కలవరమాయే..


ఎప్పుడో సమయం దొరికినప్పుడు
ఎలా ఉన్నావంటూ పలుకరిస్తావు
గుర్తుకు రాకపోయినా ఏదోలే..
ఒక్కసారి పలుకరిస్తే పనైపోతుంది కదా
అనుకుంటూ పనిలా మాటముగిస్తావు!

నీకై కొట్టుకునే నా ప్రాణం ఎక్కడున్నాడో
ఏం చేస్తున్నాడో అనుకుంటూ తపిస్తుంది
నీకది చాదస్తంగా అనిపించి కసురుతావు!

నిన్నే ప్రేమించిన మనసేమో..
ఏవో ఆకృతుల్లోనో ఆలోచనాక్షరాల్లోనో
గాత్రంలోనో గానంలోనో దాగున్నావనుకుంటూ
తైలవర్ణ చిత్రాలు గీస్తూ నిన్నే తలుస్తుంది 
వలపు వెర్రిగా మారెనని ఎగతాళి చేస్తావు!

ఎక్కడో కలలో లీలగా కనబడుతూ
అందీఅందనట్లుగా అగుపడి కలవరపరుస్తూ
సెలయేరులా రమ్మంటే జలపాతమై వెళతావు!

21 comments:

  1. కలవర పడ్డారో
    లేక కలవర పెట్టారో!!!!!!!!

    ReplyDelete
  2. జీవితం సాగుతూనే ఉంటుంది
    ఎక్కడో రాగం శృతి తప్పినట్టు
    మౌన గానం మూగబోయినట్టు
    ఏమూలో అసంతృప్తి సెగ కాలుతూ
    మనసుని దహిస్తుంది..
    పయనం కాక తప్పని జీవితం పద్మ

    ReplyDelete
  3. ప్రేమ ఇంకా ఉంది గుండె సడిలో ఆ కంట తడిలో. ప్రేమ ఇంకా ఉంది! కరిగే కాలము తధ్యమే మారుతున్న లోకము విదితమే ధనం చుట్టూ పరిభ్రమిస్తున్న మనిషి నిజమే తనలో తాను వెతుకుతున్నది ప్రేమేనన్నది సత్యమే…

    ReplyDelete
  4. విఫలమైన ప్రేమ విరహ కవితల సీరీస్..

    ReplyDelete
  5. ఈ కలవరం తగ్గే మార్గం ఏమిటి?

    ReplyDelete
  6. maroka valapu sankeLLa.

    ReplyDelete
  7. పద్మార్పితగారు
    ఈ విరహం వలపు
    ఎందుకు చెప్పండి
    ఖుషీగా పోస్ట్ రాసెయ్యండి

    ReplyDelete
  8. కలవరమేల మీ మదిలో?

    ReplyDelete
  9. ఆ జలపాతం నిశ్చలమై మీతో ఉంటుందేమో!!

    ReplyDelete
  10. ఏదో వ్యధలో ఉన్నారు కామోసు మీరు.

    ReplyDelete
  11. పొంగిపొర్లిన భావాలు బాగున్నాయి.

    ReplyDelete
  12. Chear up with smiles padma. You are very strong i know. This sort of lyrics are not applicable to you my friend. May say wishes to my dear శ్రామికజీవి.

    ReplyDelete
  13. మీరు అన్నిటినీ అధికమించి ముందుకు సాగాలి.

    ReplyDelete
  14. మీ సున్నితమైన భావాలకు జోహర్లు.

    ReplyDelete
  15. మనోభావాలకు గంఢిపడినట్లుంది..

    ReplyDelete
  16. అంతర్గత లావా ఉప్పొంగుతూనే ఉంది మీ అవ్యక్తమైన మనోభావాలతో అర్పితగారు.

    ReplyDelete
  17. మీ ప్రతీ అక్షరం మనసుని తాకుతుంది.
    ప్రతీ బొమ్మా కనుల ముందు మెదులుతుంటుంది

    ReplyDelete
  18. అందరి అభిప్రాయాలకు అభివందనములు_/\_

    ReplyDelete
  19. ఈ కలవరాలు కన్నీళ్ళు రాతి గుండెల్ని కరిగించవు
    చిత్రం నాకు ఎంతో నచ్చింది.

    ReplyDelete