నా సంపూర్ణం..


అందమైన దృశ్యాల నుండి రంగులు దొంగిలించినా
భావాలోచనలకు పదాలను చేర్చి మాలలు అల్లినా
దేవాలయాల్లో దేవుళ్ళని కొలచి దీవెనలు పొందినా
పగటికలగా వచ్చి నిజమయ్యే స్వప్నానివిగా నీవు
నీ నుండి పొందే స్ఫూర్తికి ఇవేవి సరికావు, రావు
అందుకే నీకోసం వేచి చూసే నిరీక్షణను నేను...

                            *****

నక్షత్రాల నుంచి వెలుతురుని నేను దొంగిలించినా
గాలితెమ్మెర సంగీతాన్ని సాధనతో ఆలాపించినా
చందమామ నా పై చల్లని వెన్నెలను కురిపించినా
ప్రపంచం పరాయైనా నా సొంతమనే ధీమావి నీవు
నీవు నా చెంతలేని లోటును ఇవేవీ పూరించలేవు
అందుకే నీకే హాని జరగరాదని తలుస్తాను నేను...

                             *****

పరుగులేసే వయసును కాలం నుండి దొంగిలించినా
పుస్తకాలు విజ్ఞాన విషయాలు ఎన్నింటిని భోధించినా
స్థితిగతుల నైసర్గిక స్వరూపం నాకణువుగ నర్తించినా
నువ్వు లేనిదే వెలసిన రంగాయె వసంత ఋతువు
నీవల్ల అయిన ఖాళీని ఇవేవీ పూర్తిగా భర్తీచేయలేవు
అందుకే నే కోల్పోయి నిన్ను దక్కించుకుంటాను...

41 comments:

  1. ప్రకృతి రంగుల కలగాపులగం
    వేవేల వర్ణాల మేళవింపు
    కలగలసి రసరమ్యం

    అక్షర తోరణాన భావకుసుమాలంకరణ
    పదాలకు అర్థాలు తెచ్చే ఆలోచనల సమీకరణ
    అక్షర భావ ద్వయమే వాక్కుకు చేకూరే నవీకరణ

    రోజులవే పగలు కాస్త రాతిరి కాస్త
    రోజులవే బాధ కాస్త సంతోషం కాస్త
    రోజులవే అమవస కాస్త పున్నమి కాస్త
    రోజులవే నిన్న మొన్నలు కాస్త రేపు ఎల్లుండ్లు కాస్త
    రోజులవే గ్రీష్మం వసంతం కాస్త శిశిరం శీతం కాస్త

    అడియాశల మేఘాలు కొన్ని ఆవరించినా చలించక
    నిట్టూర్పు సెగలు కొన్ని తాకినా సడలక
    ఆశయాల బాటలో కొన్ని దారులు ఆటంకించినా బెదరక

    సాగే ఊపిరి లయగతుల జీవితం పరిపూర్ణం
    ఆశ అడియాశల నడుమ సారూప్యతే నిదర్శనం
    భావోద్వేగాల సుడులలో జీవితకాలపు సంచలనం
    దూరాల తీరాలు మాటరాక మౌనాలు
    మరో అడుగు ముందు అలుపెరగక

    ఆంగ్ల సంవత్సరాది శుభాభినందనలతో

    జీవాత్మ పరమాత్మ అనే రెండింటి నడుమ
    ఏమి తిసుకురాము ఏమి తీసుకుపోము
    ఉన్న జీవితకాలం ఒక్కరికి ఒక్కటే
    ఎనిమిది దిక్కుల వ్యాప్తి చెందే కీర్తియే చివరాఖరికి

    Wishing you a Benevolent and Prosperous New Year in Advance, Padma Madam.

    Happy New Year 2018

    ReplyDelete
  2. అన్నీ ఉన్నా ఏమీ లేని పేద నువ్వు లేక అంటూ వ్రాసిన విధానం బాగుంది. ఈ సంత్సరపు ఆఖరి కవిత మరిన్ని కవితలతో మున్ముందు అలరించాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు పద్మార్పిత.

    ReplyDelete
  3. ప్రపంచమే పరాయిది అయినా
    నా సొంతమనే ధీమావి నీవు...
    సున్నితంగా మనసుని తాకిన వాక్యాలు

    ReplyDelete
  4. So beautiful pic
    lovely poetic lines
    Advance new year wishes

    ReplyDelete
  5. కళ్ళలో పొంగే బాధలు ఎన్ని ఉన్నా మనసులోని భావాలకు చక్కని రూపం ఇచ్చి మనసుని మెదడును జోకొడతారు.
    ఇవి మీకే చెల్లిందండి.

    ReplyDelete
  6. మీరు మానస చోరులే కాదు
    అందమైన అక్షరాల నిఘంటువు
    చూడముచ్చట చిత్రాలతో
    మనసు సైతం దోచుకుని
    సామాన్య భాషా ప్రయోగంతో
    గుండెలోతుల్లో కదలించే శక్తి కూడి
    మంత్రం వేసి మాయచేస్తారు...

    ReplyDelete
  7. Advance naya saal mubarak didi.

    ReplyDelete
  8. గ్రేట్ మాడం మీ కవితలు
    హ్యాపీ న్యూ ఇయర్.....

    ReplyDelete
  9. some moments leave us, but remain etched as memories that can only be cherished.. some moments are in the making, which get into vogue at the right moment.. some moments delve deep into thoughts and amalgamate with imagination and wait till the perfect moment.. former is passé.. latter is undetermined.. knit every moment into a fabric of harmony and compassion.

    happy new year two thousand eighteen

    ReplyDelete
  10. WISH YOU HAPPY NEW YEAR-2018

    ReplyDelete
  11. ఆంగ్ల నూతన సంవత్సర శుభ ఆరంభం
    మీరు మరిన్ని మంచి కవితలతో అలరించాలని కోరిక.

