మేకప్ వెలుగులు పడనిదే వెలగని
గాజుముక్కలే అలంకరించుకోని స్త్రీలు
పురుషులు చీకట్లో మెరిసే రత్నాలు..
అందంతో అమరి ఆకర్షించే రంగులవల
పురివిప్పి ఆడే మయూరం మగదాయె
ఆడనెమలి తెలుపు నలుపుల్లో వెలవెల
విలువైన దంతాలు కలిగింది మగ ఏనుగే
ఆడ ఏనుగుకు ఏవి అంతటి విలువలు..
లేడి వెదజల్లలేదు కస్తూరిని మగజింకలా
అందుకే ఆడది మగజింకని రమ్మనదాయె
నాగమణిని ధరించిన కోడెత్రాచులో గంభీరం
మణులున్నాయని వెంటపడిపోవుని నాగిని
సాదాసీదా ఆడపాముకు లేవీ చమక్కులు..
అందమంతా ఆడవారి సొంతమని మగగోల
ప్రకృతి చేసింది అన్యాయమని అరుపులాయె
సముద్రుడిలోనే దాగె ముత్యాలు రత్నాలు
వాటికొరకేగా నదులన్నీ కలిసేది సాగరంలో
నిడారంబర నదులకి లేకపోయె హొయలు..
విలువైన అంశాలన్నీ పురుషులకే చెందాలా
అడుగుదామంటే భగవంతుడూ మగవాడాయె
ఆశ్చర్యకరమిది తొమ్మిదినెలలు మోసి కన్నా
అంకురార్ప శౌర్యం అతనిదేనని ఊరేగింపులు
ప్రకృతే అలకరించి పంపిన పురుషపుంగవులు..
(ఆడవారి అందచందాలు తప్ప మగవారిని పొగడలేదు అభివర్ణించలేదంటూ అభియోగించిన వారికి పద్మ అర్పిస్తున్న చిరుకానుక ఆమోదయోగ్యమేనని అభిలషిస్తూ...మీ పద్మార్పిత)
మనసు అందం ముందు మరేది రాదు సాటి
ReplyDeleteఆ కోవలో బహుశ మాకు మేమే పోటి
నలుగురు చేరి ఒకచోట చేస్తాము పీచపాటి
ఓర్పులో ఒక్కోసారి మేమీ ఘనాపాటి
అపుడపుడు మా మాటలే నెగ్గాలని పంతం
ఐతే లేత మనసులు కూడా మాకు సొంతం
ఒక్కోసారి చిరాకులో మా మాటలకు ఉండదు అంతం
ఐతే నిబ్బరం ఆత్మ స్థైర్యం మనోబలం మా అందం
అమ్మ ఒడిలో సేదతీరే రామ కృష్ణ శ్రీనీవాసులం
అక్క చెల్లెళ్ళకు ప్రయాణాలలో ఎస్కార్ట్ ఇచ్చే అన్నాదమ్ములం
కన్నవారిని తోబుట్టువులను భార్యను పిల్లలను స్నేహగణాన్ని అభిమానించే వాళ్ళం
నవ్వును బాధను ఇలా నవరసాలను ఎలా తెలియ పరచాలో తెలియక తికమక పడే వాళ్ళం
మానవ జాతిలో ఒక ఆడవారి గణం ఒక మగవారి గణం
వారి వారి గుణాల సారణిలో ఎవరికి వారే అగ్రగణ్యం
ఆడవారికి మగవారు మగవారికి ఆడవారు ప్రేరణ
కనుక ఏ ఒక్కరికీ సన్నగిల్లకూడదు ఆదరణ
ఓం శ్రీ బురుజుపేట కనకమహాలక్ష్మి దేవి నమోஉస్తుతే
ఓం శ్రీ గోదా రంగనాథాయ నమః
మార్గశిర మాసములో శ్రీకనకమహాలక్ష్మీ దేవి పూజలతో పాటు.. డిశెంబర్ పదహారు నుండి ధనుర్మాసమారంభం సందర్భముగా.. ఏ ఒక్కరు ఇంకొకరికి తక్కువ కాదు.. ఆడవారి మంచితనం మగవారి హుందాతనం రెండూ వారి వారి మనసుకు సంకేత సంతకం అనే నమ్మకం నాది.
శ్రీ
మహాలక్ష్మీ నారాయణి వసుమతి
ఆచ్యుత రాఘవ దామోదర
శ్రీధర్ మరీ అంత ఫార్మల్ కమెంట్స్ పెట్టి కమిట్ అయిపోకండి...మన పాట్లు మనవే :)
Deleteసీ బా సీ.. పీ బా పీ.. అనంటే.. సీత బాధ సీతది.. పీత బాధ పీతది..
Deleteఎవరి సాధక బాధకాలు వారివి.. ఎవరూ గొప్ప కాదు అలా అని ఎవరూ తక్కువ కాదు.. అందరు సరిసమానమే.. ఆ విషయం నాకు అవగతమే మహి గారు..!
పూర్తిగా ఫిదా అయిపోయినాము మీకు...హా హ!
ReplyDeleteఅందంగా ఐస్ చేశారు.
