ది డర్టీ పోస్ట్..


ఆ..అన్నా ఆహా అన్నా అరిసే నేను ఐస్అవుతా మావా

సల్లబడ్డాగాని సంకనాకిస్తే నీకు పుట్టగతులుండవ్లే మావా

ఓ..అనో ఓయ్ అనో పిలిస్తే ఒంపులన్నీ నీకిస్తాగా మావా
ఒళ్ళంతా నులిమి ఒల్లనంటే సుక్కలు సూపిస్తాలే మావా

వా..అని వాహ్ వా అని నన్నే నువ్వు పొగడాలి మావా
వేరెవరినైనా వంకరగా చూస్తివా నడ్డి విరుగుద్దిలే మావా

కూ..అని కూస్తే కూహూ అనంటా కంగారు పడకు మావా
బక్కగున్నా బలిసినా బరిలోకి దిగినాక వదిలేదేలే మావా

సై..అంటే సైయ్యని నువ్వాపై సరసంలో సల్లబడకు మావా
దుప్పట్లో దూరినాక చూడు ఆపై సమ్మగుంటదిలే మావా

ఊ..అనకుండా ఊహూ అంటివా ఊకదంపుడే నీకు మావా
ఊతమిస్తే ఊరకుండక ఉల్లాసంగుండు నీకు తిరుగేలే మావా

హ్మ్..అంటూ హమ్మా అని బద్దకంగా ఒళ్ళువిరవకు మావా
మూడ్ ముంచుకొచ్చిందా నేనాపినా నువ్వు తగ్గేదేలే మావా

రా..అంటే రైయ్యని వచ్చి రసికతలో నువ్వు రెచ్చిపో మావా
శృంగార రసరమ్య గ్రంధమే నువ్వు రాసిపడేస్తావులే మావా

నీకునువ్వే

జరుగుతున్నది ఏమిటో నీకు తెలియకపోయినా
కోరుకున్నదేమీ జరుగకపోవటం నీకు తెలుసుగా
ఎవరిపై కోపము విసుగు చూపాలో తెలియకున్నా
నిన్ను నువ్వు తిట్టుకోవడమైతే నీకు తెలుసుగా!

బయటవున్నవి అన్నీ నీ సొంతం కావని తెలిసినా
సాధించే ప్రయత్నంలో అలసి సొమ్మసిల్లిపోతావుగా
నిశ్చింతగా ఉంటావు నీతోనువ్వు యుద్ధం చేస్తున్నా
నువ్వు పారిపోవాలనుకున్నా ఎక్కడికీ వెళ్ళలేవుగా!

కంటున్న కలలన్నీ గాఢాంధకారంలోనేనని తెలిసినా
దిగంతాల్లో వెలుతురుకై ఆశగా ఎదురు చూస్తావుగా
ఎడారిలో ఎండమావులకై వెతికేవు దాహంతీరకున్నా
ఆరిపోయిన ఆనవాళ్ళో చేమ తడుముతున్నావుగా!

నమ్మిన నిజాలన్నీ అబద్ధాలని నీకు తెలిసిపోయినా
బయటకు నిబ్బరంగా కనబడాలని నవ్వేస్తుంటావుగా
ఓపికనంతా పిడికిట బిగించబూనావు నీలో లేకున్నా
ఇదే బలమూ భరోసా అయ్యుండవచ్చు ఖచ్చితంగా!

చిరిగినబొంత

ఉండమన్నా ఉండక ఊడిపోయేటి ఉట్టుట్టి జీవితంలో..
ఒకరికొకరని బలవంతంగా దూర్చేరు బొత్తాన్ని కాజాలో
బొత్తాం గట్టిగా కుడితే పట్టుకుని ఉండు కాజా బొక్కలో
లేదా విడివిడిగానే ఒకటై చుట్టబడి ఉంటారు బొంతలో!

చీకిచిరిగి ముక్కలైన బొంతకు కుట్లువేసే ప్రయత్నంలో
డాన్సాడే దారం దూర్చేరు నిటారుగా నిలబడ్డ సూదిలో
నాసిరకం బట్టని తెలిసికూడా దాస్తారు పన్నెండుపొరల్లో
అదృష్టాన్ని దిండు చేసుకుని జీవితాన్ని చూడు కలలో!

కరిగేకలలలో బొంత తడవకుండా కప్పాలి టార్పాలిన్‌లో
టేపుతో పొడవైన రాత్రుల్ని కొలుస్తుండాలి అంగుళాలలో
కుడుతూ దారం తెగినప్పుడంతా ఎక్కిస్తున్నాం సూదిలో
అలసినా కూడా అగ్గగ్గలాటే అతుకుల్ని దాచే ఆరాటంలో!

