వణికించిన వాక్యాలు

ఎలా జీవిస్తే బాగుంటుందోనని తీరిగ్గా నన్ను నేను ప్రశ్నించుకున్నా
పద్మార్పితాని లేని గంభీరాన్ని గొంతులో నింపుకుని గది పిలిచింది

అప్పుడే పైకప్పు: హైగా ఆలోచించి ఆకాశమంత ఎత్తుకి ఎదుగంది
సీలింగ్ ఫ్యాన్: సిల్లీ ప్రశ్న, ముందు మైండును చల్లగా ఉంచమంది
గడియారం: సమయానికి విలువిచ్చి మసలుకోమని సజెస్ట్ చేసింది
క్యాలెండర్: కాలంతోపాటు సాగిపోవాలి అదాగదని కిలకిలా నవ్వింది
నా పర్స్: పైసామే పరమాత్మ, భవిష్యత్తు కోసం మనీ దాచమంది
అద్దము: నిన్ను నీవు నాలో చూసుకుని సవరించుకోమని చెప్పింది
గోడ: పెద్ద ఆరిందాలా ఇతరుల భారాన్ని నువ్వు పంచుకోవాలనంది
కిటికీ: నీ కోణంలోనే కాక పదిమంది దృష్టితో చూసి నేర్చుకోవాలంది
నేల మాత్రం: నిబ్బరంతో ఎవరెంత ఎత్తుకెదిగినా నేలపైనే ఉండాలంది!

అప్పుడు నే మంచంవైపు మత్తుగా చూసి నువ్వు కూడా చెప్పన్నా
సలహాలు అనేవి చెప్పుడానికి వినడానికే తప్ప బ్రతకడానికి కాదని..
చల్లగా ఉంది దుప్పట్లో దూరి పడుకో, మిగతావి మోహమాయంది!!  

బేరమేల?

అచ్చమైన తొమ్మిగుమ్మాల తోలుతిత్తిలాంటిది దేహం
హేయమైన కోరికలు అంటూనే ఆపుకోలేనిది మోహం 
కొవ్వుపట్టిన జగత్తు విచిత్ర రంగుల మైకపు సంతలో
అరువు తెచ్చుకున్న అందాలకు కట్టేటి వెల ఎంతనో?

నిదురలేని రాని అశాంతి రాత్రులు ఎరువిచ్చే శృంగారం
మెడలో జిగేలంటూ మెరుస్తున్న గిల్టు గోల్డు చంద్రహారం   
చెమ్కీ చీర తళుక్కులో పెదవులకు పూసిన రంగులతో
చపలమనసుల బురదలోబొర్లేటి బొమ్మ సంపాదనెంతనో?

చీకటిముసుగేసి సందులో దూరేటి ప్రబుధ్ధుల సంస్కారం 
వెలుగులో సానిదాని ముఖం చూస్తే ఎందుకనో చీత్కారం
నలిగిన పైట పూలు సరిచేసుకుని చూడ బ్రతుకుటద్దంలో
సిగ్గుచచ్చిన ప్రతిబింబం గారపళ్ళతో నవ్వుతుందెందుకనో?

చలిగాలి పొందుకోర వేడెక్కించే తొడల కోసమేగా ఆరాటం 
క్షణాల్లో మాయమైపోయే ఆయువుకి ఎందుకనీ బీభత్సం
పెట్టుబడిగా పడుకుని పొర్లేటి దేహమది పడుపు వృత్తిలో
అవసరం తీర్చుకుని పోతూ బేరమాడితే లాభం ఎంతనో? 

పెళ్ళితో పత్తిత్తులు

ప్రాక్టికల్  ఆలోచించు...పెళ్ళి ఎందుకనంటే?                                 
పర్మినెంట్ పర్మిషన్ గ్రాంటెడ్ టు డూ సెక్స్ కదా
పచ్చిగా చెప్పినా అడిగినా బాగుండదనే ఈ తంతు
ఒంట్లో కోర్కెలు సంకెళ్ళు తెంచుకుని వెల్లువై పొంగ
చట్టబద్ధంగా నాలుగ్గోడల మధ్యన చీకట్లో చేసుకునే  
టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజెన్ కలిసి జరుపుకునేదీ రాసకేళీ!

ప్రాబ్లం కానంత వరకెన్ని పాతివ్రత్యాలనైనా వల్లించి
ప్రవచనాలెన్నో నిజమనుకునేలా చెప్పే అబద్ధం కదా
శరీర వేడి తగ్గడానికి జరిపే రెండు నిముషాల తంతు
ఇద్దరూ అమాయకులమని ఆత్మవంచన చేసుకుంటూ
సత్ సంస్కారసహజీవన ముసుగులో గుద్దులాడుకునే
ఆమె ఎప్పటికీ ఒక శీలవతీ అతడు ఒక చెక్కరకేళీ!

ఫ్రాంక్ గా...కావల్సిన్నప్పుడు కామమందించే కంపెనీ
కండిషనల్ అటాచ్మెంట్స్ ని పిల్స్ గా మింగడమే కదా
ప్రేమ పక్కలో పడుకుని పైత్యం పెనవేసుకునేదీ తంతు
పరిస్థితుల ప్రభావంలో ఆడామగతనాలు సంసారం చేసి
మరోప్రాణి జీవంపోసుకుని బలమైన బంధం ఏర్పడగానే
మేల్ ఫిమేల్ ఆర్గాన్స్ ని పత్తిత్తులుగా చేస్తుందీ రంగేళీ!

ఐ లవ్ యూ :D

డేంజర్ మనుషులకన్నా డార్లింగ్ డ్రాకులాస్ మిన్న వెంటపడుతూ వేదించి వలపూ గిలుపు అనకుండా కోమలంగా ఎత్తుకెళ్ళి మెడవంపున రెండుగాట్లుపెట్టి డ్రాకులాగా మార్చే డార్లింగ్ డ్రాకులా ఐ లవ్ యూ! డేర్ దిల్ లేని మహరాజులకన్నా డేర్ డెవిల్స్ మిన్న యాసిడ్ పోసో బూతులు మాట్లాడో రేప్ చేయకుండా కాంగా కిస్సు చేసి కత్తితో కాకుండా గోళ్ళతో పొడిచేసి చీకట్లో వెలుగుల్ని నింపే డేర్ డెవిల్ ఐ లవ్ యూ! డేటింగ్ అనే పాష్ పీపుల్స్ కన్నా డ్రాగన్స్ ఎంతోమిన్న అర్థం చేసుకోవాలనే అర్థంపర్థం లేని మాటలేం లేకుండా డైరెక్టుగా కావల్సిందేదో కానిచ్చి పడేయకుండా ఒడిసిపట్టి భుజంపై మోసుకెళ్ళేటి డిగ్నిఫైడ్ డ్రాగన్ ఐ లవ్ యూ! డేకాయిడ్ బుద్ధున్న మ్యాన్లీనెస్ కన్నా డెమన్స్ మిన్న అవసరానికి వాడుకుని ఆపై బొంకేసి ఎస్కేప్ కాకుండా ఆకారమేదైనా మదివీడని భూతమై నవరసాల్ని పిండేట్టి డాషింగ్ & డిప్లొమాటిక్ నాడియర్ హీరో ఐ లవ్ యూ!

క్రొత్తపంధా

నేను భావాలోచలతో యుద్ధం చేసి అలసిపోకుండా 
అక్షర సైనికులందరూ నన్ను దాడికి తలపడమంటే
పదకవాతాలకు అధిపతిరాలినై అలరించబూనుకున్నా
మెప్పించాలన్న ధీక్షతో నా శక్తిని ఉసిగొల్పుతున్నా!

