ఆమె-ఆధునిక క్లియోపాత్ర

అవయవ అందాలు చూసారు అందరూ 
అంతరంగమదనం కాంచలేదు ఎవ్వరూ
అంగాంగం ప్రదర్శించెనని నిందలు వేసి
ఆయుధంగా శృంగారం సంధించెనన్నారు!

అందం చూసి నిగ్రహం కోల్పోయినవారు
అంతరంగ సిం హాసనం పై కూర్చోబెట్టారు
అనుయాయులకు ఇది అర్థంకాక గేలిచేసి
అనైతికం ఆమె భావాలోచనలు అన్నారు!
     
ఆధ్యాత్మికత జీవిత అవసరం అన్నవారూ
అంతర్గతంగా రాజీపడి ఆనకట్టలేసినవారూ         
అబల సంధించిన సమ్మోహన అస్త్రం అని 
అదే కామకళా వైదుష్యంలో మూర్చిల్లారు!

అందని అందం వికృతమని సర్దుకున్నవారు   
అధికమించి కొంతైనా అర్థం చేసుకున్నవారు
అవసరమైన ఊరడింపుతో అభయమే ఇచ్చి
అంతిమంగా కాలసర్పకాటు పడేలా చేసారు!

111 comments:

 1. Replies
  1. _/\_ No Sir..these are my thoughts and views on Cleopatra queen of Egypt.
   (Radhe Maa is a controversial Indian spiritual leader sometimes compared to be a cultist leader no comments regarding her)

   Delete
  2. Thanks, then I really appreciate your poem!I too regard her as great personality tarnished by male chauvinist historians.The clues left as the thin trails were the evidence to show how clever she is in protecting her kingdom.

   SHE FOLLOWED CHANAKYN RAJNITHI!

   Delete
  3. thanks a lot for you words.

   Delete
 2. అద్భుతంగా వ్రాసారు
  ఒక అందాలరాసి అంతరంగం చూడకనే
  ఆమె అందాలను పరివిధాల అభివర్ణించి గాయపరిచే వారిపై
  అర్పిత అస్త్రం సంధించేనేమో...

  ReplyDelete
  Replies
  1. అస్త్రమూ సంధించడము కాదులెండి...అభిప్రాయాలు పంచుకోవడం అనుకుంటే హాయి కదా ;)

   Delete
 3. స్త్రీ అంతరంగం తెలుసుకోవడం అనితరసాద్యం...అందునా అందమైన ఆమె గురించి తెలుసుకోవడం దుస్సాహసం...ఏదేమైనా అద్భుత అభివర్ణన పద్మ.

  ReplyDelete
  Replies
  1. మరీ ఇలా భయపడి పయపెడితే ఎలా మహీ...

   Delete
 4. అంతరంగం అందము ముందు అప్సరస అయినా దిగదుడుపే. ఆమె మనోభావాలు అందంగా ఉన్నాయి అంటే ఆమె అందాలరాసి అవుతుంది, కుచిత స్వభావం ఉండి కౄరత్వం ఉంటే అందం ఉండి కూడా కురూపిణిగా కనిపిస్తుంది.
  .....
  .....
  పద్మార్పితగారు మీ ప్రతీ కవితా ఆలోచించే విధంగా ఉండి మనసుని అలరిస్తాయి.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పే మనసు అందము పైకి కనబడదు...మనుషులకి చూడగానే కనపడేది కావలసింది కనిపించే అందమే కదండీ :)

   Delete
 5. నో డౌట్ అర్పిత
  క్లియోపాత్ర అద్భుత సౌందర్యరాసే కాదు అపూర్వ మేధస్సు కలది

  ReplyDelete
  Replies
  1. అవునేమో...అవే ఆమె ఆయుధం అరిష్టం కూడా అయ్యుంటాయి.

   Delete
  2. ఒప్పుకున్నావు ఒద్దికతో.

   Delete
 6. అందని అందం వికృతం
  అందని పళ్ళు పుల్లన-

  ReplyDelete
  Replies
  1. కొత్త కొటేషన్..

