మరికొందరు మౌనం వహించినా..
ఎవర్లో మార్పొచ్చి ఒరిగింది ఏమిటి?
తమలో తాము ఏడ్చి నవ్వించినా
పైకి నవ్వుతూ లోలోన ఏడ్చినా..
వారు ఉన్నా లేకున్నా తేడా ఏమిటి?
జోలపాడి కలల ఊహలు ఊగించినా
దరిచేర్చుకుని దూరంగా నెట్టేసినా..
నిదుర మేల్కున్నోళ్ళు చేసింది ఏమిటి?
కోరిన కోరికలు తీర్చి దివాళా తీసినా
వాస్తవాలను కలలుగా చూపించినా..
వచ్చి వాటేసుకున్న ఆస్తులు ఏమిటి?
పగలురేయి వచ్చిపోతూ కాలం గడిచినా
నేడుని రేపటి ఊహలతో బ్రతికించినా..
సమయానికి వచ్చిన సమస్య ఏమిటి?
నా ఆలోచన్లు అర్థంలేని ప్రశ్నలే అయినా
వచ్చేదేమిటి ఒరిగేదేమిటని అడిగినా..
జరిగేవన్నీ జరుగక ఆగిపోవునా ఏమిటి?
ఏమిటని వర్ణించేది వర్ణాలకే అందని వర్ణన
ReplyDeleteగొంతు చించుకున్న వేళ గాత్రమే ఎండేన
చివరాఖరికి మిగిలింది వడబోసిన వేదన
తిమిరమున వెతలకు నయనాలు చెమ్మగిల్లిన వేతన
పైకి నవ్వుతు లోన కుమిలిపోతు చెప్పుకోలేని యాతన
చివరాఖరికి కనులు సోలి లోలోపల గుండె ఆక్రందన
లాలి లాలి యంటు తడుతు ఒడిలో సేదతీర్చేన
రెప్పల అలికిడులకు కాటుక కన్నులు అలసి సొలిసేన
నిదురే మరచి తాను నిద్రిస్తే చాలనుకున్న లోనేదో ఆవేదన
దరికి రారమ్మని కోరిన వేళ చీర సారెలతో చేస్తే నివేదన
పలకరించి అబ్బుర పరచి కలను నిజమని ఋజువుగ సాంత్వన
ఆభాసు పాలు కానిక మనసులో ఏదో తెలియని రణగొణ
పగలు రేయని వ్యత్యాసమే లేకుండ కాలం గడిచిన
పగటి పూట ఎండ గాయం చేసేనని రేయి జాబిలిపై చులకన
రేయి పగలు రెండు ఉంటేనే కదా రోజుకి రోజుకి పొంతన
ఆలోచనల ఝరిలో పదాల డోలన
పదాల లోగిలిలో భావాల మేళన
కవితయే ఇది మరి కాదు కారాదు హేళన
కవిత లో మీరు ఏమిటని ప్రశ్నలకు కవితతోనే వ్యాఖ్య ప్రయత్నం. ప్రతి పంక్తి చివరలో న తో ముగింపు ఇద్దామని చిరు ప్రయత్నం. మీ కవితాపదఝరిలో భావాలన్ని తొణకిసలాడుతు ఉంఠే..అక్షరాలుగా పలకలేక భావాలన్ని కవితగా కనుల ముందు కదలాడేనేమో.. ఇది పొగడ్త కాదు వాస్తవికత. అక్షరాలలోన దాగిన నిరీక్షణ భావం మీరు పెట్టిన ఇమేజ్ కి సరితూగింది పద్మ గారు.
లెన్త్ ఎక్కువైంది.. ట్రంకేటింగ్ దిస్ హియర్ అబ్రప్ట్-లి
శ్రీనివాస విజయతే
ప్రశ్నలు జవాబులు మీరే చెప్పితిరి
ReplyDeleteచిత్రం చూస్తూ అవాక్కు అయితిని
మీరు అన్నింటా సిద్దహస్తులని తెలిసె.
అందాల అతివ వేదాంతము పలికినా
ReplyDeleteరస హృదయాలకు వినిపించునా
వేదన వెల్లువై మది చీల్చుకొస్తున్నా,మోములో ఆ ప్రశాంతత ఏమిటి?