నేను అనుభవాలకి రంగులద్ది భావాలు చెడిపోకుండా
రసరమ్య కావ్యాలనే లిఖించాలని ఊహలు పట్టుబడితే
లిపిలేని కలలకు రేపు నాదన్న రసాయనం పూస్తున్నా
వాక్యాలు మనసుని తాకి పరిమళింప ప్రయత్నిస్తున్నా!

నేను ఇకపై నిరాశావేదనల ఊసులన్నవే రచించకుండా
సమతాలౌకిక సామాజిక ప్రయోజన పదమాలల్లమంటే   
నన్ను నేను గెలవకపోతి రచ్చ ఏం గెలుస్తా అంటున్నా 
అయినా కొత్తగా అక్షరప్రయోగం ఒకటి మొదలెడుతున్నా!

నేను సంఘ సంస్కరణోద్యమంటూ మాటలు చెప్పకుండా
మార్పుకై నిఘంటువులో సున్నిత పదాలు వెతకబోయి
సమసమాజ నిర్మాణ పునాదుల పుస్తకం చదువుతున్నా       
మనిషినీ మానవత్వాన్ని బ్రతికించే కావ్యక్షేత్రంలో నేనున్నా!   

అస్థిర బంధం

సంబంధానికి సరైంది స్నేహం అనుకున్నాను
స్నేహమే ప్రేమగా మారుతుంటే సై అన్నాను

బంధాన్ని గట్టి పరచాలని బావాని పిలిచాను
బావలో బలం లేదంటే నిజమేనని నమ్మాను

మామాని పిలిచి మమతానురాగాలే చిలికాను
మరులుగొలిపేంత మత్తులేదంటే ఊరకున్నాను

కన్నా అంటూ పిలిచి కపటమేలేదని తెలిపాను
కలవరింతపెట్టే పిలుపంటే కామోసనుకున్నాను

ముద్దుపేరుతో పిలిచి మురిపాలు గుమ్మరించాను
ముద్దులియ్యమంటే హద్దు దాటేనని మానేసాను

నా విశ్వమే నువ్వంటూ వీడకని వేడుకున్నాను
వలపు పొరకు బంధం అక్కర్లేదంటే ఇంకేమనను

ఆప్యాయంగా అల్లుకున్న అస్థిర బంధాన్ని నేను
తుప్పట్టిన లాంతరు వెలుగులా నవ్వుతున్నాను!  

వెర్రిలోకం

వెర్రిది పిచ్చిది పనికిరాని పాగల్ లోకం ఇది
వద్దన్నా వ్యక్తుల్ని వార్తాపత్రికలా చదివేస్తుంది
ఏదోకరోజు రూపం వెనుక దాగింది చూస్తుంది
వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది!

దాచింది చదవలేనిదేదో నెమ్మదిగా తెలుస్తుంది
అంత వరకూ ఆగని లోకం ఏదేదో ఊహిస్తుంది
వ్రాయని అంశాల పెద్దనిఘంటువే దాగుంటుంది
ప్రపంచానికి కనబడని మరోకోణమే మనిషన్నది!

కన్న కలలను బ్రతికించుకునే హక్కు నీదీ నాది
ఎవరికి తగ్గ నైపుణ్యం వారిలోనే కుదించబడుంది
నువ్వు నువ్వే నేను నేనేనన్న ప్రత్యేకత మనది
నిజం నేస్తమై సహనం సన్నిహితగా ఉంటానంది!

నవ్వు వెనుక వ్యధను దాచే వ్యక్తిత్వం కొందరిది
మదిగాయానికి చేసే మోసపూరిత అలంకారమది
మనసువిప్పి నవ్వక బహిరంగంగా ఏడ్వలేనన్నది
నిజాన్ని ఎందుకు చూపకున్నామో తెలియకుంది!

మ్యాడ్ మెంటల్ పిచ్చి పైత్యం పట్టిన లోకం ఇది
వారిది కాక ఎదుటివారి జీవితాన్ని చదువేస్తుంది 
ఇతరులు మనలా ఉండాలని ఎందుకో కోరుతుంది
అందుకే మతిలేని లోకాన్ని వదిలేయమంటుంది!

దశమరసం

ఆరంభంలోనే శృతిమించిన శృంగారం దక్కదని తెలిసి
మాటలెన్నో చెప్పి ప్రేమతేనెకత్తి మదిలో దించి పోతూ
హాస్యం హద్దులు దాటినా పర్వాలేదని కబుర్లెన్నో చెప్పి
కరుణరసపు గూటి చిరునామా చెప్పమని బ్రతిమిలాడి
ఓపిక నశించి విసుగు చెందితే రౌద్రం వద్దని వేడుకుని
ఏదోలేనని నవ్వితే వీరత్వం తమదని తెగమురిసిపోయి
విరగబడి నవ్వి భయంకరమైన చిత్ర విన్యాసాలెన్నో చేసి
భీభత్సాన్ని సృష్టించి అన్నీ అద్భుతం అనేలా మరపించి
    ఏది ఏమైనా శాంతం వహించాలంటూ పాఠాలు చెప్పడం      
ప్రేమలో కొంగ్రొత్త విద్యలంటూ ప్రేమించబడలేని రానినాడు
వలలో పడ్డ పిట్ట ఉసురు మనకేల అనుకోవడం దశమరసం
నవరసాలు మనల్ని కాదు పొమ్మని పరుల చెంత చేరితే
అన్నీ కలిసిన ఎందుకూ కొరకాని ఈ దశరసం ఉత్తమం!!

భ్రమలో ఉన్నావేమో..

మారిన సమయపు మాయావలయం చూస్తూ మేల్కుని 
కనులు మూసుకుని గడిపే కాలాన్ని కలగంటున్నావేమో!

తామరాకుపై నీటిబొట్టంటి  ప్రేమసంతకాన్ని గుండెపై చూసి 
ఆవిరైన నీటిరాతల్లో  తీపిజ్ఞాపకాలు వెతుకుంటున్నావేమో!
  
వెన్నెల్లో కానరాని వెలుగును వేకువ వెలుగుల్లో వెతుక్కుని
ఆశతో మరోమారు మరపురాని బంధాన్ని పేనుతున్నావేమో!

దూరమైపోయిన ఆనందం గుండె గుర్తుల్లో దాచిందంతా తీసి 
నేలనింకిన నిరాశకి ఎత్తుపల్లాల బాటని చూపుతున్నావేమో!

ప్రేమంటే రెండుశరీరాల కలయిక కాదన్న సిద్ధాంతం వల్లించి 
ఆటుపోట్లు లేని జీవితమేలేదన్న వేదాంతం వల్లిస్తున్నావేమో!  

ప్రేమహంతకుడు..

"ప్రేమించు ప్రేమను నీవు ప్రేమతో పంచూ
అది రెట్టింపు ప్రేమను నీకు అందించు..."
పద్మ ప్రేమకే అర్పితమని కబుర్లెన్నో పలికి
ప్రేమ భావాలను మనసు నిండా నింపితే
ప్రేమించి ప్రేమించానని భరోసా ఇవ్వమంటే..
బలమైన బంధానికి బానిసను మన్నించమనె!
ప్రేమించిన మనసు బ్రతకడం రాక చావలేక
అనుకున్నది ఒకటి జరిగె మరొకటని వగచి
మార్గం మార్చి నడువ చేయి అందించమంటే..
కన్నవాళ్ళు కాళ్ళే కాదు చేతులూ కట్టేసారనె!
నచ్చింది చేయాలనుకుంటే అడ్డురాని ఆటంకాలు
నచ్చనివి వద్దనడానికి వంకలెన్నోనని మనసంటే
ప్రాధాన్యతనిబట్టే ప్రణయమైనా పని ఏదైనా అని..
ప్రేమించడానికి అవసరంలేని మిగతా అవయవాలనె!
జీవితపు చివరిమజిలీ వరకూ భంగిమలు మారుస్తూ
ప్రేమను నాలో చంపేసిన నా ప్రేమికుడికి నజరానా..
నవ్వుతూ బ్రతుకుతున్నాననే భ్రమని కలిగించానంటే
ఇంట గెలవకపోయినా నా ప్రియుడు రచ్చ గెలుస్తాననె!  