   Delete
 7. మీరు ఆధునిక అక్షర పాత్ర! నేను వొక వంట పాత్ర! :)

  ReplyDelete
  Replies  1. అందుకోండి మధు పాత్ర :)


   జిలేబి

   Delete
  2. విష్వక్సేనుడుగారూ..నేను జ్ఞానాన్ని వెతుక్కుంటూ అడుక్కుంటూ తిరుగుతున్నా చేతపట్టి "బిక్షపాత్ర"

   Delete
 8. Cleopatra was on a political mission to save her country and her power, but what we remember about her are these two famed seductions, which are a matter of politics not a matter of love padmaji.
  Your poem reflects her as lovely lady.

  ReplyDelete
  Replies
  1. Just I expressed my views..thank you

   Delete
  2. where are those lovely husky poems...waiting :)

   Delete
 9. ఈజిప్ట్కు చెందిన రాణి క్లియోపాత్రా రోమ్సామ్రాజ్య లక్ష్యాలను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్నప్పుడు విజయం మరియు విషాదం రెండింటినీ అనుభవించింది. అలా అనేక కాంక్షలతో బ్రతికే స్త్రీలు అయినా పురుషులు అయినా విషాదం విజయం చవిచూడక తప్పదని చరిత్ర చెబుతుంది పద్మా.

  ReplyDelete
  Replies
  1. చరిత్ర చదివి నేర్చుకున్న పాఠాలు నిత్య జీవితంలో ఎంతో ఉపయుక్తం గురువుగారు..మీరే అప్పుడెప్పుడో చెప్పారు. గుర్తుందిగా :)

   Delete
  2. తిరిగి అప్పజెప్పేసావు=పెంకి పిల్లవి

   Delete
  3. గురూజీ...;)

   Delete
 10. అందం చూసి నిగ్రహం కోల్పోనివారు ఉంటారా?

  ReplyDelete
  Replies
  1. కాదు అనుకుంటే ఏదీ చేయలేము...తలచుకుంటే నిష్టానిగ్రహాలతో ఎన్నో సాధించవచ్చుగా :)

   Delete
 11. క్లియోపాత్రా గురించి అనేకమైన నమ్మశక్యము గాని కథలు ఉన్నాయి.
  క్లియోపాత్రా ఆకర్షణ మరియు అందానికి అవధుల్లేని స్త్రీగా అభివర్ణించవచ్చు అంటారు
  ఆమె ఆకర్షణీయమైన కంఠ స్వరము కలిగి ఉండేది మరియు ఇతరులను ఎలా ఒప్పించాలో తెలుసునని అలా ఎందరినో తన అందంతో కట్టిపడేసింది అంటారు. చూపులకు తెలివిగా కనపడే ప్రతి వ్యక్తిని ప్రేమతో లోబరచుకునేది అంటారు. అలాగే సింహాసనమును చేజిక్కించుకోవటానికి తన అందాన్ని పణంగా పెట్టిందని అదే కాలకూట విషమై ప్రాణాలు హరించింది అనేది నిర్విదాంశము.
  అమె అందంతో మహారాజుల్ని రాజ్యాన్ని చేజిక్కించుకున్నది అనేది అలనాటి చరిత్ర.
  మీరు అక్షరాలతో మా మనసు దోచుకుంటున్నారు అనేది ప్రస్తుత చర్చ...కాదంటారా

  ReplyDelete
  Replies
  1. రాజ్యం ఏలి రాణిలా వెలగాలన్న ఆశ దురాశ దుఃఖానికి కారణం అని తెలిసింది..మీ అభిమానానికి ధన్యవాదాలండి.

   Delete
 12. క్లియోపాత్ర కథ ప్రాచిన ఈజిప్ట్ లోగల టొలేమి వంశస్థులది
  రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఏ ఒక్క రాయిని వదలలేదని చరిత్ర చెబుతోంది. ఐతే క్లియోపాత్ర వీరత్వాన్ని సహించనివారు ఆమెపై దుష్ప్రచారం కావించారని ప్రతితి.

