నీ అచ్చట్లు ముచ్చట్లు కరువైనాయంటూ
ఎద ఎగిరెగిరి ఆగలేక కొట్టుకుంటుందయ్యో
ఏడనున్నా వచ్చి సందిట్లో సవ్వడే చేసిపో!
నీ సురుక్కు చూపులే నన్ను కానలేదంటూ
నల్లమబ్బు కాటుకెట్టిన కళ్ళు మండెనయ్యో
వరదలా వడివడిగా వచ్చి నన్ను వాటేసుకో!
నీ లేత ముళ్ళ మీసాలు చెవి నిమరలేదంటూ
రవిక బిగువై రాగాలు శృతి తప్పి పాడెనయ్యో
పరువపు శంఖాన్ని తమకమే తగ్గేలా ఊదిపో!
నీ తుంటరి సైగలు కసితో కవ్వించ లేదంటూ
నారుమల్ల చీర నడుముజారి గోలచేసెనయ్యో
బుట్టెడు మల్లెలతో వచ్చి బాగా బుజ్జగించుకో!
నీ బెరుకుతనమేదో బిడియాన్ని బంధించెనంటూ
పెదవులే విరహవయ్యారంతో వంపు తిరిగెనయ్యో
మదనుడి కైవసపు మంత్రాలు వచ్చి వల్లించిపో!
ఎద ఎగిరెగిరి ఆగలేక కొట్టుకుంటుందయ్యో
ఏడనున్నా వచ్చి సందిట్లో సవ్వడే చేసిపో!
నీ సురుక్కు చూపులే నన్ను కానలేదంటూ
నల్లమబ్బు కాటుకెట్టిన కళ్ళు మండెనయ్యో
వరదలా వడివడిగా వచ్చి నన్ను వాటేసుకో!
నీ లేత ముళ్ళ మీసాలు చెవి నిమరలేదంటూ
రవిక బిగువై రాగాలు శృతి తప్పి పాడెనయ్యో
పరువపు శంఖాన్ని తమకమే తగ్గేలా ఊదిపో!
నీ తుంటరి సైగలు కసితో కవ్వించ లేదంటూ
నారుమల్ల చీర నడుముజారి గోలచేసెనయ్యో
బుట్టెడు మల్లెలతో వచ్చి బాగా బుజ్జగించుకో!
నీ బెరుకుతనమేదో బిడియాన్ని బంధించెనంటూ
పెదవులే విరహవయ్యారంతో వంపు తిరిగెనయ్యో
మదనుడి కైవసపు మంత్రాలు వచ్చి వల్లించిపో!
ReplyDeleteఅయ్యయ్యయ్యయ్యయ్యయ్యో :(
తమకంబే తగ్గేలా
ఘుమఘుమ లాడించ వయ్య గుమ్మను నేడే !
గమకంలో మైకముతో
నిమిషంబే యుగముగాను నెచ్చెలి వేచెన్ !
చీర్సు సహిత
జిలేబి
కొంటెగా అమాయకంగా ఆతృతగా ఎదురు చూపులు
ReplyDeleteమీ కవితాక్షర చిత్రము పలికే భావము..!
చురకత్తిలా చుపులతో చూసినా
ఒక్కోసారి మాటరాక మూగబోయినా
ఊసుపోక గుండె లయ తప్పినా
ఏ దారి వెంబడి ఉరుకులు పరుగులు పెట్టినా
సివరాఖరికి నీతానే చేరవస్తిని కదా కోమలాంగి
ఇంతకు మించి మీ ఈ కవితకు కమెంటలేకున్నాను పద్మ గారు.. హావభావాల లోగిలి మనసైతే ఆ మనసుకి కూసింత కలవరింత పలవరింత కలబోస్తే బహుశ అదే అలంకారమేమో ఆడవారి గొప్ప మనసుకి
~శ్రీ~
దేదీప్యమానం జ్యోతిరాత్మ శివకేశవం
గోడెక్కి గోడు గోడున
ReplyDeleteవేడెక్కిన తలపులాడి వేడికోలు - ఆ
బోడెద్దుకు వినిపిస్తే
కాడెత్తుక రయ్యి రయిన గబుకున రాడా .
అయ్యో అయ్యో అయ్యయ్యో...