మాట వినని వలపు..

నేను ఎన్నడూ ప్రేమించకూడదనే అనుకున్నా
నిన్ను చూసి నా గుండె నాకే ద్రోహం చేసింది!
జీవితం ఆడి పాడుతూ హాయిగా గడిపేస్తున్నా 
అనుకోకుండా ఈ ప్రేమరోగం నాకొచ్చి సోకింది!

కునుకు కరువైయ్యింది అంతే కదా అనుకున్నా 

ఎడబాటగ్ని లోపల నరాలను దహించి వేస్తుంది!
ప్రేమిస్తే ఒకజీవితభాగం పూర్తని సరిపుచ్చుకున్నా
ప్రేమకెన్ని ఆచారవ్యవహార ఇబ్బందులో తెలిసింది!

వరించి వ్యధపడ్డ వారిని చూసి వెర్రని నవ్వుకున్నా

వ్యధలు పీడిస్తే వలపుజాడ్యం వ్యసనంగా మారింది!
రాత్రులు కలలతో కాపురం చేస్తే సహజమనుకున్నా
మనసిచ్చి పుచ్చుకున్న వారికిదే శిక్ష అనిపిస్తుంది!
     
తప్పు తప్పూ ఇకపై ప్రేమించడం మానాలనుకున్నా
కానీ.....నా గుండె నామాట ఎప్పుడు వినిచచ్చింది!

సాక్ష్యపు ఆనవాలు

జీవిత నాటకంలో కల్మషం లేక మనసారా నవ్వి నవ్వించి
అంతరంగానికి పరిమితులే గిరిగీయనప్పుడు తెలియలేదు 
చేసిన కర్మలతో నేను పోషిస్తున్నది ఒక కీచురాయి పాత్రని!

గుప్పెడు గుండెని కరిగించి సముద్రమంత ప్రేమను పంచి
ఆకాశమంత ఆనందాన్ని కోరుకుంటేనే కానీ తెలిసిరాలేదు
కరిగే గుండెకు ఇవ్వడమే తప్ప ఆశపడి అడగడం తప్పని!

అనురాగాన్ని అలల ఆటుపోటు చేసి ఎగిరెగిరి ఆరాటపడి 
మరింత ప్రేమనిచ్చి మొహం మొత్తిందంటే కానీ తెలీలేదు 
ఏదైనా సరే అడిగినంత మాత్రమిచ్చి లేదని బెట్టుచేయాలని!

కోల్పోయిన ఉనికిని శోధిస్తూ గుండె తడారిపోయేలా తపించి
అస్తిత్వం రూపాంతరించి ఆనవాలు పట్టనప్పుడైనా తెలియదు
పలికే మాయమాటల ఇరుకులో ఊపిరాడని ఉపేక్షిత గీతమని!

అనేకాలోచనల త్రొక్కిసలాటలో ఓరిమినే అత్తర్ల ఊపిరిగా పీల్చి 
అడకత్తెరలో పోకచెక్కనై నలుగుతున్నా కానీ తెలియడంలేదు
నా నీడ కూడా నాతో వెలుగులేనిదే వెంటరాదని నాది కాదని! 

ఏమి నా భాగ్యం!

హృదయం కావ్యమై, వేదన కవితగాను గతాన్ని గజల్ గా వ్రాసి
పరాయి వాళ్ళనే శ్రోతలుగా చేసి వినిపించేలా కలిగెనే నా భాగ్యం!

కన్నీటిదారాలు పెనవేసి గుండె గాయాలను కుట్టాను వచ్చి చూసి
పరామర్శించే నెపముతోనైనా పలుకరించి పోరాదా ఓ నా అదృష్టం!

నచ్చిన లోగిలినే అందంగా ఊహించుకుని ఎదశ్వాసనే ఊపిరి చేసి
అదృష్టాన్ని అంచనా వేయక ఆనందాన్ని పందెమేసి ఆడితి జూదం!

ఏరి కోరి అంగట్లో ఎడబాటు వ్యధలను లాభం కోసమని వేలం వేసి
లోకాన్ని జయించి నీ ముందు ఓడిపోయా ఎందుకని చెప్పు నేస్తం!

నా వలపు సాంద్రతను కొలవడం రాక నీలో ఉన్న నన్ను చంపేసి
నమ్మకాన్ని సజీవంగా ఉండమని చెప్పడం ఎంత వరకూ న్యాయం!

ప్రేమన్నది ఆటవస్తువు కాదు ఆడుకున్నంతసేపు ఆడుకుని విసిరేసి
క్రొత్తబొమ్మ కొనుక్కుని మురిపెంగా దానితో కొన్నాళ్ళు ఆడుకోవడం!

నాలాగే జీవితాంతం ప్రేమకోసమే అల్లాడి అప్పుడు దరిచేరి జతచేసి
పద్మను రమ్మని పిలిస్తే నేను పోయినా నా ప్రేమ నీపైనే ఇది సత్యం!

మనసా మాయమైపోదాం రా!

చెప్పడానికి ఏముంది వినేవారుంటే ఎన్నో చెబుతారు
పనికిరాని మాటలకి విలువలేదు కదాని వాగేస్తారు..   
విని వదిలివేయక పట్టించుకుంటే బ్రతుకలేవే మనసా!

ప్రతి ఉషోదయానికీ రేయితో సంబంధం అంటగడతారు
నువ్వెంత నీ ప్రాతివత్యమెంతని రోబోతో రంకుగడతారు  
మనుషులున్న లోకంతీరే ఇదని తెలుసుకోవే మనసా! 

మనల్ని మనమాడిపోసుకుంటే అవునని ఆసరా ఇస్తారు
కాదని వాదించి గెలవాలి అనుకోకు తప్పులెంచుతారు..
వీధి కుక్కలు మొరుగుతుంటాయి గుబులేలనే మనసా! 

నీతులు చెప్పే ప్రబుద్ధులెందరో గోతులు తవ్వుతుంటారు
అవసరానికి అందితే చేతులు లేదా కాళ్ళు పట్టుకుంటారు   
పరులు అనేమాటలకి నీకళ్ళు తడుపుకునేడవకే మనసా!

ఎంతటి మహానీయులైనా అందరినీ ఆనందింపజేయలేరు
ఎవరికి ఎవరూ చివరికి ఎవరూ నీవారు కారు, రారు..    
మనకు సంతోషాన్ని ఇచ్చేది ఒక్కటైనా చెయ్యవే మనసా!

పిలచినా బిగువటోయ్..

ఏడనున్నావో ఎలాగున్నావో కానీ ఎదను మీటుతున్నావోయ్
నీలిమేఘాలు నీలిగి చుక్క రాల్చనన్నాయి నువ్వొచ్చిపోవోయ్    
కొప్పులోని మల్లెలు పక్కపై రాలి వాడిపోతున్నాయి రావోయ్
మౌనంగా మనసు పాడేటి రాగసాహిత్యం రంజుగుంటదిలేవోయ్!