  ~శ్రీ
  కదిలే కాలం ఘడియల వేలం

  Sometimes the scar of pain has a long lasting effect than a dimple of the smile. It all depends on how one judges the situation and also on how one copes up in adverse conditions even when they know that every moment is transitory.

  ReplyDelete
  Replies
  1. కార్తీక పౌర్ణమి శుభాభినందనలు మీకు పద్మ గారు

   Delete
  2. Yes...what you said is absolutely correct. I too agree with you Sridhar garu.

   Delete 13. విందారగించ వచ్చిరి
  బృందావన తలిరుబోడి ఋతురాగములన్,
  అందించవమ్మ, మధుపా
  త్రం దించుము పద్మ! నీ పెదవులన్ రమణీ !

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. కార్తీక మాసమంటూ
   శివపూజ ధీక్షాఉపవాసాలంటూ
   నియమ నిష్టలున్న వారికి
   విందు వినోద మధుపాత్రలేల!!?

   :) :)

   Delete
 14. కార్తిక మాసం
  క్లియోపాత్ర కవిత్వం
  :) :) :)

  ReplyDelete
  Replies
  1. మనకి అవసరమా చెప్పండి..:)

   Delete
 15. భారతీయ స్త్రీలు లేరా పాశ్చాత్య స్త్రీలను ప్రస్తావిస్తున్నారు?

  ReplyDelete
  Replies
  1. ఫారెన్ ట్రిప్పు...అప్పుడప్పుడూ ఫర్ చెయింజ్ :)

   Delete
 16. ఆడవారికి ట్యాలెంటుతో పాటు అందం ఒక ఎసెట్. ప్రతిరంగంలో పనికొస్తుందనడం ఎవరూ కాదనలేని సత్యం.
  మగాడు కష్టపడి ఎంట్రీ సంపాదించే చోట, అందమైన ఆడది ఒక నవ్వుతో జాక్ పాట్ కొట్టేయ్యగలదు ఇది సత్యం, అంతే కాదు ఖచ్చితంగా మగవాడి వీక్నెస్ కి సంబంధించిన సమస్యే అయినా, ఆ వీక్నెస్ ని ఉపయోగించుకోగలిగిన ఆడదాని గొప్పతనాన్ని కూడా గుర్తించకతప్పదు.
  ఈ విషయంలో “మగాడికి మగాడు శత్రువే” కాదంటారా?

  ReplyDelete
  Replies
  1. ఆడైనా మగైనా పని జరిపించుకోవడానికి కావల్సింది లౌక్యం. అది స్త్రీలు చాకచక్యంగా చేస్తారు దాన్ని మీరు టాలెంట్ అని జాగ్ పాట్ అని అంటే ఎలా చెప్పండి...స్త్రీల గారాలకి చెష్టలకో లొంగి వంగి పని చేసేస్తున్నాము అనంటే అది మగ వాళ్ళ ప్రాబ్లెం అండ్ వీక్ నెస్..కాదంటారా? :)

   Delete
  2. “మగాడికి మగాడు శత్రువే” అల్లుడూ ఆలోచనల్లో ఎదిగిపోతున్నావు అనిపిస్తుంది కాదంటావా?

   Delete
 17. చరిత్ర వక్రీకరించిన క్లియోపాత్ర వ్యక్తిత్వాన్ని తిరగదోడే నవ కవిత ఇది... ఆమె అంతరంగ మూలాల్లో దాగిన భావాలకు అక్షరరూపమిస్తూ ఇలా అందర్నీ మేస్మరైస్ చేయడం మీకు కవిత్వంతో పెట్టిన విద్య! అద్భుతం! సలాం...మేడం....!!