బొంతైనా బనారస్ చీరైనా తేడాలేదు కుట్టే కంటిచూపులో
చేతితో కుట్టినా మిషనైనా దారం దూరవల్సిందే సూదిలో
ఎన్నిగాట్ల కుట్లువేసినా దాగవు ఇవేం జీవితపు చిరుగులో
చిన్నచిన్నగ చిరిగి బొంతతోనే చితికిపోతాయి చివరిదశలో!


తప్పొపుల తులాభారం

నా ఓటములన్నీ కలిసి కొవ్వొత్తిగా కాలి నీ గెలుపై వెలిగితే
ఆ వెలుగులో నా బ్రతుకునిచూస్తూ గతించాలి అనుకున్నా!
జీవితంలోకి ఇంద్రధనస్సులా వచ్చి వెళ్ళిపోతావని తెలిసుంటే
కామకోరికలకే ప్రాధాన్యతనిచ్చి మనసునులిమి కప్పెట్టేదాన్ని!
ఎవరు ఎవర్ని చూసి ఎందుకు మోహించారోకదాని తెలిసిపోతే
వాటినే పలుమార్లు ప్రకటించి దూరమవ్వడానికి దారి ఇస్తున్నా!
నటించే బంధానికున్న బలం నిర్మలమైన ప్రేమకు లేదనంటే
అంతర్గత ఆలోచనల్ని ఇంత నగ్నంగా చెప్పుకోక పోయేదాన్ని!
వెదజల్లేటి సువాసనలు క్షీణించనంత వరకే కౌగిళ్ళని చెబితే
మూలుగుతున్న వాంఛలపై వస్త్రంవేసి కర్మకాండ చేసేదాన్ని!
చల్లని మేనుతో ఎడబాటు ఎదని వెచ్చని కన్నీరు తడిపేస్తుంటే
విశాలహృదయాన్ని వేశ్యనై ముక్కలు చేసి పంచిపెడుతున్నా!
పొరపాట్లు తప్పొప్పుల మధ్య తేడాలను చర్చించుకుంటూపోతే
జీవితకాలం సరిపోదని తెలుసుకుని మెల్లగా తప్పుకుంటున్నా!

గుర్తుండే ముఖం



సమయానుసారం వయస్సు పెరిగిపోతుంది
కోల్పోయిన కలలలో కట్టివేయబడి నక్కినా
కొంత తెలిసినట్లు మరికొంత తెలియనట్లుగా
శరీరం దూరంవెళ్ళినా ముఖం గుర్తుంటుంది!

ప్రేమని కాంక్షించి ఎన్నో జరగాలని ఊహించి
గుమ్మనంగా కోర్కెలెన్నో కప్పెట్టి కొన్ని తీరినా
కాలం మారి పయనించు నదీ ప్రవాహంలాగా
శరీరం కృంగికృశించినా ముఖం గుర్తుంటుంది!

సంపద మంటల్లో మోము కాలి బూడిదౌతుంది
అమాయకులూ మూర్ఖులూ అమ్ముడుపోయినా
కొనుగోలుదారులు దగాతో నీచానికి దిగజారగా
శరీరం మండి మాడినా ముఖం గుర్తుంటుంది!

బాల్యం యవ్వనం వృద్ధాప్యం తనలోతానే వణికి
అద్దం తననితానే పాతముఖం చూపమనడిగినా
నీరుకారిపోయే నిస్సహాయత సిగ్గుతో తలవంచగా
శరీరము మునిగితేలినా ఆ ముఖం గుర్తుంటుంది!

మనుషులంతా ఒక్కటైనా ముఖాల్లో తేడాఉంది
విభిన్న ముఖకవళికలతో ఎవరెలా మార్పుచెందినా
సిగ్గులేని ముఖాలు జ్ఞాపకాల్లో జీవిస్తాయి నిర్లజ్జగా
శరీరం శవమై కాలిపోయినా ముఖం గుర్తుంటుంది!

కామపుచూపు..

