తెలుసు

నాలోని అలజడి నా అంతరాత్మకు తెలుసు 
లోకానికి ఏం తెలుసని లేనిపోనివి అనుకుంటారు..
అవకాశం ఇస్తే మరో నాలుగుమాటలు చేర్చి ముచ్చటిస్తారు!

నా అంతరాత్మ అంతమవక ఆపిన ఆయువుకేం తెలుసు 
చిక్కుపడ్డ చేతిగీతలను సరిచేయాలని అనుకుంటాయి..
కుదిరితే అక్షరాలు కూర్చి నుదుటిరాత మార్చాలనుకుంటాయి!

నా భావాలను కనబడనీయని నవ్వుకు తెలుసు 
అసంపూర్ణంగా ముక్కలైన ఆశయాల అసలు కధలు..
వాటిని కప్పిపుచ్చడానికి అంతరాత్మ వేస్తున్న విచిత్ర వేషాలు!

నాకే తెలుసన్న నిజం నా అంతరాత్మకూ తెలుసు 
ఆవేశంతో అస్తిత్వాన్ని ఆర్పేయాలని చేసే ప్రయత్నంలో..
ఎద ఎన్నిసార్లు మరణించి మరోప్రయత్నంగా ప్రాణంపోసుకుందో!

నాకు తెలియని గుట్టు నాలో అంతర్మధనానికి తెలుసు  
రెండక్షరాల ప్రేమకోసం ఉక్కిరిబిక్కిరి అవుతుందని మనసు.. 
"స్త్రీ" ఉనికి కోసం ప్రాకులాడే ఒంటరి అక్షరమని ఎందరికి తెలుసు!

43 comments:

  1. మానసిక పరిపక్వత కూడుకున్న క్షణం
    తప్పొప్పులు నిజానిజాలు తెలుసుకునే క్షణం
    నిన్నటికి నేటికి గల వ్యత్యస గోచరించే క్షణం
    మన్ననలు అవమానాలు మెలిపెడుతు కవ్వించే క్షణం

    కనురెప్పల కదలికల్లో లోకం ఒక్కటే కదలాడదు
    లోపలి ఆవేదన సాగరపు అలల తాకిడి ఒక్కోసారి
    భావాల ఆలోచనలు ఒక్కటే మనసుకి తరాస పడదు
    నిట్టూర్పు వదిలెళ్ళిన క్షణిక గాయాలు ఒక్కోసారి

    ఓపిక నశించనంత వరకు ప్రతి కెరటం అత్యద్భుతం
    చలనం ఆగనంతవరకు ప్రతి పయనం సంచలనం
    నిన్నటి రేపు కి రేపటి నిన్న కి లేదేమి తేడ

    స్త్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఔతుంది. అమ్మ గా అవతరించి మాతృమూర్తి గా నిలుస్తుంది. చెల్లిగా అవతరించి అనురాగాన్ని పంచి పెడుతుంది. భార్యగా అవతరించి కష్ట సుఖాల్లో సమపాళ్ళు పంచుకుంటుంది. స్నేహితురాలిగా అవతరించి మంచికై ప్రాకులాడుతుంది.
    ఏ స్థానం తాను తీసుకున్నా ఆ స్థానం స్థాయి అణగారనీయదు. స్త్రీ, పురుషుల నడుమ గల బాంధవ్యం నవసమాజ, సమసమాజ నిర్మాణానికి నాంది పలకాలి. కట్టుబాట్లలో ఆచార వ్యవహారాలలో ధైర్యాన్ని ఓర్పుని సడలనీయక సాగాలి.

    ~శ్రీధర్ భూక్య

    చిత్రం బాగుంది. చిత్రానికి తగినటువంటి కథనం బాగుంది పద్మ గారు.

    ReplyDelete
    Replies
    1. Wish you a happy new year Sridhar-Harinath

      Delete
    2. Thank you for the Wishes, Harinath Sir.. Wishing you too a year full of Health, Happiness, and Prosperity.. Belated Wishes for Sankranti too.
      Always Humbled and Obliged.

      Om Namo Kesavaaya

      Delete
    3. Thank you and God bless you my dear-Harinath

      Delete
  2. "స్త్రీ" ఉనికి కోసం ప్రాకులాడే ఒంటరి అక్షరమని ఎందరికి తెలుసు ?