  ReplyDelete
  Replies
  1. శృంగారమే ఆమె ఆయుధం
   ఆమె శరీరం ఎరవేసే కామపిశాచి
   శృంగార పాండిత్య ప్రావీణ్యురాలు...చివరికి పాముతో కాటు వేయించుకుని ప్రాణం తీసుకుని సాధించింది ఏమిటి అనిపించి క్లియోపాత్ర గురించి చదివితే..వాటికి ఏదో నా భావాలు జోడించి ఇలా మీ అందరితో పంచుకున్నాను. ధన్యవాదాలండీ.

   Delete
 18. http://padmarpitafans.blogspot.in/2017/11/blog-post.html

  పద్మార్పిత ఒక విలువైన వజ్రం! - పి. జనార్ధన్

  ReplyDelete
  Replies
  1. జనార్ధన్ గారు..ఎప్పుడో మాటవరుసకి వజ్రాల గురించి అడిగితే..అది ఇలా రూపాంతరం చెందించారు. మీ అమూల్యమైన అభిమాన అక్షరాలకు నా నెనర్లు_/\_

   Delete
 19. క్లియోపాత్ర ఏమో కాని మీరు ఖచ్చితంగా అక్షరపాత్ర.

  ReplyDelete
  Replies
  1. అంటే అక్షరాలు వెతుక్కుంటూ తిరుగుతానా:)

   Delete
 20. ' కాలసర్ప 'మనగ = కాల మనెడు పాము ,
  నల్ల త్రాచనంగ నరయ రెండు ,
  నల్లత్రాచు కాటు నధిగమించగ వచ్చు ,
  కాటు కాల మేయ దాట తరమ ?

  ReplyDelete
  Replies
  1. కాలము ఘడియల కాటు వేసిన జ్ఞాపకాలుగా చివరి దాక మిగిలేను కదా.. అనినా దాటినట్లే కదా రాజారావు సర్..

   Delete
  2. వెంకట రాజారావుగారు...నిజమే మీరు చెప్పినట్లు కాలసర్పపు కాటును అధికమించవచ్చునేమో కానీ కాలం వేసిన కాటును అధికమించడం కష్టమే కాదు అసాధ్యం అనుకుంటాను.

   Delete
 21. అందం కాలక్రమేణా తగ్గినా చేసిన పనులు చిరకాలం గుర్తుండి పోతాయి.

  ReplyDelete
  Replies
  1. మంచి పనులు అయితే పొగుడుతారు చెడ్డవి అయితే తిట్టుకుంటారు.

   Delete
 22. ఈ కవిత పదునైన శక్తితో అభివ్యక్తమైంది.మరణానంతరమూ మనుషుల్లో జీవించడం మనిషి జన్మకు నిజమైన సార్థకత అది సవ్యమైన రీతిలో శోభాయమానం లేదంటే ఎవరికి తోచింది వారు అనుకుంటారు. అటువంటి గాధే "క్లియోపాత్ర"ది కూడ, ఆమె అందాన్ని పొగిడిన వారికి మించి విమర్శించి చెడుగా ప్రచారం చేసినావారే ఎక్కువ.

  ReplyDelete
  Replies
  1. సుబ్బారావుగారు..మీరు చెప్పింది కరెక్ట్.

   Delete
 23. ఆందం..అమృతం.హాలాహలం..
  ఫ్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన రాజకీయ చదరంగం
  పద్మార్పిత విరచిత ఆధునిక సాక్ష్యం

  ReplyDelete
  Replies
  1. నన్నే సాక్షిని చేసారు...ఇరికించలేదు కదా :)

   Delete
 24. అంతరంగమదనం కాంచలేదు ఎవ్వరూ... బాహ్యాన్ని చూసి పడటం ..పడెయ్యటం తప్పా అంతరంగం చదువేంత సీన్ ఏ ఒక్కరికీ లేదనట్టు అద్భుతంగా చెప్పారు .. ఇలా శరాలు సంధించటం మీకు పాలతో పెట్టిన విద్య ...

