ఇదేమి ప్రయాసా పోరాటమో తెలియకున్నది
స్వప్నాలు నిజం చేసుకోవాలన్న ప్రాకులాటలో
సీతాకోకచిలుక ఉన్న రంగులన్నీ కుదవుపెట్టి
తన అసలు రంగు వెలసిపోయేలా చేసుకుంది!
తన నిశ్చింతని వదలి సుఖాలను అన్వేషిస్తూ
ఆలోచనలే ఊపిరిగా చేసుకుని నిశ్శబ్ధ హోరులో
గుండె చేసే చిన్న ధ్వనికి సైతం బెదిరి తృళ్ళిపడి
కళ్ళ నుండి జారుతున్న మౌనరాగం వింటుంది!
తన భావలు బయటపడలేక రాక శ్వాసలో ఆగి
తనకైన గాయాలు ఎవరికీ కనబడనీయక దాచి
ముందు చూపంటూ ఏమీ లేక వెలుగు కానరాక
నీడనే నేస్తంగా చేసుకుని నలుగురితో నడుస్తుంది!
గొంగళి పురుగు నుండి రూపాంతరం చెంది
ReplyDeleteఅందవిహినం నుండి అందం వైపు మార్పు చెంది
పుప్పొడిని ఆన్వేషిస్తు రెక్కల పొడిని జారవిడిచి
అయ్యో సిటాకోక్ చిలుక్ సిల్క్ మార్క్ లోగో ఆయే అలసి
చిన్ని ఉచ్వాస నిఃశ్వాసలతో ప్రాణం పోసుకుని అవయవముగా రూపాంతరం చెంది
ఉన్న దేహంలో రక్తాన్నంత శక్తి మేరకు సరఫర చేయించి
ధమనుల సిరల నడుమ స్ట్రెస్ వలన స్ట్రెయినై అనక పేయినై
కొద్ది మందిలో సి హెచ్ డీ బారిన పడి అలసి సొలసి
లోకాన్నంత నలుపు తెలుపు కనుగుడ్లతో వీక్షించి
అనక రంగుల హరివిల్లునే మనసు లోగిలిలో ఉంచి
బాధ కలిగినా నిట్టూర్చి.. ఆనందం కలిగినా తడిచి
నయన ద్వయం దాచే కదా జ్ఞాపకాలెన్నో తరచి
చాలా నాజుకైన ప్రాణమిది
పంచ భూతాల సమ్మేళనమిది
ఊపిరున్నని నాళ్ళే భావోద్వేగాల సమాహారమిది
అలసి సొలసినాక చివరాఖరున జ్ఞాపకమై కదలాడేది
~శ్రీ~
మణికంఠ అయ్యప్ప
నిర్లిప్తతను నిస్సహాయతను ఆఖరి మజిలి పోరాటాన్ని
మీదైన శైలిలో వైవిద్యభరితంగా అక్షర చిత్రాలతో చక్కగ చెపారు పద్మ గారు..
Life: It has no surety bonds guaranteed by God.. It has no warranty certificate to be claimed by Humans.. It is one and only precious gift with one time limited offer.. Let it delve deep into emotions and get back every time strengthening itself and let it not suffer..!
అనుభూతుల్ని దాచుకుని ఆశల్ని రెక్కలు చేసుకుని సాగిపోవడమే మనకు ప్రాప్తం ఉన్నంతే మనకు దక్కేది. మనసుని తాకిన కవిత.
Deleteమీకు నా వెశ్లేషణాత్మక కవిత నచ్చినందుకు ధన్యవాదాలు అమృత గారు.. మీకూ మీ ఇంటిల్లిపాదికీ దేవి శరన్ నవరాత్రి శుభాకాంక్షలు వల్లి గారు.