ఎవరు ఏవిధంగా అనుకుంటే అలాగే అనిపిస్తాను
కామందృష్టి ఉన్న కళ్ళనుండి ఎన్నని కప్పెట్టను
ప్రశాంతంగా జీవించాలంటే ఏమేం మూసిదాచను!
చీరకడితే నడుంవంపు తప్ప వేరేం నీక్కనబడదు
నడిచి వెళుతుంటే రెండుపిరుదుల కదలిక ఆగదు
స్తనాలు చూపకుండా పవిట పొర ఏదీ దాచలేదు!
ఘాగ్రాపై చోలీ చూసి వెతికేవు రొమ్ముల కొలతలు
వీపును చూసినా కలుగు నీ అంగానికి కదలికలు
ఇనుపకచ్చడాలతో కట్టేసి కాపాడాలి శరీరభాగాలు!
చుడీదార్ వేస్తే చున్నీని ఎక్సరే కళ్ళతో చూస్తావు
అవయవం సౌష్టవం అంగుళమైనా వదలకున్నావు
ఎన్ని బొంతల్లో చుట్టి శరీరనిర్మాణం ఆపమంటావు!
ఎవరి పిల్లైనా తల్లైనా భార్యైనా నీక్కావలి ఆడఅంగం
పురుషాంగ వీర్యస్కలనం అయితే చాలదే మగతనం
తల నుండి కాళ్ళ వరకు కప్పితే కనబడదా కామం!
ఏ ముడతమడత అగుపడ్డా కామానికవి సంకేతాలు
నా భాగాలేవైనా నీయవ్వనాన్ని రెచ్చగొట్టేటి ప్రేరణలు
ఎక్కడ దొరికేను నీ కళ్ళగంతలు అయ్యేటి వలువలు!
ఆలోచనా విధానం మార్చి చూడు సమాజం మారును
లేదా కళ్ళూఒళ్ళూ కామఘర్షణకై కొత్తసాకు వెతుకును
కామపు చూపుల్ని తల్లిరొమ్ములు కూడా కవ్వించును!

నా సలాం..

నన్ను అసహ్యించుకునే వారికి నా సలాం..
దృఢత్వాన్ని నానిండా నింపిన వారు కదా!!

నాకోసం ఆందోళన పడేవారందరికీ సలాం..
నిజానికి నా బాగోగులపై శ్రద్ధ వారిదే కదా!!

నాతోనే ఉంటానని వదిలిన వారికీ సలాం..
ఎప్పటికెవ్వరూ నాతో ఉండరని తెలిపె కదా!!

నన్ను ప్రేమిస్తున్న వారందరికీ నా సలాం..
హృదయాన్ని విశాలంగా చేసిన వారు కదా!!

నాకు పరిచయమైనవారు అందరికీ సలాం..
బ్రతుకు ఊహించని మలుపు తిరిగె కదా!!

నా జీవితానికి ప్రత్యేకమైన అతిపెద్ద సలాం..
దేన్నైనా తట్టుకునే శక్తినిచ్చి నడిపిస్తుంది కదా!!

ప్రత్యేకస్థానం..


నీవైపు అకర్షించబడ్డానికి ప్రత్యేక కారణమంటూ ఏంలేదు
దానికొక అర్థమూ పరమార్థం ప్రణాలికంటూ కూడా లేదు
ఏదో జరగాల్సింది ఇంకేదో జరిగిపోయింది అంతే సుమా..
నిన్ను చూడక ముందు జీవితానికొక అర్థమంటూ ఏంలేదు
అప్పటిదాకా బ్రతుక్కి ఒకగమ్యం నిశ్చింతస్థానం దొరకలేదు
అంతకు మించిన ఆలోచనలు నామెదడుకి లేవు సుమా..
నీ వ్యక్తిత్వసునిశితపరిశీలనా గుణానికి లొంగానంతే ఏంలేదు
అందరి మనసులనీ చదివే నీకు నామది కష్టం అనుకోలేదు
అనుకోకుండా మనసుతో చూసి మాట కలిపాను సుమా..
నిన్ను చుట్టిముట్టి ఉన్న భవబంధాల్లో నేనుండాలని ఏంలేదు
నిడారంబరనియమనిబంధనలున్న బంధమన మదిఒప్పుకోదు
ఉరుకులపరుగుల జీవనవ్యాపకంలో మరచిమారిపోకు సుమా..
నీ సహచరసావాససాంగత్యాన్ని తప్ప నేను కోరింది ఏంలేదు
మనసున మెండుగా ఉంది బయటపడని గుర్తింపు అక్కర్లేదు
ఏదేమైనా నాకంటూ ప్రత్యేక సమయాన్ని సృష్టించాలి సుమా..

తప్పేమిటి?