చురకత్తి మీసాలోడా నీకోసం చుక్కలతోటంతా చుట్టొచ్చినానోయ్
అల్లిబిల్లి కౌగిట్లో అల్లుకుపోయి కొసరి అనురాగమే అందిస్తానోయ్
కన్నుకన్ను కలిపిచూసుకుంటే వెన్నెలరేడు వెక్కెక్కి ఏడ్చునోయ్
చీకట్లో సరసమాడక నీ నీడతోనే నీకు దాగుడుమూతలేలనోయ్!

ప్రణయంలో పట్టువిడుపుల పదునెంతో నీకు తెలియని కాదోయ్
వలపురేడా నీకై రసికరాజరికమే పరుపుగా పరచినాను కదోయ్
ఆకలేసున్నావు అందుకో ఇస్తాను నా కౌగిలెంతో తియ్యనిదోయ్
కంటికి కానరాక కవ్విస్తే వేచి ఉన్న విరహమెలా తీరుతుందోయ్!

మెరుపులా మెరిసిపోక మబ్బై కమ్ముకుని వానలా తడిపేసెయ్
వలపు వానలో తనువు తాకి తడారని అందాలని తడిమేసెయ్
సిగ్గుపడితే సొగసులే కరిగేనని సిగ్గువిడిచాను నన్ను చుట్టేసెయ్  
లోకాన్ని మరచి మైకంతో ఏకమైపోదాము దీపం ఆరిపివేసెయ్!  

బూడిదైన ఆశ..

నాకు మాత్రమే పరిమితమైన నా భావాలకు నిప్పంటుకుంది
నలుగురితో పంచుకోలేనంటూ లోలోన ఇమడలేక మండుతూ
కాలరాయలేని కలవర కలలను తైలంగా ఒంటిపైన వేసుకుని 
మంటల్లోనైనా మరుగున పడమని మర్మాలను మసిచేస్తుంది!
నాలో మాత్రమే రగిలే కోరికల జ్వాల భగ్గున మండి ఎగసింది
నాసిరకం వలపులో చిక్కుకున్న చంచల మనసును తిడుతూ
పోయేకాలానికి వచ్చిన పుట్టెడు బుద్ధుల్ని పిడకల్లో కాల్చమని
గతజ్ఞాపకాలను గుర్తు రావద్దని సంస్కారం మరచి తిడుతుంది!

నాకు నేనుగా నిర్మించుకున్న అందమైన ఆశలసౌధం కూలింది
నిరసన తెలుపని నిస్సహాయ ఆలోచనలు మైనంలా కరుగుతూ
గతకాలజ్ఞాపకాలను చల్లార్చలేని వేడి కన్నీటిని ఆవిరై పొమ్మని
నివురుగప్పిన నిజాల్ని నిద్రలేపి గాలితో జతై కాలిపొమ్మంటుంది!
నాలో నిండిన ఆత్మస్థైర్యం నిలువున కాలుతూ బేలగా చూసింది
నీరసించిన అప్పటి నన్ను ఇప్పటి నాతో పోల్చలేక గల్లంతౌతూ
ముఖం చాటేసిన మైకపు మోహాలను మంటల్లో కాల్చివేయమని
ఆత్మను వదలి సెగల్లో కాలిన ఆశయం బూడిదై గాల్లో కలిసింది!           

వ్యధ కానుక!

కుదిరితే నీ మనసు చెప్పింది విను
లేదంటే నన్ను మౌనంగా ఉండమను
వ్యధను సంతోషమని ఎలా అనగలను
నవ్వడానికి ఏం ఎలాగోలా నవ్వేస్తాను!

విరబూయించడానికి తోటలోని పూలను
లేని ప్రేమని తోటమాలిలో కలిగించలేను
నవ్వుతున్న ముఖంలో దాగిన బాధను
రాతిగుండెని కన్నీటితో కడిగెలా చెప్పను!

ఒకరి నొప్పి ఇంకొకరినెలా భరించమనను
ఆ బాధ వేరొకరికి కలగాలని శపించలేను
కన్నీటిలో వ్యధలని కొట్టుకుపొమ్మన్నాను
ఏదో ఇలా సరిపుచ్చుకుని తృప్తిపడతాను!

అందమైన కల ఒక్కటైనా చూడని నేను
సంతోషకరమైన ఊహలేం ఊహించుకోను
ఏ విధంగానూ తృప్తి పరచలేకపోయాను
అందుకే నువ్విచ్చేది ఏదైనా స్వీకరిస్తాను! 

బావలు సైయ్..

ఆంధ్రా బావనో, తెలంగాణా బావయ్యో లేక రాయలసీమ మామో
ఎవరైతే నాకేటి ఏ ఊరోడైతే నాకేంటి బావలందరికీ బస్తీమే సవాల్
నన్ను మెచ్చి నావెంట రాకుంటే లైఫ్ మొత్తం మిస్ అవుతావోయ్! 
 
నేనేంటి నా యవ్వారమేందని సోచాయించి పరేషాన్ ఎందుకు నీకు     
కోనసీమ కోటేరుముక్కు, చిత్తూరు పాలకోవ నా రంగు చూస్తే జిల్
ఆంధ్రాపారిస్ తెనాలి అందం తెలివితేటలు కూడా నా సొంతమేనోయ్!
 
పల్నాటి పౌరుషం కాకతీయ ప్రతాపం కలిసి మీసమున్న మగాడైనా
నీ బాంచన్ అంటూ నా చుట్టూ తిరిగి నాకు గులామవ్వడం కమాల్
నా జిమిక్కులతో కూచిపూడి తీన్ మార్ కోలాటమాడిస్తా చూడరోయ్!
  
తెలంగాణా సక్కినాల్లా సక్కిలిగిలెట్టే సరసం గోదారి పూతరేకు పరువం  
సీమ సంగటిముద్దలాంటి ముద్దులతో అయిపోతావు నువ్వు ఢమాల్    
నన్నంటుకుంటివా హైదరాబాదీ ఇరానీచాయ్ లెక్క గరంగుంటారోయ్!
 
మంగళగిరి వెంకటగిరి పోచంపల్లి గద్వాల్ ధర్మవరం కోక ఏది కట్టినా
చీరకే అందమొచ్చే సొగసు నాదైనా ఖర్చు పెట్టేటి నీ గుండె గుబేల్  
నాతోటి లింకు ఆషామాషీ అనుకుంటివా కరుసైపోతావ్ జరబద్రమోయ్!

రహస్య ప్రియుడు..

ఏకాంతవేళ ఏం తోచక నాలో నేను మాట్లాడుకుంటే..
నాకే తెలియకుండా నన్ను నఖశికపర్యంతం చూస్తాడు!

సడీసప్పుడు లేక జంటగువ్వలుగా ఎగిరిపోదామంటే..
పెదవిని పెదవితో తాకకనే పరోక్షంగా పంటిగాటెడతాడు!

చంద్రుడు రేయి దుప్పటిని కప్పుకుని తారలతోటుంటే..
మిలమిలా మెరిసేటి తన చూపుతో నన్ను కప్పేస్తాడు!

ఏటిగట్టున కూర్చుని ఏరుగలగల శబ్దమేదో వింటుంటే..
వెనకమాలొచ్చి వేడిసెగ చెవిలో ఊది వాటేసుకుంటాడు!

ఇసుకలో గవ్వలు ఏరుకుని ఆడుకుందాం రమ్మనంటే..
నా ఇసుకతిన్నెల వంపులే తనని నిలవనీయవంటాడు!

