గుప్పెడంత గుండెకి ఏమైందో పడిపోయింది
ఎంత వెతికినా సరే ఆచూకీనే తెలియకుంది
అదేమని అర్థం చేసుకుని నిర్ణయించుకుందో
ఏ అవసరం లేదనుకుని వదిలేసిపోయింది!
ఎక్కడ ఎలాగుంటుందో ఏమోనని బెంగగుంది
ఆకలేసినా అడగలేని అమాయక అల్పప్రాణది
ఎండావాన తట్టుకోలేనిది ఒంటిరిగా ఎలాఉందో
హఠాత్తుగా వెళ్ళాలి అనుకుంది వెళ్ళిపోయింది!
ఊపిరే నాకది ఎవరినెలా అడిగి తెలుసుకునేది
చితికిందో చిరిగిందో చిల్లుపడిందో తెలియకుంది
ఎక్కడెక్కడ తిరిగి ఎన్ని అవస్థలు పడుతుందో
నలుపురంగు నచ్చక రంగుల్లో కలిసిపోయింది!
ఆశలు ఆశయాలని అణచివేసుకున్న ప్రాణమిది
గతంలో నన్ను ఒదిలేసి భవిష్యత్తు వెతుక్కుంది
ముతకదారంకన్నా పట్టుకుచ్చు మోజనిపించిందో
విసుగని వేసారిపోయి నిశ్శబ్దంగా నిష్క్రమించింది!
చిన్నిగుండెకేం తెలుసునని భావవలలో నేచిక్కింది
వడగాలికొదిలి వయసుగాలి దొంతర్లో దొర్లిపోయింది
నాజూకు గుండె నన్ను నమ్మి లాభంలేదనుకుందో
గుణపాఠం వల్లిస్తూ జీవితమే జీవచ్ఛవమయ్యింది!
మీ గుండె పోయిన విషం తెలిపి
ReplyDeleteమా గుండెను తడిపేసారు...
Very heart touching
గుప్పెడంత గుండెకు ఎన్ని తిప్పలో కదా..
ReplyDeleteemotional feels are touching mam
ReplyDeleteలోకంలో ఇలాంటి విద్యార్ధులు ఎందరో
ReplyDeleteఇంకెన్ని చాప్టర్లు చదవాలో
మరెన్ని నైట్ అవుట్లు చేయాలో
ప్రేమ పరీక్షలో ఉత్తీర్ణతకి...
గుప్పెడంతే ఉంటుంది కానీ శరీరం మొత్తానికి ఆయువు పట్టు గుండె. ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అటకెక్కిస్తున్నాడు లేదా ప్రేమా దోమా అంటూ ప్రక్కదారుల్లో గుండెను ఇబ్బంది పెడుతున్నారు. గుండె లేకపోతే ఇంక జీవి బ్రతికి ఏం లాభం చెప్పండి. అందుకే బద్రం మీ గుండె.
ReplyDeleteగుండె పడిపోయినా నిబ్బరంగా ఉండడం ఎలాగో చెప్పు నేస్తం.
ReplyDeleteగుండెల్లో ఏదో సడి ఉండుండీ ఓ అలజడి.
ReplyDeleteగుండెల్లో ఎన్నెన్ని భావాలు నిక్షిప్తపరిచారో
ReplyDeleteబరువెక్కిందేమో మోయలేక వెళ్ళిపోయింది
బయట వీధిలో కష్టాలు దెబ్బలూ తగిలితే
అది మీరే శరణమని వచ్చి ఒదిగిపోతుంది
ఈ మనోజ్ఞ హృదయం "భావ" వలలో చిక్కినట్లయితే చక్కదనమే...!
ReplyDeleteఎటొచ్చి ఏ మాయదారి "బావ" వలలో చిక్కితేనే చచ్చేంత చిక్కు..!
గుండె పోయిన దిగులు చిత్రంలో ప్రస్ఫుటంగా కనబడుతుందండి
ReplyDeleteMissing Heart
ReplyDeleteOh no...
Fantastic touching words
ReplyDeleteLovely
ReplyDeleteఎక్కడికి పోదు మీరు ప్రేమించి వారి నుంచి భద్రంతో తిరిగి వస్తుంది
ReplyDeleteఈ ప్రేమ వ్యహారమే ఇంత
ReplyDeleteగుండె ఉన్నవారు ప్రేమించి
ఆపై గుండె తమ గుండెను
ఎదుటి వారికి అప్పగించి
గుండె లేకపోతే పోయెనని
బ్రతికి కూడా చస్తుంటారు..
రెండు మనసున పెనవేత ప్రేమంటే
ReplyDeleteగుండె పోతే ప్రేమ చచ్చిపోవడమే కాదు ప్రాణం పోయినట్లే కదా!
ఆశలు ఆశయాలని అణచివేసుకున్న ప్రాణమిది.
ReplyDeleteమీ గుండె మీలో పదిలం...బెంగ పడకండి మేడం.
ReplyDeleteగుండె చిన్నిదే కానీ చెప్పలేనన్ని భాధలు అండ్ భావాలు.
ReplyDeleteపోయిందని కంప్లెయింట్ ఇచ్చారా?
ReplyDeleteహృదయం అనేది ఇచ్చిపుచ్చుకునే భాంఢాగారం. ఎంత పెట్టుబడి పెడితే అంతే లెక్కసరిగా మనం పొందగలం. ఎవరికి ఉన్న భయాలు వారిని ఆందోళనకు గురి చేసినప్పుడు ఎదుటివారిని బాధ పెడతారు అనిపిస్తుంది.
ReplyDeleteగుండెపోతే... కవిత ఎలా రాసారు?
ReplyDeleteపోయిన గుండెతో గుబులుపడి రిప్లైస్ ఇస్తే ఏదో రాయబోయి ఏమో రాస్తే...అందుకే అందరికీ అర్పిత నమస్కరిస్తుంది. _/\_
ReplyDeletelovely.. very heart touching
ReplyDelete