Delete~శ్రీ~
ఇంద్రకీలాద్రి నివాసిని కనక కవచ ధారిణి మాత్రే తమ్ త్రిశక్తి స్వరూపిణి ముదిత చిరు మంద హాసిని త్వమాహం భజే
ఆవేదన నీదైన శైలిలో
ReplyDeletehmmmmm :(
ReplyDeleteనిజానికి జీవితపు దారిలో ప్రాకులాట సహజం. పోరాటం ఏంటో తెలియని ప్రాకులాట, కొన్ని స్వప్నాలు నిజం చేసుకోవాలన్న ప్రాకులాట... ఇతకీ ఆ స్వప్నం మన ఆరాటం తీరుస్తుందా? ఒకవేల తీర్చగలిగితే మన పోరాటం ఆగుతుందా?? ఎన్నెన్ని బ్రతుకు ప్రశ్నలు ఈ జీవితంలో.... సీతాకోక రంగులు కుదువబెట్టి ఉన్నరంగు వేలయడం ఎంత గొప్ప వ్యతీకరణ.
ReplyDeleteప్రణయంలోనూ, ప్రళయం లోనూ గుండెచప్పుడు విధ్వంసాన్నో, విన్యాసాన్నో చేస్తుంది అంటాడు ఓ కవి. ఆ మాటలు నిజమయ్యాయి మీ కవితలో... కళ్ళనుండి జారే కన్నీళ్లను మౌనరాగం తొ పోల్చడం కవిత్వపు ప్రక్రియలో ‘హైపర్ బోలీ’ దాన్ని సరైన విధంగా వ్యక్తీకరించారు. ఖుదొస్...మేడం!!
జీవితం, జీవన పోరాటం హృదయానికి ఎన్ని గాయాలు చేసినా కనపడనీయకుండా నలుగురితో సాగడం అనేది కవిత్వంలో ఒక ‘అండర్ స్టేట్మెంట్’ భావనతో వాక్యానికి సరైన నిగూడార్థాన్ని ఇచ్చారు. కవితలో నాయకి ఎంతో ఉన్నత గుణాలు, ఆశయాలు కలిగి ఉన్నప్పటికీ కస్టాలు కప్పి పెట్టి నలుగురితో సాగడం అనేది ఒక గొప్ప ఔన్నత్యం. అలంటి భావనని ‘నలుగురితో నడవడం అనే సాధారణ వ్యక్తీకరణతో ఆమె ఔన్నత్యాన్ని మరింత పెంచారు. ఇది ఒక రకమైన అండర్ స్టేట్మెంట్ తో కూడిన ఎక్షాగరేషణ్.. కవితకు మరింత శోభను ఇచ్చి కవితా నాయకి వేదనని సరైన రీతిలో వర్ణనకు తెచ్చింది... సలాం....మేడం!!!
ReplyDeleteతనభా వనలుబ యటపడ
కనెలతు క మనసు జిలేబి కందెను గనవే !
వినిమయ మవ్వని బతుకున
కనకన పద్మార్పితా! జకాతి దొరుకునే :)
బిలేజి
తాశ్రీ వర్యులు.. తమ సిగ్నేచర్ నామము నిటుల స్థానభ్రంషమై ఆయస్కాంత క్షేత్ర తర్జన భర్జన లైనటిలా ఇటుక టువా యేలనో..! దరస గా కమెంటి నాను దసర శుభా భినందనలు ముందస్తు గానే బతుకమ్మ ఉయ్యాలో..!!
Delete~శ్రీ~
గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో
తంగేడి పూలంట ఉయ్యాలో
Deleteశ్రీధర బుక్యా ! మాతా
శ్రీ దరువులు పలు రకములు సీగా నపెసూ
నౌ! ధరణిన్నపుడపుడున్
కోదండమును విడువన గగురును బిలేజీ :)
జిలేబి
బుడుగు వలెనన్న గోపాళం పొడుం డబ్బయును
Deleteసిగాన పెసునాంబ యును గాచేటి బాపు రమణలిరువు రన్..
శ్రీ యనుచు హరిణి పతినెల్ల ధరను ధారయింతుమే ధరహరి దశవ తారముల దలిచేన్..!
తూచ్.. నేను మాతను కాదు జిలేబి గారు..
శ్రీధర నామధేయుడిని.. పద్య గద్యా లంకరణ బహుబాగు నని మెచ్చుకుంటి
~శ్రీ~
దేవకినందన యోగమాయ యశోదనందన
రాధిక మనోహర గోవర్ధనోద్ధార గోవింద గరుడారుఢ
నాకు పద్యాలతో అక్షర పదవిన్యాసం రాదు జిలేబి గారు.. ఏదో అక్షరాలను మీరు రాసేటి శైలికి అనువుగా రాయాలని చూశా.. కుదరలేదు.. మీరు గద్య పద్యాలలో దిట్ట.. అనుభవైజ్ఞులాయే..
