అభిమానించడం ధ్వేషించడం ఆస్వాధించడం
ఇరువురిలో సమాన స్థాయిలో ఉన్నప్పుడు
స్త్రీలు మాత్రమే జాతులుగా విభజించబడడం
పురుషుడు ఆమెలోని నాణ్యతలు ఎంచడం..
ఎంత వరకూ సబబో నాకు అర్థంకానే కాదు!
పద్మినీ జాతిలో శుభలక్షణాలు ఉన్నాయనడం
మురిపించి మరిపించి మెప్పించేదామైనప్పుడు
ఆమెకు సరైన జోడి పురుషులలో లేకపోవడం
పైగా పద్మినీజాతి స్త్రీ కావాలని కోరుకోవడం..
ఎంతైనా ఇది న్యాయ సంబంధిత కోరిక కాదు!
చిత్రిణీ జాతి స్త్రీలు అందచందాలు చిందించడం
ఆకర్షించడం ఆమెకే చెల్లును అనుకున్నప్పుడు
తిరిగి ఆకట్టుకునే మగమహారాజులు కొరవడడం
స్థిరచిత్తం లేని ఆమెని చూసి చొంగ కార్చడం..
మగ అహానికిలా ముసుగేయడం మంచిదికాదు!
శంఖినీ మగువలు కస్సుబుస్సుతో చిర్రుమనడం
కుటిల స్వభావంతో కర్కశంగా ప్రవర్తించినప్పుడు
వీరిని ప్రేమించడం కోరి కయ్యానికి కాలుదువ్వడం
ఏదో కోరి అనవసర ఆసక్తితో అర్హులు చాచడం..
వివేకుల నాగరికత్వపు చత్వారం అస్సలు కాదు!
హస్తినిజాతి ఆడది నల్లగా అధికబరువు ఉండడం
మెచ్చని పుంగవులు వంకల కోసం వెతికినప్పుడు
ఆకార హొయలు ఆమెకేనని గేలిచేసి మాట్లాడడం
అంతరంగ అందాన్ని చూడలేని అంధత్వ లక్షణం..
అలాంటి మహోన్నతుడినందుంది మగతనం కాదు!
మరోసారి మగవారిని తిడుతూ పొగుడుతూ..
ReplyDeleteఅదేంటండీ ఆడవారు కూడా మగవారిని విడగొట్టి విబేధాలు సృష్టించి ఆనందిస్తార
ReplyDeleteఅయినా మగవారిలో రెండువర్గాలే...ధనవంతుడు దరిద్రుడు ఇంకా వేరెవరితో పనిలేదు ఆడవారికి!
అర్పితగారూ అంతలా మగవారి పై కక్ష కట్టినారు?
ReplyDeleteఏల?
ఎందువలన?
ప్రకృతి అందాలుగా భావించి స్త్రీలను చేస్తున్నాము.
స్త్రీ జాతులని పోల్చిన మగవాడి బ్రతుకు బస్టాండ్ అవుతుందని విడమరచి చెప్పారు.
ReplyDeleteఎంత గొప్పవారైనా స్త్రీ విషయం వచ్చేటప్పటికి, ఒకే విధంగా ఆలోచిస్తారు ఇది సత్యం.
ReplyDeleteఆలోచించి అక్షరాల్లో రాసుకోవడమే మా వంతు మాడం గారు. ఆచరణలోకి వచ్చేస్రికి ఆడవారిదే పై చేయి.
మరో షాక్ పోస్ట్ పెట్టి మగవారిని ఆడిపోసుకోవడం అన్యాయం పద్మార్పితజీ.
ReplyDeleteఅంతరంగ అందాన్ని చూడలేని అంధత్వ లక్షణం..కొత్తదనం
ReplyDeleteస్త్రీ వారి జాతుల విశ్లేషణ సమాజంలో జరిగే వాస్తవ సంఘటనలని వస్తువులుగా తీసుకొని పదునైన వాక్యాలతో అల్లిన కవితాంశం బాగుంది కానీ ఏదో అసంపూర్తిగా ముగించావు అనిపిస్తుంది.
ReplyDeleteస్త్రీ అటువైపు వెళుతోందని తెలిసిన ప్రతీ పురుషుడు ఆమె వంక ఓసారి చూడ్డం సహజం. ఇందుకు ఆమె అందంగానే ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్రకృతిపరంగా పురుషుల సహజాతం. పురుషుల్లో స్త్రీల పట్ల ఆసక్తి, స్త్రీ గురించీ ఆలోచించటమన్నది జీవపరిణామంలో అబ్బిన లక్షణంగా చెప్పుకోవచ్చు. అంత మాత్రాన్న అదేదో పెద్ద నేరం అన్నట్లు చేసి ధూషించడం తప్పు అనుకుంటాను పద్మార్పితగారు.
ReplyDeleteఆడవారి జాతులని అక్షరసేద్యం చేసారు కదా!
ReplyDeleteఆనాడు స్త్రీ జాతి ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్భయంగా పోరాడిన సాహితీవేత్త గురుజాడ అప్పారావుగారు అయితే నేడు స్త్రీలను జాతులగా విభజించారని విజృంభించారు మీరు...బహుపరాక్!
ReplyDeleteఏ జాతి స్త్రీ అయినా పురుషులని ఆకర్షించే విధంగానే కనపడుతుంది. ప్రకృతి వారం.
ReplyDeleteపద్మినీ
ReplyDeleteచిత్రిణీ
శంకిణీ
హస్తిణీ
హాహాహా
స్త్రీజాతులే కాదు స్త్రీ ఎప్పుడూ ఒక చర్చనీయాంశమే.
ReplyDeleteస్త్రీ సమస్యల పై శంఖారావం పూరించారు అనుకుంటే మరోలా సీన్ చూపించారు.
ReplyDeleteస్త్ర్రీ అపురూపం గౌరవప్రదం.
ReplyDeleteనాకు తెలిసి మగవారు స్త్రీలను జాతులుగా విభజించి చూడరు..అసలు చాలామందికి ఈ జాతుల విషయమే తెలియదు.అందానికి ప్రాముఖ్యతనిస్తారన్నది నిజం..
ReplyDeleteమనసుకు ప్రాధాన్యతనిస్తే బాగుంటుందని నా అభిప్రాయం..భర్త అందంగా లేడనే ఒకే ఒక్క కారణంతో దారి తప్పుతున్న మగువలనూ చూస్తున్నాం సమాజంలో మరి ఇది ఏ జాతి లక్షణం పద్మార్పిత గారూ
వారి వారి దృష్టి కోణాన్నిబట్టి మారుతుంది.
ReplyDeleteమగాణ్ణి ఏకడంలో మీరు దిట్ట
ReplyDelete