చెల్లాచెదురుగా పడున్న రంగుల చతురస్రాలని
వరుసక్రమంలో ఆకర్షించేలా సర్దబోవ అనిపించె
చూస్తే ఇంపుగా ఉండి ఆడుకునే ఒక పజిలని
అటుదిటు తిప్పి సరిచేస్తే అన్నీ ముక్కలేనని!
జీవితాన్ని మక్కువతో మొక్కి కొనసాగితే తెలిసె
ఒకేరంగున్న ఘనాలైన ఒక్కచోట కలిసుండవని
చూడబోవ త్రిమితీయ రూపాలతో తికమక పెట్టి
పారాహుషార్ అంటూ సంకేతాలు అందిస్తాయని
చదువబోతే అన్నీ అర్థంకాని కోడ్ భాషాక్షరాలని!
జీవితంలో సమస్యలు స్పష్టంగా కనబడితే తెలిసె
బ్రతుకైనా పజిలైనా పరిష్కరించాల్సింది మనమని
జనాలు ఎదుగుతుంటే నాలుగు రాళ్ళురువ్వి నవ్వి
వీలుకుదిరితే క్రిందకు దించే ప్రయత్నమే చేస్తారని
కష్టాలని కాలితో తన్నితే జీవితం కుదుటపడునని!
రంగుల రుబిక్స్ క్యూబ్ తో ఝంఝాటం
ReplyDeleteకాని రంగులన్ని వరుసగా అమర్చాలని ఆరాటం
జీవితం రాగద్వేషాల కలగాపులగం
ఏ ఒక్కటి మిస్ ఐనా అతలాకుతలం
అపుడపుడు జీవితం జిగ్సా పజిల్
ఏ ముక్క ఎక్కడుందో వెదికే లోపు హడల్
అన్ని ఆకారాలు ఒక్కలా ఉన్నా కావు మింగిల్
బంధాలన్ని యేనాటికైనా ఒక్క తాటిపై నిలిచేనని జింగిల్
అపుడపుడు జీవితం అనిపిస్తది పొడుపు కథ
అల్లకల్లోల ఆలోచనలతో భారమైన మానసిక వ్యథ
సమాధానము తెలిసినా గాని మెలికలతో మోత
సమస్య చిన్నదే కాని చిక్కుముడులతోనే వాత
పద్మ గారు.. కవితల తోరణం తో ఎన్నో రకాలుగా అలరిస్తు.. నిరంతరాయముగా మీ కవిత సుమఝరి.. ప్రతి ఒక్కరి మన్ననలు పొందాలని ఒక శ్రేయోభిలాషిలా కోరుకుంటు.. మీకు టీచర్స్ డే విషెస్.. ఎప్పటిలానే మీ కవిత దానికి తగట్టుగా చిత్రం చాలా బాగుంది..
~శ్రీ~
రామదూత రామబంటు
థ్యాంక్యూ వెరీ మచ్. మీ ప్రోత్సాహ ప్రోధ్బలాలే నాతో ఇలా రాయిస్తున్నాయి. ధన్యురాలిని.
Delete
ReplyDeleteشركة كشف تسربات المياه بالقطيف
شركة عزل اسطح بالقطيف
شركة كشف تسربات المياه بالقطيف
Sorry to say this..I don't know Arabic nor Urdu. More over this blog is for telugu knowing people.
Deleteజీవితంతో ఆడుకోవడం ఆషామాషీ కాదు పద్మగారు.
ReplyDeleteఅనితరమైన వాటితో ఆడుకోవడమే గొప్ప.
Deleteజీవితంతో మనం ఆడుకోకపోతే అది మనతో ఆడుకుంటుందని బాగా సెలవిచ్చారు.
ReplyDeleteఅందరికీ ఆడుకుని గెలవడం సాధ్యం కాదండీ.
కష్టపడి సాధ్యం చేసుకోవాలి అదే అసలైన కిక్ :)
Delete
Deleteకిక్ టూ నా త్రీ నా పద్మార్పిత గారు :)
జిలేబి
3 కిక్ స్పెషల్ ;)
DeleteOutstanding words with awesome poster.
ReplyDeletethank you
Deleteజీవితం పజిల్
ReplyDeleteపరిష్కారం ప్లే
బాగుంది లైఫ్.
Life
DeleteIs
Colorful
"ఒక పరిష్కారం కాని పజిల్ వలె అందమైనది జీవితము"
ReplyDeleteపరిష్కరించి అందం చూడాలి.
Deleteపద్మా ప్రస్తుతం లైఫ్ నాతో ఆడుకుంటున్నది.దాని ప్రతిబింబంలా మలచావు నీ కవితని
ReplyDeleteకష్టాల కాలితో కిక్ చేయనులేను. జాబ్ వదల్లేని పరిస్థితి, ఎప్పటికి సెట్ అవుతుందో?
ఈ స్టేజ్ ప్రతి మనిషికీ ఎప్పుడోకప్పుడు తప్పదండి సంధ్యగారు.
Deleteమీరు చాలా నిబ్బరం గుండెధైర్యస్థులు...గుడ్ లక్
జీవిత పజిల్ విప్పడం సులభమా
ReplyDeleteఈజీగా ఉంటే ధ్రిల్ ఉండదుగా :)
Delete
ReplyDeleteజీవితపు పజిలు విప్పగ
ఓ వనితా సాధ్యమౌన ? మోకరిలదగు
న్బోవె సుఖమయముగ బతుక
నీవున్ మహిలో జిలేబి నిక్కంబిదియే !
జిలేబి
జీవితపు పజిల్ విప్పలేను కనుకనే ఈ ప్రగల్భాలు..చేయలేని వారే చాటంత చేసి చెబుతారు అంటారా? కానివ్వండి :)
Deleteపోనీలెండి..కొన్ని సారూప్యత గల పక్షులైనా పద్మార్పిత గూటికి ఈ విదంగా చేరుతున్నాయి.