    ReplyDelete
  12. అంతు చిక్కని మనసు గురించి అర్థం కాకపోవడమే బహుశా ప్రేమ ఏమో
    అందుకే మీరు అర్థం కారు మీ భావాలు అన్నీ ప్రేమతో నిండి ఉంటాయి..

    ReplyDelete
  13. "ఊహల ఉయ్యాలవే మనసా..మాయల దయ్యానివే మనసా..లేనిది కోరేవు..ఉన్నది వదిలేవు"
    మనసుకు ఒక తీపి గాయం చేసేది వలపు
    వలపెరిగిన ఎదకు తప్పవు పాట్లు అగచాట్లు
    అయినా మీకు కొత్త కాదు ఇటువంటి గాట్లు

    ReplyDelete
  14. "ఈ అంతరంగపు ఎడారిలో
    భావకవితలే ఒయాసిస్సులు
    కళల కలల్లో జీవిస్తూ
    ప్రతీ పాత్రలో లీనమైనప్పుడు
    అంతర్మధన విముక్తి కష్టం
    కవితా రూపకల్పనకై చేసే కృషి
    కళాసాధనకి సంపూర్ణత ఇస్తుంది"

    ReplyDelete
  15. పాఠకుల - మల్లె మొగ్గల
    మాటల పలు కవిత - లల్లి మైమరిపించే
    దీటైన పద్మ గారికి
    నేటి నవ వసంత మిడు ననేక శుభాలన్ .

    ReplyDelete
  16. 2017 సంవత్సరం సంపూర్ణమైంది..
    2018లో మళ్ళీ విజృంభణ మొదలు
    హ్యాపీ న్యూ ఇయర్ పద్మార్పితా..

    ReplyDelete
  17. మీ కవిత్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మనసు దోచుకుంటాయి..ఇక చెప్పేది ఏంటండీ 😛

    ReplyDelete
  18. సుందరమైన చిత్రం
    సుమధుర భావాలు
    హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ టు యు.

    ReplyDelete
  19. ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ 😄

    ReplyDelete
  20. మారో గోలీ... గతం గతః
    మరో అధ్యాయం మొదలు...

    ReplyDelete
  21. ఎన్ని దొంగిలించి ఏమీ ప్రయోజనం మనసుకు నచ్చింది దొరక్కపోయే... ఎంతో చక్కగా వ్రాసారు.

    ReplyDelete
  22. నీ బాటలోనే నా అడుగులు
    నువ్వు ఉంటే ఇంకేం వేరే వాటితో పనిలేదు
    ఇద్దరి లోకం ఒకటే అనుకుని మసలుకునే బాపతు ప్రేమజంట.

    ReplyDelete


  23. నీవే లేక జిలేబీ
    నా వునికే లేదిక! లలనా! నా రాణీ !
    చావై నా ఓకే నే
    నీ వొక పరి చూడవే వనిత నను గావన్ :)

    ReplyDelete
  24. మీరు సంపూర్ణం అయితే చూడాలని మా కోర్కె... 😂

    ReplyDelete
  25. ఒకచోట ఆగిపోవడం అంటే నూతనత్వం లేకపోవడమే కదా అందుకే నిరంతర ప్రవహించాలి… ప్రవాహం గండుశిలల్నీ సైతం ఎంత నునుపుగా మారుస్తుందో నీకు తెలియని కాదు. ఒక్కసారి వ్రాయడం మొదలుపెట్టిన నీకు భావాలు ఏం కరువు కాదు. నూతన సంవత్సరం మరిన్ని నూతన భావాలకు అక్షరరూపమిచ్చి అందరినీ అలరింపజేస్తూ నీవు ఆనదంతో సాగిపో అర్పితా అదే నీకు సంపూర్ణతను చేకూరుస్తుంది, ఆశ్శిస్సులతో-హరినాధ్

    ReplyDelete
  26. పగటికలగా వచ్చి నిజమయ్యే స్వప్నం...అధ్భుతం

    ReplyDelete
  27. మనసు నిఘంటువు.

    ReplyDelete
  28. చక్కని దృశ్యకావ్యం అందించారు.

    ReplyDelete
  29. స్థితిగతులకణువుగ నర్తించినా noe use madamji

    ReplyDelete
  30. పరుగులేసే వయసును కాలం నుండి దొంగిలించి..ఇలా ఎలా చేసారు :)

    ReplyDelete
  31. భావం మధురం

    ReplyDelete
  32. ప్రణయభావలహరి సంపూర్ణం...సుమధురం.. సలాం....మేడం!!!

    ReplyDelete
  33. మగ జాతి అసూయతో కుళ్ళుకొంటోంది..ఈ మానస చోరుని తలచుకొని మరి..మరి..

    ReplyDelete
  34. అనిర్వచనీయమైన అనుభూతిని అందించారు
    2018 సంవత్సరం ఇంకా కవితలు మొదలుపెట్టలేదు

    ReplyDelete
  35. లేజీ ఎక్కువైంది..కారణం చలి కాదుకదా :) :) :)

    ReplyDelete
  36. అందరికీ పద్మార్పిత వందనములు_/\_
    2018 మొదటిరోజే హడావిడి బిజీబిజీ
    ఆలస్యానికి అందరూ మన్నిస్తారని ఆశ!

    ReplyDelete
  37. సాగిపొండి మరెన్నో మనసు దోచే కవితలు రచించండి.

    ReplyDelete
  38. ఎవరికీ సంపూర్ణమైన జీవితం లభించదు అనుకుంటాను.

    ReplyDelete