నీ పిలుపుకై!!!

నా చెంత లేవన్న చింతలేదు
త్వరలో వస్తావన్న ఆశా లేదు
కంటికెదురుగా లేవన్న భాధలేదు

నాలోనే నీవున్నావని నేచెప్పలేదు.


ప్రతి ఉఛ్వాస నిఛ్వాసలో నిన్నే తలుస్తున్నా

శ్వాస లేనిదే జీవితం లేదని మొరపెట్టుకున్నా

నీ తలపు తరువాతే శ్వాసాడుతుంది ఎంత వద్దంటున్నా
నీ నవ్వులో నే కోరినలోకం ఉందని మనస్సంటున్నా

కలసి జీవించలేక పోతున్నామని కలవర పడుతున్నా.


నీ చెంత నేను లేనని చింత ఏలా??????

కనులుమూసి తలచుకో కంటికెదురుగా ఉంటాను కలలా

నీవు నన్ను కలవమని పంపించు కబురు ఎలాగోలా

చితి నుండి అయినా లేచివస్తాను గాలిలో ధూళిలా.
........

ఉగాది పచ్చడి!!!

పద్మ అర్పిస్తుంది మీకు
విరోధి నామ సంవత్సర
శుభాకాంక్షలు......
ఉగాది పచ్చడితో పాటు...

http://lh4.ggpht.com/_uLcy17Ge5pc/Scvznbo_xpI/AAAAAAAAASM/RGOMTUlsr3E/s400/oo.jpg
పచ్చడిని స్వీకరించండి.....
పండగ చేసుకోండి..........
పసందుగా వుంటే ఆరగించండి...
పనికిరాదనుకుంటే మన్నించండి..
ప్రయత్నించి మరోసారి........
పసందైన పచ్చడిని పంపిస్తానండి...
(వచ్చే ఉగాదికి)

అతని రాకకై!!!

కనురెప్పలారా మూతపడరా!
కలలోనైనా అతన్ని చూడనీయరా?
ఉదయం ప్రాంభం అతని నిరీక్షణలో!

నడిరేయినైనా గడపనీయండి కలలలో.

గుండె గొంతు విప్పి నా వేదన....

కనులుమూసి చేస్తున్నా నివేదన....

ప్రేమించబడడమే ప్రేమకాదేమో!!

నిరీక్షిస్తూ జీవించడం కూడా ప్రేమేనేమో!!

పెదవులపై దరహాసం అందరికీ సాధ్యం..
చెమ్మగిల్లిన కన్నులతో నవ్వడం ఎందరికి సాధ్యం?

మాటలోని అర్ధం అందరికీ తెలుస్తుంది.
మౌనంలోని మర్మం కొందరికే బోధపడుతుంది.

కనులు మూత పడిన నాడు కార్చెదడు కన్నీళ్ళు!!
పెదవి విప్పి మాట్లాడమని చేసెదడు వేడికోళ్ళు.!!!!

తలపు!!!

నిన్ను తలవని క్షణం లేదు.

నన్ను నేను మరచిన నిన్ను నేను మరువలేదు.

నీవు నన్ను తలవక పోయిన నీమీద నాకు కోపంలేదు.

నిన్ను నేను మరచినవేళ నాకు జీవితమేలేదు.

మరవడానికి మరణమే శరణ్యం అనుకుంటే, దానికి అంతటి ధైర్యంలేదు.

వ్రాతలు........

