వాటి క్రింద నేను శిధిలమైనా నవ్వేస్తాను!
నీ కంటి వెలుగులే నలుగురికీ మార్గమైతే..
ఆ కంటిమెరుపుకు నా చూపు జోడిస్తాను!
నా ఊహల రెక్కలు నీకు వచ్చి పైకెగిరితే..
ఎగిరే రెక్కలు నేనై ఆకాశంలో విహరిస్తాను!
నీకలలు నెరవేర్చుకునే ప్రక్రియలో నీవెళితే..
వాటికి కారణం నేననుకుని మురిసిపోతాను!
నాకన్నీరు నీ సంతోషాన్ని ఆవిరి చేయబోతే..
వ్యధలను దాచేసి నవ్వులు నీపై చిందిస్తాను!
నీ జోడీ నేను కానని తెలిసి నాతోడు వీడితే..
తుదిశ్వాస వరకూ నీ నీడలో లీనమైపోతాను!
నా రూపం నీ మదిలో ఎప్పటికీ ఉండాలని..
అజ్ఞాతంగానైనా ఆనందంగా అంతమైపోతాను!!
అజ్ఞాతంగా అంతమ అయిపోవడం
ReplyDeleteనిస్వార్ధమైన ప్రేమకు నిదర్శనం.
నిదర్శనం కోరేది నిజమైన ప్రేమంటారా?
DeleteSo.....
ReplyDeleteBeautiful narration
thankQ
Deleteమహాద్భుత ప్రేమకావ్యాచిత్రాన్ని రూపొందించారు-అభినందనలు పద్మార్పితా
ReplyDeleteధన్యవాదాలండీ
Deleteఆది నుండీ చివరి వరకూ నిర్మలమైన మనసుదోచే వాక్యాలతో వలపు అస్త్రం సంధించి మరోసారి ప్రేమార్పితని నిరూపించుకున్నారు.
ReplyDeleteఇలా ప్రెమకే సొంతమైపొమ్మంటారా
Deleteఅందమైన మనసులో రాగజనిత పదజాల భావలహరి.
ReplyDeleteశ్రీత
మీ అభిమానం అది.
Deleteమీ మనోభావలహరి నా వందనములు.
ReplyDeleteకలల శిఖరాలే నే చేరినా, కీర్తి గగనాన విహరించిన చిగురంత నీ ప్రేమ పొందడం కంటే ఉన్నతమైన ఘనతలు కావు సుమా.నీ నీడే, నా జాడై - కడదాక ముడిపడిన జోడై, వీడలేని తోడై -నీకు నేను అండగ వుంటే అంతమెలా అవుతావు..? నా సొంతమే అవుతావు.
ReplyDeleteప్రేమను కవితలో పొందుపరచి అందించారుగా..
Deleteపద్మా ఎంత ప్రేమ తత్వమైనా నీకు ఇటువంటి పోస్టు సరిపడదు.ధీరురాలు ఎటువంటి దాన్నైనా సాధించే నేర్పూ కూర్పూ నీలో చూసిన నాకునువ్వు ఈ విధంగా నిస్తేజంగా అంతమైపోవడం అలాంటి భావాలను వ్యక్తపరచడం కూడా నచ్చదు.
ReplyDeleteచిత్రం కనుసొంపుగా ఉంది.
నాటి లైలామజ్ఞూ, దేవదాసుపార్వతీ, సలీమనార్కలీ...అందరివీ విషాదభరితాలే కదండీ!
Deleteమహాద్భుత ప్రేమకావ్యంలో అంతమైపోవడమే అపశృతిలా ఉంది
ReplyDeleteప్రేమను పొంది మెప్పించడంలో అందెవేసిన చెయ్యి మీది..హా హా
అన్ని ప్రేమలూ అందరికీ దక్కవు కదండీ.
Deleteకత్తిలాంటి పోస్ట్ ఫోటో పెట్టి గుండెల్లో కసుక్కున పొడిసినావుగదమ్మా..
ReplyDeleteవామ్మో ఏమైనా అంటే నన్ను కత్తితో పొడిచేలా ఉన్నారు.
Deleteప్రేమ ఎంత మధురమో అంత వేదన కూడా అన్నట్లు ఉంది మీ కవిత.
ReplyDeleteరెండూ సమపాళ్ళలో ఉంటే పర్వాలేదండీ..
Deleteఅందమైన కవితను అందించారు.
ReplyDeleteవ్యధలో అందాన్ని మీరే చూడగలిగారు.
Deleteమాటల్లో చెప్పలేని రసమయ ప్రేమ వ్యధాభరిత కావ్యం.
ReplyDeleteఅవునంటారా!
Deleteఅక్షరాలతో సునామీలు పుట్టిస్తారు.
ReplyDeleteప్రేమ అలజడులు మీకేలా?
మనసు చేసే అలజడికి హైరానా పడక కొరడా ఝళిపించండి.
అనుకోకుండా వచ్చే సునామీలో ఎవరైనా కొట్టుకుపోతారు కదండీ!
DeleteSimply superb your thoughts and paintings.