ReplyDeleteసొగసు చూడ తరమా అన్నట్లుంది మీ ఆలోచనల్లో మగవారి అందాన్ని పొగిడిన తీరు అబ్బో
ReplyDeleteజంతువుల వరకూ వాటి ప్రత్యేకత సరేనండి
ReplyDeleteమనుషుల్లో మాత్రం ఎంతవారు కానియండీ కాంత దాసులే
Super
ReplyDeleteఆమోదించి ఆనందంతో గెతులు వేస్తాం
ReplyDeleteఇన్నాళ్ళకి మగవాడి అందాన్ని పొగిడితే
చదివి సంతసించే భాగ్యం కలిగెనాయె!!!
విభిన్నం మీ ఆలోచనా సరళి.
ReplyDeleteఅందాలు సొంతమై ఏం లాభం ఏ అలంకారాలు లేకపోయినా ఆడవాళ్ళకి అణిగిమణిగి ఉండక తప్పని బ్రతుకులాయె మగజాతి ప్రాణులు. అది పుల్లి అయినా పిల్లి అయినా సరే తప్పదు.
ReplyDeleteపొగడకపోయినా బుట్టలో పడిపోతాం అదే మా వీక్ పాయింట్. :) :) :) :) :)
నమ్మక తప్పని నిజం.
ReplyDelete
ReplyDeleteకవులకు కల్పనలు అందం అంటారు...
కాని మీరు రాసినవి నిజాలు...
అందుకేనేమో మరింత అందముగా ఉన్నాయి...
ధన్యులము పురుషజాతి పుంగవులము...
Yes 100% right.
ReplyDeleteనడిరేయి ఎంత నల్లదైన
ReplyDeleteఒక్క దివిటి ముందు నిలుచునా?
దివిటీలు ఎన్ని వెలుగుతున్నా
సూర్యకాంతి ముందు ఆగునా?
సూర్యుడు ఎంత ప్రకాశించినా
చంద్రుడి అందం ముందు కొరవేగా?
చంద్రుడు ఎంత అందంగా ఉన్నా
ఆడవారి సోయగాల ముందు చులకనా?
ఆడవారి సోయగాలు చూసి పడినా
పురుషుడు ఎప్పుడూ పైచేయేగా?
This comment has been removed by the author.
ReplyDeletegood one madam
ReplyDeleteమగవారి అందాన్ని పొగిడి వారి జన్మకు సార్థకత ఇచ్చింది మీ కవిత...అహ అహా
ReplyDeleteవిలువైన అంశాలన్నీ పురుషులకే చెందాలా
ReplyDeleteఅడుగుదామంటే భగవంతుడూ మగవాడాయె
అడగడానికి ఏమి మిగలలేదు
అన్నీ మీరు వ్రాసేసారు
కిమ్మనకుండా పడి ఉంటారు పురుషపుంగవులు మీరు వ్రాసింది చదివి ఫిదా అంతే. :)
ReplyDeleteఎంత అందగాడైనా ఏం లాభం?
ReplyDeleteఆలోచించి చించి పడతాం...
పడి లేచి పరిగెత్తే లోపల పుణ్యకాలం ఖతం
మగవాడికి తప్పవు అగచాట్లు అర్పితగారు
మగాళ్ళకు కూడా ఓ అందం ఉంటుందని ప్రకృతి ఒడిలో అందరూ అందమైన రూపాలే అంటూ వెలిబుచ్చిన మీ అభిప్రాయానికి మగాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారో మేడం!
ReplyDeleteఅద్భుతం మీ వెన్నలాంటి మనసు !! సలాం.....
(ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు _/\_)
- పద్మార్పిత ఫ్యాన్స్
పొగుడుతూ తిట్టుకున్నట్లు ఉన్నారు మమ్మల్ని
ReplyDeleteప్రసంశలు
ReplyDeleteపొగడ్తల
పదగుళికలతో
పరవశింపజేసావు
పద్మార్పితా
మనసు అందం చూస్తే ఆడవాళ్ళ కన్నా మగవారే ఎక్కువ అందగాళ్ళు పద్మ.
ReplyDeleteఅందగాళ్ళు హ్యాపీ
ReplyDeleteఅతివల సౌందర్యమే రసమయ కవితాజరికి ఆలంబన అనుకున్నాను ఇన్నాళ్ళు...
ReplyDeleteఆరాధకుల ఆహార్యానికి కూడా సాహిత్య సొగసులు ఇంతబాగా అద్దవచ్చునని నిరూపించాయి మీ వేళ్ళు..!
అందరి ఆమోదనలతో మనసు ఉల్లాసమైంది..ధన్యవాదాలు అందరికీ _/\_
ReplyDeleteవాదోపవాదాలకు తావు లేకుండా అక్షరరూపం ఇచ్చుకుంటే గొడవలు ఉండవిని నా అభిప్రాయము.
ReplyDeleteపడిపోయా నేనైతే ...
ReplyDeleteమగవారి గుండెల్లోకి డైరెక్ట్ ప్రేమ తూటా పేల్చారు.
ReplyDeleteమాకూ ఫాన్స్ ఉన్నారు పొగుడుతుంటారని తెలిసింది
ReplyDeletebhale chepparu
ReplyDeleteఫిదా!
ReplyDeleteWow great lyrics
ReplyDelete