ఏమిటిది!?

మధుర జీవితమే దరిచేరి తీయగా నన్ను తాకి  
క్షణక్షణం మదికి మరింత దగ్గర అవుతానన్నది!

సంధ్యవేళ నీ ఊసులేమో వింజామరలుగా వీస్తూ
రాత్రివేళ జ్ఞాపకాలను ఊరేగింపుగా తెస్తానంటుంది!

ఊపిరితీసి వదలబోవ నీ పరిమళం నన్ను చుట్టేసి
పులకరింతల కబురై వచ్చి గిలిగింతలు పెడుతుంది!

నా ఎద ప్రాంగణం అంతా నీవు పెనవేసి వీణ మీట  
హృదయసవ్వడేమో నీ మాటల్ని పాట పాడుతుంది!

ఎందుకు ఈ అసంకల్పిత అవినాభావాలు అనుకుంటే
వెర్రిదానా వలపని నీ వలపు నన్ను కౌగిలించుకుంది!

వలపు మంట మోజు ఏమిటో రుచి చూసి చెప్పబోతే
నీ విరహంలో నేను కాలుతూ నిన్ను కాల్చ వద్దంది!
 
ఇది భ్రాంతా లేక బంధమా అనుకును మీమాంసలో
ఆలోచనలన్నీ నువ్వు నా సొంతమని ధృవీకరిస్తుంది!

30 comments:

  1. మీ ప్రణయ భావుకతకు దాసోహం.

    ReplyDelete
  2. Lovely poem & picture
    ...
    ...
    Wish You & Your Family Happy Navaratri Ustav

    ReplyDelete
  3. kshanamaina nee navvulo nilavalani vundi.
    reppa pataina nee kalalalo kalavalani vundi.
    maraninchaina neelo kalasi povalani vundi.

    ReplyDelete
  4. అదిరింది గుండె జల్లుమన్నది.

    ReplyDelete
  5. కదిలే కాలం చేసే అపురూపమైన భావన ఇది
    కదలికలు లేని మనసు తాలుకు ఊహల చలనమిది
    ఊసులేవో చెవిలో గుసగుసలై హాయిగొలిపే తరుణం ఇది
    కలకాలం కడదాక నిలిచే ఆత్మకు సరిలేని నిర్వచనమిది
    రాగద్వేషాల లయగతులతో సతమతమయ్యే ప్రణయం ఇది
    చల్లగ వీచే గాలి వెదజల్లే సుమగంధాల సెలయేరిది
    భావాలన్ని మనసు వీణ తంతిని మీటగ ధ్వనించే గేయం ఇది
    కనుచూపు మేరలో ప్రకృతిని హుషారుగొలిపే తమకమిది
    పెదవంచుల పై వసివాడని చిరునవ్వు సంతకం ఇది

    ~శ్రీ~
    భ్రమరాంబ మల్లిఖార్జున శరణితి
    ఝుంకార ఝంకార నాదమితి

    ప్రణయ భావాలనైనా విషాదపు ఛాయలైనా
    అలవోకగా వ్రాయగలరు మీరు పద్మ గారు..
    కనులను తాకే చిత్రము మనసును తాకే అక్షరము చక్కగా అమరినాయి మీ భావాలకు

    ReplyDelete
  6. ప్రణయం ప్రాణమైన వేళ పొంగిన భావాలు మధురం.

    ReplyDelete


  7. ఏమిటిది ? మధుర జీవిత
    మే? మిం టికెగిసితి గాద మేల్మిని గానన్
    నా మదిలో నిలిచావు సు
    మా! మనసునుదోచినావు మధురస్మృతులన్!

    జిలేబి

    ReplyDelete
  8. విషాద కోన దాటి వసంత వనంలో
    విహరిస్తున్న పద్మార్పిత పవనాలు
    ఆహ్లాదపు ఆనంద వీచికలను
    అందించకుండా, అలరించకుండా ఎలా వుంటాయి..?

    ReplyDelete
  9. ప్రేమ పూల పరిమళాలకు కొదవులేదు మా పద్మార్పిత కొలనులో.
    చిత్రం బహు కనువిందులు చేయుచున్నది.

