ఎక్కడైనా మనిద్దరం ఏకాంతంగా కలుద్దాం
మెల్లగా వొకరి కన్నీటిని...
యింకొకరి మనసులోకి వొంపుకొని
ఎడబాటు మలినాలు కొన్ని పోగొట్టుకుని
గాఢమైన కౌగిళ్ళతో కుశలప్రశ్నలు సంధించుకుందాం!!!
మనసులో నలుగుతున్న కొన్ని ఉధ్వేగాలను
సున్నితంగా పెకళించి వలపుతంత్రులు మీటి..
మౌనరాగాన్ని నిశ్శబ్ధంగా ఆస్వాదిద్దాం
లెక్కలేనన్ని జీవిత చిక్కుముడులని
ఓపిగ్గా విప్పుకుంటూ కొత్తసమాధానాలను అన్వేషిద్దాం!!
గతకాలపు గురుతుల మన పుస్తకంలో
ఇంకొన్ని పుటల్ని ప్రేమతో అతికించి...
బ్రతుకు గ్రంధాన్ని అందంగా రాసుకుందాం
ఆశల నక్షత్రాలతో అందంగా అమరిన ఒకానొక రాత్రిని
మన చిరునవ్వుల వెన్నెల్లతో సుందరంగా ముస్తాబుచేద్దాం!
ఊహలతో ముడిపడిన ఉద్వేగాలు
ReplyDeleteకోరికలతో పెనవేసుకున్న వేదనలు
ఎప్పుడూ మనసు మనుగడను శాసిస్తూనే వుంటాయి.
mansu poralo dachina bhavam.
ReplyDeleteso nice expression
ReplyDeleteనిన్నటి కలలకు ఆశలు జోడిస్తే
మౌనం మనసుకు అర్థమౌతుంది
పశ్చాత్తాపాలు పెనవేసుకుంటే
నిట్టూర్పులు వర్షిస్తాయి..
ఆవిరైన ఆనందాలు
నవ్వులతో నాట్యం చేస్తాయి
ఒకరికొకరి కౌగిలిలో
వ్యథలు మటుమాయం అవుతాయి..
ఆ రాత్రి చీకటి కాగితంపై మౌనాక్షరాలు ఎన్నో ప్రశ్నలకు జవాలు ఇస్తాయి...అందమైన అక్షరమాల.
ReplyDeleteఏమి బుచికీలు రాస్తారమ్మా
ReplyDeleteప్రేమజీవుల హ్రదయస్పందన అమోఘం.
ReplyDeletePainting chala bagundi madam. Kavitalo bhavam pongenu.
ReplyDeleteకన్నీళ్ళతో ఎడబాటు మలినాలు కరిగిపోయేనా..
ReplyDeleteఏవీ నిరుడుకురిసిన హిమ సమూహములు అని వెతుకుతూ,
ఎడారి బాటన పొడారిన గొంతుతో...తడి ఆరిన గుండెతో వెతుకుతున్నా..ఆ మధుర వెన్నెల రాత్రి మళ్ళీ వచ్చేనా..
గ్యాప్ ఇచ్చి మనసుని మెలిపెట్టే అక్షరామాలను రాశారు. అభినందనలు
ReplyDeleteఇరువురి మనసులు ఒకటాయే మరి హద్దులు లేనే లేవాయె!
ReplyDeleteబ్రతుకు గ్రంధాన్ని అందంగా రాసుకుందాం..అత్యాశ ఏమో
ReplyDeleteఊహా విహారము అతి మధురంగా చిత్రించారు పద్మార్పితా..
బహుకాల దర్శనం అదీ విరహ వేదనతో
ReplyDeleteఏల ఇటుల మీరు...................................????
శ్రేయస్కరమైన భావాలను అత్యద్భుతముగా తీర్చిదిద్దటం మీకు ఫౌంటెయిన్ పెన్ తో పెట్టిన విద్య..
ReplyDeleteఅన్యమనస్కంగా రేగే ఆలోచనలు మనసు తలుపు తడుతు
చంచలమైన భావాలను అక్షరాల కొలనులో ముంచి తీస్తు
ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుని అలరించే పద్మ గారికి సాహో
~శ్రీత
ఎలా ఉన్నారు?
ReplyDeleteమీ కవితల ఒరవడి సాగుతుంది దేదీప్యంగా.
మండుటెండలో వర్షం కురిసినట్లు మీ కవితాచిత్రం.
ReplyDeleteగడచిన కాలపు గురుతులతో తడిసి సేదతీరునులెండి ఇరువురి మనసులు. భావగర్భితమైన కవితకు చక్కని చిత్రాన్ని జతచేసారు.
ReplyDeleteBeautiful Painting.
ReplyDeleteపరామర్శలతో ఒకరికొకరు ఊపిరి పోసుకుని ఊహలకు రెక్కలు తొడిగి స్వేచ్ఛగా విహరించండి. సీతాకోకచిలుకల్లా జీవితానికి రంగులద్ది ముద్దుమురిపాలతో బాధనంతటిని తొలిగించుకుని కౌగిలింతలతో పరవశించాలి ప్రేమికులు. మరో గుర్తుండిపోయే కవితను అందించారు. అభినందనలు.
ReplyDeletemeeru edirasina adbhutam
ReplyDeleteprema kavitalu inka adbhutam
మనసులో నలుగుతున్న కొన్ని ఉధ్వేగాలను
ReplyDeleteసున్నితంగా పెకళించి వలపుతంత్రులు మీటి..extraodinary
నా భావాక్షరాలని ఆదరిస్తున్న అభిమానమిత్రులు అందరికీ అభివందనములు.
ReplyDeleteఅనూహ్యమైన భావవ్యక్తీకరణ.
ReplyDeleteగతకాలపు గురుతుల పుస్తకంలో ఇంకొన్ని ప్రేమ పుటల్ని అతికించడం అతిరమ్యం.
ReplyDeleteతూటాలతో కాదు అక్షరాలతో తూట్లు పొడిచారు
ReplyDeleteవాహ్ రే పద్మార్పితా!
ReplyDeleteమనసు పొరలు తొలగించి మాట్లాడుకుందాం రా..
ReplyDeleteamazing
ReplyDelete