కొంచెం హాట్ గురూ..

                                                                          చల్లని శ్వాస వణికించె ఊపిరినల్లుకుని
నీ స్పర్శ తగిలి వేడిపుట్టనీ తనువులో
ఈ రేయి మంచంతా కరిపోనీ కౌగిలిలో
నేడు కాలిపోనియ్యి నీ బాహుబంధాల్లో!

జీవనాడి చలించనీయి ఊపిరి పోసుకుని
కలిసి కలవడి అలసి కరగనీ నన్నునీలో
పలికే పెదవుల్ని ఓడిపోనీ ముద్దులాటలో
శరీరాన్ని కప్పేయి నీ తనువు దుప్పట్లో!

రాపిడినీయి తడిమనసుకి ఉపశమనమని
ఆవిరైపోనీ శంకలు ఏమైనాఉంటే హృదిలో
కంపిస్తున్న కరముల్ని బిగపట్టు నీచేతిలో 
బీడుభూమిని తడిపేయి వర్షపు చుక్కల్లో!

నిందించకు వణికేపెదవులు సెగరగిలించెనని
స్తంభించనీ మేనిహొయలు సరససల్లాపాలలో 
ఏకమవనీ శరీరాలు ఒకటన్న మీమాంసలో
మంచుకే మంటపుట్టనీ మనిద్దరి బిగికౌగిట్లో!

38 comments:

 1. వణుకు పుట్టించే చలి ఇపుడిపుడే తెరమరుగవుతూనే
  ముచమటల వేసవికి సంకేతమై భాసిల్ల వచ్చేను మెల్లగా
  తియతీయని క్షీర పాయసాల పాకం నుండి షడ్రుచుల వైపునకు పయనం
  అమితమైన పొగమంచు వెలవెలబోవ నిప్పు కణికెల అలంకారముతో సూర్య అంగేట్రం వెరసి
  ఈ వేసవి వేడిమి చిర్రు బుర్రు లాడుతు చురకలంటించ వచెనేమో

  ReplyDelete
 2. అర్పితగారు అనుకోకుండా అదృశ్యం అయినారు అనుకుంటి...ఇంత హాట్ పోస్ట్ తో వచ్చారు. పోయే పోయే చలి గిలిగింతలు పెడుతున్నట్లుంది.

  ReplyDelete
 3. పరిమళించే పూలు, విరిసిన వెన్నెల, మేఘ మాలికల మాటున తళుక్కున మెరిసే మెరుపులు, చిక్కని చీకట్లో ఆశారేఖల్లా మిలమిల మెరిసే నక్షత్రాలు, ఇలా ఎన్నో ప్రకృతి మనోహర దృశ్యాలతో పాటుగా దోబూచులాడుతున్న శృంగార వీచికలు మీ కవితలో దాగినట్లున్నాయి అందుకేనేమో మీరు హాట్ హాట్ గురూ అంటే మేము ఆశ్చర్యపడుతూ హా హా మేడం అనుకుంటున్నాము.

  ReplyDelete

 4. అమృతం కురిసిన రాత్రి-హ్యాట్స్ ఆఫ్ టు యు పద్మార్పిత

  ReplyDelete
 5. అరవిరిసిన వెన్నెల రాత్రివేళ మనసును గిల్లుతుంటే పుట్టుకొచ్చే భావం
  చిత్రం కొంచెం ఏమిటీమ్మా భారీగానే కవ్వించి కైపు ఎక్కిస్తుంది పద్మా..

  ReplyDelete
 6. రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి పదాలు అదే విధంగా చిత్రము.

  ReplyDelete
 7. సెన్సారోళ్ళు సూత్తే కటింగ్ సేత్తారు జర బద్రం తల్లో పద్దమ్మా, నాకు మాత్రం మస్తుగ నచ్చింది.

  ReplyDelete
 8. "You survived because the fire inside you burned brighter than the fire around you" this quote is for you padma.
  నీవు బయట మండుతున్నా నీలో మండుతున్న భావావేశపు వెలుగు ప్రకాశవంతమైనది అందుకే నువ్వు ఇందరి అభిమానాన్ని చూరగొన్నావు.Keep it up.
  Hope my telugu translation is correct.

  ReplyDelete
 9. ఇరువురి తనువున ప్రేమతో కురిసె పులకింతల జల్లులు అవి గుండె సవ్వడిని పెంచితే ఇంక ఎక్కడివి చెప్పండి వేడి సెగలు. రొమాంటిక్ కవితను అందించారు.

  ReplyDelete
 10. నీలిసంద్రం పొంగి పిలిచింది
  నీలాకాశం వంగి ముద్దిమ్మంది
  చిలిపి గాలీ ఏదో గోల చేసింది
  చిన్నది కౌగిలించుకోమంది
  చందమామ సిగ్గుపడి దాగింది
  నిదురించిన మది జోలపాడింది

  ReplyDelete
 11. dear sir very good blog and very good telugu content

  Latest Telugu News

  ReplyDelete
 12. బుగ్గపై అద్దిన ముద్దులు కెంపులు
  కన్నుల్లో విరబూసెను వెలుగులు
  వెచ్చని కౌగిళ్ళు వలపు దొంతరలు
  ప్రతి స్పర్శలో ఏవో మైమరపులు..

