పూసిన చెట్టులోనూ పడిపోయిన కొమ్మ నుండీ పరిమళాలు కోరి
పసిపిల్లలైతేనేమి పండుముసలిది అయితేనేమి పరువాలు చూసి
పేట్రేగిపోతున్న మగతనాన్ని కోసి కారంపెట్టి ఎర్రగా వేపాలనుంది!
దేశంలో ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా పురుషాంగాలు మొలచి
అవి లేచినప్పుడు చిన్నా పెద్దా ముడుచుకున్న యోనీలకై వెతికే
కౄరమగాళ్ళ మొడ్డల్ని సైనైడ్ సూదులతో గుచ్చి చూడాలనుంది!
అడ్డదిడ్డంగా పెరిగిన మగబుధ్ధితో అదృష్టం ఉంటేనే పుట్టే ఆడపిల్లని
అవసరాలుతీర్చే శృంగార సాధనమనుకుని అవయవాలన్నీ తడిమే
కర్కశ కామకీటకాల కళ్ళుపీకి ధ్వేషంతో కాండ్రించి ఉమ్మాలనుంది!
రొమ్ములు చీకినప్పుడు లేని రోమాలు పెన్నిస్ లతోపాటుగా పెరిగి
కామంతో కళ్ళుదొబ్బి ఏరంధ్రంలో పెడుతున్నారో కూడా తెలియని
రాక్షసుల నవరంధ్రాలలో సీసం కాసిపోసి చిందులు వేయాలనుంది!
మదమెక్కిన మగజాతి విశృంఖల వీర్యకణాలని ఆసిడ్ లో ముంచి
కాళ్ళు పట్టుకేడ్చి బ్రతిమిలాడినా వదలని వాడి బీజాలబలుపు తీసి
ఏరులై పారిన రక్తం కడిగి వాడి స్కలనాన్ని సమాధి చేయాలనుంది!
అద్భుతంగా ఆవేదనను ఆవిష్కరించారు.
ReplyDelete
ReplyDeleteమానవ మృగాల
వికృత విన్యాసంలో
జన్మ మర్మాల
మరణకాష్ట ధూపం
మదించిన మదజాడ్యంలో
మరణఘోష హోమాలు
కౄరమృగ చేష్టల్లో
నలిగిన తిమిర జీవనాలు..
అడ్డదిడ్డంగా పెరిగిన మగబుధ్ధి
ReplyDeleteఅదృష్టం ఉంటేనే పుట్టే ఆడపిల్ల
మీకు వందనములు అర్పితా.
పద్మా నీవు ప్రేమ వెనుక దాచిన రుద్రరూపం/అదే మరో కోణంలో నీ రూపాన్ని చూడ్డం ప్రశంసనీయం. నీ భావోధ్రేకాలు కొనియాడదగినవి.
ReplyDeleteమీ ఈ శూలం వంటి పదాలకు మగ కామాంధులు తప్పక నపుంసకులు అవుతారు.మీ కవితాధాటికి తట్టుకుని నిలబడిన అక్షరాలు చురకత్తులై మనసులో చొచ్చుకుని పోతున్నాయి.మీ పదునైన వాక్యాలకు ప్రణమిల్లుతున్నాను.
ReplyDeleteమదమెక్కిన మగజాతి విశృంఖల వీర్యకణాలని ఆసిడ్లో ముంచి-వాడి వేడి పదాల్లో మగజాతి మునిగి మసి అవుతుంది.
ReplyDeleteమేడం మీ ప్రతీ అక్షరంలోను ఆక్రందనే కాదు ఆవేదన కూడా కనబడుతుంది.
ReplyDeleteకామాంధులకు సరైన శిక్ష ఇది. కొందరికైనా కనువిప్పు కావాలి మీ ఈ కవిత.
Ashamed of myself to be a man
ReplyDeleteExcellent post
మీరు వాడిన పదజాలానికి నా మౌనంతో నిరసన తెలియజేస్తున్నాను
Delete
Deleteఅదేమండీ నీహారిక గారు మీరు మౌన నిరసన అంటే యెలా ? ఓ సంవత్సరం వెలి వేయాలిగా ? అథమ పక్షం ఓ నెలైనా ? ప్చ్ ! మరీ యింత పార్షి యాలిటీ యా !
ఇంతకీ శ్యామలీయం వారెక్కడ పోయారబ్బా ?
వారొస్తే పద్మార్పిత గారికే మగునో
నారాయణ నారాయణ
ఇంత అన్ పార్లియ మెంటరీ యా !
జిలేబి
మగమృగాలని తిట్టే నిఘంటువు
Deleteఅగ్రహారంలో నీహారిక మాటలు చెల్లవు కదా ?
