నమ్ముకున్న నమ్మకాలు మదిలో నలిగినా నేను
పలుసార్లు పిప్పి కాక అంతమైనా హాయిగుండాలి!
ఎంతో సుదీర్ఘ ప్రయాణం చేసి అలసిసొలసిన నాకు
మొదలు ముగిసి నిద్రలో అంతా అంతమై పోవాలి!
ఎవ్వరూ లేని రాలేని చోట పోయిన ప్రాణంతో నేను
ప్రశాంతంగా తప్పులని ఆత్మపరిశీలన చేసుకోవాలి!
దేహదాహ ప్రలోభ కాంక్షలకు ఎంతో లొంగిన నేను
మంతనాలు జరిపే మనిషికి కనబడకుండా పోవాలి!
ఎన్నో ఉషోదయాలు నిద్రపోయి వ్యర్థం చేసిన నాకు
స్వగతాలు స్మశానం చూస్తానన్న కోరికను తీర్చాలి!
అధ్భుతహాః
ReplyDeleteమరణం అంత సులభంగా సుఖంగా ఉండదు జీ.
ReplyDeletePadma simply superb hats off
ReplyDeleteఆది అంతం కూడా మనం అనుకున్నట్లు కోరుకున్నదిజరుగదు. అదే జీవితం. ఫోటొ పెయింటింగ్ అమ్మాయి నా కనులను కట్టిపడేసింది.
ReplyDeleteఆద్యంతాలు ఆద్యాంతం మనకు వెసులు బాటయ్యేవి కావు
ReplyDeleteఆద్యంతాలు అమాంతం మనకు తెలిసి వచ్చేవి రానివి కావు
ఆద్యంతాలు వాటికవే మొదలుకుంటాయి తట్టుకుంటాయి
ఆద్యంతాలు వాటినవే పెనవేసుకుంటాయి విడిచి పెడుతుంటాయి
ఆద్యంతాలు ఉజ్వలత్వానికి తామసానికి ప్రతీకలు
ఆద్యంతాలు అక్షరభావానికి మనసు మౌనానికి ప్రతిరూపాలు
~తశ్రీ ణిరధ
ఏమి మీలో ఈ వైరాగ్యం
ReplyDeleteఎందుకు ఈ నిరుత్సాహం
చిత్రము చూడ కడురమ్యం
వాక్యాల్లో వద్దు వేదాంతం..
స్వగతాలు స్మశానం చూడాలి అనుకుఓవడం వ్యధాభరితం.
ReplyDeleteమంచి చావు రావాలని కోరుకోవడం పరిపాతే అందరికీ...చేసుకున్న వారికి చేసుకున్నంత...రావాలి కదా! అయినా మీరు అప్పుడే చావుని గురించి ఆలోచించడం ఏమిటి వెర్రి కాకపోతేనూ.............
ReplyDeleteచావు పుట్టుకలు మన చేతిలో లేవు.
ReplyDeleteదేహదాహ ప్రలోభ కాంక్షలు :)
ReplyDeleteపద్మార్పితగారు మీ పిక్ నేను వాడుకోవచ్చునా?
ReplyDeleteమనం మరణించినప్పుడు ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నామే అని లోకం మనకోసం ఏడవాలి. ఇది జరగాలంటే మన జీవన నడవడిక మారాలి అంతే కానీ ఇలా హాయిగా చనిపోవాలి స్మశానానికి నవ్వుతూ వెళ్ళాలి అనుకోవడం సబబు కాదు.
ReplyDeletechitti gunde
ReplyDeletegattiga kottukunnadi
mee kavita chadivi..
హృదయాన్ని మెలిపెట్టే వాక్యాలు, కనులను కవ్వించే బొమ్మ. రెంటికీ పొంతనలేదు.
ReplyDeleteనమ్ముకున్న నమ్మకాలు మదిలో నలిగి...:(
ReplyDeleteenduku inta vyragya? hayiga navvutoo navvistu undaka. no i wont agree with you padmarpita.
ReplyDeleteఅవసరమా మీకు ఈ అంతం అవటం
ReplyDeleteఈ చావు కేకలు కవితలు.
అందరి స్పందనలకు నా ప్రణామములు_/\_
ReplyDeleteఎలాగైనా అంతం అవ్వాల్సిందేనని ఇప్పటి నుంచి ఆలోచిస్తే ఎలా?
ReplyDeleteమంత్రముగ్ధంగా ఉంది.
ReplyDeleteAmazing to see
ReplyDelete