ReplyDeletethankQ
Deleteమనసు దోచే పిక్ పెట్టి మనసును మెలిపెట్టే మాటలు ఎందుకు?
ReplyDeleteసున్నిత మనస్కులకు ఇది తప్పదేమో..
Deleteనేను కలగన్న శిఖరాలు నువ్వు చేరితే..
ReplyDeleteవాటి క్రింద నేను శిధిలమైనా నవ్వేస్తాను! ప్రేమ పై ప్రగాఢ విశ్వాసం
ప్రేమకు నమ్మకమే ఊపిరి కదండీ.
Deleteవిడిపోడానికే కలిసి మనం
ReplyDeleteకనురెప్పలుగా మిగిలి ఉన్నాం
కనురెప్పలు అలా కల్సి
ఇలా విడిపోతాం ఎందుకో??
కనులు మూస్తే నీ జ్ఞాపకం
తెరిస్తే కనుమరుగౌతానని భయం
అప్పుడే ఆశ అంతలో నిరాశ..
ప్రేమ ఎంత ఆశ పెడుతుందో అంత నిరాశకు గురి చేస్తుందండీ.
Deleteద్విపదాలు జోడించి కూర్చిన కవిత మనసుని హత్తుకున్నా ఏదో తెలియ ముసురు కమ్మింది.
ReplyDeleteలోన దాగిన నిజం ముసుగేమో!
Deleteచాలాబాగుంది
ReplyDeleteథ్యాంక్యూ
Deleteసూపర్ వేదన.
ReplyDeleteవేదన సూపర్ ఏమిటో?
Deleteనా బాధలో భాష్యంలో తోడు నువ్వు
ReplyDeleteఅలవోకగా కదలాడే అలజడి నీవు!!
నా ఒంటరితనపు చేయూత నువ్వు
ఆశల వెల్లువలో ఊరట నీవు!!
నా ప్రతి కదలికకీ భాష నువ్వు
ఆగ్రహం వచ్చిందంటే ఆనకట్టవు నీవు!!
నా తోడు నీడా అన్నీ నువ్వు
సమస్యలో పరిష్కారం కూడా నీవు!!
నా నిశిరాతిరి ప్యనం నువ్వు
మండుటెండలో మంచుకొండవు నీవు!!
అన్నింటా తానే అవ్వడం గొప్ప భావం.
Deleteచాలా రోజులకి బ్లాగ్లో అడుగు పెట్టి చూసాను
ReplyDeleteమీరు ఇంకా ప్రేమ ఆవేదనలోనే కొట్టుమిట్టాడుతున్నారు అనిపిస్తుంది
ప్రేమంటే ఏమిటో తెలియనివాళ్ళే ప్రేమ గురించి ఎక్కువగా వ్రాస్తుంటారు....కుమిలిపోతుంటారు. ప్రేమ గురించి తెలుసుకున్నాక మానేస్తారులెండి !
Deleteమాయావిశ్వం & నీహారికగారు చాన్నాళ్ళకి వచ్చి ఒకరు ప్రేమ ఉందని మరొకరు ప్రేమ లేదని రెండు అస్త్రాలనూ నాపైనే సంధించడం భావ్యమా చెప్పండి.
Deleteప్రేమంటే ఏమిటి ? ఎలా ఉండాలి ? ఒక పోస్టులో చెపుతారా ?
Deleteనీహారికగారు....ప్రేమ గురించి నాకు అనుభవం శూన్యం
Deleteప్రేమ పై నాకున్న జ్ఞానం శూన్యం..అన్నీ ఊహా రచనలే...నమ్మాలి!
ప్రేమ ఎంత మురిపిస్తుందో అంత వేదనలకు గురి చేస్తుందని బాగాచెప్పారు.
ReplyDeleteఅద్భుతం మీ ప్రేమకోసాగారం.
ReplyDeleteదుండగులు బ్రద్దలుగొడతారేమో..
DeleteHeart touching
ReplyDeletebeautiful pic.
thank you.
Deleteహృదయ బాధ అగాధమంత అని తెలిపే కవిత...
ReplyDeleteమీరు ఎప్పుడు కొలిచారు...ఎలా తెలిసిందో అఘాధమంతని!?
Deleteప్రేమభావమే అయినప్పటికీ అంతర్లీనంగా ఏదో ఆందోళన నీలో కాదని నువ్వు అన్నా అక్షరాల్లో కనబడుతుంది. చిత్రం చాలా బాగుంది. సదా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ-హరినాధ్
ReplyDeleteచాన్నాళ్ళకీ...అంతా కుశలమే కదండీ?
Deleteఅందరికీ ఏదో ఒక బాధ తప్పదు కదండీ...జీవితం అన్నాక!
ఎంతందంగా వ్యక్తం చేసారండి మీ ప్రేమ అమరం.
ReplyDeleteఅజ్ఞాతంగా అంతమై పోవడం మినహా అంతా బాగుంది.
ReplyDeletePadmarpita ani peru pettukoni, prema lo kuda meeku meere arpinchu kuntunnaru. Peruki tagga kavita-Arpita
ReplyDelete