రెండడుకులు నువ్వు ముందుకు వెయ్యలేదు
నాలుగడుగులు వేసి నేనూ ధైర్యం చెయ్యలేదు
విడిపోతే కానీ ఎడబాటు ఏమిటో తెలియలేదు!
నువ్వొస్తావని పాతికేళ్ళు నేను వేచి చూడలేదు
నువ్వో పాతికవసంతాల ముందు కబురంపలేదు
వలపు జ్యోతులే ఆరిపోయాయి వెలుతురేలేదు!
నీవు లేవన్న వ్యధను మనసూ మరచిపోలేదు
గుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
నీ గమ్యమే నాకు శాపమని నాడు తలచలేదు!
సాంత్వన మాటలెన్ని చెప్పుకున్నా ఊరటలేదు
ఓదార్పులే ఇచ్చిపుచ్చుకున్నా కన్నీరాగడంలేదు
దాహార్తితో అరచిన ఆశాశయాల దాహం తీరలేదు!
కాలమే పగతో కాలకూటవిషమౌనని అనుకోలేదు
కలలన్నీ సమాధైపోయె కనులు ఇది కాంచలేదు
హృదయం నుండి ఊపిరి వెళ్ళి మరల రానేలేదు!
నాలుగడుగులు వేసి నేనూ ధైర్యం చెయ్యలేదు
విడిపోతే కానీ ఎడబాటు ఏమిటో తెలియలేదు!
నువ్వొస్తావని పాతికేళ్ళు నేను వేచి చూడలేదు
నువ్వో పాతికవసంతాల ముందు కబురంపలేదు
వలపు జ్యోతులే ఆరిపోయాయి వెలుతురేలేదు!
నీవు లేవన్న వ్యధను మనసూ మరచిపోలేదు
గుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
నీ గమ్యమే నాకు శాపమని నాడు తలచలేదు!
సాంత్వన మాటలెన్ని చెప్పుకున్నా ఊరటలేదు
ఓదార్పులే ఇచ్చిపుచ్చుకున్నా కన్నీరాగడంలేదు
దాహార్తితో అరచిన ఆశాశయాల దాహం తీరలేదు!
కాలమే పగతో కాలకూటవిషమౌనని అనుకోలేదు
కలలన్నీ సమాధైపోయె కనులు ఇది కాంచలేదు
హృదయం నుండి ఊపిరి వెళ్ళి మరల రానేలేదు!
ఏం జరగులేదు సంతోషం అదే జరిగి ఉంటే..
ReplyDelete~°~
ReplyDeleteచివురులు తొడిగే ఆశ కు నిరాశ నిర్వేదపు మచ్చలా
వెన్నెల కురిపించే చంద్రునికి అమవస గ్రహణమా
మనిషిలో మానవత్వపు ఛాయలకు ఈర్శ్య ద్వేషమా
~!~
మీ కలపు పదునైన భావాలు అమోఘం.
ReplyDeleteఇద్దరూ ఇద్దరే
ReplyDeleteఎవరూ తెగువ చూపలేదు
ముందడు వేసి ఉంటే కధ మరో మలుపు తిరిగేది
మీ ప్రేమ భావాలు అద్భుతం
superb
ReplyDeletemaatalu levandi
గుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
ReplyDeleteనీవు చేసిన ఎద గాయమూ మానలేదు
మనసుని మీ కవిత పాతజ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఎటో తీసుకెలళ్ళింది పద్మా..
ReplyDeleteVery nice emotional touch
ReplyDeleteసాంత్వన మాటలెన్ని చెప్పుకున్నా ఊరటలేదు..
ReplyDeleteనన్ను నాకు కాకుండా చేసినంత బాధగా ఉంది మీ కవిత.
ReplyDeleteఎమోషనల్ టచ్ తో అసాంతం తెలియని వేదన నింపిన కవిత.
నీవు లేవన్న వ్యధను మనసూ మరచిపోలేదు
ReplyDeleteగుర్తుకురాకని ఎంత వేడినా నువ్వూ మానలేదు
మీ ప్రేమ వ్యధ పవర్ అస్సలు తగ్గలేదు
మీరు మీ కవితలతో రాతిగుండెను కూడా కరిగించి సునాయసంగా ఏడిపించగలరు.
ReplyDeleteAmazing blog.
ReplyDeleteఅతి సున్నితమైన భావాల్ని అంత కంటే సున్నితంగా చెప్పారు మీ కవితలో.
ReplyDeleteఅందరి ఆదరణాత్మక వ్యాఖ్యలకు అంజలులు ఘటిస్తున్నాను.
ReplyDeleteహృదయ ఆవేదన లావాలా పొంగినవేళ పెల్లుబికిన కవిత.
ReplyDeleteప్రేమ ఉద్వేగం ఎడబాటుల పర్యవసానం మీ ఈ కవిత.
ReplyDeleteఅద్భుతంగా అందించారు. అభినందనలు.
so beautiful love feel
ReplyDeleteఇంకా ఏం కావాలి
ReplyDeleteమీరు ఊహల నుండి బయటపడండి.
ఎంతో మానసిక ఆలోచలతో సతమతమౌతున్నట్లు ఉంది పద్మార్పితా నీ మనసు. అది దాటి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను-హరినాధ్
ReplyDelete