  ReplyDelete
  Replies
  1. పాలు విరగడానికి ఒక్క ఉప్పుకళిక చాలుకదండీ...అలాగే అప్పుడప్పుడూ ఏదో శరాలు సంధించి తంటాలు కొనితెచ్చుకుంటానుగా :)

   Delete
 25. Historical Character in new view.
  chala baga cover chesaru..hats off

  ReplyDelete
 26. టోలెమిక్‌ రాజవంశంలో చివరిగా ఈజిప్టును పరిపాలించిన రాణి క్లియోపాత్ర. అందగత్తె అయిన ఆమె అంతర్యుద్ధంతో రగిలిపోతున్న రాజ్యంలో శాంతిని నింపి చరిత్రలో నిలిచిపోయింది. ఆమెను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన ఆధునిక క్లియోపాత్ర ప్రసంశనీయం.

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ నయనిగారు.

   Delete
 27. మీరు ఇలా వ్రాయడంలో సిద్ధహస్తులు.

  ReplyDelete
  Replies
  1. ఈ మధ్య అంతర్ధానమైనారు..ఎలా ఉన్నారు.

   Delete
 28. అందమే ఆమె ఆయుధం అయితే
  అక్షరం మీ ఆయుధం సుమా :)

  ReplyDelete
  Replies
  1. అల్పజీవి అర్పిత...ఆయుధాలు ఏల?

   Delete
 29. అన్నీ పంక్తులు "అ" అక్షరంతో మొదలుపెట్టారు బాగుంది.అంతంలో సరైన క్లారిఫికేషన్ నీదైన శైలిలో ఇవ్వలేదు ఎందుకో?

  ReplyDelete
  Replies
  1. భలే కనిపెట్టేసారు...ఆది ప్రాసల ప్రయోగం చేసాను.

   Delete
 30. గమనించనే లేదు సుమీ..
  మీ పరిశీలనా పటిమకు అభినందనలు

  ReplyDelete
 31. అదుర్స్
  అర్పితా
  అక్షరాలు
  అన్నీ
  అద్భుతం
  అభినందనలు
  అందుకో

  ReplyDelete
  Replies
  1. వావ్..బాగుంది ప్రశంస.

   Delete
 32. క్లియోపాత్ర గురించి ఎవరికీ పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు. ఆమె పేరు తల్చుకుంటే 'గొప్ప అందగత్తె" అని మాత్రమే అనుకుంటారు. కానీ క్లియోపాత్ర అందగత్తె మాత్రమే కాదు... ఎంత మంచి తల్లో, మంచి నాయకురాలో అర్థం అవుతుంది ఆమె జీవిత చరిత్ర చదువుతుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడగల ప్రతిభాశాలి ఆమె. నా దృష్టిలో క్లియోపాత్ర అత్యంత శక్తివంతురాలు. క్లియోపాత్ర ప్రమాదవశాత్తు పాముకాటుతో మరణించినట్లు ఎన్నో ఏండ్లుగా కొనసాగుతున్న వాదనను బ్రిటన్‌కు చెందిన సర్పశాస్త్ర నిపుణులు కొందరు ఖండించి ఒప్పుకోరు,ఆమె ప్రమాదవశత్తూ మరణించలేదని.. ఆత్మహత్య చేసుకుని ఉంటుంద్నటారు. కాలనాగు, రక్త పింజర్ల లాంటి విష సర్పాలు ఈజిప్టులో గానీ, రాణివాసంలో కనిపించినట్లు దాఖలాలు లేవని పేర్కొని, గ్రామీణ ప్రాంతాల నుంచి ఓ బుట్టలో రహస్యంగా పామును తీసుకొచ్చి క్లియోపాత్ర మరణానికి ఉపయోగించుకొని ఉండవచ్చు. అలాగే ఆమెకు సంబంధించిన ఇద్దరు సేవకులను చంపడానికి కూడా ఆ పామును ఉపయోగించుకొని ఉండి ఉంటారు అనే అభిప్రాయాన్ని కొందరిలో. ఏది ఏమైనా ఆమె ఒక పవర్‌ఫుల్ లేడీ-హరినాధ్

  ReplyDelete
  Replies
  1. చరిత్రపుటలు క్షుణ్ణంగా తిరవేసిన మీరు...చెప్పినవి అక్షరసత్యాలు.
   మీకు వందనములు.

