అక్షరాభరణం


నాకూ నా ఆలోచనలకూ ఏదో అవినాభావ సంబంధం
బాధలోను ఆనందంలోను అక్షరాలుగా అల్లుకుంటాయి
రంగురంగుల ఊహల పరిచయాలకు రూపం ఇస్తాయి!
నాలోనాకు నా అనుభూతులకీ తెలియని అంతర్మధనం
భావాలుగా బయటపడుతూ ఆవేశాన్ని వెదజల్లుతాయి
ఆవేదన చెందుతుంటే ఆత్మీయంగా పెనవేసుకుంటాయి!

నాతో చెలిమి చేయాలనుకునే అదృష్టానికి ఈర్షాధ్వేషం
అవే అందమైన పదాలుగా అల్లుకుని బంధువులైనాయి 
తెలిసీ తెలియని విజ్ఞానపు వ్యక్తిత్వమై వికాసాన్నిస్తాయి!     
నావల్లకాని పనులకు నా రచనలంటే ఎంతో అభిమానం
ఈ విధంగా విశ్వవీక్షణ గవాక్షాలై మురిసి గెంతులేస్తాయి
ఏ మాధ్యమ పరిజ్ఞానంలేని నాతో రచనలు చేయిస్తాయి!
   
నాలో రసాస్వాధన్ని పెంపొందించిన నీకు పద్మ అర్పితం
ఉత్తమాభిరుచినిచ్చిన నీకు నాభావాలన్నీ గులామైనాయి 
ఆప్తంగా అలరించే అక్షరాలకు సాష్టాంగ ప్రణామాలన్నాయి! 

43 comments:

  1. మనుషులు ఒకరికొకరు దూరం అవుతున్నారు.మదిలోని భావాలన్నీ శబ్దరూపం దాల్చకుండానే గొంతులోనే గట్టిగా గూడుకట్టుకోనివ్వక రాసేస్తున్నారు.

    ReplyDelete
  2. అనువైన అక్షరాలతో అర్థవంతమైన అసాధారణమైన అస్థిరమైన ఆలోచనలను అదుపుచేస్తు అందించేరు అసమాన అక్షరార్థమాలిక అందుకే అక్షరాభరణం ఆమోదమే అర్పితగారు.

    ReplyDelete
    Replies
    1. హెపిస్ బడేస్ ఇన్ అడ్వాంసు.. పద్మ అర్పిత గారు

      Delete
  3. మీ అక్షరాలు మమ్మల్ని కూడా అలరిస్తాయి.

    ReplyDelete
  4. అక్షరాల అభిమానం బాగా వెల్లడించారు.

    ReplyDelete
  5. ఏ పరిజ్ఞానం లేదంటూనే మీ అక్షరాల వెంటపడి మా చూపులు పరిగెత్తేలా చేస్తున్నారు..
    అనిర్వచనీయ కవితా జగత్తు మత్తులో ఓలలాడిస్తున్నారు..
    ఇంతా చేసిందంతా చేసి, నాకు ఏమీ రాదు- తెలియదు అంటూ అమాయకపు మాటలు వల విసురుతారు.
    మీకిది భావ్యమా..?

    ReplyDelete


  6. కవితా జగత్తు మత్తున
    సువిశాలంబగు పదముల సుమధుర కైపుల్
    రవిగాంచని పడతుకల మ
    ది వింగడములన్ జిలేబి దించితి వమ్మా :)

    జిలేబి :)

    ReplyDelete
  7. మాటలు చాలామంది మాట్లాడతారు
    అక్షరాలు చాలామంది రాస్తారు
    మనసుకొలను పద్మాలను అందమైన అక్షరాలుగా
    మలచటం చాలా తక్కువమందికి తెలుసు..
    పద్మాక్షరాలకు ఫిదా కాని మనసుంటుందా ..?

    ReplyDelete
  8. మీ ఆలోచనలు బాగుంటాయి.......
    మీరు అక్షరాలతో ఆకట్టునే విధంగా వ్రాస్తారు
    అందుకే ఫిదా అయిపోతారు అంతా.

    ReplyDelete
  9. ఇలాగే మరిన్ని కవితలతో ఆకట్టుకోవాలి మీరు.