చాటుమాటు సరసం మనకేల ఎవరైనా చూస్తారనంటే..
నగ్నంగా నన్ను చుట్టేసుకుని నాలో కలిసిపోతున్నాడు!

నీలిమేఘాలపై ఊసులాడి మరోలోకంలో తేలుదామంటే..
నాకే అర్థమయ్యే భాషలో శృంగారశతకమే చదువుతాడు! 

ఊపిరున్న శవం..

నా భావాలను వెళ్ళబుచ్చి ఎవరిని మెప్పించి
ఏం సాధించానో ఏమో తెలియకపోయినా...
ఉన్నదున్నట్లు చెప్పుకుంటే తిప్పలు తప్పించి
ఒరిగేది ఏమీ ఉండదని ఆలస్యంగా తెలుసుకున్నా!

నా నీడని వేరొక అందమైన రూపంలో రంగరించి
ఏం పొంది ఆనందించానో తెలియకపోయినా...
కలలన్నీ కరిగి ఆవిరైపోవగా కన్నీరంతా హరించి   
కాటికేగబోవ ఊపిరి ఉందంటే జీవచ్ఛవమై ఉన్నా!

నా ఆలోచనలకి అనుగుణంగా అందరినీ ఎంచి
ఏం లాభాన్ని పొందానో తెలియకపోయినా...
ఉన్న మనసుకి లేని పిచ్చిని కూడా ఎక్కించి
వెర్రిదాన్నని పచ్చబొట్టుతో పద్మ అనిపించుకున్నా! 

నా అంతరంగం ఎంతో నిర్మలమైందని భ్రమించి
ఏం ఆశల అందలమెక్కానో తెలియకపోయినా...
ఉన్న ఆత్మనిబ్బరాన్ని నలిపేసి నట్టేట్లో ముంచి
పరులను నమ్మి నన్ను నేను హత్య చేసుకున్నా! 

అపరిచితులం అవుదాం...

మన ఈ పరిచయమేదో మనకు అచ్చిరాలేదు 
పద ఇద్దరం అపరిచితులం అయిపోయి మరల 
మంచిముహూర్తం చూసుకుని పరిచయమౌదాం!

నీ నుండి నేను నా నుంచి నీవు ఏమీ ఆశించక
తప్పొప్పులు ఎంచక ఇద్దరి చూపులు కలబడేలా
ఒకరినొకరు ఆకర్షించే కిటుకులేవో కనుక్కుందాం!
   
ఎడబాటు ఎదకొట్టుకోవడం పలుకలేదని అలగడం
ప్రేమలో హెచ్చుతగ్గులని తగవులాడుకోని జతలా 
మదిగోడలపై నీ నా పేర్లు పచ్చబొట్టు రాయిద్దాం!

అహపు అడ్డుగోడ తొలగించి క్షమని పందిరిగా అల్లి
పాత వలపుని నరికి తిరిగి పరిచయం పెంచుకుని
బాధల్ని ప్రక్కనెట్టి బలమైన బంధాన్ని ముడివేద్దాం! 

గాయమవని కొత్తమనసులు రెండూ పొట్లం విప్పి
ఒకరంటే ఒకరికి ఇష్టం ఆసక్తి పెరిగి పోటీ పడేలా
నాటి తప్పటడుగుల్ని మార్చి సప్తపదిగా నడుద్దాం!


కృత్రిమం..

ఎంత దూరానున్నా ఎప్పుడూ ఎడబాటు అనిపించలేదు
ఎదురుగా నిలబడున్నా ఇంతకూ నువ్వెవరన్న ప్రశ్నే..
నా అన్న భావం పరాయిదై వలపు వగరుగా అనిపించి
నకిలీతనపు నవ్వులద్దుకుని నగ్నంగా నర్తిస్తున్న నైజం!

పలికినా పలక్కపోయినా మౌనంలో భాష కొరవడలేదు
ఇప్పుడు పదే పదే పిలిచి పలుకరించినా ఏదో దిగులే..
నా వాడు కాడన్న సంశయంతో ముద్దుగా పిలవాలన్నా
ఎందుకో వద్దని లేని గాంభీర్యాన్ని అద్దుకున్న ముఖం! 

తిన్నావాని అడిగితే చాలు కడుపునిండి ఆకలేవేయలేదు
వెళుతూ వెనుతిరిగి చూస్తే వస్తాడన్న నాటి ధీమాయే..
నాతో లేడంటూ నేటి కన్నీటికి కారణమై ఏం చెప్పాలన్నా       
మాట్లాడొచ్చానడిగి మాట్లాడబోయి పలికితే అంతా మౌనం!

బంధానికి బలమని నవ్వబోతే ఆ నవ్వులో జీవమేలేదు
అది చూసి అనురాగమే ముడులు విప్పుకుని ఎగిరె..
నాది నాదన్నది నన్నువీడి ఇంకెవరితోనో ముడివడిపోయి
ఎప్పటికైనా పరాయిదాన్ని నేనేనన్నది ముమ్మాటికీ నిజం!           

           

కలవరమాయే..


ఎప్పుడో సమయం దొరికినప్పుడు
ఎలా ఉన్నావంటూ పలుకరిస్తావు
గుర్తుకు రాకపోయినా ఏదోలే..
ఒక్కసారి పలుకరిస్తే పనైపోతుంది కదా
అనుకుంటూ పనిలా మాటముగిస్తావు!

నీకై కొట్టుకునే నా ప్రాణం ఎక్కడున్నాడో
ఏం చేస్తున్నాడో అనుకుంటూ తపిస్తుంది
నీకది చాదస్తంగా అనిపించి కసురుతావు!

నిన్నే ప్రేమించిన మనసేమో..
ఏవో ఆకృతుల్లోనో ఆలోచనాక్షరాల్లోనో
గాత్రంలోనో గానంలోనో దాగున్నావనుకుంటూ
తైలవర్ణ చిత్రాలు గీస్తూ నిన్నే తలుస్తుంది 
వలపు వెర్రిగా మారెనని ఎగతాళి చేస్తావు!

ఎక్కడో కలలో లీలగా కనబడుతూ
అందీఅందనట్లుగా అగుపడి కలవరపరుస్తూ
సెలయేరులా రమ్మంటే జలపాతమై వెళతావు!

ఊగిసలాట..


నాకు మరో క్రొత్తమార్గంలో పయనించాలని లేదు
నీ అడుగులో అడుగేసి గమ్యాన్ని చేరాలనే తప్ప 

ఇప్పుడు నా సలహాలు సంప్రదింపులతో పనిలేదు 
నీకు మరో మార్గం దొరికె నాకు నీ అవసరం తప్ప

నేను కోరుకున్నదీ లేదు నాకు దక్కిందీ ఏమీలేదు
అనవసరంగా మనసు వ్యధను పెంచుకున్నానే తప్ప

ప్రేమిస్తున్నానంటే ప్రేమను ఇస్తున్నానని తెలియలేదు
తెలిసుంటే ప్రేమించేదాన్నే కాదు ఒంటరి జీవితం తప్ప  

నీతో పదికాలాలూ బ్రతకాలని అస్సలు ఆశపడలేదు 
నీ ఎదపై వాలి ఊపిరి వదలాలి అనుకున్నాను తప్ప

ఆశల మేడకట్టి నీపేరుతో నాపేరు జోడించడం రాలేదు 
కన్నీరు మున్నీరై నన్ను నేను నిందించుకోవడం తప్ప

నా హృదయానికి నిన్ను మరవడమే తెలియడంలేదు 
ఇంకా నీ నీడనే నా నివాసం అనుకుంటున్నాను తప్ప

నీ మీదే మనసుపడి..