    ఎంత బాగా వ్రాసారండీ ... ఈ ఒక్క అక్షరం చాలదూ ?

    ReplyDelete
  3. అన్నీ తెలుసు అనుకోవడం అవివేకం
    అన్నీ తెలిసి కూడా నిగూఢతతో ఉండడం గొప్పతనం
    మంచి కవితాచిత్రం పద్మార్పితజీ..

    ReplyDelete
  4. అనంతకోటి ఆలోచనలకు అలజడులకు స్త్రీ మూలం అయితే ఒంటరిది అనుకోవడం తప్పు😁

    ReplyDelete
  5. ఆశనిరాశల అంతర్మధనమా లేక వ్యధలను నింపుకున్న గుండె గొంతువిప్పి వ్రాసిన భావమా
    చిత్రం భావాల ఉనికిని చాటుకుంటున్నట్లు బాగుంది.

    ReplyDelete
  6. గుండె గుహల్లో
    ప్రతిధ్వనించిన కోరికలకు
    కళ్ళెం వేయడం కష్టం
    ఊపిరి తీగలపై ఊయల ఊగుతూ
    చివరి వరకూ ప్రయత్నించడం
    వివేకవంతుల లక్షణం..

    ReplyDelete
  7. అనుభూతులు అనుభవాలు కలిసిన భావావేశ కవిత...awesome

    ReplyDelete
  8. స్త్రీ ఒక ఒంటరి అక్షరం అద్భుతం.

    ReplyDelete
  9. మనసుని తాకే భావాలతో అంతరంగంలో కలిగిన అలజడిని తెలిపారు బాగుంది.

    ReplyDelete
  10. మనసు గోల మస్తుగుంది

    ReplyDelete
  11. మరోసారి మనసు దోచిన కవితాక్షరాలు
    Beautiful painting mam.

    ReplyDelete
  12. బొమ్మ అదిరింది
    వాక్యాలు మదిని తాకెనని మీకు తెలుసు

    ReplyDelete
  13. మాడంజీ మీరు అన్నింటా పర్ఫెక్ట్
    మీకు తెలియనిది లేదు మీరు సూపర్
    అన్నీ తెలుసు అనుకుని మాబోటి వారు వేస్ట్
    మీ బ్లాగ్ మీ పోస్ట్ అండ్ పెయింటింగ్స్ ది బెస్ట్

    ReplyDelete
  14. అపజయాన్ని అంగీకరించలేని వారు జయం అయితే పర్వాలేదు అపజయ ఫలితం మనసు పరిపరివిధాల పోతుంది. ఈ పరాజయాన్ని మరెవరి మీదైనా నెట్టెయ్యాలని మనసు ఉవ్విళ్లూరుతూ దారులు వెతుక్కుంటుంది. అందుకు ఎవరిని నిందించాలన్న అంతర్మధనం మొదలవుతుంది. కానీ అసలు వాస్తవం- వైఫల్యానికి కారణం తామేనని ఒప్పుకోనప్పుడు జరిగే తర్జనభర్జనే ఈ మధనం. పైగా అన్ని తమకే తెలుసును అనుకోవడం మరో మూర్ఖత్వం. ఆశయం నిర్ణయం సరైన వ్యూహం ఎంచుకోవడం తగిన ప్రణాళిక వేసుకుని కార్య సిధ్ధి సాధించిన వారు ఆత్మసంఘర్షణకు లోనుకారు తప్పక విజయం సాధిస్తారు. ఎందుకో మీ పోస్ట్ చవితే కలిగిన భావాలను మీతో పంచుకున్నాను.
    మీ పోస్ట్ పరంగా నేను వ్రాసింది అప్రస్తుతం అనుకుంటే తొలగించవలసిందిగా మనవి.

    ReplyDelete
  15. So beautiful painting didi.

    ReplyDelete
  16. అంతరంగదర్పణం
    అనుభవాలు భావపాతాలై
    గుండె శిలలను చేరితే
    అలజడి చెందిన అంతరాత్మ
    బ్రతుకు ఒరవడిని తాళలేక
    పల్లాలని వెదుక్కుంటూ
    అంతర్మధనానికి లోనై
    మది లోయల్లోకి జారుకుంటాయి
    చచ్చిన ఆశలు ఆడుకుంటాయి
    జ్ఞాపకాలు ఒడ్డున పడేస్తాయి
    అనుభవసారాలై జీవితాన్ని సరిచేస్తాయి..