ReplyDeleteఏమో ఏమో ఏదో అయినది, శృతి మించి రాగాన్న పడుతున్నది.
మీరు అసాధ్యులు సుమా!
ReplyDeleteప్రణయాక్షర నీరాజనం
ReplyDeleteకమనీయభావ విన్యాసం
వలపువీణల రాగరంజితం
సరసశృంగార పద్మార్పితం
This comment has been removed by the author.
ReplyDeleteచూపులకు అమాయకత్వానికి అద్దంలా వుంది మీ నాయకి
ReplyDeleteహృదయం పరిస్తే రతీ దేవికి హారతి నందించేట్టు వుంది
బెరుకుతనం ఎవరిది ఆమెదా అతనిదా?
ReplyDeleteప్రణయం మహాప్రళయం సృష్టించిన దాఖలా కనబడుతున్నది మీ కవితల్లో....హ హ హా
ReplyDeleteబేరుకుతనం బిడియంని బంధించె... నిజమా(గొప్ప అనుభూతి)
ReplyDeleteరారమ్మని పిలవడం ఓకే
ReplyDeleteవచ్చిపో ఏదో ఒకటి చేసుకో అనడమే ఇబ్బంది
ఎంతైనా ప్రియుడాయే 😁
ఎప్పుడూ ఏ అచ్చటాముచ్చటా లేదంటూ ఆడవారు ఆడిపోసుకునే అమాయకులైన మగవారినే కదా?
ReplyDeleteFantastic lovely lyrics padmarpitagaru.
ReplyDeleteనారుమల్ల చీర నడుముజారి గోలచేసె....మీకే సొంతం ఇటువంటి పదాలు
ReplyDeleteశృంగారము రంగరించి రాసిన కవిత చిత్రము రెండూ బాగున్నవి.
ReplyDeleteపరిమళభరితం పదాలు
ReplyDeleteఅందులో దాగిన పరువపు రహస్యాలు.
పరువపు శంఖాన్ని పూరించి రవిక బిగువ రాగాలు వినవలసిందే అయితే. :)
ReplyDelete
ReplyDeleteశృంగారం కాస్త శృతిమించినట్లు ఉన్నది, చిత్రము అమాయకంగా చూస్తుంది...జాగ్రత్త అవకతవలు అయ్యేను.
మనసుకి చేయ్యలనిపించిన ప్రతి దాన్ని చేసెయ్యి అంటూ పరిమిషన్ ఇచ్చారు..
ReplyDeleteనన్నేదో సెయ్యమాకు నడుముకాడ
ReplyDeleteసోకంతా దోచమాకు ఆడ ఈడ పాటవిన్నాము
ఏదో చేసెయ్యి..పద్మార్పిత కవిత చదివాము ఈడ
ఏదో చెయ్యమని రెచ్చగొట్టకు
ReplyDeleteసరిగంగ స్నానమంది మనసు
పగటిపూట అలజడి రేపకు
తుమ్మెద ముట్టని తేనె కోసం
తుంటరి పెదవులని కదపకు
దిక్కులు కలవని విరహాలను రేపి
తీరని కోరికలతో గోలపెంచకు
అలలై పొంగిన అందాలతో కైపెక్కించి
గొంతు ఎండి ఊపిరిని ఆపకు..
Innocent face with lovely lines.
ReplyDeleteఆ చూపుల్లో పడనివారు ఉండరు
ReplyDeleteబాగుంది మీ కవిత
పసిడి కాంతులు ఆరబోసినట్లు అందాలు
ReplyDeleteఅలల వలె వచ్చిపోయే పడతి అలకలు
కలల కలబోసిన కవ్వింపు కవితలు
మైమరపించి మురిపించే పరిమళ పదాలు
హాయితో అలరిచు అర్పిత వ్రాసేటి కావ్యాలు
కనులకు ఎంతో ఇంపు రంగరించిన చిత్రాలు
ప్రణయ రాగాలు...పరువాల ముచ్చట్లు...మొత్తానికి ప్రేమ పరాగాలు వెదజల్లి జనుల్ని మత్తెక్కించారు మీ కవిత్వంతో.... అద్భుతం మేడం... సలామ్!!
ReplyDeleteఅందరి ఆదరణాత్మక ప్రేమ వ్యాఖ్యలకు నా అభివందనం._/\_
ReplyDelete