వెన్నెల రేయిలో
మల్లెల జల్లులో
నిన్ను తలచిన నన్ను చూసి
జాబిలమ్మ వెక్కిరించింది తన నవ్వుతో...
నేనున్నాను నీలో
ఉంటానెల్లప్పుడూ నీమనసులో
అని చెప్పినా వినకుండా కిలకిలమంది కలసి తారలతో...
నీవన్నావు నేనున్నానని నీలో
నీలోని ప్రతి అణువణువులో
అది విన్న జాబిలమ్మ దాగుంది మబ్బుల మాటున ఈర్ష్యతో...
నా తపనను చూడు నీతలపులలో
ఏకమౌదామా ప్రేమలో???
మన ప్రేమను చూసి వర్షించాయి మేఘాలు ఆనందంతో...
అది చూసి తారలు కూడా మెల్లిగా జారుకున్నాయి నిట్టూర్పుతో...
Hi Padma, good one..
ReplyDeleteపదార్పితగారు,
ReplyDeleteభావ సంచయంలో పడి చిన్ని ఔచిత్యాన్ని మరచారు.కవిత స్త్రీ పరంగా చెబుతున్నారు కాబట్టి వెన్నెలమ్మ ఈర్ష పడడం సబబే.కాని తారలతో కలసి నవ్వు కోవడమే ఔచిత్య భంగం ఎందుకంటే తారలు కూడా స్త్రీయాత్మక సూచికలే కదా.పలువురు స్త్రీల మధ్య సాన్నిహిత్యం నిశిద్దం కదా.ఒకవేల తారలను పురుష సంభంద ప్రతీకలుగా కవయిత్రి భావించినా అది మరింత అసాంఘీకమవుతుంది కదా. తడి ఆరని భావోద్వేగంలో ఔచిత్య ప్రమాణాలు మర్చి పోతే ఎలా? మీ కవితాత్మను స్రుజిస్తున్న వాడిగా నా విమర్శైది.అన్యధాభావించ కండి.
-సుబ్బారెడ్డి
'కిలకిలమంది కలసి తారలతో...'
ReplyDeleteతప్పు ఎంచాలని కాదు కానీ, ఈ వాక్యం ఎందుకో అతకలేదనిపించిందండి. బహుశా అంత్యప్రాస కోసం ఇలా రాసినట్టున్నారు.. ఫోటో తో సహా మిగిలినదంతా బాగుంది.
సుబ్బారెడ్డిగారు... మీ ఆలోచనాస్పందనలకు ధన్యవాదాలండి!!! కాని నాకు తెలిసినంత వరకు ఈర్ష్యాధ్వేషాలకి, వేరొకరి గురించి చర్చించుకోవడానికి లింగభేధాలు ఉండవేమోనని నా భావం (స్త్రీల మద్య సాన్నిహిత్యం లేకపోవడం అనేది ఒకప్పటి మాటండి). మురళిగారు...అన్నట్లు ప్రాసకోసం ప్రయాసలో పదజాలం కుదరలేదు, అయినా ఎవరైనా సరిచేయకపోతారా!! అని ధైర్యం చేసానండి.
ReplyDeleteMahesh & Muraligaaru థాంక్సండి...
ఒక మాట చెప్పరా? ఇంతకీ అలా తారలు, జాలిబి జారుకున్నాక మీరిరువురూ మళ్ళీ మీ స్వప్నజగత్తులోకి జారిపోయారా లేదా? భావన, అది వ్యక్తం చేయటంలో చదువరులకు కలిగే అనుభూతి బాగున్నాయి.
ReplyDeletevery nice kavita.
ReplyDeletephoto ekkaDa saadhiMchaaru/,,, photo chaalaa baagunnadi.
jaabilamma daaagunnadi
taaralu jaarukunaayi;
mEGAlu varshiMchaayi gadaa!
"iMka aa jaabilikii, I chukkalakuu marugEdi? "............
I BavaMtO maLLI iMkO kavitanu aaSistuu
చంద్రుడు పుంలింగమైతే,జాబిలి స్త్రీలింగమౌతుందా?
ReplyDeleteజాబిలి పురుషుడు,తారలు స్త్రీలు.ఇలా వర్ణించడమే న్యాయం.
కవిత బాగుంది.
జయచంద్రగారు,
ReplyDeleteవెన్నెల,చంద్రుడు ఓరకంగా కవి సమయాలే.కవులు కొన్ని సంధర్భాల్లో చంద్రున్ని,జాబిలమ్మ,వెన్నెలమ్మాంటూ కూడా స్త్రీపరంగా చెప్పారు.పద్మగారు కూడా జాబిలమ్మ అంటూ చంద్రున్ని సంబావించారు.తారలను ప్రియురాల్లుగా,చంద్రున్ని ప్రియుడిగా మన కవులు కవి సమయాన్ని సృష్టించి వున్నారు కాబట్టి ఒకే కవితలో చంద్రున్ని జాబిలమ్మగా భావించిన రచయిత్రి అదే కవితలో తారలతో కలసి నవ్వు కోవడం ఔచిత్య భంగం అని నేను భావించాను.అయితే జాబిలమ్మ తన నెచ్చెలులైన తారలతో కలసి నవ్వుకోవడంలో తప్పు లేదని కూడా అర్తమవుతోది.కాని మీరన్నట్లు చంద్రుడు పుంలింగమైతే జాబిలిస్ర్తీ లింగమవుతుందా అన్నది తప్పు. జాబిలి కాదు గాని జాబిలమ్మ నిశ్చయంగా స్ర్తీలింగమే.
-సుబ్బారెడ్డి