ఇన్ని ప్రశ్నలు ఒకేసారి కురిపించారు. మెదడు వాచిపోయింది.
ReplyDeleteచాలా తెలివి
ReplyDeleteఏమిటీ ఏమిటీ?
ప్రశ్నించారు ఓకే
నో ఆన్సర్ మాడంజీ
జీవితం ఏమిటి అని ప్రశ్నించుకుంటే జవాబు ఉండదు.అందరూ అన్ని సవ్యంగా సాగాలని అనుకుంటారు కానీ సాగదు. ఎందుకు ఏమిటని ప్రశ్నించక సాగిపోతే సరి సమయతో పాటు అన్నీ అవే సర్దుకుంటాయి.
ReplyDeleteనూతన పంధాలో కవిత వ్రాసి ఆలోచింపజేసారు.
Beautiful Painting
ReplyDeleteThoughtful lines
అన్ని ప్రశ్నలకూ జరిగేది జరుక మానదని చివరి లైన్లో జవాబు ఇచ్చరు బాగుంది.
ReplyDeleteవాస్తవాలు కలలుగా చూపించడం అనగా ఊహల్లో విహరించడం అంటారా? కాలానికి అతీతం ఏదీ జరుగదు అనుకుంటా మిగిలినవి అంతా మన భ్రాంతి.
ReplyDeleteపరేషాన్ చేసే ప్రశ్నలు.
ReplyDeleteబుల్లెట్స్ లేవు పిస్టోల్ ఖాళీ.
ఎక్కడ, ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎంతగా ఆకర్షించబడునో ఎందుకు చూరం అవునో చెప్పడం కష్టం సుమా....
ReplyDeleteఎందుకు? ఏమిటి? ఎలా? ఎక్కడ? ఎప్పుడు? ఇలా ప్రశ్నలు నీలో ఉద్బవించాయి అంటే జరుగుతున్న విషయాలను అన్నిటినీ గమనిస్తూ విచక్షణతో ఆలోచిస్తున్నావు.
ReplyDeleteఆ ఆలోచన వల్లే ప్రతీది ప్రశ్నించుకుంటూ వాటి సమాధానం కోసం పరిశోధించడం, దాని వల్ల కొత్త విషయాలు తెలుసుకోవడమో చేస్తున్నావు. అందుకే ఇంత అభివృధ్ధి సాధించి అద్భుతంగా వ్రాస్తున్నావు. ప్రశ్నించుకో వాటికి జవాబులు సొంతగా అన్వేషించుకో అర్పితా,ఆశిస్సులు-హరినాధ్.
మంచి ప్రశ్నలు అడిగి ఆలోచింపజేసారు
ReplyDeleteపెయింటింగ్ పిక్ నాచురల్
తమలో తాము ఏడ్చి నవ్వించినా
ReplyDeleteపైకి నవ్వుతూ లోలోన ఏడ్చినా..enta correct
Beautiful
ReplyDeleteవాస్తవాలను కలలుగా చూపించడం సాధ్యమా?
ReplyDelete' ఏమిటి? ఏమిటి? ఏమిటి? '
ReplyDeleteసామాజిక స్పృహలు లేక సామాన్యులుగా
పోమారే బ్రతుకు బతుకు
సోమరులను ప్రశ్న లడుగుచో ఫలమేమీ ?
ఇలాంటివి ఎన్ని వ్రాసి చదివి ప్రయోజనం ఏమిటి?
ReplyDeleteగొంతు చించుకు అరిచినా మౌనం వహించినా ఒరిగేది ఏమీలేదు....కొందరి జీవితాలు అంతే.
ReplyDeleteజరిగేవన్నీ జరుగక ఆగిపోవునా ఏమిటి?
ReplyDelete???????????????????????????
బాగున్నాయి భావాలోచన తరంగాలు.
ReplyDeleteNice picture
నా ఆలోచన్లు అర్థంలేని ప్రశ్నలే...silly
ReplyDeleteఅందరి స్పందనలకు నా కృతజ్ఞతలు.
ReplyDeleteకాలం
ReplyDeleteవయసు
జీవితం
ఏదీ ఆగదు..
మీరు ఖడ్గం కలం కమలం కుంచె వీణ ధనం చేతిలో పట్టుకుని కూర్చున్న సరస్వతీదేవి అండీ
ReplyDelete