కలలోనైనా అతన్ని చూడనీయరా?
ఉదయం ప్రాంభం అతని నిరీక్షణలో!
నడిరేయినైనా గడపనీయండి కలలలో.
గుండె గొంతు విప్పి నా వేదన....
కనులుమూసి చేస్తున్నా నివేదన....
నిరీక్షిస్తూ జీవించడం కూడా ప్రేమేనేమో!!
పెదవులపై దరహాసం అందరికీ సాధ్యం..
చెమ్మగిల్లిన కన్నులతో నవ్వడం ఎందరికి సాధ్యం?
మాటలోని అర్ధం అందరికీ తెలుస్తుంది.
మౌనంలోని మర్మం కొందరికే బోధపడుతుంది.
కనులు మూత పడిన నాడు కార్చెదడు కన్నీళ్ళు!!
పెదవి విప్పి మాట్లాడమని చేసెదడు వేడికోళ్ళు.!!!!
మీ శైలి లో ఉంది..
ReplyDeleteముంగిట నిరీక్షిస్తూ వారిజాక్షి నిలువగా
ReplyDeleteవేరు తోరణ మేల ద్వారబందమునకు ....
అన్నట్టుందండీ !
పద్మార్పితగారు,
ReplyDeleteమీ కవిత్వం లోని ఆత్మాశ్రయ రీతి అధ్బుతంగా వుంది.మన్సుతో ఊసులు చెప్పగల వారికే మౌనం మర్మం అర్తమవుతుంది.మంచుముక్కతో గుండెను కోస్తున్న అనుభూతిని కొదరు మాఅత్రమే అనుభవించగలరు. అలాంటివారే లోకం భాధను స్వభాధగాచూడగలరు.మీఃహృదయపు చెమ్మ కవిత్వంలోకి ప్రవహించి పలువురి హృదయాల్కు చెమ్మను పంచ గలుగుతోది
-సుబ్బారెడ్డి
నీరిక్షణ బాగుందండి , ఆ అమ్మాయి ఇంకా బాగుంది.
ReplyDeleteఇప్పుడే మీ బ్లాగు ను చూసానండి
ReplyDeleteకవితలు వాటి పక్కన బొమ్మలు చూస్తుంటే
మల్లె పందిరి నీడలో మరువాలు మందారాల మంచం మీద
చల్ల గా సేద తీరినట్లుంది
కీప్ ఇట్ అప్
regards
jayabharath
పద్మ గారు చాలా బాగా రాస్తున్నరండి బొమ్మ కూడా చాలా బాగుంది
ReplyDeleteచాలా బాగుంది పద్మార్పిత గారు. మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ReplyDeletechala baaga chepparu.. good expression..
ReplyDeletePindesarandi..chala bagunayi..
ReplyDelete