ఆనందంగా అంతమౌతాను..

నేను కలగన్న శిఖరాలు నువ్వు చేరితే..
వాటి క్రింద నేను శిధిలమైనా నవ్వేస్తాను!

నీ కంటి వెలుగులే నలుగురికీ మార్గమైతే.. 
ఆ కంటిమెరుపుకు నా చూపు జోడిస్తాను!

నా ఊహల రెక్కలు నీకు వచ్చి పైకెగిరితే..
ఎగిరే రెక్కలు నేనై ఆకాశంలో విహరిస్తాను!

నీకలలు నెరవేర్చుకునే ప్రక్రియలో నీవెళితే..
వాటికి కారణం నేననుకుని మురిసిపోతాను!

నాకన్నీరు నీ సంతోషాన్ని ఆవిరి చేయబోతే..
వ్యధలను దాచేసి నవ్వులు నీపై చిందిస్తాను!

నీ జోడీ నేను కానని తెలిసి నాతోడు వీడితే..
తుదిశ్వాస వరకూ నీ నీడలో లీనమైపోతాను! 

నా రూపం నీ మదిలో ఎప్పటికీ ఉండాలని..   
అజ్ఞాతంగానైనా ఆనందంగా అంతమైపోతాను!! 

60 comments:

  1. అజ్ఞాతంగా అంతమ అయిపోవడం
    నిస్వార్ధమైన ప్రేమకు నిదర్శనం.

    ReplyDelete
    Replies
    1. నిదర్శనం కోరేది నిజమైన ప్రేమంటారా?

      Delete
  2. So.....
    Beautiful narration

    ReplyDelete
  3. మహాద్భుత ప్రేమకావ్యాచిత్రాన్ని రూపొందించారు-అభినందనలు పద్మార్పితా

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ

      Delete
  4. ఆది నుండీ చివరి వరకూ నిర్మలమైన మనసుదోచే వాక్యాలతో వలపు అస్త్రం సంధించి మరోసారి ప్రేమార్పితని నిరూపించుకున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఇలా ప్రెమకే సొంతమైపొమ్మంటారా

      Delete
  5. అందమైన మనసులో రాగజనిత పదజాల భావలహరి.

    శ్రీత

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానం అది.

      Delete
  6. మీ మనోభావలహరి నా వందనములు.

    ReplyDelete
  7. కలల శిఖరాలే నే చేరినా, కీర్తి గగనాన విహరించిన చిగురంత నీ ప్రేమ పొందడం కంటే ఉన్నతమైన ఘనతలు కావు సుమా.నీ నీడే, నా జాడై - కడదాక ముడిపడిన జోడై, వీడలేని తోడై -నీకు నేను అండగ వుంటే అంతమెలా అవుతావు..? నా సొంతమే అవుతావు.

    ReplyDelete
    Replies
    1. ప్రేమను కవితలో పొందుపరచి అందించారుగా..

      Delete
  8. పద్మా ఎంత ప్రేమ తత్వమైనా నీకు ఇటువంటి పోస్టు సరిపడదు.ధీరురాలు ఎటువంటి దాన్నైనా సాధించే నేర్పూ కూర్పూ నీలో చూసిన నాకునువ్వు ఈ విధంగా నిస్తేజంగా అంతమైపోవడం అలాంటి భావాలను వ్యక్తపరచడం కూడా నచ్చదు.
    చిత్రం కనుసొంపుగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. నాటి లైలామజ్ఞూ, దేవదాసుపార్వతీ, సలీమనార్కలీ...అందరివీ విషాదభరితాలే కదండీ!

      Delete
  9. మహాద్భుత ప్రేమకావ్యంలో అంతమైపోవడమే అపశృతిలా ఉంది
    ప్రేమను పొంది మెప్పించడంలో అందెవేసిన చెయ్యి మీది..హా హా

    ReplyDelete
    Replies
    1. అన్ని ప్రేమలూ అందరికీ దక్కవు కదండీ.

      Delete
  10. కత్తిలాంటి పోస్ట్ ఫోటో పెట్టి గుండెల్లో కసుక్కున పొడిసినావుగదమ్మా..

    ReplyDelete
    Replies
    1. వామ్మో ఏమైనా అంటే నన్ను కత్తితో పొడిచేలా ఉన్నారు.

      Delete
  11. ప్రేమ ఎంత మధురమో అంత వేదన కూడా అన్నట్లు ఉంది మీ కవిత.

    ReplyDelete
    Replies
    1. రెండూ సమపాళ్ళలో ఉంటే పర్వాలేదండీ..

      Delete
  12. అందమైన కవితను అందించారు.

    ReplyDelete
    Replies
    1. వ్యధలో అందాన్ని మీరే చూడగలిగారు.

      Delete
  13. మాటల్లో చెప్పలేని రసమయ ప్రేమ వ్యధాభరిత కావ్యం.

    ReplyDelete
  14. అక్షరాలతో సునామీలు పుట్టిస్తారు.
    ప్రేమ అలజడులు మీకేలా?
    మనసు చేసే అలజడికి హైరానా పడక కొరడా ఝళిపించండి.

    ReplyDelete
    Replies
    1. అనుకోకుండా వచ్చే సునామీలో ఎవరైనా కొట్టుకుపోతారు కదండీ!

      Delete
  15. Simply superb your thoughts and paintings.