    ReplyDelete
  10. అలా అడగ్గానే
    ఇలా అలరించారు

    ReplyDelete
  11. భ్రాంతా లేక బంధమా అనుకును మీమాంసలో కొట్టుమిట్టాడు ప్రణయం ;)

    ReplyDelete
  12. ఓహో...ఆహా
    వలపుకు అంతంలేదు
    కవితలకు అలుపురాదు

    ReplyDelete
  13. This comment has been removed by the author.

    ReplyDelete
  14. ఎంత మంచి మధుర భావన! పరిమళాల గురించి, సంధ్య వేళల గురించి, యద పరవశాల గురించి, వలపు గురించి, రాత్రుళ్ళు జ్ఞాపకాల గురించి కాళిదాసు నాటకాల్లో ప్రియుడి వలపు వేదనను ఇట్లే వర్ణిస్తాడు కవి. అచ్చంగా అలాటి పోలికలే మీ పద్యంలో ఉన్నాయి. కాలిదాసుకు పోటీ ఇవ్వగల మహంకాళీ మీరు. వలపు మంట రేపిన మీమాంసలో మమ్మల్ని మరువకండి మేడం... సలాం!

    ReplyDelete
    Replies


    1. "కాలి దాసుకు" పోటీ ఇవ్వగల మహంకాళీ :)

      ఇంత పెద్ద పంఖా వేగాన్ని పద్మార్పిత తట్టుకుట్టుందా ! ఆ ! :)

      జిలేబి

      Delete
  15. ప్రేమకు భాష రూపం లేదు అంటారు మీరు ఎన్నో రంగులు రూపాలు అద్దుతున్నారు.

    ReplyDelete
  16. చక్కని కవితై వచ్చి
    తీర్చిదిద్దిన అక్షరాలతో
    మనసుని దోచావు...

    ReplyDelete
  17. కవితలతో కలవరం రేపి
    కళ్ళలో ఆశ నిరాశలు దాచి
    ప్రతి వాక్యం మనసు తట్టిలేపి
    కదిలీ కదలక దోబూచులాడి
    అందరి హృదయాలను కదలించి
    గుచ్చి గుచ్చి గుండెల్లో చేరి
    మరిన్ని చిత్ర విచిత్రాలు చేయి..

    ReplyDelete
  18. ఈ ప్రణయం అలజడి సృష్టించేలా ఉంది 😁

    ReplyDelete
  19. నా ఎద ప్రాంగణం అంతా నీవు పెనవేసి వీణ మీట..మనసు పాడింది సన్నాయి పాట.

    ReplyDelete
  20. ప్రేమ ఒక మైకం, పడితే అయిపోతాము చిత్తు
    వద్దనుకుంటూనే తెలియకుండా పడిపోతాము...అదే మీరు చెప్పింది

    ReplyDelete
  21. ప్రణయ ప్రభంజనం మీతో మొదలు మీతోనే అంతం అనుకుంటాను...హా హా హా

    ReplyDelete
  22. మధుర భావాల సుమమాల మనసులో పూయించి ప్రణయ రాగాలు పలికించే మీ కవిత.

    ReplyDelete
  23. ప్రేమ ప్రియురాలు కవితల్లో కలల్లో ప్రియం.

    ReplyDelete
  24. లోన ఏవో వలపులు విరిసి
    లేని ఆశలు మనసున రేపె
    సుందర స్వర్గం ఎదుట నిలిచి
    నీ మాటలే మధువులై పొంగె
    ఆణువణువును పులకింపజేసి
    గతజ్ఞాపకాలను గుర్తు చేసె**

    ReplyDelete
  25. మదికి మరింత దగ్గరౌతూ!

    ReplyDelete
  26. కచిక

    తాం భూసుతా ముక్తి ముదారహాసం
    వందేయతో లవ్య భవం దయాశ్రీ

    శ్రీయాదవం భవ్యలతోయ దేవం
    సంహారదాముక్తి ముతా సుభూతాం

    ReplyDelete
  27. వలపు మోజు కదా..

    ReplyDelete
  28. అందరి అప్యాయతకు నమోఃవందనములు _/\_

    ReplyDelete