాచుకున్న మమతను దించి వేసుకునే దారిలేక
అడిగితే ఇచ్చేది ప్రేమా? మరణించేదెప్పుడో చెప్పమని అడిగితే
ప్రశ్నకు జవాబు అడుక్కుని మరీ ప్రేమను పొందటం చేతకాక
తెలివైన నీ ప్రశ్నకు తెలివిలేక ఇలా సమాధానం ఇస్తున్నాను!
మనసువిప్పి చెప్పలేని మమతలు బియ్యంలోని రాళ్ళు కదా
ఏ ప్రాణం ఎప్పుడెలా పోతుందో ఎవరు చెప్పగలరు చెప్పు!?
అందుకే నిర్దిష్టంగా సమయాన్ని నిర్దేశించి వలపు కురిపించక
ప్రాణంపోయే వరకు ప్రతీరోజూ చెంత ఉండాలని కోరుతున్నాను!
మరో ప్రేమ కావ్యమా లేక కండిషన్ ఆ?
ReplyDeleteమరణించే ముందు ముచ్చటించటం...నూతన ఊహారచన బాగుంది.
ReplyDeleteBeautiful picture with lovable lines.
ReplyDeleteచచ్చేంత వరకూ విడువకు అని డైరెక్టుగా చెబితే వింటాడేమో గురుడు. అసలే కంఫ్యూజ్ లో ఉన్నాడు...ఏమంటారు?
ReplyDeleteమీ భావవ్యక్తీకరణ బావుంది పద్మగారు
ReplyDeleteమనసువిప్పి చెప్పలేని మమతలు బియ్యంలోని రాళ్ళు excellent.
ReplyDeleteతెలివైన నీ ప్రశ్నకు తెలివిలేక ఇలా సమాధానం ఇస్తున్నాను, హన్నన్నా..ఎంతమాట తెలివైన జవాబు ఇచ్చారు.
ReplyDeleteభావం మెండు.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteidemito artham kani gandaragolam.
Deletevankalu vetike varitho em chepina sardi cheppinatlu untundi.
ReplyDeleteBeautiful picture on wall
ReplyDeleteమనసువిప్పి చెప్పలేని మమతలు బియ్యంలోని రాళ్ళు new quote to think.
ReplyDeletemanasuku mamatalaku linkpedithea jarugubatu ayye kalamaa idi. tappani sari paristitulloe andaroo maravalasindea. manishi jeevitamloe annee kavalsinde. I like this post and your blog also.
ReplyDeleteమంచితనాన్ని చేతకానితనంగా చూపుతూ
ReplyDeleteహేళనకే పెద్ద పీట వేసి సంతృప్తి పడేవాళ్ళ కంటే
పంటిబిగువున అవమానాన్ని సహిస్తూ
ఎదుటివారి చేష్టలకు పరాకాష్టను భరిస్తూ నిటూర్చే కంటే
తమలో ఉన్న చెడు తత్వాన్ని కప్పి పెడుతూ
తమ వెంట నడిచేవారి కాలు వంకరంటు హేళన చేసే కంటే
andamaina painting tho koodina aksharamala
ReplyDeleteచిత్రములో
ReplyDeleteనిండు పున్నమిలో
చూడ ముచ్చని జంట.
_/\_పద్మార్పిత వందనమస్తు_/\_
ReplyDeleteఏదైనా ఊపిరి ఉన్నంత వరకే..
ReplyDeleteSo lovely words.
ReplyDeleteVah vaa
ReplyDeleteNice blog