నిన్ను కాంచిన వేళ....

నేకన్న కలలు ఏమైనాయని నా కన్నులు వర్షించాయి!
నా ప్రాణం ఏదని నా మనసు ఘోషించింది!
ఈ నిరీక్షణ ఎన్నాళ్ళని ప్రతిక్షణం నన్ను ప్రశ్నించింది!
బదులివ్వమని చిరునవ్వుని పెదవులు అర్ధించాయి.......

నిన్ను కాంచిన వేళ నా కన్నులు ఆనంద భాష్పాలు రాలుస్తానన్నాయి!
నీవు నా చెంతనుంటే మనసు చిందులు వేస్తానంది!
మండుటెండలో వెన్నెలై వస్తానని కాలం జవాబిచ్చింది!
ఆసమయం వస్తే నాపెదవులు చిరునవ్వుతో నర్తిస్తానన్నాయి.......

7 comments:

  1. బాగుందండి.. చాలా రోజుల తర్వాత కనిపించారు..

    ReplyDelete
  2. పద్మ గారు!
    మీ రచనా శైలిని గమనిస్తే మీ కవిత్వం "గజల్" ప్రక్రియలో బాగా ఒదుగుతుంది - అనిపిస్తుంది. గజల్ రూపం అవగాహన కోసం "సినారె గజళ్ళ"ను అధ్యయనం చేయండి. మంచి గజల్ కవయిత్రిగా రాణించగలరు.
    - డా.ఆచార్య ఫణీంద్ర

    ReplyDelete
  3. నేస్తమా..చాలా రోజులైనట్లుంది,ధన్యవాదాలు!!
    మురళీగారు.. ఆఫీసులో పని కాస్త ఎక్కువైందండి,థాంక్స్!!
    ఆచార్యగారు..ధన్యవాదాలండీ,తప్పక ప్రయత్నిస్తాను!!

    ReplyDelete
  4. పద్మగారు ప్యేన్టింగ్ మీరుకాని చేసారా? చాల బాగుంది .

    ReplyDelete
  5. పద్మగారూ!! ప్రెట్టీ గుడ్ కవిత.

    ReplyDelete
  6. పద్మగారూ! ఈ మద్యన మీ బ్లాగ్ కి రాలేదు. చాలా రాసేసారే!ఇదిగో నా కామెంట్
    "నీ తోటి వుంటే నాకీ లోకం సొరగంగా వుంటాది మావోయ్! నిన్నిడిసి పోతేను నీ వల్లె నాకు బువ్వ నోటికి పోదు మావోయ్, కునుకు కంటికు రాదు మావోయ్..."

    ReplyDelete