సుదీర్ఘ ప్రయాణంలో మార్గం మరచిపోయి
దారిచూపమన ఆగిపొమ్మనడంలో అర్థమేంటి!
శీతల తరంగం ముద్దముద్దగా తడిసిపోయి
చలివేయ కాస్త సూర్యరశ్మిని కోరితే తప్పేమిటి?
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలు అతిభారంగా ఉన్నాయి
లోపల ఎంత వేడి ఉన్నా ప్రయోజనమేమిటి!
నీలాకాశం కంటినిండుగా తిరుగాడుతున్నాయి
నిశ్చలంగా నీటిని నిలబడిపొమ్మంటే తప్పేమిటి?
హోరుగాలులు ఏమో శాపనార్థాలై వీస్తున్నాయి
అంధకారంలో అలంకరణతో ఉపయోగమేంటి!
నిర్మానుష్య రహదారిపై చల్లని అలలాసాగిపోయి
సిగ్గునీడలో తలదాచుకుంటే మాత్రం తప్పేమిటి?
పొగమంచై పర్వతాల్లో సూర్యుడు దాగిపోయి
ఉప్పకన్నీటితో మండే గాయాలకు మందేమిటి!
గాలిలో తేలుతున్న ఆశపొగలు మసగపరిచాయి
మేఘాలను కుండపోతై కురవమంటే తప్పేమిటి?

"అర్పితాభిప్రాయం"


సమాజ అద్దంలాంటి పుస్తకం ఎంత చదివినా ఏముంది
నలుపు తెలుపు అక్షరాలు తప్ప ఏం అర్థం కాకున్నది

రాజ్యాంగ చట్టాలు చదవినాక కన్నీరొచ్చి మసగబారింది
ఎందుకని యోచిస్తే ఎంత వంచనా మోసమనిపిస్తున్నది

వాదోపవాదాలతో నిజాన్ని తడికల్లో చుట్టేసేగా నడుస్తుంది
నీదినాదంటూ సూక్తులెన్నో చెప్పుకుంటూ బ్రతుకుతున్నది

క్షణక్షణానికి రంగులు మార్చే స్త్రీపురుషులేగా ఇక్కడుంది
ముందూ వెనుక మూర్ఖపువాదం తప్ప నీతి ఎక్కడున్నది

ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఎత్తుకుపైఎత్తేగా వేస్తుంది
అది నమ్మించాలనే నటన నేర్చుకుని నాటకం ఆడేస్తున్నది

వలపుసెగ వాక్యాలకు రాజ్యాంగం ఆమడ దూరంలోనే ఉంది
రాజ్యాంగం రాసినవారిలో రసికత లోపించినట్లే గోచరిస్తున్నది

మనసుకి నవ్వు ముసుగేసుకుని బ్రతకడంలో అర్థమేముంది
పడిలేచి పళ్ళికిలించక జ్ఞానంతో ప్రశ్నించి మది సాగమన్నది
నువ్వు నేను రాజ్యాంగం చదివితే చేసిన తప్పులు తెలిసింది
తెలుసుకున్న సూత్రాలు కొన్నైనా అమలు చెయ్యాలనున్నది


(విష్వక్సేనుడు వినోద్ గారు వ్రాసిన "నువ్వు నేను రాజ్యాంగం" పుస్తకం చదివిన తరువాత నాలో చెలరేగిన భావాలకు అక్షరరూపమే ఈ "అర్పితాభిప్రాయం" చూసి చదివి చెప్పండి ఎలా ఉందో)

లాభసాటి ఒప్పందం

అనుభూతులు ఆమ్లధారల్లా ఆవిరైపోతుంటే
మమతల మసిపూసి ఏం మాయ చేస్తాం..

ఆలోచనలకి అవసరాలే ఆనకట్టలు వేస్తుంటే
ఊహాసౌధాలకు అరచేతుల రక్షణ ఏమిస్తాం..

మనసులోని మాట గొంతు దాటి రాకుంటే
నమ్మకపు దస్తావేజులు చేతికి ఎలా ఇస్తాం..

బరువైన బాంధవ్యాలు ఊపిరి ఆడనివ్వనంటే
స్వతంత్ర స్వేచ్ఛారెక్కలు ఎలా విప్పారుస్తాం..

మలినమైన మమకారమే మిగిలి ఉందంటే
స్వఛ్చమైన సాంగత్యాన్ని ఎక్కడని చూస్తాం..

స్వార్ధప్రణాలికలే వలపు వ్యాపార పెట్టుబడంటే
అనురాగాన్ని అరువుపెట్టి ఏంలాభం ఆర్జిస్తాం..


