ఆమె ఆడె!

అల్లరివయసేమో వలపువలలో చిక్కి ఊగగా
అణగారిన కోర్కెలు ఎదలో చిందులు వేయ
అడుగువేయలేని అనుభవాలు ఊహల్లో సాగి 
అనుభూతులు భావచెరసాలలో బంధించబడె!

ఆడలేని మయూరిని అందలం పై ఎక్కించగా
ఆగలేని ఆమె నడుమును అటుఇటూ ఊప
అందమైన ఆ కులుకులకు పలుకులు లేవన
ఆటాడలేని మది సైతం ఆటకు అలవాటుపడె!

అలై పొంగు భంగిమను పొగడపూలతో పొగడగా
ఆదిమంత్రం వేసినట్లు పరిమళాలకు పరవశించి 
అధరసుధలను కెంపులవోలె మెరిపించి మురిసి
అణువణువు పులకరించెనని రాని అబద్ధమాడె!

అందెల అరిపాదాలు సలిపి రాయబారమంపగా
ఆశలే ఆకృతి దాల్చి వగలు సెగలుగా బుసకొట్ట
ఆ మేని వంపులే విరహము పెంచి కవ్వించెనన
ఆవేశమే ఏడ్వలేక నవ్వులద్దుకుని నాట్యమాడె! 

33 comments:

 1. చూడగానే శృంగార రచన అనిపించినా చదితే లోతైన భావం మిళితమైనది
  భావగంభీర కవితని అందించారు ప్రశంసనీయం...అభినందనలు

  ReplyDelete
 2. కొర్కెల అలలపై వలలేస్తే చిక్కే ఆలోచనలతో సతమతమైతే
  రేగే ఆశల నురగపై తేలియాడే మనసు ఆడే నాట్యం అతుల్యం

  మనసుకు మనసుకు నడుమ మాటల వారధి
  ఆ వారధి మౌనమనే కుంటపై నిర్మిస్తే పదాల నృత్యం అత్యద్భుతం

  అందని అందియల ఘల్లులతో జలదరించే మదిలో ముసురుతున్న భావాల చినుకు ముత్యాల తడి తన్మయత్వం చేసే నాట్యం అనిర్వచనీయం

  ~శ్రీ~
  పెరుమాళాండాళ్ గోదారంగనాథ

  ReplyDelete
 3. నటనం ఆడింది ఆమెనో లేక ఆమె మనసో... చిత్రం మాత్రం కేక పుట్టించె.

  ReplyDelete
 4. శృంగారం వెదల్లే కవిత అనుకున్నాను బొమ్మచూసి
  బోల్తా కొట్టించారు. కవిత బాగుంది పద్మార్పితగారు

  ReplyDelete
 5. నెరజాణ హొయలు ఒలకబోస్తూ జాలిగా వలపు గీతం వల్లించడం ఆశ్చర్యం.
  ఇదేదో గోలగా ఉంది, చిత్రం కవ్విస్తుంది..హ ఆహా హా

  ReplyDelete
 6. సరిరావు ఏ వ్యాఖ్యలు మీ సరస కవితలు.

  ReplyDelete


 7. నడుమందంతో రమణీ
  గుడుగుడు కుంచెము సయి చెడుగుడులాడితివే !
  పిడుగైనావే పిల్లా
  బడబానలము రగిలించి పడగొట్టితివే :)

  జిలేబి

  ReplyDelete
 8. అనుభూతులు "భావ" చెరసాలలో బంధించబడెనా..లేక "బావ" సరసాలలో బంధించబడెనా..!
  అ,ఆ లతో అద్భుతమైన ఆహ్లాదాన్ని అందించారు.

  ReplyDelete
 9. చక్కని భావోద్వేగాలతో సరసం కాస్తా విరసంగా మారి మనసుకీ వలపుకీ మధ్యన సున్నిత సంఘర్షణ జరిగితే పుట్టిన కవిత ఇది అనిపిస్తుంది. చిత్రంలో చిన్నది వగలు పోతున్న విషయం పక్కన పెడితే నా వాక్యాలు కరెక్ట్ అనుకుంటాను అర్పితగారు.:)

  ReplyDelete
 10. మనసుతో జపించక
  తలపులలో తలచి
  పై పై అలుక ఎందుకో
  అల్లరి వయసులో
  పూబోణికి ఉలుకు ఎందుకో
  వెన్నెలంటి మోము పై
  గిలిగింతలు తరిగి
  విసుగు చింత ఎందుకో?