    ReplyDelete
  10. పద్మాక్షరాలు పదిలం
    పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete

  11. పద్మాక్షరాలకు ఫిదా
    బద్మాష్గాళ్ళైనను యవవలసిన దే పో !
    గద్మను బట్టుచు ముద్దుగ
    సద్మను పోగొట్టునయ్య చక్కని చుక్కా :

    జిలేబి

    ReplyDelete




  12. పడిపోయా నేనైతే
    వడి పద్మార్పిత కవితల వర్షపు ధారల్
    సడిజేయగ మది తా అల
    జడిగనె నోయీ జిలేబి జవజవ యనుచున్‌

    జిలే‌బి

    ReplyDelete
  13. పద్యాలు చందోబద్దంగానే.... అందరికీ అర్ధమయ్యేటట్టు చెప్పలేమా??

    ReplyDelete
    Replies
    1. నీ కర్థంబవకున్న
      న్నీ కర్మగదా జిలేబి నీల్గుడదేలా !
      పోకిరి బుడతల పండితు
      లౌ? కసరత్తులను జేసి లావై గనిరే :)

      జిలేబి
      (పరార్:))

      Delete
    2. @ chiranjeevi,

      కావ్యం వ్రాయబడే శైలిని పాకం అంటారు. ఇవి రెండు విధాలు.

      1.ద్రాక్షాపాకం: సరళమైన పదాలతో రసస్పూర్తిని వెంటనే కలిగించేది.(ద్రాక్షపండు నోటిలో వేసుకోగానే రసాన్ని వెంటనే ఆశ్వాదించగలుగుతామే అలాగన్నమాట !)

      2.నారికేళ పాకం : రసం నిగూడంగా ఉండి కొంచెం శ్రమతో బుద్ధిని పదునుపెట్టి అర్ధం చేసుకుంటేగానీ అర్ధం చేసుకోలేని శైలి.(నారికేళం అంటే కొబ్బరిని కోసినవెంటనే తినడానికి వీలవదు,పీచుని తీసి,పెంకుని పగలగొట్టి,లోపలి పదార్ధాన్ని నమిలితేగానీ రసాస్వాదన చేయలేం)

      కావ్య రచనా విధానాలు మూడు రకాలు.
      1. పద్యకావ్యం
      2. గద్యకావ్యం
      3. పద్యగద్యోభయో కావ్యం లేదా చంపూకావ్యం అని అంటారు.

      Delete
    3. ఆ రెంటికీ మధ్యలో కదళీ పాకం అనేది ఇంకొకటి ఉంటుంది. ద్రాక్ష కంటె దీనికి తొక్క వొలుచుకునే అదనపు పని ఉంటుంది కదా... అలా, ద్రాక్షా పాకం కంటె కొంచెం కష్టమైనది కదళీ పాకం.

      Delete
    4. ఈ అన్నింటికంటే జిలేబి పాకం బహు రంజుగా ఉండును... వేడిగా అనిపించే చల్లని కావ్యాలను ఇట్టే నమిలి చప్పరించి మింగేయొచ్చు....
      చీర్స్....
      :)
      జిలేబీయమంతా పద్మార్పితమేనా !?!?

      Delete
    5. విశ్వక్సేనుడు గారు కదళీ కంటక న్యాయం చెపుతున్నారు.

      అర్ధం తో వచ్చే రుచిని అర్ధపాకం అంటారు. అర్ధ పాకం లేకుండా సాగిపోయే కవిత్వాన్ని బబుల్‌గమ్ కవిత్వం అంటారు.

      “ఆ అవ్వే మరణిస్తే
      ఆ పాపం ఎవ్వరి” దని
      వెర్రిగాలి ప్రశ్నిస్తూ
      వెళిపోయింది!
      ఛందస్సు అంటే అంటే ఇలా తేలికగా అర్ధం అయ్యేలా ఉండాలి ! కవిత్వంలో వేము, వంకాయ, పోకచెక్క పాకాలని సర్వదా విసర్జించమని, రేగి, చింత, దోస పాకాలు కాస్త సంస్కరించి మెరుగు పరిస్తే ఆస్వాద యోగ్యాలవుతాయని, ద్రాక్ష, మామిడి, కొబ్బరి పాకాలని ఎల్లవేళలా ఆస్వాద యోగ్యాలేనని పండితుల ఉవాచ !