చివరిమజిలీ..

పచ్చపసుపుని ఒంటికంతా రాసి నలుగు పెట్టి
పక్వానికొచ్చిన పరువాన్ని పవిటలో మెలిపెట్టి
పబ్లిక్ గా రా మావా పారిపోదామని అంటి...
అన్నదే తడువుగా అత్తాపత్తా లేకుండా పోతివి!
పిరుదుల వరకున్న వాలుజడను కొప్పు చుట్టి
పిక్కల పైదాకా చుక్కల చీరని బిగుతుగ చుట్టి
పిటిషన్ పెట్టేటోళ్ళు ఎవ్వరూ నాకు లేరంటి...
అయినా కిమ్మనకుండా ఎక్కడికో ఉడాయిస్తివి!
పుప్పొడితో పూలరెక్కలని వేరు చేస్తిని విడగొట్టి
పున్నమివెన్నెల్లో పక్కపై రమ్మన్నా కన్నుగొట్టి
ఫుల్ పల్లెటూరి బైతుననుకుని నన్ను గెంటి...
అహంకారమున్న అమీర్ ఆమెని మనువాడితివి!
పెద్ద పోటుగాడివని భంగపడితి మది బొప్పికట్టి
పెద్ద ఆసామికి అర్పించుకుంటి మానం లెక్కకట్టి
పెనాల్టీగా ఉంచుకుంటా అంటే అక్కడే ఉంటి...
అనురాగం తప్ప మస్తు పైసలు నాదగ్గర ఉన్నవి!
పొందులో పొర్లి పైసా గడించిన ఇద్దరం ఒకేమట్టి
పొగరుతగ్గి నువ్వు వడలినేను చివరికౌతాం మట్టి
పొల్యూట్ కాక ముందు ఎలాగో కలవకుంటి...
అయితే అయ్యింది ఛలో కలిసిచేద్దాం చావుమజిలీ!

వెతుకులాట

మూగబోయి ఎందుకు ఉంది ఈ జీవితమని
ఎందుకిలా జరుగుతుందని ఎవరిని అడగాలి
చతికిలబడి సమయమెందుకు సాగుతుందిలా
సంతోషకరమైన క్షణాలను ఎక్కడని వెతకాలి?

నుదుటిరాతను ఎందుకిలా రాసావో చెప్పని
జీవితం ఇంకా ఎంత దూరం ఇలాగే సాగాలి
కలలు కళ్ళలోనే చెమటలు కక్కి కారిపోనేల
తడారని పెదవుల కోసం ఎక్కడని వెతకాలి?

మేలు చేస్తే పంపించిన దీవెనలు ఏంచేసావని
ఆకాశాన్ని తాకిన ఆశలు శాశ్వితముగా రాలి
శ్వాస ఎక్కడో మలుపుతిరిగి మరలివచ్చెనిలా
మదిని వదలిన స్పందనని ఎక్కడని వెతకాలి?

అలా జరిగింది!

గోరువెచ్చని నీటితో అభ్యంగన స్నానం చేసితి
కురులు ఆరబోసి సాంబ్రాణి ధూపాన్ని వేసితి
నీకిష్టమైన పలుచని తెల్లచీరనే ఒంటికి చుట్టితి
నుదుటన నిలువుబొట్టు కంటికి కాటుక పెడితి
వళ్ళంతా వన్నెతగ్గని వగలనే నగలుగా వేసితి
తలలో మల్లెలుతురిమి గుమ్మంలో నీకై వేచితి!
చక్కని చూపుల వలలో చిక్కుతావని కలగంటి
నా నడుము వంపులో నక్కాలని ఊహల్లోఉంటి
కోరికల కొవ్వొత్తులు పడకగదిలో వెలిగించుకుంటి
చెప్పకున్నా నన్నునీవు చదివేస్తావు అనుకుంటి
వచ్చి ఇచ్చే చుంబన లాలాజలమే లేపనమంటి
ఈ విరహఉష్ణవ దాహం నీవే తీర్చగలవనుకుంటి!
అలా ఎదురుచూసిన నాకు నీరాక ఒక పిడిబాకు
ఇంటికొస్తూ రాగానే తేనీరు కావాలి అలసిన నీకు
స్నానం తరువాత రుచులు కోరతావు భోజనంకు
ప్రయాణబడలికతో నీ దేహం దాసోహం పాన్పుకు
ఇంకేం తలపులు రగిలించిన ఉత్తేజపు వేడి నాకు
ఆరాటం అందంగా ఆవిరైపోయింది నిట్టూర్పులకు!