ReplyDeleteభావస్వేఛ్ఛకు బలం ఉందని నిరూపించిన కవిత
ReplyDeleteఇది దమ్ము పట్టున్న కవిత
కడుపు రగిలించే కామాంధులకు ఈ కవిత కనువిప్పు కావాలి.
నిజానిజాలు భావోధ్రేకాలను నిర్భయంగా వెదజల్లే మీ గట్స్ ఎప్పుడూ ఆలోచనాత్మకంగానే కాదు అందులో సత్యం దాగి ఉంటేనే మీరు వ్రాస్తారనేది నిర్విదాంశం. అందుకే మీరంటే చెప్పలేని అభిమానం.
ReplyDeleteచదువుతుంటే గుండె పగిలి ఘోషిస్తుంది. మనిషిగా ముఖ్యంగా మగవాడిగా పుట్టినందుకు తలదించుకునేలా చేసాయి మీ ప్రతీ వాఖ్యాలు. ఎంతో మానసిక సంఘర్షణకు లేనై ఆవేదన చెదితేనే ఇటువంటి పదాలు బయటికి వస్తాయి అనిపిస్తుంది. మనం మనుషులం మానవసమాజాల్లోనే బతుకుతున్నామా? పశువులకు ఉన్న రక్షణ కూడా మనం చిన్న ఆడకూతుర్లకు కల్పించలేక పోతున్నామా? స్త్రీని లైంగికానందం తీర్చుకునే ఒక వస్తువుగా భావించి తీర్చుకుని చంపి పారేయడం అమానుషం.
ReplyDeleteసృష్టిలో స్త్రీ పురుషులు సమానం అయినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది?
ReplyDeleteఎంతో కోపంతో భావాన్ని వెళ్ళబుచ్చారు కదా. :(
ReplyDeleteమీరు...
ReplyDeleteరాసింది చదివిన తరువాత
మనసు భారంతో మూగబోయింది
పవర్ఫుల్ పట్టున్న పదాలతో మగజాతిని చీల్చి చెండాడారు
ReplyDeleteMOST POWERFUL LINES
ReplyDeleteజరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని పదునైన పదాలతో మీరు అందించిన పోస్ట్ బాగుంది.
ReplyDeleteకరెంట్ ఎఫైర్స్ విషయాలపై కామాంధుల కు కరెంట్ షాక్ కొట్టేలా రాశారు....
ReplyDeleteMadam you are all rounder.
ReplyDeleteమతి తప్పి గిర్రున తిరిగె తల.
ReplyDeleteఆహా అద్భుతం అగ్ని కణితలు కురిప్పించారు
ReplyDeleteఅక్షర అవేదన ఆజ్యంగా పోసి.
మొత్తానికి చంపి సమాధి చేసారు
ReplyDeleteమీ వాడి వేడి పదాలతో..నమస్తే
నీ ఈ పదాల ధాటికి మగజాతి పుట్టుక పైనే అసహ్యం కలుకుతున్నట్లు గోచరిస్తుంది. అయినా అందరూ ఒకే విధముగా ఉంటారు అనుకోవద్దు. మంచీ చెడు అనేవి అందరిలోనూ ఉంటాయి. ఏమైనా సాంఘిక దురాగతం పై మంచి పోస్ట్ వ్రాసావు. ప్రశంసలు ఆశీర్వచనాలు-హరినాధ్
ReplyDeleteఅసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేదించే మగమృగాలూ
ReplyDeleteకడుపు రగిలించే పనులు చేసే కామాంధులూ కొందరైనా ఇది చదివి మారితే అంతే చాలు..
ఇక బూతులు అసభ్య పదజాలం నేను వాడాను అంటారా...మెత్తగా బుజ్జగించి చెబితే జనాలకి ఎక్కదు. అయినా చదివేది అక్షరాలే అసభ్యంగా హేయంగా అనిపిస్తుంటే.. ఇంతకన్నా జుగుస్ప పుట్టించే మాటలు వింటున్న వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో కదా!!. దయచేసి ఎవ్వరూ ఇక్కడ ఆక్రోశం ఆవేదన చూడండి అంతే కానీ అక్షరాలు అసభ్యకరమా కాదా అని వెతకొద్దని మనవి.
అందరి నిర్మొహమాట స్పందనలకూ అభివందనములు...మీ పద్మార్పిత.
మీ కలానికి మీలో పొంగుతున్న భావాలకు నా శతకోటి వందనములు.
ReplyDeleteఆడవారిపై జరుగున్న అరాచకాలకు అక్షరరూపం
ReplyDelete