ఎవరూ అడక్కముందే అన్నీ చెయ్యరు
నాటినవారు నీరు పోస్తారనుకుంటే పోయరు
నాటినవారు వారి చెట్టుఫలాన్ని వారు తినలేరు
మన కష్టనష్టాలకు ఇంకెవరో బాధ్యులుకారు
మన కన్నీటిని వేరెవర్నో త్రాగమన్నా త్రాగలేరు
ఆనందం పంచు అప్పుల్ని పంచితే అంగీకరించరు
కార్యాచరణకు కృషి చెయ్యాలని చెబుతారు
పనైయ్యిందంటే వారు చెప్పబట్టే అయ్యిందంటారు
లేకుంటే మనప్రయత్న లోపమని మనపై నెట్టేస్తారు
ఎవ్వరూ ఇంకొకరి కోసము ప్రాణాలు వీడరు
కడ వరకూ తోడని కల్లబొల్లి కబుర్లు చెబుతారు
మనమది స్థానంలో మరొక మనసుని అమర్చలేరు
ఊపిరున్న మనిషిని కలిసి ఊసులు చెప్పనివారు
చనిపోయిన తరువాత ఆత్మకెందుకు శాంతి చేస్తారు
ఏమైనా ఒంటరిగా వచ్చి ఒంటరిగానే పోతారు అందరూ!
పుట్టిన వేళ చుట్టు జనం గుమ్మి గూడుతారు
ReplyDeleteవారెవరో తెలియదు.. అమ్మ, నాన్న, నానమ్మ, అమ్మమ్మ తప్ప
గిట్టిన వేళ మన చుట్టు జనం గుమ్మి గూడుతారు
పాడెను భూజాన ఎత్తి చితి పేర్చేదాక
వారెవరెవరో తెలుసుకోవాలన్న ప్రాణం ఉండదు
చేసిన ధర్మం పుణ్యం పురుషార్థం నిజంగా
ఒకరికి బ్రతికి ఉన్నపుడు చేకూరాలి
చివరాఖరున మిగిలేది గుప్పిట బూడిదే
అదీ ఏ గాలికి ఎగిరి పంచభూతాలలో కలసి పోవాల్సిందే
మంచి మర్యద బ్రతికున్నపుడు పంచి పెడితే
జీవితాంతం గుర్తుంటుంది.. చచ్చాక ఉనికే లేదుగా
పని అయితే చేసింది మేము అంటారు
ReplyDeleteపని కాలేదంటే మనది తప్పు అంటారు
ప్రతి ఒక్కరికీ అనుభవమే అనుకుంటాను
జీవిత సత్యాలు అక్షారాల్లో బాగా చెప్పారు
కోరికలు, ఆచరణలు, విభిన్న ధృవాలు.
ReplyDeleteపాత సూక్తులే అయినా వ్రాసిన తీరు బాగున్నది.
ReplyDeleteAkasani nichchena vesi chukkalni pattukuntara?
ReplyDeleteమనం చేసిన కర్మని ఎవరూ అనుభవించరు..SSSSSSSSS
ReplyDeleteఊపిరున్న మనిషిని కలిసి ఊసులు చెప్పనివారు-సత్యం
ReplyDeleteఆకాశానికి నిచ్చెన వేసారా...ఎగిరిపోవాలని???
ReplyDeleteఎవ్వరూ ఇంకొకరి కోసము ప్రాణాలు వీడరు, కడ వరకూ తోడని కల్లబొల్లి కబుర్లు చెబుతారు..true
ReplyDeleteThat is real Life :)
ReplyDeleteమనమది స్థానంలో మరొక మనసుని అమర్చలేరు..సున్నితభావం
ReplyDeleteమనం చేసుకున్నదే మనకు తిరిగి దక్కుతుంది.
ReplyDeleteఎవరికి వారే చూసుకోవాలి
ReplyDeleteఎవరికి ఎవరూ తోడు ఉండరు
మింగుడుపడని సత్యాలు పద్మాజీ
Madam Prabhu pai kavitanu rasi krupanu pondavale.
ReplyDeleteమీ అందరి అభిమాన ఆశిస్సులతో ఎత్తుకు ఎదగాలని కోరుతూ...మీ పద్మార్పిత
ReplyDeleteప్రభావవంతమైన పదాలని పేర్చి వ్రాసే మీ కవితలు మీ పవిత్రమైన హృదయాన్ని పదునైన మీ ఆలోచనా శక్టిని ఆవిష్కరించుచున్నవి.
ReplyDelete