ఒక పదం

ఒక పదం జీవితానికి ఆశ, ఆ పదమే జీవన పరిభాష...
ఒక పదం జీవన రాగం, అది తెలుపును జీవితసారం...
ఒక పదం గెలుపు, వేరొకటి ఓటమిని తెలుపు....
ఒక పదం భయం, మరొకటి ఇస్తుంది అభయం...
ఒక పదం ప్రేమకి నాంది, ఇంకొకటి పగకు పునాది...
అందుకే....
పదాలను చూసి వాడు, తప్పుడు పదాలతో చేయకు కీడు...
సరళమైన పదాలు మంచికి జోడు, అవి కానేరవు హాని నాడు-నేడు!

నీ,నా,మన....

నీ మనశ్శాంతి నేనై
నీ కంటిపై కునుకునై
నీ కలలన్నీ నావై
నీ ప్రతి కదలిక నేనౌతా!!

నా కాటుక కళ్ళే నీవై
నా బుగ్గన సిగ్గులు నీవై
నా అలోచనాసరళే నీవై
నా చిరునవ్వులన్నీ నీకిస్తా!!

మన ఇరువురిది ఒకటే గమ్యమై
మనం ఒకరికొకరు ఒకరిమై
మనం మరికొందరికి ఆదర్శమై
మన జీవనయానం సాగిద్దాం!!!