నువ్వు నేను అకస్మాత్తుగా కలిస్తే
పరిచయం ఉన్నట్లు అనిపించినా..
పరిచయంలేదని పలకరించక వెళ్ళిపో!
కూడబలుక్కుని కన్నకలల నిండా
నువ్వు నేను కలిసి ఉన్నామనిపిస్తే
పీడకలని పడుకో నిద్ర రాకపోయినా..
పుస్తకాల్లో చరిత్ర చదివి జ్ఞానంపెంచుకో!
పేరూ ఊరూ గుర్తు చేసుకోకుండా
రంగురూపం పనిపాట్లు జ్ఞాపకమొస్తే
తెలిసీ తెలియనట్లు గుర్తుకొచ్చినా..
మనసుకు మతిమరుపొచ్చెను అనుకో!
కలిసి మాట్లాడిన ముచ్చట్ల నిండా
ఆడిన ఆటల్లో చేసినబాసలు అనిపిస్తే
అలిగిన అలకలు తీరక బాధించినా..
కంటనీరు రానీయక నవ్వుతూ బ్రతికిపో!
ఎవరి బ్రతుకైనా ఎటువంటిదైనా చదువక/బ్రతుకక తప్పదు మేడం.
ReplyDeleteజీవితమంటేనే ఆశ నిరాశ, నిటూర్పు హర్షం, కలిమి లెమిల సమాహారం.. కనుక బ్రతకటం పరిపాటి.. అందులోనే ఉంది జీవితానికి ఇచ్చే గౌరవం, మర్యాద. ఎంతటి వారైనా సరే చివరి దాక బ్రతకాలనే సంకల్పముంటుంది.. ఆపై భగవంతుని దయ మనిషి కర్మానుసారేణ ప్రాప్తం.
ReplyDelete
ReplyDeleteబ్రతికేయ్ నన్ను మరిచి పో
కుతకుత పడకు మతిమరుపు కూడిందనుచున్
వెతలని, తొక్కేయ్ తలపుల
వి తాకగా, తెలియ దెవరు వీరోయనుచున్
జిలేబి
బ్రతుక్కు నువ్వు ఇచ్చే చిట్కాలు అన్నమాట ఇవి :)
ReplyDeleteసలహా ఎవరికి ఇస్తున్నట్లు?
ReplyDeleteలేక సంప్రదించమని అటున్నారా?
చిన్న డౌట్.. హ హా అహా
ప్రతీ రచనలో లోతైన భావాన్ని తెలియ చేస్తారు మీరు.
ReplyDeleteMeaningful picture.
ReplyDeleteNice
ReplyDeletechala baga rasaru.
ReplyDeleteసలహాలు సంప్రదింపులు మొదలుపెట్టారు.:)
ReplyDeleteపేరూ ఊరూ గుర్తు చేసుకోకుండా ఎట్లా మానేజ్ చేసి మరచిపోయేది?
ReplyDeleteidimiti ila fix chesinaru/ evarini ekkada? ha ha ha ha
ReplyDeleteఅన్నీ సర్దుకుని బ్రతికేయ్....
ReplyDeleteకూడబలుక్కుని కన్నకలలు:)
ReplyDeleteఅందరికీ నమస్కారం_/\_
ReplyDelete