మనసు మనసైన వాడిని ప్రశ్నించాల్సి వస్తే....జవాబు రాదని తెలిసి కూడా ఇలా నిలదీస్తుందేమో!

వాడి వాంఛ..

పూసిన చెట్టులోనూ పడిపోయిన కొమ్మ నుండీ పరిమళాలు కోరి 
పసిపిల్లలైతేనేమి పండుముసలిది అయితేనేమి పరువాలు చూసి 
పేట్రేగిపోతున్న మగతనాన్ని కోసి కారంపెట్టి ఎర్రగా వేపాలనుంది!

దేశంలో ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పురుషాంగాలు మొలచి 
అవి లేచినప్పుడు చిన్నా పెద్దా ముడుచుకున్న యోనీలకై వెతికే 
కౄరమగాళ్ళ మొడ్డల్ని సైనైడ్ సూదులతో గుచ్చి చూడాలనుంది!

అడ్డదిడ్డంగా పెరిగిన మగబుధ్ధితో అదృష్టం ఉంటేనే పుట్టే ఆడపిల్లని
అవసరాలుతీర్చే శృంగార సాధనమనుకుని అవయవాలన్నీ తడిమే
కర్కశ కామకీటకాల కళ్ళుపీకి ధ్వేషంతో కాండ్రించి ఉమ్మాలనుంది! 
     
రొమ్ములు చీకినప్పుడు లేని రోమాలు పెన్నిస్ లతోపాటుగా పెరిగి
కామంతో కళ్ళుదొబ్బి ఏరంధ్రంలో పెడుతున్నారో కూడా తెలియని
రాక్షసుల నవరంధ్రాలలో సీసం కాసిపోసి చిందులు వేయాలనుంది!

మదమెక్కిన మగజాతి విశృంఖల వీర్యకణాలని ఆసిడ్ లో ముంచి
కాళ్ళు పట్టుకేడ్చి బ్రతిమిలాడినా వదలని వాడి బీజాలబలుపు తీసి 
ఏరులై పారిన రక్తం కడిగి వాడి స్కలనాన్ని సమాధి చేయాలనుంది!

ఆనందంగా అంతమౌతాను..

నేను కలగన్న శిఖరాలు నువ్వు చేరితే..
వాటి క్రింద నేను శిధిలమైనా నవ్వేస్తాను!

నీ కంటి వెలుగులే నలుగురికీ మార్గమైతే.. 
ఆ కంటిమెరుపుకు నా చూపు జోడిస్తాను!

నా ఊహల రెక్కలు నీకు వచ్చి పైకెగిరితే..
ఎగిరే రెక్కలు నేనై ఆకాశంలో విహరిస్తాను!

నీకలలు నెరవేర్చుకునే ప్రక్రియలో నీవెళితే..
వాటికి కారణం నేననుకుని మురిసిపోతాను!

నాకన్నీరు నీ సంతోషాన్ని ఆవిరి చేయబోతే..
వ్యధలను దాచేసి నవ్వులు నీపై చిందిస్తాను!

నీ జోడీ నేను కానని తెలిసి నాతోడు వీడితే..
తుదిశ్వాస వరకూ నీ నీడలో లీనమైపోతాను! 

నా రూపం నీ మదిలో ఎప్పటికీ ఉండాలని..   
అజ్ఞాతంగానైనా ఆనందంగా అంతమైపోతాను!! 

ఇద్దరమూ..

ఒక నిస్సహాయతల నదిలో.. 
నీవు ఆదరిన నేను ఈ దరినా
ఏ ఒడ్డునా నిలకడగా ఉండలేక
సతమతం అవుతూ ఇద్దరమూ!

ఒకప్పుడు ప్రేమ ప్రపంచంలో..
నీవూ నేనూ పూర్తిగా మునిగినా 
నేడు మనసు విప్పి మాట్లాడలేక
సంశయిస్తూ వ్యధతో ఇద్దరమూ!

ఒకానొక వసంత ఋతువులో..
నీకు నేను నాకు నువ్వే అయినా
ఇప్పుడు రాలిన ఆకులై చిగురించక
జ్ఞాపకాల సుడిలో చిక్కి ఇద్దరమూ! 

ఒకటే బాటై గమ్యానికి చేరువలో..
నువ్వూ నేనూ కలవక విడిపోయినా
ఎడబాటు పవన అశ్రువులు రానీయక  
నీవునీవుగా నేనునేనుగా ఇద్దరమూ!

ఒకానొకరోజు కలిసి నెరసిన జుట్టులో..
నన్ను నీవు గుర్తించి దరిరాక పోయినా
మన అలసిన హృదయాలపై అలుగలేక
పరిస్థితుల చెరలో బంధీలై ఇద్దరమూ!  

ఏంకాలేదు!

రెండడుకులు నువ్వు ముందుకు వెయ్యలేదు
నాలుగడుగులు వేసి నేనూ ధైర్యం చెయ్యలేదు
విడిపోతే కానీ ఎడబాటు ఏమిటో తెలియలేదు!

నువ్వొస్తావని పాతికేళ్ళు నేను వేచి చూడలేదు
నువ్వో పాతికవసంతాల ముందు కబురంపలేదు 
వలపు జ్యోతులే ఆరిపోయాయి వెలుతురేలేదు!

నీవు లేవన్న వ్యధను మనసూ మరచిపోలేదు
గుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
నీ గమ్యమే నాకు శాపమని నాడు తలచలేదు!

సాంత్వన మాటలెన్ని చెప్పుకున్నా ఊరటలేదు
ఓదార్పులే ఇచ్చిపుచ్చుకున్నా కన్నీరాగడంలేదు
దాహార్తితో అరచిన ఆశాశయాల దాహం తీరలేదు!
 
కాలమే పగతో కాలకూటవిషమౌనని అనుకోలేదు
కలలన్నీ సమాధైపోయె కనులు ఇది కాంచలేదు
హృదయం నుండి ఊపిరి వెళ్ళి మరల రానేలేదు!

కలిసుందాం..

నమ్మకూడదు అనుకుంటూనే నిన్ను నమ్ముతూ
సమాధానంలేని ప్రశ్నవని తెలిసి కూడా ప్రశ్నిస్తూ
అంతరంగంలో అన్నీ నీవనుకుని పైకి ఏం కావని
నా ప్రతీఅడుగులో నీవున్నావని జీవించేస్తున్నాను!

ఎదపై సేదతీరుతుంటే గుండె నిబ్బరమనుకుంటూ
లేనిపోని ఆశయాలెన్నో మనసు నిండా నింపేస్తూ
ఆలోచనలు అన్నింటినీ నువ్వే దొలిచేస్తుంటే బేలనై
నువ్వు నా రేపై మిగులుతావంటూ బ్రతికేస్తున్నాను!

ఎప్పుడూ వెన్నంటి ఉంటానన్న నీ బాసని స్మరిస్తూ
చూసుకుంటే నా ప్రక్కన లేని నీ పై ఆవేశపడుతూ
ఎందుకు స్వార్థం వలలో బంధీవైనావని ప్రశ్నించలేక
నా మదికి సమాధానం చెప్పలేక తల్లాడుతున్నాను!

విడిపోవడానికే కలిసామన్న వాస్తవాన్ని రావద్దంటూ
లేని ఢాబుని కన్నీటి పై కప్పి అజమాయిషీ చేస్తూ
ఇలా కల్సి అలా విడిపోయే కనురెప్పలని ఊరడిస్తూ
ఎప్పటికీ కలిసుండే వరమియ్యమని అడుగుతున్నాను!       
     

