అరవిరిసిన విహంగాలు ఊహా సౌధాలు..
చంద్రుడు మబ్బుల మాటున నక్కెననో
తారలు షికారుకెళ్ళి ఇంకా తిరిగి రాలేదనో
వంకలు కొన్ని వెతికి రేయిని పొడిగించరాదా
ఊహలతో మరిన్ని ఊసులు చెప్పనీయరాదా!
మేఘమా! చంద్రుడ్ని మాయచేసి ఒడిసిపట్టి
వెన్నెలనే దోచి కలల కలువల్ని విప్పారనిచ్చి
అంబరాన్ని అవనితో సంధి చేసి సంబరపడరాదా!
ఎగసే సాగరకెరటాల వంటి భావ అలజడులలో
హత్తుకున్న కోర్కెల్లేవు, కొట్టుకుపోయినవీ లేవు
స్థిర సంకల్పానికి నిర్ధిష్టమైన రూపం ఒకటిచ్చి
పట్టుదలని పరిచయం చేసి ప్రణయంగా మార్చి
అంధకారానికి వెలుగుతో పరిణయం చేయరాదా
గమ్యాన్ని సరిగమల సరాగాలతో శింగారించరాదా!
మనసు అందమైనది అయితే అందాన్ని అలంకరించే పనిలేదు.
ReplyDeleteవయ్యారి వలపు రగిలించి
ReplyDeleteఏమి చెప్పినా ఫాటాల్ ఢమాల్ అంతే
చిత్రములో సుందరి కవ్విస్తుంది.....
Lones and beautiful painting.
ReplyDeleteవంకలు ఏమీ వెతక్కు వలపులో
ReplyDeleteచక్కగా సున్నితత్వాన్ని ఒలికించారు పదాల్లో
బొమ్మ కళ్ళలో మెదులుతుంది కొన్నాళ్ళు.
అనువైన దుస్తులు మేనికి అలంకారం
ReplyDeleteలంగరు వేస్తు కనిపించే కనులకు కాటుక అలంకారం
కాగితపు కత్తిరింపు వలే రంగురంగుల బొట్టు నుదుటికి అలంకారం
రంజుగా రంగరించుకున్న రసరమ్యమైన భావాలు కావ్యానికి అలంకారం
~శ్రీత ధరణి
అలంకరణ ఆడువారి సొత్తు ఒకప్పుడు. ఇప్పుడు మగవారు కూడా అలంకరణ పై శ్రద్ధ వహిస్తున్నారు.
ReplyDeleteమనసుని అలంకరించుకోవడం ఎలాగూ? వ్రాసి పుణ్యం కట్టుకోండి.
ReplyDeleteBEAUTIFUL PICTURE
ReplyDeleteపట్టుదల పరిచయం?
ReplyDeleteచాలాబాగుంది...అలంకారం
ReplyDeleteandamaina kavita
ReplyDeleteవర్ణన బాగుంది
ReplyDeleteచిత్రం మరింత అందాన్ని చేకూర్చింది
స్థిర సంకల్పానికి నిర్ధిష్టమైన రూపం ఇవ్వడం అంటే ఆషామాషీ కాదు పద్దమ్మా
ReplyDeleteఅంధకారానికి వెలుగుతో పరిణయం కొత్తగా ఉంది
ReplyDeleteసౌందర్యాన్ని ఆరాధించే వారు వ్రాసే వాక్యాలు కూడా సౌందర్యంతో నిండి ఉంటాయి.
ReplyDelete_/\_ అందరికీ అభివందనములు _/\_
ReplyDeleteఅక్షరాలే మీకు అలంకారం.
ReplyDelete