  ReplyDelete
 11. అల్లరి వయసు చెప్పిన ముచ్చట్లు రసవత్తరంగా ఉండాలి మీ కవితలో బెడికొట్టిన వైఖరి కనబడుతుంది ఎందుకో?

  ReplyDelete
 12. రొమాంటిక్ టచ్ ఇచ్చినట్టే ఇచ్చి క్లాస్ తీసుకున్నారు ఎప్పటిలా...

  ReplyDelete
 13. వామ్మో ...ఇది అల్లరి వయసా
  కాదు అన్నీ తెలిసిన మనసు
  గుండెలు పిండి పిప్పి చేసేను తస్మాత్...జాగ్రత్త :)

  ReplyDelete


 14. వామ్మో! యిది అల్లరివయ
  సామ్మా! అన్నీ తెలిసిన జాణవు గా ప
  ద్మమ్మా ! మనసును పిండితి
  వమ్మీ దండిగ జిలేబి! పడతుక ! రమణున్ :)

  జిలేబి

  ReplyDelete
 15. ఆశలే ఆకృతి దాల్చి వగలు సెగలుగా బుసకొట్ట..పదాల అల్లిక బాగుందండీ.

  ReplyDelete
 16. ఆది అంత్య ప్రాసలు కూర్చి వ్రాసిన పద్యం బాగుంది.
  చిత్రము కవ్విస్తుంది.

  ReplyDelete
 17. Ato vellipoyindi manasu

  ReplyDelete
 18. చివరి లైన్ కట్టిపడేసింది.

  ReplyDelete
 19. నడుము చూపి మనసు దోచిన నెరజాణా
  నువ్వు కులుకుతు నటనమాడ
  నిలువదే నా మనసు
  ఆ నడకల్లో ఎన్నెన్ని వయ్యారి హొయలు

  ReplyDelete
 20. Winter special romantic poem mam.

  ReplyDelete
 21. ఏందమ్మో గిట్ల గిలిగింతలు పెడితివి, బొమ్మ మస్తు పరేషాన్ గున్నది.

  ReplyDelete
 22. keka pettincharu
  pic & poem superb

  ReplyDelete
 23. ప్రణయం
  విరహం
  పద్మార్పితం

  ReplyDelete
 24. శృంగార ప్రణయ దృశ్యకావ్యం చిత్రించడం మీకే సాధ్యం

  ReplyDelete
 25. మనోభావాలను ఆటగా కూర్చి కవితలో కళ్ళకు కట్టినట్లు చూపించావు.

  ReplyDelete
 26. అందరి అభిమాన అక్షరస్పూర్తికీ నా హృదయపూర్వక అభివందనములు _/\_

  ReplyDelete
 27. బాధలని భరిస్తూ బంధాలని మననం చేస్తూ
  మనసు చంపుకుని మమతల రంగు పులుముకొని
  ఆడైనా మగైనా జీవించి ఉన్నత వరకూ ఆడడమే తప్పదు.

  ReplyDelete
 28. "అ" మొదలిడి "డె" అంతం చేసె
  మీ ఆది అంత్యల ప్రాసా జిజ్ఞాస
  కడు రమ్యమైనది అతి ప్రియం కూడా
  మరెన్నో ప్రాస భావ పోస్ట్ ల అలరించాలి

  ReplyDelete
 29. ఆటలో పాటలో ఆవేదన ఉన్నది.

  ReplyDelete


 30. నీ వంపుల్ విరహమ్ముపెంచె నొడలున్వేసారె కవ్వింపులొ
  ల్కే వేణీ !అధరామృతమ్ము మనసున్ కెంజాయ కెంపుల్ వలెన్
  వావాతన్పిలిచెన్ జిలేబి వలె రావంబాయె పద్మార్పితా!
  ఆవేశమ్మది నేడ్వలేక నగువై నాట్యంబు జేసెన్ గదా

  జిలేబి

  ReplyDelete