కిక్ కసి ..

కోక్ పెప్సీ సోడాతో కాక రా కొట్టాలన్నంత కసి..
గుండెని కోసీ మిక్సీలో బాగామెత్తగా రుబ్బి తీసి
ముద్దని గుప్పెట్లో పట్టుకుని క్రిందాపైకీ ఎగురవేసి
బంతితో ఆడినట్లు ఆటాడి విసుగుపుడితే విసిరేసి
ఏమైందని అమాయకంగా అడిగితే రగిలినట్లు కసి!
పద్మార్పిత బొమ్మలే సెక్సీ రాతల్లో కనబడని కసి..
ఫోటోలు చూసి భారంగా నిట్టూర్పు విడిచేసి అలసి
ఎవరికి వారే అదీఇదనీ ఇష్టమొచ్చినట్లు ఊహించేసి
రమ్మూ బీరు వైన్ కలిపి కొట్టినట్లు రచ్చరచ్చ చేసి
నన్ను చూస్తేనే కానీ తీరదనుకోవాలా మీలోని కసి!
కాక్ టైల్లా అన్నీ కలిపి ఫుల్గా కొడితే తీరునేమో కసి..
కల్లూసారాయే కాదు ఆల్కాహాల్ ఏదైనా మత్తని తెలిసి
ఎందుకో అనిపిస్తుంది అన్నీకలిపి త్రాగేసి తాకాలి రోదసి
నక్షత్రాలను బుట్టలోవేసి చంద్రుడితో చిందేయాలి కలిసి
ఇదీ గత కొన్ని రోజులుగా నాలో చెలరేగుతున్న కసి!
కల్లుకొచ్చి ముంత దాచినట్లు కాక అనిపించింది చెప్పేస్తి
మీకు ఏం రాయాలి అనిపిస్తే అదిరాసి తీర్చుకోండి కసి!

నీ బాకీ

కోరిక తీర్చినందుకు తిరుగు బహుమతి బాకీ
కొంతకాలం ఆగు తప్పకుండా ముట్టచెబుతాను
వాగ్దానం చేయలేదన్న వంకతో ఇవ్వననుకోకు
నీకు బహుమతి తిరిగివ్వకుండా ఊపిరి వీడను

కోరరాని కోరికలు కోరే నేనో పంజరంలో ఏకాకీ
కాలాన్ని నీతోటి గడపాలన్న ఆశతో బ్రతికేస్తాను
ప్రేమలోముంచి ఉక్కిరిబిక్కిరి చేసాను శపించకు
నీ ఋణం తీర్చుకోకుండా నేను ఎటూ పోలేను

కోర్కెలతో తడారిన పెదాల్లో ఏముంటుంది చలాకీ
కాలంతోపాటు నేను కలిసి కధలు అల్లుకుంటాను
పనికిరాని వేదాంతం వల్లించి విసిగించా తిట్టుకోకు
నీకు పరిమళమివ్వని పువ్వులేం బహూకరించను

కోరికోరుకున్న బహుమతి నీకందుకే అంత గిరాకీ
కాలానికి ఎదురీది నా తాహతుకుమించిందే ఇస్తాను
ఉబుసిపోక ఊరించేటి ఊకదంపుడు ఊసులనుకోకు
నీకే నిన్నిచ్చి(నీవే నాప్రాణం) బాకీ తీర్చుకుంటాను

నిష్ప్రయోజనం

కాంతిపుంజాలు విప్పారి వెలిగి ఏం ఉపయోగం
ఎగసిపడే ఆశలే నల్లనిమసై ముఖాన్ని అంటితే

వలపుని వాయిదాపై తీరుస్తానంటే ఏం న్యాయం
ముక్కలైన మనసు ప్రతిస్పందించలేక వాలిపోతే

విరిగిన గోడనానుకుని ఆసరాని ఏం సమంజసం
పరువపు పచ్చి ఇసుకతో కట్టిన గూళ్ళే కూలితే

భీతిల్లి బిక్కుమంటూ బ్రతుకీడ్చి ఏం ప్రయోజనం
జీవితమే తెలియక సగానికిపైగా కాలిబూడిదైపోతే

నిర్మానుష్య రేయి ప్రశాంతంగా ఉండి ఏం లాభం
కరిగి క్షీణించిన రేయిలో అకస్మాత్తుగా అంతమైతే..