మనసు ఇప్పటికీ ఆ జ్ఞాపకాల బొంతనే కప్పుకుంటానంది
చాలాకాలంగా దాని క్రిందే ఎన్నో ఊహల్తో కాపురం చేసింది
ఇతర ఏ ఉతికిన కొత్తబొంతలోనూ ఆ అనుభూతి రాకుంది
చెప్పాలంటే ఆ జ్ఞాపకాల బొంతలో నాదన్న ధీమా ఉండేది
దాన్ని కుట్టడంలో చూపిన శ్రద్ధ ఓపిక ఇప్పుడు కొరవడింది
అపోహలను ఎన్నింటినో పొరల మధ్యనదాచి కలిపికుట్టిందది
వేలిముద్రలు కళ్ళ ముందు చేసిన నాట్యమే కదలాడుతుంది
దారపుపోగుల చిక్కుముళ్ళు విప్పడం ఇప్పుడింకా గుర్తుంది
అల్లరితో అలిగి లాక్కుని చుట్టుకుదొర్లిన స్పర్శ వీడనంటుంది
అందుకేనేమో పాతబడి ఎన్ని తూట్లుపడినా వదల్లేకపోయింది
కానీ ఇప్పుడు ఆ ఇరుశ్వాసల పరిమళం మాయమైపోయింది
ఎందుకంటే నేను ఒంటరిగానే బొంతను చుట్టుకుని దొర్లుతుంది
కోటు వేసుకోవడం అలవరచుకున్నాడన్న రహస్యం దాగుంది!
వితంలో అన్ని సంఘటనలు జ్ఞాపకాలు కాలేవు
ReplyDeleteకానీ ప్రేమ విషయంలో ప్రతీది జ్ఞాపకమే అవుతుంది
అదేగా ప్రేమలోని మాధుర్యం మత్తు.
Deleteజ్ఞాపకాలు ఎన్నటికీ చెరుగని ముద్రలు.
ReplyDeleteఅవును నిజమే.
Deleteఓ వయసుకు వచ్చిన తర్వాత ఆడవారిలోనైనా, పురుషుల్లోనైనా మతిమరుపు సహజం. ఒకనాటి జ్ఞాపకాలు గుర్తుండవు. అయితే తాజాగా ఓ అధ్యయనం వెల్లడించిన వివరాల ప్రకారం.. పురుషులకంటే మహిళలకే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందని, వారికే మెమరీస్ ఎక్కుగా ఉంటాయని తెలిసింది. ఈ పరిశీలనలో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ జ్ఞాపకశక్తి ఉందని గుర్తించారు. వారి మస్తిష్కాల్లోనే జ్ఞాపకాలు పదిలంగా భద్రమై ఉంటాయని తేల్చారు. అందుకే మీరు జ్ఞాపకాలను బొంతగా పరచుకుంటే అతను కోటువేసుకుని మరచినట్లు తెలుస్తుంది.
ReplyDeleteఇక్కడ కూడా హెచ్చు తగ్గులు ఎందుకులెండి.
Deleteజ్ఞాపకాల దొంతర్ల బొంత చక్కగా కుట్టారు
ReplyDeleteఇప్పుడు కుట్టలేం :)
Deleteక్షణాలు యుగాలుగా దొర్లి
ReplyDeleteరోజులు నెలలు వేగాలై పరుగెట్టి
ఆశనిరాశలు దాగుడుమూతలాడి
నిరాశ నిస్పృహలు కొట్టుమిట్టాడుతున్నా
జ్ఞాపకాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి.
మదిని తాకాయి మీ చిరుపదాల జల్లులు.
Deleteఈ కాలంలో బొంతలు ఎవరు వాడుతున్నారు
ReplyDeleteఅంతా కుషన్ మక్మల్ రజైయ్ కాలంలో అందరూ సుఖానికి అలవాటు పడిన ప్రాణాలు బొంతలు కుట్టుకుని అదే జ్ఞాపకాలను గుర్తు పెట్టుకునే టైం లేదు..
అదే నా బాధ కూడాను...బొంతలాగే వదిలివేస్తారేమోనని!
Deleteఊహల్లో ఉండటం ఎంత హాయిగా ఉంటుంది
ReplyDeleteజ్ఞాపకాలు అంతే మధురంగా ఉంటాయి
జరుగుతున్న వాస్తవం చేదుగా ఉంటుంది
ప్రతిదీ కాలమే నిర్ణయిస్తుంది
జరగాల్సింది జరిగిపోతుంది..