  

ఒకానొక రాత్రి...

ఎక్కడైనా మనిద్దరం ఏకాంతంగా కలుద్దాం
మెల్లగా వొకరి కన్నీటిని... 
యింకొకరి మనసులోకి వొంపుకొని
ఎడబాటు మలినాలు కొన్ని పోగొట్టుకుని
గాఢమైన కౌగిళ్ళతో కుశలప్రశ్నలు సంధించుకుందాం!!!

మనసులో నలుగుతున్న కొన్ని ఉధ్వేగాలను
సున్నితంగా పెకళించి వలపుతంత్రులు మీటి.. 
మౌనరాగాన్ని నిశ్శబ్ధంగా ఆస్వాదిద్దాం
లెక్కలేనన్ని జీవిత చిక్కుముడులని
ఓపిగ్గా విప్పుకుంటూ కొత్తసమాధానాలను అన్వేషిద్దాం!!

గతకాలపు గురుతుల మన పుస్తకంలో
ఇంకొన్ని పుటల్ని ప్రేమతో అతికించి...
బ్రతుకు గ్రంధాన్ని అందంగా రాసుకుందాం
ఆశల నక్షత్రాలతో అందంగా అమరిన ఒకానొక రాత్రిని 
మన చిరునవ్వుల వెన్నెల్లతో సుందరంగా ముస్తాబుచేద్దాం!

అస్థిర హామీ..

సంతోషంగా ఉంటానని ఒట్టేసి నీకు చెప్పి
మారిపోతానని నీకు హామీ ఇవ్వలేనుగా..
నా మనోభావాలు క్షణికాలేనని మభ్యపెట్టి
నీ ఆనందంకోసం అంటాకానీ నిజంకావుగా..

నిన్ను ఎప్పుడైనా తెలియక బాధిస్తానే తప్ప
తెలిసెన్నడూ నీ భావాలనైనా గాయపరచనుగా..
నీకు ఇబ్బంది కలిగించే పరిస్థితిని కలిగించక
వాగ్దానం చేసి నిబ్బరంగా మసలుకుంటానుగా..

నీకు ఎల్లప్పుడూ అన్నింటా మద్దతుని ఇచ్చి
నీ విజయాలకు నేను వారధిని అవుతానుగా..
నవ్వడం ఏడవడం నీతో కలిసి మెలిసి చేస్తూ
నిన్ను ప్రేమించే వారిలో నాదే ముందు పేరుగా..

భాగస్వామ్యం కోరక బాధల్లో భాగం పంచుకుంటూ
నిజాయితీకి నిర్వచనమే నేనని నిరూపించుకుంటాగా!

జ్ఞాపకాలబొంత..

మనసు ఇప్పటికీ ఆ జ్ఞాపకాల బొంతనే కప్పుకుంటానంది
 చాలాకాలంగా దాని క్రిందే ఎన్నో ఊహల్తో కాపురం చేసింది
ఇతర ఏ ఉతికిన కొత్తబొంతలోనూ ఆ అనుభూతి రాకుంది
చెప్పాలంటే ఆ జ్ఞాపకాల బొంతలో నాదన్న ధీమా ఉండేది 
దాన్ని కుట్టడంలో చూపిన శ్రద్ధ ఓపిక ఇప్పుడు కొరవడింది
అపోహలను ఎన్నింటినో పొరల మధ్యనదాచి కలిపికుట్టిందది
వేలిముద్రలు కళ్ళ ముందు చేసిన నాట్యమే కదలాడుతుంది 
దారపుపోగుల చిక్కుముళ్ళు విప్పడం ఇప్పుడింకా గుర్తుంది
అల్లరితో అలిగి లాక్కుని చుట్టుకుదొర్లిన స్పర్శ వీడనంటుంది 
అందుకేనేమో పాతబడి ఎన్ని తూట్లుపడినా వదల్లేకపోయింది

కానీ ఇప్పుడు ఆ ఇరుశ్వాసల పరిమళం మాయమైపోయింది
ఎందుకంటే నేను ఒంటరిగానే బొంతను చుట్టుకుని దొర్లుతుంది
   కోటు వేసుకోవడం అలవరచుకున్నాడన్న రహస్యం దాగుంది! 

గుండెపోయింది…



గుప్పెడంత గుండెకి ఏమైందో పడిపోయింది
ఎంత వెతికినా సరే ఆచూకీనే తెలియకుంది
అదేమని అర్థం చేసుకుని నిర్ణయించుకుందో 
ఏ అవసరం లేదనుకుని వదిలేసిపోయింది!

ఎక్కడ ఎలాగుంటుందో ఏమోనని బెంగగుంది
ఆకలేసినా అడగలేని అమాయక అల్పప్రాణది
ఎండావాన తట్టుకోలేనిది ఒంటిరిగా ఎలాఉందో
హఠాత్తుగా వెళ్ళాలి అనుకుంది వెళ్ళిపోయింది!

ఊపిరే నాకది ఎవరినెలా అడిగి తెలుసుకునేది
చితికిందో చిరిగిందో చిల్లుపడిందో తెలియకుంది 
ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని అవస్థలు పడుతుందో
నలుపురంగు నచ్చక రంగుల్లో కలిసిపోయింది!

ఆశలు ఆశయాలని అణచివేసుకున్న ప్రాణమిది
గతంలో నన్ను ఒదిలేసి భవిష్యత్తు వెతుక్కుంది
ముతకదారంకన్నా పట్టుకుచ్చు మోజనిపించిందో   
విసుగని వేసారిపోయి నిశ్శబ్దంగా నిష్క్రమించింది!

చిన్నిగుండెకేం తెలుసునని భావవలలో నేచిక్కింది
వడగాలికొదిలి వయసుగాలి దొంతర్లో దొర్లిపోయింది
నాజూకు గుండె నన్ను నమ్మి లాభంలేదనుకుందో 
గుణపాఠం వల్లిస్తూ జీవితమే జీవచ్ఛవమయ్యింది!

తారతమ్యం..

అభిమానించడం ధ్వేషించడం ఆస్వాధించడం
ఇరువురిలో సమాన స్థాయిలో ఉన్నప్పుడు 
స్త్రీలు మాత్రమే జాతులుగా విభజించబడడం
పురుషుడు ఆమెలోని నాణ్యతలు ఎంచడం..
ఎంత వరకూ సబబో నాకు అర్థంకానే కాదు!

పద్మినీ జాతిలో శుభలక్షణాలు ఉన్నాయనడం  
మురిపించి మరిపించి మెప్పించేదామైనప్పుడు
ఆమెకు సరైన జోడి పురుషులలో లేకపోవడం  
పైగా పద్మినీజాతి స్త్రీ కావాలని కోరుకోవడం..
ఎంతైనా ఇది న్యాయ సంబంధిత కోరిక కాదు!

చిత్రిణీ జాతి స్త్రీలు అందచందాలు చిందించడం
ఆకర్షించడం ఆమెకే చెల్లును అనుకున్నప్పుడు
తిరిగి ఆకట్టుకునే మగమహారాజులు కొరవడడం        
స్థిరచిత్తం లేని ఆమెని చూసి చొంగ కార్చడం..     
మగ అహానికిలా ముసుగేయడం మంచిదికాదు!

శంఖినీ మగువలు కస్సుబుస్సుతో చిర్రుమనడం
కుటిల స్వభావంతో కర్కశంగా ప్రవర్తించినప్పుడు
వీరిని ప్రేమించడం కోరి కయ్యానికి కాలుదువ్వడం       
ఏదో కోరి అనవసర ఆసక్తితో అర్హులు చాచడం..      
వివేకుల నాగరికత్వపు చత్వారం అస్సలు కాదు!

