ఊగిసలాట..


నాకు మరో క్రొత్తమార్గంలో పయనించాలని లేదు
నీ అడుగులో అడుగేసి గమ్యాన్ని చేరాలనే తప్ప 

ఇప్పుడు నా సలహాలు సంప్రదింపులతో పనిలేదు 
నీకు మరో మార్గం దొరికె నాకు నీ అవసరం తప్ప

నేను కోరుకున్నదీ లేదు నాకు దక్కిందీ ఏమీలేదు
అనవసరంగా మనసు వ్యధను పెంచుకున్నానే తప్ప

ప్రేమిస్తున్నానంటే ప్రేమను ఇస్తున్నానని తెలియలేదు
తెలిసుంటే ప్రేమించేదాన్నే కాదు ఒంటరి జీవితం తప్ప  

నీతో పదికాలాలూ బ్రతకాలని అస్సలు ఆశపడలేదు 
నీ ఎదపై వాలి ఊపిరి వదలాలి అనుకున్నాను తప్ప

ఆశల మేడకట్టి నీపేరుతో నాపేరు జోడించడం రాలేదు 
కన్నీరు మున్నీరై నన్ను నేను నిందించుకోవడం తప్ప

నా హృదయానికి నిన్ను మరవడమే తెలియడంలేదు 
ఇంకా నీ నీడనే నా నివాసం అనుకుంటున్నాను తప్ప

27 comments:

 1. మీ కలం పలికే పలుకులకు నేను దాసోహం.

  ReplyDelete
 2. సున్నితంగా మనసుని తడిచేసారు
  మీ భావఝరిలో తడిసి ముద్దయ్యాము

  ReplyDelete
 3. ప్రేమిస్తున్నాను అని అంటే ప్రేమను ఇవ్వడం
  కొంక్రొత్త లాజిక్ వాహ్ వాజీ!

  ReplyDelete
 4. ఎవరి కోసం ఎదురుచూపులు
  ఎవరిపైన ఈ వలపు రుసరుసలు?

  ReplyDelete
 5. ప్రేమిస్తున్నానంటే ప్రేమను ఇస్తున్నానని తెలియలేదు- ఈ విషయం మీరు చెప్పే వరకూ మాకూ తెలియలేదు

  ReplyDelete
 6. sumadhuram mee
  kavitaloo
  bhavalu
  chitralu

  ReplyDelete
 7. ప్రేమ మనసులో పుట్టి మాటల్లో బయటపడుతుంది అంటాతు. మీకు మాత్రం భావాల్లో పుట్టి అక్షరాల్లో అలరిస్తుంది.

  ReplyDelete
 8. నీతో పదికాలాలూ బ్రతకాలని అస్సలు ఆశపడలేదు
  నీ ఎదపై వాలి ఊపిరి వదలాలి అనుకున్నాను తప్ప..touching lines

  ReplyDelete
 9. భగవంతుడు మనిషికి ఒక మనస్సు, ఇంద్రియాలు ఇచ్చాడు కాబట్టి అవి ఆకర్షించబడి మనసుని పరిపరివిధాలా యోచించేలా చేస్తుంది అందుకే మనసుల్లో ప్రేమ ధ్వేషం వాటితో సంఘర్షణ. ఇది మనసు ఇంద్రియాల సహజ లక్షణం. ప్రేమను పండం అంటూ జరిగితే నేను నాది అనే స్వార్థం పెరిగి వచ్చే అవలక్షణాలు. భావ ఏదైనా మీరు వ్యక్తపరిచే తీరు ప్రశంసనీయం.

  ReplyDelete
 10. మీ ప్రేమకు ఎంతో బలం ఉంది
  అందుకే అక్షరాల్లో ఆంత పట్టు.

  ReplyDelete
 11. మనసు ఇస్తే ఇదే మరి తంటాలు.

  ReplyDelete
 12. your feelings are superb mam.

  ReplyDelete
 13. as usual your poetry touches the heart.

  ReplyDelete
 14. మనసైన వాడు అర్థం చేసుకోకనే ఇన్ని వ్యధలు... వాడికి ఈ కవిత కనువిప్పు కావాలని కోరుకుంటూ

  ReplyDelete
 15. //నా హృదయానికి నిన్ను మరవడమే తెలియడంలేదు
  ఇంకా నీ నీడనే నా నివాసం అనుకుంటున్నాను తప్ప/// చాలా బాగుందండి. ఈ ఒక్క మాట చాలు ఎన్నో విషయాలు వివరంగా చెప్పడానికి.

  ReplyDelete
 16. ఏ భావమైనా మీ ద్వారా అది మనసును తాకుతుంది. సి

  ReplyDelete
 17. అపురూపమైన భావాలకు నిలయం మీ ఆలోచనలు.. ఎటు నుండి ఎటువైపో తీసుకుని వెళతాయి.

  ReplyDelete
 18. ఆశల మేడకట్టి నీపేరుతో నాపేరు జోడించడం రాలేదు
  so poetic pitty words.

  ReplyDelete
 19. చీకట్లో రాలిపడుతున్న తారల్లా
  ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి…
  నీవు చేజార్చుకున్న
  వేకువ వెలుగుల కోసం
  ఎగురుతున్న ఎన్నో పక్షుల్లా
  సమాధానాలు వెతుకుతున్నాయి…

  ReplyDelete
 20. ఊగిసలాడుతున్న భావాలకు మీ వాక్యాలే ఊరట...అందరికీ అర్పిత అంజలి ఘటిస్తున్నది.

  ReplyDelete
 21. ఆదరి నుంచి ఈదరి చేరాక
  అనుభూతులు వెతుకుతుంటుంటే
  అనుభవాలు మాత్రమే కనబడతాయి
  కాదని కదం ముందుకు వేతే
  కాగుతున్న మనసు వేడి
  దుఃఖం ఆగక తన్నుకు వస్తుంది

  ReplyDelete
 22. Marvelous expressions.

  ReplyDelete
 23. మనసు ఊగిసలాడి మిమ్మల్ని హైరానా పెడుతుందా?

  ReplyDelete
 24. నీ నీడనే నా నివాసం అనుకుంటున్నాను

  ReplyDelete
 25. హృదయావేదన నిచ్చెన దిగనంటున్నది కవితలో.
  బొమ్మ నాచురల్ లుక్ ఉంది

  ReplyDelete
 26. ప్రేమ మనసు నిండుగా ఉంటే తన్నుకొచ్చే భావాలు.

  ReplyDelete