  ReplyDelete
 13. మాటల్లేవు మీ హాట్ పోస్ట్ కి
  డేర్ డేరెస్ట్ డెవిల్..:)

  ReplyDelete
 14. వణికే చలిలో వేడి పుట్టించడం మీకే చెల్లింది

  ReplyDelete
 15. చలికి చక్కిలిగిలి పెట్టింది మీ కవితాచిత్రం.

  ReplyDelete
 16. తహతహతో తడిపొడి తపనల తాళం.

  ReplyDelete
 17. చలి మెలిక తిరిగి ఆలోచనల వేడిని పెంచింది పోస్ట్.

  ReplyDelete
 18. జిగేల్ అన్న సొగసే
  మిల మిల మిరిసేను
  కన్నులు రపరెపలాడెను
  లేత పెదవులే వణికెను
  ఎర్రనీ బుగ్గల సిగ్గులు కందెను
  సింగారం సిగ్గుతో మెలితిరిగెను
  తలగడ రమ్మని పిలిచెను
  తలుపుకు గొళ్ళెం పడెను
  తనువుల కలిసి కళ్ళెం పడెను..(సరదాగా వ్రాసినది)

  ReplyDelete
 19. పండువెన్నెల మంటలురేపెను అంటే ఇదేనేమో పద్మార్పితగారు. కౌగిళ్ళ పందిట్లో వలపు వాయనాలు ఇచ్చి ఒకరినొకరు కవ్వించుకుంటే మంట చల్లారుతుందేమో. రసికతనే రాపిడి చేసి కైపెక్కితేనే తప్ప మురిపాలమోజు మంచులా మంటల్లో కరుగదేమో. ఎమైనా వలపు మంటలు రేపడంలో మీ అక్షరాలు రాటుదేలినవి.

  ReplyDelete

 20. సుమసౌరభ కెరటాలలో గుండె నిండగా ఎడబాసిన వలపు ఆశలకు మది లేపనం పూస్తుంది.

  ReplyDelete
 21. శరీరాన్ని కప్పేయి నీ తనువు దుప్పట్లో..really hot madamji

  ReplyDelete
 22. రాపిడినీయి తడిమనసుకి ఉపశమనమని ఆవిరైపోనీ శంకలు ఏమైనాఉంటే మనసులో బాగావ్రాసారు

  ReplyDelete
 23. Ooooooooooooooohhhhh lalaaa kevu keka

  ReplyDelete
 24. ఆవిరైపోనీ శంకలు ఏమైనా ఉంటే
  అయస్కాంతమై మనసును అంటుకునే మాటలు.

  ReplyDelete
 25. నవరసాల్లో శృంగారం రాయడం కత్తిమీద సాము లాంటిది. అటువంటిది అసభ్య పదాలు దొర్లకుండా సంపూర్ణమైన సరళ భావవ్యక్తీకరణ నిజంగానే ఒక సవాలు.
  ఈ విషయంలో పద్మార్పిత సఫలీకృతురాలు అయినట్లే అనిపిస్తుంది.. గాలి,నేల,ఆకాశం,వెన్నెలలో దాగిన శృంగారాన్ని సున్నితంగా గుర్తు చేసినట్లు వ్రాసావు, భేష్ అర్పిత-హరినాధ్

  ReplyDelete
 26. చిలిపిచూపు పలుకరించి మనసున గిల్లిగింతలు పెట్టి మదిలో సరికొత్త ఆశలు రేపి ఊహలు పరువళ్ళు త్రొక్కి లోన వేడి పుట్టించి బయట చలివేసి చక్కిలిగిలి పెట్టించింది మీ శృంగార భావ వ్యక్తీకరణ. బహుబాగుంది

  ReplyDelete
 27. హాటుగా రాసినా ఘాటుగా రాసినా ఏదోలే మన పద్మార్పితయే కదా అని అభిమానించే మీ అందరికీ నా నమోఃవందనములు _/\_

  ReplyDelete
  Replies
  1. ఆయ్ మీరు ఏం రాసినా అమోదించి ఆనందిస్తాము...అభిమానించే వాళ్ళం కదండీ!:)

   Delete
  2. Arpita chala Hot guru. Padmarpita peru taluchukunte nee veedi sagalu kammukuntunnai. Ika mee kavita tho Nava naadulu kampimpa chestunnaru ga.

   Delete
 28. ఎద సొగసుల వంపుసొంపుల్లో
  ఆ పొంగుల వెచ్చని తాకిడిలో
  తాకిడి రేపేటి ప్రియ వేదనలో
  మేల్కొల్పె శృంగార తలపులు
  నా అణువణువులలో...సరదాగా వ్రాసిన కవితండోయ్.

  ReplyDelete
 29. పద్మగారికి...
  పరిచయం చేసిన మహేష్గారికి నమస్కారం.

  ReplyDelete
 30. సరిలేరు మీకేవ్వరూ...

  ReplyDelete
 31. Sweet and subtle layering of heart touching words ...lovely :)

  Suresh Babu

  ReplyDelete
 32. వేడి తాకిడి
  వలపుజల్లు!

  ReplyDelete