హస్తినిజాతి ఆడది నల్లగా అధికబరువు ఉండడం  
మెచ్చని పుంగవులు వంకల కోసం వెతికినప్పుడు  
ఆకార హొయలు ఆమెకేనని గేలిచేసి మాట్లాడడం
అంతరంగ అందాన్ని చూడలేని అంధత్వ లక్షణం..
అలాంటి మహోన్నతుడినందుంది మగతనం కాదు!           
    

దారిమళ్ళింది..

                                                                    ఈ మధ్య భావాలు ప్రక్కదారులు తొక్కుతున్నాయి
                                                                    వద్దన్నా వినక అనవసరంగా రచ్చకెక్కుతున్నాయి!

సార్ధకత సాంద్రతల అన్వేషణలో దేన్నీ పట్టించుకోక
ఊహల్లో ఉండలేమని వాస్తవానికి దగ్గరౌతున్నాయి!

అందమైన అబద్ధపు తొడుగేసుకుని హాయిగా ఉండక
నీతి నియమాలు మనసాక్షంటూ కొత్తదారి పట్టాయి!
 
సన్నగా ఈలవేసి కన్నుకొట్టి కవ్వించి పబ్బంగడుపక
లేని వలపు ఎలా పుట్టించేదంటూ నిలదీస్తున్నాయి!

ఎవరేమైతే మనకెందుకని పట్టక నవ్వుతూ నవ్వించక
రాని నవ్వు నవ్వలేక ఇదీ ఒకబ్రతుకే అంటున్నాయి!

జీవితపాఠాల్ని చదువుతున్నాయనుకుంటాను చూడక
అందుకే జ్ఞానం ఎక్కువై మనసుని కెలుకుతున్నాయి!

చూడనట్లు పోక ఎందుకొచ్చిన రబస నీకిదన్నా వినక
నన్నో వింతజీవిననెంచి బ్రతికినా చచ్చినట్లంటున్నాయి!
       

ఏదో చేస్తివి!

మనసు మెదడు బుద్ధి అన్నీ వశం తప్పేంతగా
నాలో ఇమిడిపోయి నువ్వు కైవశం చేసుకుంటివి
ఇదిగో అదిగో వస్తున్నావు అనుకునే ఆరాటంలో
సిగ్గుపడ్డ మోముని ముంగురులు కప్పేలా చేస్తివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మార్చేస్తివి!

మనసు పొరల్లో కోరికలు పురివిప్పి నర్తించేంతగా
నా ఆలోచనల్లో నువ్వు మెదులుతూ మురిపిస్తివి
ఏదోలెమ్మంటూ సర్దుబాటు చేసుకునే ప్రయత్నంలో
ప్రకృతి అందించిన అందాల్లో నువ్వు అగుపడితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు ఏమారిస్తివి!

మనసు నిగ్రహించుకుని నేను సింగారించుకునేంతగా
నాలోని ఆహభావాల పై నీవు అజమాయిషీ చేస్తివి
నీది కాని నాదన్నది ఏమున్నదిలే అనుకునేంతలో
ఈర్ష్యకే కన్నుకుట్టేంతగా వలపందించి అలరించితివి
ప్రియా ఇంతలా ఎలా నన్ను నువ్వు మాయచేస్తివి!

కొంచెం హాట్ గురూ..

                                                                          చల్లని శ్వాస వణికించె ఊపిరినల్లుకుని
నీ స్పర్శ తగిలి వేడిపుట్టనీ తనువులో
ఈ రేయి మంచంతా కరిపోనీ కౌగిలిలో
నేడు కాలిపోనియ్యి నీ బాహుబంధాల్లో!

జీవనాడి చలించనీయి ఊపిరి పోసుకుని
కలిసి కలవడి అలసి కరగనీ నన్నునీలో
పలికే పెదవుల్ని ఓడిపోనీ ముద్దులాటలో
శరీరాన్ని కప్పేయి నీ తనువు దుప్పట్లో!

రాపిడినీయి తడిమనసుకి ఉపశమనమని
ఆవిరైపోనీ శంకలు ఏమైనాఉంటే హృదిలో
కంపిస్తున్న కరముల్ని బిగపట్టు నీచేతిలో 
బీడుభూమిని తడిపేయి వర్షపు చుక్కల్లో!

నిందించకు వణికేపెదవులు సెగరగిలించెనని
స్తంభించనీ మేనిహొయలు సరససల్లాపాలలో 
ఏకమవనీ శరీరాలు ఒకటన్న మీమాంసలో
మంచుకే మంటపుట్టనీ మనిద్దరి బిగికౌగిట్లో!

తెలుసు

నాలోని అలజడి నా అంతరాత్మకు తెలుసు 
లోకానికి ఏం తెలుసని లేనిపోనివి అనుకుంటారు..
అవకాశం ఇస్తే మరో నాలుగుమాటలు చేర్చి ముచ్చటిస్తారు!

నా అంతరాత్మ అంతమవక ఆపిన ఆయువుకేం తెలుసు 
చిక్కుపడ్డ చేతిగీతలను సరిచేయాలని అనుకుంటాయి..
కుదిరితే అక్షరాలు కూర్చి నుదుటిరాత మార్చాలనుకుంటాయి!

నా భావాలను కనబడనీయని నవ్వుకు తెలుసు 
అసంపూర్ణంగా ముక్కలైన ఆశయాల అసలు కధలు..
వాటిని కప్పిపుచ్చడానికి అంతరాత్మ వేస్తున్న విచిత్ర వేషాలు!

నాకే తెలుసన్న నిజం నా అంతరాత్మకూ తెలుసు 
ఆవేశంతో అస్తిత్వాన్ని ఆర్పేయాలని చేసే ప్రయత్నంలో..
ఎద ఎన్నిసార్లు మరణించి మరోప్రయత్నంగా ప్రాణంపోసుకుందో!

నాకు తెలియని గుట్టు నాలో అంతర్మధనానికి తెలుసు  
రెండక్షరాల ప్రేమకోసం ఉక్కిరిబిక్కిరి అవుతుందని మనసు.. 
"స్త్రీ" ఉనికి కోసం ప్రాకులాడే ఒంటరి అక్షరమని ఎందరికి తెలుసు!

ఆమె ఆడె!

అల్లరివయసేమో వలపువలలో చిక్కి ఊగగా
అణగారిన కోర్కెలు ఎదలో చిందులు వేయ
అడుగువేయలేని అనుభవాలు ఊహల్లో సాగి 
అనుభూతులు భావచెరసాలలో బంధించబడె!

ఆడలేని మయూరిని అందలం పై ఎక్కించగా
ఆగలేని ఆమె నడుమును అటుఇటూ ఊప
అందమైన ఆ కులుకులకు పలుకులు లేవన
ఆటాడలేని మది సైతం ఆటకు అలవాటుపడె!

అలై పొంగు భంగిమను పొగడపూలతో పొగడగా
ఆదిమంత్రం వేసినట్లు పరిమళాలకు పరవశించి 
అధరసుధలను కెంపులవోలె మెరిపించి మురిసి
అణువణువు పులకరించెనని రాని అబద్ధమాడె!

అందెల అరిపాదాలు సలిపి రాయబారమంపగా
ఆశలే ఆకృతి దాల్చి వగలు సెగలుగా బుసకొట్ట
ఆ మేని వంపులే విరహము పెంచి కవ్వించెనన
ఆవేశమే ఏడ్వలేక నవ్వులద్దుకుని నాట్యమాడె!