అయినా ఓర్పు తప్పదు జీవితానికి!!....
ఓర్పు కూడా వ్యధతో ఓడిపోతుంది.
Deleteమనసును ఎంతగా స్థిరపరచుకొంటున్నా కమ్ముకొన్న ఆలోచనలు మనసుని స్థిమితంగా ఉండనీయవు.
ReplyDeleteఅవును కదా అందుకే ఈ వ్యధ.
Deleteవేసవి కాలం వచ్చేసిందిగా బొంతలూ, కోట్లూ మూలన పెట్టేసి ఆరుబయట చల్లగాలి(AC)లో విహరించండి.ఎపుడూ జంటగా బ్రతుకుతున్నాం కదా అని జంటగా చస్తామా ఏమిటీ?
ReplyDeleteఆరుబయట ఖాళీ ఈరోజుల్లో కరువైందండీ..ACఅన్నారు ఓకే!
Deleteకటువుగా అనిపించినా మీరు చెప్పింది సత్యం...
నీహారికగారూ మీరు నా పార్టినే :)
Deleteమీరు నా పార్టీలో చేరినందుకు ధన్యవాదాలండీ ! పోరాడవలసి వస్తే ఒంటరిగానే మనం పోరాడాలి.
Deleteమహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు !
బొంత భాగోతాన్ని కడిగిపడేశారు... మిక్కిలి ప్రేమమూర్తులు మీరు!
ReplyDeleteబొంతలు ఎలాగో కరువైపోతున్నాయి..
Deleteకడిగిపడేసాను అంటే నీళ్ళు కరువైనాయి అంటారేమో...అసలే ఎండాకలం వచ్చేసింది.
అందరూ ఏవో జ్ఞాపకాలను నెమరువేస్తూ జీవించవలసిందే
ReplyDeleteకొన్ని మధురానుభూతులు మరికొన్ని వ్యధలు..ఏవైనా తప్పవు
నమ్మక తప్పని నిజం.
Deleteనిర్ధయగా నీవు వెళ్ళివుండవచ్చు...
ReplyDeleteనీ జ్ఞాపకాలు మాత్రం సదా నీడనిచ్చి కాచుకుంటున్నాయి
ఇవి మాత్రం కడదాక నాకు తోడుంటాయని గట్టిగా నమ్ముతున్నాను
ఎందుకంటే వాటికి నీలాంటి హృదయం లేదు.
మనసిచ్చిన వారు మరుగైతే, జ్ఞాపకాలే సేద తీర్చేది
జ్ఞాపకాలు బొంతల కాదు హౄదయస్పందనలై ప్రతిద్వనిస్తున్నాయి పద్మార్పిత గారు
వావ్..మనసుని తడిమే మాటలు చెప్పారు.
Deleteసన్నటి కన్నీటి పొరలాంటి గీతలు జ్ఞాపకాలు మెల్లని సన్నని ధారలై ప్ర్రారంభమైన జ్ఞాపకాలు నెమ్మదిగా చెదిరిపోతాయి.
ReplyDeleteకన్నీరు మున్నీరుగా ఏడవాలి అంటారా?
Deleteశరీరం ఉండక పోవచ్చు ఆత్మ ఉంటుంది. ప్రేమ భౌతికంగా స్పర్శించకపోవచ్చు జ్ఞాపకం ఉంటుంది. శరీరానికి మరణం ఉంది కానీ మనసుకి లేదు ముఖ్యంగా జ్ఞాపకాలకి. మనిషి మరణించినప్పుడు కాదు ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు మృతి చెందినప్పుడు అసలు మరణం. మరణించిన మనిషికి సైతం ఏదో ఓ మూల మన మనసులో ఉన్న జ్ఞాపకాలలో నిత్యం సజీవంగా ఉంటారు. అది చాలు మానవ జన్మకు-హరినాధ్
ReplyDeleteమనమే పోయిన తరువాత జ్ఞాపకాలు సజీవం అయితే ఏమిటి సమసిపోతే మాత్రం ఎందుకు చెప్పండి.