Delete~శ్రీధర్ భూక్యా పాత్లోత్
Deleteశ్రీధర బుక్యా! మాతాశ్రీ దరువులవి :)
శ్రీధర బుక్యా మాతా, శ్రీ దరువులు కావు :)
జిలేబి
ఓహ్ :)
Delete
ReplyDeleteసీతాకోకచిలుక ఉన్న రంగులన్నీ కుదవుపెట్టి తన అసలు రంగు వెలసిపోయేలా చేసుకుంది.. ఎన్నో అర్థాలు స్పూరించే ఈ వాక్యాలు చాలా నచ్చాయి ..
విషాద సాగరంలో ఓదార్పు నావలా,
ReplyDeleteఎడారి జీవనంలో దయార్ద్ర మేఘంలా,
ఒంటరి ప్రయాణంలో తోడూ నీడలా
స్పర్శిస్తాయి, స్పందింపజేస్తాయి
ఇవి నా మనసులో దాగిన భావాలే అని ప్రతి ఒక్కరిని తడుముకొనేలా చేస్తాయి ఈ అమూల్య అక్షరాలు.
నీడనే నేస్తంగా చేసుకుని నలుగురితో నడుస్తుంది..ఇదే మీరు మమ్మల్ని అక్షరాలతో కట్టివేయడం.
ReplyDeleteఇలాంటి ఏడుపుగొట్టు కవితలు ఆపరా? ప్రేమార్పితా???
ReplyDeleteకన్నీటి మౌనరాగం అధ్భుత భావం
ReplyDeleteమీరు అక్షరాలతో ఆకట్టుకుంటారు మాడం
ప్రయాస అనుకుని మనం ఆత్మనిబ్బరాన్ని కోల్పోతే ఎలా చెప్పండి. కష్టాల నుండి బయటపడి ముందుకి సాగిపోవాలి. మనుషులకే వచ్చేది కష్టాలు. ఎంత ఎదురీదితే అంత బలం. వ్యధల్లో అసలైన మనలోని స్థైర్యాన్ని మనం గుర్తిస్తాము. మంచి కవితను అందించారు.
ReplyDeleteవేదల్ని తరిమి కొట్టాలనుకో
ReplyDeleteతలచుకున్నదే తడవుగా
విధి తలవంచేను చూడు
నీలో ఏముందో నీకే తెలుసు
వ్యధలకు వత్తాసు పలికితే
ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు
నీలో భయాన్ని పొలిమేర దాటించు
నీ శక్తి మేరకు నీవు శ్రమపడు
నిన్ను నీవు గుర్తించి ముందుకి సాగు..
సీతాకోకచిలుక ఉన్న రంగులన్నీ కుదవుపెట్టి
ReplyDeleteతన అసలు రంగు వెలసిపోయేలా చేసుకుంది!
సమస్య అనేది వచ్చి ఒక సమరాన్ని నీ కోసం సిద్దం చేసినప్పుడు నిన్ను నీవు నిరూపించుకునే అవకాశం ఇచ్చినట్లు పద్మార్పితా అంతే తప్ప గుండె నిబ్బరం కోల్పోయి నిరాశతో నీరసించిపోవడం అవివేకం. మనకి మనమే తక్కువ అంచనా వేసుకుని ఏదో జరగరాని అనుకోని జఠిల సమస్యలు అన్నీ మనకే వచ్చాయి అనుకోరాదు, దీన్ని ఎవ్వరూ హర్షించరు. మన విలువ ఏమిటో మనం తెలుసుకుని విసిగి వేసారక సాగితే విషాదం వేదనలు వెయ్యి మైళ్ళ దూరం పారిపోతాయి ఇది తెలుసుకుని మనుగడ సాగిస్తే అంతా మంచి జరిగి సర్దుకుపోతుంది.
ReplyDeleteమదిలో నిక్షిప్తమై ఉన్న వేదనకు మీరు ఇచ్చిన అక్షరరూపం మనసుని తాకింది.