మొన్నీమధ్య నేను నా స్నేహితురాలు కలసి జలవిహార్ కి వెళ్ళాము. మధ్యాహ్నం భోజనం చేసి అక్కడ ఇసుకలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరిగి కోపంలో తను అనుకోకుండా నా మీద చేయి చేసుకుంది. వెంటనే క్షమించమని చెప్పి బయలుదేరదామంది. నేను సరే ఒక్కనిముషం అని చెప్పి అక్కడ ఇసుకలో నా స్నేహితురాలు నన్ను ఈరోజు చెంపదెబ్బ వేసింది అని వ్రాసి అక్కడి నుండి బయలుదేరాము. మనసులో తను చేయి చేసుకుంది అన్న భాధలో ఏదో ఆలోచిస్తున్న నాకు ప్రక్కన వేగంగా వస్తున్న ఆటోని చూసుకోలేదు. నా స్నేహితురాలు వెంటనే నన్ను లాగివుండకపోతే, నేను ఇప్పుడు బ్లాగ్ లో ఈ కధ వ్రాసేదాన్ని కాదేమో!!
మనసు బాగోలేదని కొద్దిసేపు నెక్లెస్స్ రోడ్ ప్రక్కన వున్న పార్క్ లో కూర్చొని వెళ్ళదామని అక్కడ ఏమైనా బల్లలు ఖాళీగా వున్నాఏమో అని చూస్తే ఎక్కడా దొరకక ఒక చదునైన బండ కనబడితే దానిమీద చతికిలబడ్డాము. తను నన్ను క్షమించమని మరీ మరీ ప్రాధేయ పడింది. నేను తనని ఆ విషయము మరచిపొమ్మని మనం ఎప్పటికి మంచి స్నేహితులమేనని చెప్పి నా హాండ్ బ్యాగ్ లో నుండి నెయిల్ కట్టర్ కి వున్న షార్పర్ తో బండమీద నా స్నేహితురాలు ఈరోజు నా ప్రాణాలు కాపాడింది అని చెక్కాను. దాన్ని చూసి తను ఏమిటి ఇంత కష్టపడి రాస్తున్నావు అని అడిగింది. ఏమిలేదు నీవు చేసిన మేలు నేను మరచిపోకూడదని గాలికి, వర్షానికి కొట్టుకుని పోవద్దని రాతిమీద వ్రాసాను. నేను కొద్దిసేపటి క్రితము ఇసుకలో వ్రాసిన విషయం ఇప్పటికి క్షమ అనే గాలికి కొట్టుకుని పోయివుంటుంది కదా! ఇంక వెళ్ళదామా అన్న మాటలకి తనుకూడా ఎంతో అభిమానంతో చేయిచాచి లేచింది, ఇంక వెళదాం పద అంటూ.....
"ఒక విషయం జరగడానికి క్షణాలు చాలు...
అర్థం చేసుకోవడానికి నిముషాలు చాలు...

ఆచరించడానికి గంటలు చాలు...

మరచిపోవడానికి జీవిత కాలం చాలు..."
ఇది ఇక్కడ ఎంతవరకు వర్తిస్తుందో తెలియదు కాని నాకు ఒక స్నేహితురాలు పంపిన SMS గుర్తుకు వచ్చింది .

నిన్ను కాంచిన వేళ....

నేకన్న కలలు ఏమైనాయని నా కన్నులు వర్షించాయి!
నా ప్రాణం ఏదని నా మనసు ఘోషించింది!
ఈ నిరీక్షణ ఎన్నాళ్ళని ప్రతిక్షణం నన్ను ప్రశ్నించింది!
బదులివ్వమని చిరునవ్వుని పెదవులు అర్ధించాయి.......

నిన్ను కాంచిన వేళ నా కన్నులు ఆనంద భాష్పాలు రాలుస్తానన్నాయి!
నీవు నా చెంతనుంటే మనసు చిందులు వేస్తానంది!
మండుటెండలో వెన్నెలై వస్తానని కాలం జవాబిచ్చింది!
ఆసమయం వస్తే నాపెదవులు చిరునవ్వుతో నర్తిస్తానన్నాయి.......

ప్రేమ జల్లులు....

వెన్నెల రేయిలో
మల్లెల జల్లులో

నిన్ను తలచిన నన్ను చూసి

జాబిలమ్మ వెక్కిరించింది తన నవ్వుతో...


నేనున్నాను నీలో

ఉంటానెల్లప్పుడూ నీమనసులో
అని చెప్పినా వినకుండా కిలకిలమంది కలసి తారలతో...

నీవన్నావు నేనున్నానని నీలో

నీలోని ప్రతి అణువణువులో

అది విన్న జాబిలమ్మ దాగుంది మబ్బుల మాటున ఈర్ష్యతో...


నా తపనను చూడు నీతలపులలో
ఏకమౌదామా ప్రేమలో???
మన ప్రేమను చూసి వర్షించాయి మేఘాలు ఆనందంతో...
అది చూసి తారలు కూడా మెల్లిగా జారుకున్నాయి నిట్టూర్పుతో...