   Delete
 33. అధ్యాత్మికత is a meaningless word - me thinks!
  ఆధ్యాత్మికత is correct - in my opinion.

  ReplyDelete
  Replies
  1. ఆద్యాత్మికం is a word coined from ఆద్యాత్మ a conjunction of ఆది and ఆత్మ.. the first soul.. or literally and or contextually belongs to the knowledge regarding the first soul alias పరమాత్మ. ఆద్యులు has another meaning which means respected person: as far as I know, Hari Sir..

   Delete
  2. హరిబాబుగారు...మీరు చెప్పించి కరెక్ట్
   ఆదిప్రాస ధ్యాసలో పడి దీర్ఘం మరచి టైపు చేసాను.
   సరిచేసానుగా...మన్నించండి.

   Delete
 34. అందం చూసి నిగ్రహం కోల్పోయినవారు
  అంతరంగ సింహాసనం పై కూర్చోబెట్టారు
  ఇలా అందానికి దాసోహమై స్త్రీ యే కారణం యుద్ధాలకు ప్రళయానికి అనడం ఎంత వరకూ కరెక్టో నాకు అర్థం కాదు :)

  ReplyDelete
  Replies
  1. ష్...కదా గట్టిగా అనకండి...మనమే కారణం అంటారు.:)

   Delete
 35. తాను మరల వచ్చింది
  వసంతాన్ని వెంటబెట్టుకుని..
  కాని శీతాకాలమాయే ఇపుడు

  తాను మరల వచ్చింది
  అక్షరాలన్ని వెంటబెట్టుకుని..
  కాని భావాలే మారిపోయే ఇపుడు

  తాను మరల వచ్చింది
  నవ్వులని వెంటబెట్టుకుని..
  కాని జ్ఞాపకాలన్ని గాయాలాయే ఇపుడు

  తాను మరల వచ్చింది
  స్నేహాన్ని వెంటబెట్టుకుని..
  కాని మౌనమే సమాధానమాయే ఇపుడు

  ఓన దేకతో బోలావుణు కేన్ లాగ
  పణన్ బోలావతో హాటో బోలేని కేన్ మాలమ్ మన
  జేతీజ్ ఏక్వడి హుఁస్యారి ఛ ఏక్వడి హాయావరీచ

  ఓన దేకతో పేనాని రేణు కేన్ లాగ
  పణన్ తీన్ వణ పర జో కేమేలిచ మన
  జేతీజ్ రకేన్ కేర్వేని జోకేన్ కేర్వేని గచ్చబ్ రేర్వేని

  ఓన దేకతో మన నాన్కీస్ ఛ్వారి దికావచ అబ్బి
  పణన్ మ కతో అత్రీ రీస్ కచ ఊ భులాడి పడేని మన
  సాడాతీన్ వర్స్ వేచాలే మననోన హర్దేమా ఫరుకరచ నూజ్

  ReplyDelete
  Replies
  1. చిన్ననాటి జ్ఞాపకాలను యేడాదికి ఒకసారైన తలుచుకునే బాలల దినోత్సవ సందర్భం

   Delete
  2. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు...ఒకటేనండోయ్ :)

   Delete
 36. హవ్వారే హవ్వా హైలేసో
  సో సో..........
  దానియవ్వారమంతా హైలేసో

  ReplyDelete
  Replies
  1. యవ్వారం ఎప్పుడూ హై నే :)

   Delete
 37. అందానికి ఆకర్షించబడని వారు ఇలలోనే కాదు ఇంద్రలోకంలో కూడా అరుదు.
  అది అతిక్రమించని అంతవరకూ ఓకే ఒకే...హ హ హా

  ReplyDelete
  Replies
  1. హద్దులు మీరనంత వరకూ ఓకె ఓకె..

   Delete
 38. స్త్రీ ఎప్పుడు అందమైన వస్తువుగానే చుస్తారు

  ReplyDelete
  Replies
  1. ఆమెలోని ఆదిశక్తిని అధములు చూడలేరు.