Deleteమన్నించాలి మీ వ్యాఖ్యలకు ప్రతి స్పందన్ మాత్రమే నా ఈ రిప్లై.
జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి మోయక తప్పదు..అందునా బొంతలా కుట్టి మరీ పోగుచేసుకున్నవి.
ReplyDeleteబ్రతికినంత కాలం మోయడమే
Deleteప్రతీ ఒక్కరి జీవితంలో ఎన్నో మరువలేని జ్ఞాపకాలు దాగి ఉంటాయి. అలాగని వాటినే తలచుకుని కొత్తతరాన్ని కాదంటే ఎలాగండి. తప్పదు సాగించే పయనంలో ఈ ఒడిదుడుకులు.
ReplyDeleteమరీ కొత్త మోజులో బ్రతకక సమతుల్యంగా ఉంటే చాలు.
DeleteOld things are more beautiful
ReplyDeletethan many things brand new
Because they bring fond memories
of things we used to do.
Yes your absolutely correct.
Deleteనీ జ్ఞాపకాలు కానేకావు అవి
ReplyDeleteనీలోని ఊహాశక్తికి ప్రతిరూపం
చిగురించే ఆశలకి తుదిరూపం
ఈ కవితలే నిలువెత్తు సాక్ష్యం
మీరు మరీనూ...సాక్ష్యం కోరితే ఎలా?
Delete"గంతకు తగ్గ బొంత దొరికింది" అని బహుశ అందుకే అంటుంటారేమో పెద్దలు..! పేరులో గల పొర్ట్ మాన్టీయు గమనించగలరు.. కనుకే హియాటస్..!
ReplyDeleteజీవితపు ఆకాశాన జ్ఞాపకాల చినుకుల నడుమ సంతోషాల వానవిల్లు కలగలసి.
ఎప్పటిలాగే మీ కవిత అలరించింది పద్మ గారు
~శ్రీ~
గరుడగమన శ్రీరమణ
~శ్రీత
మధుర జ్ఞాపకాలు అయితే విరిజల్లు
Deleteచేదు జ్ఞాపకాలు అయితే కుంభవృష్టి
ఇరుశ్వాసల పరిమళం మాయమైపోయింది..
ReplyDeleteఎడబాటులో తప్పదుగా..
Deleteబొంత బాగోతం మస్తు బాదైతున్నది
ReplyDeleteబాధతో కూడా బాగోతం విన్నారన్నమాట.
Deleteప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సరదాలు,ఆనందాలు, బాధలు , జ్ఞాపకాలు,మరెన్నో మధురమైన అనుభావాలు, ఎన్నో ఉంటాయి. జీవితాచరణలో తారసపడే వేరువేరు సంఘటలు ప్రతి మనిషికీ వ్యక్తిగతంగా కొన్ని జ్ఞాపకాలను ఇస్తూ ఉంటాయి. అలాగే సామూహిక అనుభవాలు కూడా జ్ఞాపకాలుగా రూపాంతరం చెంది మనసున చెరిగిపోని ముద్ర వేసుకుంటాయి. ఆనందాన్ని ఇచ్చే జ్ఞాపకాలను నెమరువేసుకుని వేదన కలిగించే వాటిని మరచిపోవడం ఉత్తమం.
ReplyDeleteమీ సలహా సమీక్ష బాగుందండీ.
Deleteగుర్తు ఉంచుకోవలసిన విషయాలు ఒక్కటి కూడా గుర్తుంచుకోరు అంటూ మా శ్రీమతి పోరు.
ReplyDeleteమీకు ఎప్పటి పాత జ్ఞాపకాలు ఎలా గురుంటున్నాయో కిటుకు చెప్పి పుణ్యం కట్టుకోండి.
గుర్తుంచుకోవలసి వచ్చినప్పుడు అంతా మీ శ్రీమతిని ఒక మొట్టికాయ వేయమనండి నందూగారు.
Deleteలోతైన భావం ఉంది మీ కవితలో.
ReplyDeleteధన్యవాదాలు.
Delete
ReplyDeleteలోతైన భావమున్నది
ఓ తరుణీ! పద్మ! నీదు జొళ్ళెము లోనన్
రేతిరి బవలున్ చదువ
న్నాతురతో యుంటి మమ్మ నవ్య జిలేబీ !
జిలేబి
/\_తిడుతూ పొగిడినట్లున్నది..
Delete