నీ పిలుపుకై!!!

నా చెంత లేవన్న చింతలేదు
త్వరలో వస్తావన్న ఆశా లేదు
కంటికెదురుగా లేవన్న భాధలేదు

నాలోనే నీవున్నావని నేచెప్పలేదు.


ప్రతి ఉఛ్వాస నిఛ్వాసలో నిన్నే తలుస్తున్నా

శ్వాస లేనిదే జీవితం లేదని మొరపెట్టుకున్నా

నీ తలపు తరువాతే శ్వాసాడుతుంది ఎంత వద్దంటున్నా
నీ నవ్వులో నే కోరినలోకం ఉందని మనస్సంటున్నా

కలసి జీవించలేక పోతున్నామని కలవర పడుతున్నా.


నీ చెంత నేను లేనని చింత ఏలా??????

కనులుమూసి తలచుకో కంటికెదురుగా ఉంటాను కలలా

నీవు నన్ను కలవమని పంపించు కబురు ఎలాగోలా

చితి నుండి అయినా లేచివస్తాను గాలిలో ధూళిలా.
........

17 comments:

 1. నీవు నన్ను కలవమని పంపించు కబురు ఎలాగోలా
  చితి నుండి అయినా లేచివస్తాను గాలిలో ధూళిలా.........

  Beautiful.. chala baaga raasaru !!

  ReplyDelete
 2. చాలా బాగుంది. రాస్తూనే వుండు..

  ReplyDelete
 3. "స్వప్న ప్రపంచాల సౌందర్య దీపాలు చెంత వెలిగే వేళ ఈ చింత నీకేల?" ..ఎందుకో గుర్తొచ్చిందండీ.. బాగుంది..

  ReplyDelete
 4. పద్మార్పిత గారు మీ కవిత చదివాకా చచ్చేదాకా నా జోలికి రాకురా బాబు హాయ్ గా వుంది, చచ్చాక ఎలాగు గాలిలో దుళినై నిన్ను పిక్కు తింటాను అన్న భావం గోచరిస్తోంది అదేంటో?

  ReplyDelete
 5. చాల టచింగ్ గ వుందండి .

  ReplyDelete
 6. స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు!!!!

  ReplyDelete
 7. రవిగారు...మీ వ్యాఖ్య చూసాక అలాకూడా ఆలోచిస్తారా!! అనిపించింది..
  అయినా అవి అనుభవం నేర్పిన పాటాలేమో!! కదండీ? Thanks for comment...

  ReplyDelete
 8. hi andi
  chaala thanks mee response ki.(musugu mukhanike).

  ReplyDelete
 9. mee blog chaala baagundi. keep going.

  ReplyDelete
 10. Your profile breaths fresh air. Pl. keep going. I am a fan of Guide. I watched probably 20 times. Wahida's dance devanand's dialogues....fantastic..." Kantonse keench ke yae Anchal".

  ReplyDelete
 11. "చితి నుండి అయినా లేచివస్తాను గాలిలో ధూళిలా......... "
  అధ్భుతం ఈ వాక్యం

  ReplyDelete
 12. padmarpita garu meeru chala baaga kavithalu rasthunnaru meeru inka chala great kavalni na korika

  ReplyDelete
 13. mee kavitalu anni okati okati ga chaduvuthunanu andi..... im new to view ur blog.
  chala late ga na abhipryam rastunna...
  chala bagunayi andi...

  ReplyDelete