దశమరసం

ఆరంభంలోనే శృతిమించిన శృంగారం దక్కదని తెలిసి
మాటలెన్నో చెప్పి ప్రేమతేనెకత్తి మదిలో దించి పోతూ
హాస్యం హద్దులు దాటినా పర్వాలేదని కబుర్లెన్నో చెప్పి
కరుణరసపు గూటి చిరునామా చెప్పమని బ్రతిమిలాడి
ఓపిక నశించి విసుగు చెందితే రౌద్రం వద్దని వేడుకుని
ఏదోలేనని నవ్వితే వీరత్వం తమదని తెగమురిసిపోయి
విరగబడి నవ్వి భయంకరమైన చిత్ర విన్యాసాలెన్నో చేసి
భీభత్సాన్ని సృష్టించి అన్నీ అద్భుతం అనేలా మరపించి
    ఏది ఏమైనా శాంతం వహించాలంటూ పాఠాలు చెప్పడం      
ప్రేమలో కొంగ్రొత్త విద్యలంటూ ప్రేమించబడలేని రానినాడు
వలలో పడ్డ పిట్ట ఉసురు మనకేల అనుకోవడం దశమరసం
నవరసాలు మనల్ని కాదు పొమ్మని పరుల చెంత చేరితే
అన్నీ కలిసిన ఎందుకూ కొరకాని ఈ దశరసం ఉత్తమం!!