నునుసిగ్గుతో తలవాల్చిన నా కనుదోయలకు
తెలియని ఆశలేవో చూపి ధైర్యాన్ని ఎర వేసి
నగుమోము పై ముంగురులను కదలనీయకే!
చలివెన్నెల జాబిలీ ఎదనుతట్టి నిదుర లేపకే
తారలతో నీవు తాళలేక విరహం నాలో రేపి
ఎదురు చూసిన గుండె గుబులుగున్న వేళ
మేఘాల్ని తరిమి నన్ను వీధి పాలు చేయకే!
చలువ చందన పరిమళం చిలిపిగా పూయకే
ఏకాంతం కోరుకునే ఇరువురి హృదయాలకు
కనులవిందు చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెప్పి
కలవర కలువ నయనాల కునుకు దోచేసుకోకే!
మేను హొయలు వన్నెల బిగువులు చూడకే
నిండైన నా వయ్యారాలని నీ వర్ణనలో చూపి
కలలను కనుల ముందుంచి అతనిలో కసిరేపి
కవ్వించింది నేనంటూ నిందను నా పై మోపకే!
ReplyDeleteసానాతుపడి పరిమళము
చానా ఘుమఘుమల లేమ చతురత వాహ్వాహ్ !
మీనా కుమారి ! నీవే
యేనా డైనన్ జిలేబి యేరాలముగన్ !
జిలేబి
నింద వేసినామను నేరము మాపై మోపుట తగునా మీకు?
ReplyDeleteలేదు, కాదంటూనే శృంగార పరిమళాలు వెదజల్లి,
ReplyDeleteఆనక తప్పు నాది కాదంటూ ఎంత గడుసుగా,
సొగసుగా, జారుకో చూస్తుంది
ఈ వయ్యారాల చిన్నది.
ప్రేమలో నిందలు నిబంధనలు లేవంటారు...ఎవరు చేసినా బాధితులు ఇద్దరూ అవుతారు.
ReplyDeleteఈ ప్రేమ కావ్యం ఎక్కడో పులరింతలు రేపుతుంది...
ReplyDeletelovely lovable lines
ReplyDeleteవెన్నెల ఎంత చల్లనా
ReplyDeleteనీ పదాలు అంత తీయన
తుంటరి భావాల తలపులు
మదిలోన పులకరింతలు
పాత రోజుల తలపింపజేసాయి
నిండు జాబిల్లి పండు వెన్నెలల వేళ
ReplyDelete'పిల్ల తెమ్మెర' శ్రీగంధవృక్షముల ప
రీమళము మోసుకొని వచ్చి ప్రియము గూర్చ ,
నిందమోపుట న్యాయమా ? కుందరదన !
ఇలా చదివాకా చిలిపితనం ఆవహించి ఏదైనా రాస్తే ఆ నింద మాపై వద్దండోయి ..
ReplyDeleteచేయ వలసినవి అన్నీ చేసి నిందకు అంటారేమీ
ReplyDeleteఅయినా నిందలు వేయడం మీకు పరిపాటి...పాపం మగజాతి హా అహా
So beautiful poem Arpitaji.
ReplyDeleteనిందలు పడేటోళ్ళం మేం
ReplyDeleteనిందలు ఏసేటోళ్ళు మీరాయె
హప్ చిప్ గుంటిమి, గంత దైర్యం మాకేడిది
నింద వేసి నీరుగార్చి
ReplyDeleteసులువుని క్లిష్టతరముగా నెంచి
విసిగి వేసారి వంత పాడకని
వెగటుగా వెవెవె అంటు వెటకరించి వెక్కరించే
మనషులే మనిషి మనసుని మభ్యపెట్టి
శునకానందం పొందేరు ఎందుకనో
వలమాలినవారి వలపు వాసంతమే విరుగుడాయేనా
చిరుగాలీ తుంటరి చిగురాకులా సడి చేయకే
ReplyDeleteచలివెన్నెల జాబిలీ ఎదనుతట్టి నిదుర లేపకే
చలువ చందన పరిమళం చిలిపిగా పూయకే వంటి పదాల ప్రయోగాలు-
ప్రేమ సున్నితమైనది, దాన్ని అభివ్యక్తీకరించటంలో కూడా కొంత వ్యక్తిత్వం, అభిరుచి, సున్నితత్వం ఉండాలి అనే విషయాన్ని అన్యాపదేశంగా చెబుతున్నాయి.
వలపు వీచికలు మరోమారు వీచె మీ కవితలో.
ReplyDeleteచిలిపి పరుగులతో సడిచేసే చిరుగాలి, చందన పరిమళాలు, ఏటి గలగలలు, పచ్చని ఆకుల కదలికలు, నిండుపున్నమి వెన్నెల వంటి పదాలు కేవలం పాటల్లో మాటల్లోనే తప్ప నిజజీవితంలో అంతా హడావిడి ఉరుకులు పరుగులు, మెకానికల్ లైఫ్స్ కదా పద్మార్పిత-హరినాధ్
ReplyDeleteకమ్మని కవితతో కవ్వించారు-ఇది ముమ్మాటికీ నింద కాదు నిజం.
ReplyDeleteపండువెన్నెలను అడిగి పాన్పు తీసుకుని రమ్మనో నీలిమబ్బుల నుండి నిదురని ఇవ్వమనో అడగక
ReplyDeleteఎందుకు ఈ అనవసరపు నిట్టుర్పు సడులు ఏమైనా అన్నాము అంతే నిందలు వేసాము అంటూ అభియోగాలు.
చల్ల చల్ల
ReplyDeleteకూల్ కూల్
కష్టాలకు, కడగండ్లకు, సంతోషాలకు స్పందించి వ్రాసేది నిజమైన కవిత్వం అలా తన్మయత్వంతో అనుభవించి వ్రాసేదే పది కాలాలు గుర్తుండిపోతుంది. అది మీ కవితల్లో ఉంది.
ReplyDeleteచల్లని గాలి పండువెన్నెల్లో
ReplyDeleteచక్కని కవితలు చదివితే
ఆనందం వెల్లివిరియునులే
మటలు ఉప్పెంగి పాడునే
మనసు తేలి ఆడునులే
చిరుగాలికి పూలు నవ్వ
కన్నె వదనం కళకళలాడే
కలకాలం మది భావాలు
కలవరింతలు రేపునులే..
నిందను నాపై వేయకు అన్నా
ReplyDeleteజాణతనపు జవ్వనిదే కదా పైచేయి!
Lovely pic & post.
ReplyDeleteI really like your site - In addition to this I herewith posting a very useful site regarding the educational and Govt Jobs information.
ReplyDeleteClick Here To educational and Govt Jobs information.
Your site is providing useful information.
Deletethank you K.S.Chowdary garu
కలలను కనుల ముందుంచి అతనిలో కసిరేపి కవ్వించింది నేనంటూ నిందను నా పై మోపకే ha ha ha
ReplyDeletehttps://youtu.be/IxnwR4vVpPs
Deleteఅమ్మో... ఇంత నిందాస్తుతా? అర్పిత గారు ఏం రాసినా రమ్యంగా అతిమదురంగానే ఉంటుంది అనడానికి ఈ కవిత ఓ తార్కాణం! అద్భుతం...మేడం!! సలాం...
ReplyDeleteఅందరి ఆదరణాభిమానాలకు అభివందనములు _/\_
ReplyDelete