నీవు ఆదరిన నేను ఈ దరినా
ఏ ఒడ్డునా నిలకడగా ఉండలేక
సతమతం అవుతూ ఇద్దరమూ!
ఒకప్పుడు ప్రేమ ప్రపంచంలో..
నీవూ నేనూ పూర్తిగా మునిగినా
నేడు మనసు విప్పి మాట్లాడలేక
సంశయిస్తూ వ్యధతో ఇద్దరమూ!
ఒకానొక వసంత ఋతువులో..
నీకు నేను నాకు నువ్వే అయినా
ఇప్పుడు రాలిన ఆకులై చిగురించక
జ్ఞాపకాల సుడిలో చిక్కి ఇద్దరమూ!
ఒకటే బాటై గమ్యానికి చేరువలో..
నువ్వూ నేనూ కలవక విడిపోయినా
ఎడబాటు పవన అశ్రువులు రానీయక
నీవునీవుగా నేనునేనుగా ఇద్దరమూ!
ఒకానొకరోజు కలిసి నెరసిన జుట్టులో..
నన్ను నీవు గుర్తించి దరిరాక పోయినా
మన అలసిన హృదయాలపై అలుగలేక
పరిస్థితుల చెరలో బంధీలై ఇద్దరమూ!
కాలం కడలిలో వడివడిగా కొట్టుకుపోతున్న జీవితాల్లో రసాస్వాధన కరువైపోతుంది.
ReplyDeleteఒక అనుభూతి హృదయ అంతరాల్లో
ReplyDeleteఒక తీయని జ్ఞాపకం అలనాటి గురుతులు,.
స్థితిగతుల పర్యవసానం జీవితం
ReplyDeleteపరిస్థితుల సమాహారం జీవితం
ఉద్రిక్తతల కలగాపులగం జీవితం
శ్రీత
ప్రేమించడం
ReplyDeleteప్రేమించబడడం
ఒక గొప్ప వరం
కానీ...
జీవితం చేతిలో
కీలుబొమ్మలం
మనం అందరం
హృదయ కవాటాలు ఎప్పటికీ తెరచి ఉంటాయి
ReplyDeleteస్థితిగతులే మనుషులను తారుమారు చేస్తాయి
LOVELY TOUCH
ReplyDeleteనాకు ఎందుకో మీరు ప్రేమలో పూర్తిగా విఫలమైన ఛాయలు కనబడుతున్నాయి
ReplyDeleteతప్పుగా అనుకోవద్దు..ఈ మధ్య మీ కవితల్లోని భావం అలా అనిపిస్తుంది.
అయినా మీరు ఇలాంటివి ఎన్ని వ్రాసినా చదవడానికి బాగుంటాయి.
హృదయ నిండా అనురాగం ఎంత ఉన్నా పరిస్థితులకు తలవంచక తప్పదు
ReplyDeleteజీవితం ఎంతో తీయనైనది అనుకుని సాగిపోవడమే ఉత్తమం. ప్రేమ ఎప్పుడూ అమరం.
మార్పు అనేది అన్నింటికీ ప్రధాన లక్షణం. ఇది ఒక బాహ్య ప్రపంచానికే కాక, అంతఃప్రపంచంలో కూడా ఉంటుంది. ఒకప్పుడు కోపం, ఒకప్పుడు శాంతం, ఒక చోట ద్వేషం, ఒక చోట రాగం, విజయం సాధించటం వల్ల ఆనందం, ఓడిపోవటం వల్ల దుఃఖం, ఇవన్నీ మనకు అనుభవమే. ఈ దేశ, కాల, కారణాలతో నిమిత్తం లేని, ఈ మార్పులేని ప్రపంచాన్ని మనం ఊహించటం కూడా కష్టం. అందుకే అన్నింటికీ అలవాటు చేసుకోవాలి ప్రేమ కూడా అందులో ఒక భాగం అయినప్పుడు మార్పు సహజమే అనుకోవాలి.
ReplyDeleteending is so good.
ReplyDeleteపరిస్థితుల చెరలో బంధీలై చాలానచ్చింది.
ReplyDeletefantastic conclusion ichi gauravam pencharu
ReplyDeleteఎందుకు ఈ నిస్సారవంతమైన ఆలోచనలు?
ReplyDeleteఅనవసరంగా నీరసాన్ని కొనితెచ్చుకనేల!!?
ఏదో ఒకసారి గుర్తుకురావడం ఏమిటి?
ReplyDeleteమస్తిష్కంలోని ప్రతికణంలో నిక్షిప్తమైపోతే
ఏదో ఒక స్థితి పరిస్థితి
ఏదో ఒక సంఘటన ఒక అనుభూతి
అప్పుడప్పుడూ మేఘాలు కమ్మే
మనసు ఆకాశం అయిపోయి
హృదయతంత్రులు వేదనతో నిండె
గుండె భారం అయిపోయి
అయినా ఏదో రాగం ఆలపిస్తున్నా
నువ్వు నేను ఒకటే అనుకున్న ఊహల్లో..
బంధీలో బానిసలు మీరు
ReplyDeleteమీ అక్షరజ్ఞానానికి నా సలాం.
ReplyDeleteఅద్భుతః
ReplyDeleteMind blowing
ReplyDeleteనీవునీవుగా నేనునేనుగా
ReplyDeleteLovely mam
ఆవేదనతో ఇద్దరూ ఒక్కరికి ఒకరు సరిజోడి.
ReplyDeleteఈ ప్రేమ మత్తు నుండి బయట పడకపోతే
ReplyDeleteజీవితం దుర్లభం.. ప్రయత్నం చేయాలి
పద్మా భావపటిమలో వేదన చదవడానికి బాగుంటుంది
ReplyDeleteఎవరికీ ఇలాంటి వేదన వద్దు.
సమస్యలతో సతమతం అవుతూ బ్రతకడమే జీవితమా!?
ReplyDeleteవ్యధల భాంఢాగారంలో ఇద్దరు బంధించబడ్డారు
ReplyDeleteసున్నితంగా మనసుని తాకుతాయి మీ వాక్యాలు.
వేదనతో రెండు హృదయాలు కలబోసిన భావన బాగుంది.
ReplyDeleteఅందరి అప్యాయతకూ నా నమోఃవందనములు.
ReplyDeleteఇద్దరూ ఇద్దరే
ReplyDeleteప్రేమ రాగయుక్తం
ReplyDelete