మోహపు దారాలు వేళ్ళ మధ్య చిక్కుకునె
ముడి విప్పలేక రోమాలు నిక్కబొడుచుకునె!
నా పిచ్చి ప్రేమ ఎందుకో నిన్ను ఎంచుకునె
చెప్పని మాటలెన్నో చెప్పినట్లు ఊహించుకునె!
నీవు పగలైతే నేను నువ్వెళ్ళితే వచ్చే రాత్రినె
ఇద్దరి ఆశలూ సాయంత్రం కలవాలని కలగనె!
చెప్పే ఊసులు అబద్ధాలైనా నామది నిజమనె
సత్యాన్ని చూద్దామంటే దూరంగా తానుండెనె!
కలువకు సూర్యుడు మిత్రుడైనా దూరముండెనె
వెర్రి వ్యామోహం పుట్టి కువలయము కృంగెనె!
నీటిలోలేని కమలం కమలాప్తుని రశ్మికి వాడెనె
పంకమంటని పద్మ వీచే గాలికి కొట్టుకుపోయెనె!
వారిజ అంటే నీరజ...అనగా తామర పువ్వు దానికి వరులు ఎవరు?
ReplyDeleteచిత్రము అర్థవంతముతో కూడి విచారంగా ఉంది...అయినా బాగుంది
GOD BLESS YOU
ReplyDeletekamalam sun rays ku vikasinchunu kadandi mari vairam ela iddaru friends ayinappudu.
ReplyDeleteనిఖార్సైన నిజం ఏమంటే
ReplyDeleteబురద గుంటలో వికసించే పువ్వని కమలానికి పేరు
కాని
సూర్యుని కాంతికి విచ్చుకుని మురిసేదనేదే నిజం
నిఖార్సైన నిజం ఏమంటే
జాబిలి కాంతిలో కల్మషం లేని ధవళముంటుందని ఖ్యాతి
కాని
వసివాడని జాబిలి వెన్నెలకు అమవస పున్నములు వేరుకాదనేదే సత్యం
అలానే
జీవితాన సుఖదుఃఖాలు భాగాలే
జీవితాన గిల్లికజ్జాలు సర్వసాధారణమే
జీవితాన మాయూసి ఖుషి సరిసమానమే
జీవితాన కలిమి లెమ్ములకు కృంగరాదనేదే
~శ్రీ
చిత్రం విచార వదనం.
ReplyDeletePadma why so depressed?
ReplyDeleteDon't think much..be happy
మోహపు దారాలు వేళ్ళను కట్టివేసే
ReplyDeleteమనసు ముందరి కాళ్ళకు బంధం వేసెను కదండి
మనసుని తాకే వాఖ్యాలు.
వారిజ వైరి = కమలానికి శత్రువు (సూర్యుడు) అమ్మో...అద్భుతం పద్మా నీ ఆలోచనల్లో కమలం నిగారింపు భేషుక్!
ReplyDeleteEmotional touch
ReplyDeleteకమలాప్తుడు అంటే సుర్యుడు..
ReplyDeleteఅతనితో వైరం తగదు, కమలానికి సూర్యుడు ఎంత దూరాన్న ఉన్నా తామర విప్పారక మానదు.
పరిపూర్ణమైన గజల్
ReplyDeleteపగలు రాత్రి ఇద్దరూ అయితే కలిసేది ఎలా?
ReplyDeletevinta vairam
ReplyDeleteNice poetry
ReplyDeleteArtham karu ila aithe
ReplyDeleteనీటిలో కమలం.
ReplyDeleteశ్వేత పద్మానికి మనో నిబ్బరం కలదని విన్నాను
ReplyDeleteమరి ఏమాయేనో ఆ ధైర్యం...ఇటువంటి నిరుత్సాహపు కవితలు ఎవరికోసం?
అందరికీ పేరు పేరునా అభివందనములు _/\_
ReplyDeleteవిచార వేదనలకు స్వస్తి పలుకు 2020
ReplyDelete