ReplyDeleteతీవ్ర మనస్థాపనకి గురైతే వచ్చిన మాటలా...
ReplyDeleteనీడను నేస్తం చేసుకుని సాగిపోవడం అమోఘం.
ReplyDeleteExcellent heart touching feels madam.
వ్యధ వ్యక్తీకరణలో మీ ప్రత్యేకత కనబరిచారు.
ReplyDeleteసీతాకోకచిలుక ఉన్న రంగులన్నీ కుదవుపెట్టి
ReplyDeleteతన అసలు రంగు వెలసిపోయేలా చేసుకుంది!
రంగు పోతే పోయింది మనసు ముఖ్యం కదా ? మనసుని గుర్తించడం లేదని కదా బాధ ? రంగు చూసి వచ్చినవారు మనసుని ఎలా చూడగలరు ? (ముందు)చూపేలేని వారు గుర్తిస్తే ఎంత ? గుర్తించకపోతే ఎంత ? ఎప్పటికైనా, ఎంతవారలైనా జీవిత పాఠం నేర్చుకోడానికి "ఖరీదు" చెల్లించక తప్పదని గుర్తించండి. అప్పటిదాకా నిర్లిప్త పయనమే సీతాకోక చిలుకకి మంచిది.
జీవితం ఆగదు నడుస్తూ ఉంటే అసలు రంగులు బయట పడతాయి.
ReplyDeleteమనం తొందరపడి కలత చెంది తెలుసుకొవలి ప్రయత్నించి ప్రయోజనం ఉండదు పద్మ.
Life is a game of challenges lets play with pleasure and power my dear.
వేదన అయినా వేడుకలు అయినా హ్రదయానికి హద్దకునే విధంగా వ్రాయదాంలో మీరు దిట్ట.
ReplyDeletesoooooooooooperrrrrrrr
ReplyDeleteఇదేమి ప్రయాసా పోరాటమో తెలియకున్నది...అదే అర్థం కావడంలేదు
ReplyDeleteఆలోచనలను ఊపిరిగా చేసుకుని నిశ్శబ్ద హోరులో నీడను నేస్తం చేసుకోవడం మీకే చెల్లింది.
ReplyDeleteఈ ఏడుపులు పెడబొబ్బలు వద్దు
ReplyDeleteపండగరోజులు పసందైన పోస్ట్ పెట్టండి పద్దమ్మా :)
This Folk Song on Bathukamma is not only Melodious, But also Colourful as the Myriad Hues of Flowers..
ReplyDeleteYes.. It is the Floral Season.. Shot in Picturesque Locations Pan Telangana (Adilabad: Kuntala Falls, Warangal: Laknavaram Lake, Pakhal Lake, Kakatiya Fort Area, Hyderabad: Charminar, Golconda) as well as in the US (San Francisco: Golden Gate Bridge), to depict the Cultural Harmony of Telangana.
This Season of Dasara, Every Year, the People of Telangana Gather Assorted Flowers and Arrange them in Conical Shapes, which is then Worshipped as Bathukamma (Another Name of Durga Bhawani) for Nine Days. At the End of Nineth Day, they let these floral structures afloat in nearby Lakes and Ponds.
Daandiya or Kolaatam is held in parallel with Circumabulation around the Floral Decoration which remains a Star Attraction wherein Boys and Girls Equally Participate.
Kudos to Mic TV for putting up this Audio Visual Treat..
This Video Song also features Telangana CM Kalvakuntla Chandra Sekhara Rao Gaaru's Daughter Kavitha Gaaru and V6 Channel Anchor Kathi Karthika.
Enjoy the Music..!
Happy Navratri to Everyone..!!
Yaa Devi Sarvabhooteshu
Shaktiroopena Sansthitha
Namastasyayi Namastasyayi
Namastasyayi Namo Namah
Parallel Festivities Across Both Telugu States:
Telangana: Bathukamma
Andhra: Indrakeelaadri Kanaka Durga Devi Sharannavaraatri
Rayalaseema: Tirumala Venkatanarasimha Brahmotsavam
Bathukamma Wishes to You, Padmarpita Gaaru
అందరి అక్షర అభిమాన స్పందలకూ శతకోటి వందనములు_/\_
ReplyDelete