    ReplyDelete
  17. ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ మునగలేక తేలక త్రిశంకు స్వర్గంలా మారినప్పుడు చెప్పే జీవితసారం ఇది. ఆనందాన్ని విషాదాన్ని పంచుకునే తోడు కరువైనప్పుడు పదిమందిలో వున్నా మోయలేని ఒంటరితనంతో ఆలోచనలు ముల్లులై మనసును గుచ్చుతుంటే కలిగే భావాలు. ఇంత లోతైన భావావేదన అంతర్మధనం అవసరమా చెప్పు. హాయిగా గలగలా పారే సెలయేరులా సాగిపోక, ఆశిస్సులతో-హరినాధ్

    ReplyDelete
  18. జీవన స్మృతుల గుసగుసలై కనపడని గాజు పెంకుల్లా గుచ్చుకుంటాయి మీ కవితలు వాటి భావాలు.

    ReplyDelete
  19. "ఆవేశంతో అస్తిత్వాన్ని ఆర్పేయాలని చేసే ప్రయత్నం"
    ఇది సాధ్యమా పద్మగారు.

    ReplyDelete
  20. So nice and beautiful expressions.

    ReplyDelete
  21. గడిచిపోయిన గతంలోకి తొంగి చూడక
    భావాతీతమైన జ్జ్ఞాపకాల తలుపువేసి
    మసకబారిన మనసు అద్దాన్ని బోర్లించి
    వెలిగేటి ఆశా దొంతరలు పేర్చుకోవడమే!

    ReplyDelete
  22. ఇంచుమించు నా భావాలే సుమా! :)

    ReplyDelete
  23. మీరు ఎంతో తెలివైన వారు సుమా
    అందుకే అన్నీ మీకు తెలుసు.....

    ReplyDelete
  24. స్త్రీ ఉనికి కోసం ప్రాకులాట

    ReplyDelete
  25. స్త్రీ పవర్ఫుల్
    ఆమె శక్తి అసామాన్యం
    ఆమె అంతరంగం తెలుసుకోవడం కష్టం

    ReplyDelete
  26. మీ భావాలకి అందమైన రూపం ఇచ్చారు.

    ReplyDelete
  27. స్త్రీ సృష్టికి మూలమని చెప్పకనే చెప్పావు అనుకోమంటావా లేక అనుకోవడానికి ఏముంది ఎవరికి తోచింది వారు అనుకుంటారు ఎవరికి వారు తమ అంతరాత్మకు సమాధానం చెప్పుకుని సాగిపోమ్మంటావా పద్మా? చిత్రం అతిసుందరం.

    ReplyDelete
  28. లవ్లీ పోయం మాడంగారు పిక్ కూడా చాలా బాగుంది.

    ReplyDelete
  29. అంతరాత్మ అలజడులు.

    ReplyDelete
  30. స్త్రీ సమక్షంలేని పరిసరాలే వేరుగా వుంటాయి. శుష్కంగా, జీబుగా, చీకాకుగా.
    ఆడది తనున్నచోట తన చుట్టూ ఆర్ద్రత ప్రవేశపెడుతుంది.
    మగవాళ్ళ మనస్సుకి ఏంటినా వంటిది స్త్రీ.
    స్త్రీకి ప్రత్యేకమైన ఉనికితో పనిలేదు.

    ReplyDelete
  31. జోరు హుషారు పుట్టించే పోస్ట్లు కరువైన మీ నుంచి...ఎందుకు వలన?

    ReplyDelete
  32. స్త్రీ" ఉనికి కోసం ప్రాకులాడే ఒంటరి అక్షరం...అద్భుతం

    ReplyDelete
  33. మీ అందరి అభిమానానికి సదా శిరస్సు వంచి నమస్కారములు. _/\_

    ReplyDelete
  34. ఎంతో మానసిక పరిపక్వత ఉంటే తప్ప ఇంతటి అద్భుతమైన భావం పడదు- హ్యాస్టాప్ పద్మార్పిత.

    ReplyDelete