    ReplyDelete
  16. మనసు దోచే పిక్ పెట్టి మనసును మెలిపెట్టే మాటలు ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. సున్నిత మనస్కులకు ఇది తప్పదేమో..

      Delete
  17. నేను కలగన్న శిఖరాలు నువ్వు చేరితే..
    వాటి క్రింద నేను శిధిలమైనా నవ్వేస్తాను! ప్రేమ పై ప్రగాఢ విశ్వాసం

    ReplyDelete
    Replies
    1. ప్రేమకు నమ్మకమే ఊపిరి కదండీ.

      Delete
  18. విడిపోడానికే కలిసి మనం
    కనురెప్పలుగా మిగిలి ఉన్నాం
    కనురెప్పలు అలా కల్సి
    ఇలా విడిపోతాం ఎందుకో??
    కనులు మూస్తే నీ జ్ఞాపకం
    తెరిస్తే కనుమరుగౌతానని భయం
    అప్పుడే ఆశ అంతలో నిరాశ..

    ReplyDelete
    Replies
    1. ప్రేమ ఎంత ఆశ పెడుతుందో అంత నిరాశకు గురి చేస్తుందండీ.

      Delete
  19. ద్విపదాలు జోడించి కూర్చిన కవిత మనసుని హత్తుకున్నా ఏదో తెలియ ముసురు కమ్మింది.

    ReplyDelete
    Replies
    1. లోన దాగిన నిజం ముసుగేమో!

      Delete
  20. చాలాబాగుంది

    ReplyDelete
  21. Replies
    1. వేదన సూపర్ ఏమిటో?

      Delete
  22. నా బాధలో భాష్యంలో తోడు నువ్వు
    అలవోకగా కదలాడే అలజడి నీవు!!
    నా ఒంటరితనపు చేయూత నువ్వు
    ఆశల వెల్లువలో ఊరట నీవు!!
    నా ప్రతి కదలికకీ భాష నువ్వు
    ఆగ్రహం వచ్చిందంటే ఆనకట్టవు నీవు!!
    నా తోడు నీడా అన్నీ నువ్వు
    సమస్యలో పరిష్కారం కూడా నీవు!!
    నా నిశిరాతిరి ప్యనం నువ్వు
    మండుటెండలో మంచుకొండవు నీవు!!

    ReplyDelete
    Replies
    1. అన్నింటా తానే అవ్వడం గొప్ప భావం.

      Delete
  23. చాలా రోజులకి బ్లాగ్లో అడుగు పెట్టి చూసాను
    మీరు ఇంకా ప్రేమ ఆవేదనలోనే కొట్టుమిట్టాడుతున్నారు అనిపిస్తుంది

    ReplyDelete
    Replies
    1. ప్రేమంటే ఏమిటో తెలియనివాళ్ళే ప్రేమ గురించి ఎక్కువగా వ్రాస్తుంటారు....కుమిలిపోతుంటారు. ప్రేమ గురించి తెలుసుకున్నాక మానేస్తారులెండి !

      Delete
    2. మాయావిశ్వం & నీహారికగారు చాన్నాళ్ళకి వచ్చి ఒకరు ప్రేమ ఉందని మరొకరు ప్రేమ లేదని రెండు అస్త్రాలనూ నాపైనే సంధించడం భావ్యమా చెప్పండి.

      Delete
    3. ప్రేమంటే ఏమిటి ? ఎలా ఉండాలి ? ఒక పోస్టులో చెపుతారా ?

      Delete
    4. నీహారికగారు....ప్రేమ గురించి నాకు అనుభవం శూన్యం
      ప్రేమ పై నాకున్న జ్ఞానం శూన్యం..అన్నీ ఊహా రచనలే...నమ్మాలి!

      Delete
  24. ప్రేమ ఎంత మురిపిస్తుందో అంత వేదనలకు గురి చేస్తుందని బాగాచెప్పారు.

    ReplyDelete
  25. అద్భుతం మీ ప్రేమకోసాగారం.

    ReplyDelete
    Replies
    1. దుండగులు బ్రద్దలుగొడతారేమో..

      Delete
  26. Heart touching
    beautiful pic.

    ReplyDelete
  27. హృదయ బాధ అగాధమంత అని తెలిపే కవిత...

    ReplyDelete
    Replies
    1. మీరు ఎప్పుడు కొలిచారు...ఎలా తెలిసిందో అఘాధమంతని!?

      Delete
  28. ప్రేమభావమే అయినప్పటికీ అంతర్లీనంగా ఏదో ఆందోళన నీలో కాదని నువ్వు అన్నా అక్షరాల్లో కనబడుతుంది. చిత్రం చాలా బాగుంది. సదా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. చాన్నాళ్ళకీ...అంతా కుశలమే కదండీ?
      అందరికీ ఏదో ఒక బాధ తప్పదు కదండీ...జీవితం అన్నాక!

      Delete
  29. ఎంతందంగా వ్యక్తం చేసారండి మీ ప్రేమ అమరం.

    ReplyDelete
  30. అజ్ఞాతంగా అంతమై పోవడం మినహా అంతా బాగుంది.

    ReplyDelete
  31. Padmarpita ani peru pettukoni, prema lo kuda meeku meere arpinchu kuntunnaru. Peruki tagga kavita-Arpita

    ReplyDelete