      Delete
    6. రాసెదెలానూ తెలుగులో ఐనప్పుడు.. భాషకూడా తెలుగు వాడొచ్చుకదా...

      Delete
  14. బద్మాష్గాళ్ళైనను పద్మాక్షరాలకు ఫిదా యవవలసిన దే పో !

    ReplyDelete
  15. చెదరనీయకు చిరునవ్వులు
    చిందేసి ఆడనీ నీ కవితలు
    పరవశింపజేయనీ నీ చిత్రాలు
    కైవసం అవ్వనీ ఆనంద ఆరోగ్యాలు..

    ReplyDelete
  16. అక్షరమాలకు పుట్టినరోజు శుభాకంక్షలు
    కవితల విరిబోణికి శుభ ఆశ్శిస్సులు..

    ReplyDelete
  17. మనసులని దగ్గర చేర్చే సాన్నిహిత్యం, తెలుగుభాష పై ఎనలేని ప్రావీణ్యం చూసాను నీ ప్రతీ పదంలోను. ఎవరి మనసునీ నొప్పించని మాధుర్యం నీ మాటల్లో/కమెంట్స్ లో ఉంది. ఇక రాతలు భావాల విషయానికి వస్తే ఏ పోస్ట్ కి అదే నిత్య నూతనం అనిపిస్తుంది. ఇలా పదికాలపాటు చల్లగా వర్ధిల్లు అర్పిత-హరినాధ్

    ReplyDelete
  18. తుపాకీ తూటాలు మీ అక్షరాలు.

    ReplyDelete
  19. అక్షర నీరాజన అభినందనలు....!!

    ReplyDelete
  20. సాధారణ అక్షరాలకు ప్రేమ రసాయనం పూస్తారు
    మీ పదాల నైపుణ్యం, అమరిక బాగున్నాయి. అందుకే మీకు ఇంత అభిమాన జనం!

    ReplyDelete

  21. విజయానికి చిరునామా మీ అక్షరాలు
    చెదిరిపోని భావాలకు ప్రతిరూపాలు
    జన్మదిన శుభాకాంక్షలు అందుకోండి.

    ReplyDelete
  22. మీ అక్షరాలు మనసుని దోచుకునే అస్త్రాలు

    ReplyDelete
  23. వేరీ నైస్ మీ అక్షరాలు.

    ReplyDelete
  24. గీ మరిసేటి మాయరోగమొచ్చి
    నీ పుట్టినదినం మరిసినా
    ఆలస్యంగా సెప్పినా అల్గమాకు
    మస్తుగ జేసుకో బర్తడేలు..

    ReplyDelete
  25. అలరించే అక్షరాలకు హద్దులు ఆనకట్టలు వేయనేల?
    భావాస్వేఛ్ఛ కొలనులో పద్మాలను విరబూయనియ్యి

    ReplyDelete
  26. మీ అక్షరాలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.

    ReplyDelete
  27. మీ అక్షరఆభరణాలు మాబోటి ఎందరికో ప్రేరణలు పద్మగారు
    నూతనభావాలు మరిన్ని వెదజల్లండి పరిమళాలను ఆస్వాధిస్తాము.

    ReplyDelete
  28. అక్షర ఆభరణాలు అతివిలువైనవి
    అనుభవాలకు అక్షర రూపాలు

    ReplyDelete
  29. Belated birthday greetings.

    ReplyDelete
  30. అక్షరాలని ఆలింగనం చేసుకుని మరీ రాస్తావు పద్మా అందుకే అవి నీ వశం.

    ReplyDelete
  31. మీరు రాసే అక్షరాలు అన్నీ బాగుంటాయి.

    ReplyDelete
  32. _/\_అందరికీ పద్మార్పిత నమస్సుమాంజలి_/\_

    ReplyDelete
  33. మీ అక్షరాలు నిజంగా అందమైన ఆభరణాలు.

    ReplyDelete
  34. Very attractive blog you have.

    ReplyDelete