   Delete

 39. "అనైతికం ఆమె భావాలోచనలు అన్నారు"
  ఉలిదెబ్బ తగలనిదే రాయి శిల్పము కాదు.
  ప్రతి వైఫల్యం ఓ ఉలిదెబ్బ వేదనలన్నీ రాతితో సుదీర్ఘ రాపిడులే
  నొప్పి తప్పదు..చివరికి జయం సంబరం చేసుకునేలా చేస్తుంది

  ReplyDelete
  Replies
  1. సార్..మీరు ఇంత పవర్ఫుల్ గా చెబుతారు అనుకోలేదు. థ్యాంక్యూ.

   Delete
 40. స్త్రీ అనగానే సమాజంలోని మనుషుల మనస్తత్వాలనుబట్టీ, ఎవరికి తగిన ఊహా కల్పనలను అనుసరించి వాస్తవ అవాస్తవాలకు అనుగుణంగా ఆడదనీ, అబల అనీ కొన్ని సందర్భాలలో వక్కాణించగా మరి కొన్ని సందర్భాలలో ధైర్యసాహసాలకు చిరునామాగా, రాజ్యాలను ఏలేటి చక్రవర్తినిగా అభివర్ణించడం జరిగింది. శారీరకంగా ఆమె బలహీనురాలైనప్పటికీ మానసికంగా మహాబలవంతురాలు ఇది నిజం.

  ReplyDelete
  Replies
  1. అవును మీరు చెప్పినవి అక్షరసత్యాలు. థ్యాంక్యూ.

   Delete
 41. బలమైన వ్యక్తిత్వంగల ఆడది మగాడ్ని ఆత్మన్యూనతకు గురిచేస్తుంది. గతంలోనూ అతివలదే అపరిమిత తెలివి నేటికీ తెలివి, గంభీరం, చాతుర్యత, మానవత వారివే!

  ReplyDelete
  Replies
  1. అన్నింటా అతివలే అని అనలేం కానీ ఎవరికి వారే గొప్పవారు.

   Delete
 42. నోడౌట్ ఆడాళ్లు మస్తు పవర్ఫుల్, రుజువు చేసినారు.

  ReplyDelete
  Replies
  1. రుజువులు సాక్ష్యాలు అవసరమా చెప్పండి.

   Delete
 43. అధ్భుతం మీ ఆలోచనలు
  వాటికి తగినట్లు కూరిన అక్షరాలు
  చిత్రాలు కూడా పద్మార్పితా

  ReplyDelete
  Replies
  1. థ్యాంక్యూ వెరీమచ్

   Delete
 44. అంతరంగ భావాలను అణచుకుని రాజీపడుతూ బ్రతకడం కష్టం.

  ReplyDelete
  Replies
  1. అయినా రాజీపడక తప్పని బ్రతుకులు.

   Delete
 45. అసలు ఆడవారే అర్థంకారు అంటారు
  అటువంటప్పుడు అందమైన అంతరంగం
  అర్థం చేసుకోవడం అసాధ్యం
  అది అప్పుడైనా ఇప్పుడైనా ఒకటని అర్థమైంది

  ReplyDelete
  Replies
  1. తెలివైన వారికి అలాగేగా అర్థం అవుతుంది:)

   Delete
 46. అభివర్ణనలో ఆధునీకత
  మీ అక్షరాల్లో ఆత్మస్థైర్యం

  ReplyDelete
  Replies

  1. మీ అభిమానానికి అభివందనం.

   Delete
 47. వండఫుల్ పోస్ట్

  ReplyDelete
 48. you are rocking modern Cleopatra.

  ReplyDelete
 49. మీలో ఆమె భావాలు ఉన్నాయని నా అభిప్రాయం.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు

   Delete
 50. అద్భుతమైన ఆలోచనల మేలు కలయిక.

  ReplyDelete
  Replies
  1. భాస్కర్ గారు బ్లాకు స్వాగతం.

   Delete