ReplyDeleteమీరు సాదాసీదా సింపుల్ మనసు/మనిషి అని తెలిసె..థ్యాంక్యూ
Deleteహయ్యారే హవ్వ...జీవితాన్ని కాలితో తన్నమందువా ఎంత మాటంటివి.
ReplyDeleteబుద్ధిగా ముద్దుగా చెబితే విననప్పుడు తప్పదుగా
Deleteపారాహుషార్ అంటూ సంకేతాలు అందిస్తాయని
ReplyDeleteచదువబోతే అన్నీ అర్థంకాని కోడ్ భాషాక్షరాలని
Transmitting Signal: Hello
DeleteReceiving Signal: *%_%* °○°
:) RK Gaaru (:
అంతే కదండీ..జాగ్రత్తగా ఉండూ అంటూ వివిధ రూపాల్లో సంకేతాలు పంపుతాయిగా.
Deleteబ్రతుకైనా పజిలైనా పరిష్కరించాల్సింది మనమే
ReplyDeleteఈ ఒక్క లైన్ చాలు బ్రతుకు సక్రమంగా గడపడానికి
ఎవరో వచ్చి ఏమీ చేయరు కదండీ
Deleteజీవన ప్రహేళిలో ప్రయాణించాల్సిన దూరం చాలానే ఉంది. ప్రతి మలుపులో ఇలా దుఃఖాన్ని తన్నేస్తూ సాగిపోవడమే కదా జీవితం.... సూపర్ అర్పిత గారు... సలామ్!!
ReplyDeleteతన్నగలమో లేదో కష్టమో కానీ...ప్రయత్నించడం అయితే మానేయవద్దు కదండీ... thank you.
Deleteచాలా చాలా దన్యవాదాలు ఫ్యాన్స్ బ్లాగర్ కు నేను వ్రాసిన పంక్తులు తీపిగుర్తులుగా పోస్ట్ పెట్టినందుకు.
Deleteజీవితాన్ని ఊహించి
ReplyDeleteకలగంటే కల్లలు అవుతాయి
కష్టాలను కాలరాసి సాగితే
కొంత సాంతనైన మిగులుతుంది
కాలం అన్నిటికీ పరిష్కారం చూపి
జీవించే మార్గం చూపుతుంది
ప్రయత్నించి పట్టుదలతో సాధిస్తే
విజయంతో పాటు విజ్ఞాం పెరిగి
మరికొందరికి మార్గదర్శం అవుతాం
కష్టాలని తట్టుకోలేమని ఏడిస్తే
కృంగిపోయి ఎవ్వరికీ పనికిరాము..
ప్రయత్నిస్తే ఫలితాలు బాగుంటాయని కవిత రూపంలో బాగాచెప్పారు. ధన్యవాదాలండి.
Deleteఇంతకీ జీవితపు రూబిక్స్ క్యూబ్ లో మీకిష్టమైన నలుపు ఉందా??
ReplyDeleteలేదా రంగుల్లోనే కాంప్రమైజింగా...జింగా లలా?
తెలుపు/White, ఎరుపు/Red, నీలం/Blue, ఆరెంజ్/Orange, ఆకుపచ్చ/Green, పసుపు/Yellow మొత్తం ఆరు రంగుల మిళితం ఈ రూబిక్స్ క్యూబ్...అనుకుని ఇష్టమైనవి ఉండక దక్కకపోవడమే జీవితం కదండీ...ఏముంది పట్టుదలతో కావాలి అనుకుంటే ఏదో ఒక రంగుకి నలుపు స్టికర్ అంటించడమే...లేదా ఉన్న రంగుల్లో దేన్నో దాన్ని ఇష్టపడ్డమే. అయినా అన్ని రంగులకూ మూలం తెలుపు మనసు తెలుపైతే చాలులెండి.
Deleteపద్మార్పితగారు తెలుపు రంగు వక్రీభవనమే ఇన్ని రంగులు..ఎంతో అద్భుతంగా ఉంది మీ వివరణ
Deleteఒకే రంగు ఉన్న ఘనాలు ఒక చోట ఉండవు అలాగే మనుషులు అంతా కలసి ఉండరని నిఘూడమైన అర్థాన్ని ప్రతిబింబింప జేసారు. మీ కవిత ఎప్పటి వలనే ఆలోచనాత్మకం.
ReplyDeleteమీ అభిమాన స్పూర్తి వాక్యాలకు ధన్యవాదాలు.
Deleteఒక్కసారి గెలిస్తే మానేయముగా మళ్ళీ మళ్ళీ గెలవ్వాలి అనుకుంటాము. అలాగే ఒక్కసారి ఓడిపోయామని మానేయకూడదు పద్మా...ఏదేమైనా ఆడుతూనే ఉండాలి జీవితమైనా ఆట అయినా సరే. Correct
ReplyDeleteమీరు చెప్పింది సత్యం.
Deleteఆపక ఆడుతూనే ఉండాలి
నమస్కారం _/\_
ReplyDeleteమీ బ్ల్లాగ్ కూడలిలో కలుపబడింది. http://koodali.club/
తెలుగు సాహిత్య ప్రియులను, బ్లాగ్ లోకంలో తెలుగు నెటిజన్లను మరియు ఎంతో మంది బ్లాగర్లను పరిచయం చేసిన 'కూడలి' అగ్రిగేటర్ అస్తమయం అవడం అందరికీ బాధ కలిగించింది. కూడలి లేని లోటును ఎన్నో తీరుస్తున్నా, దానికి అలవాటుపడ్డ వారు మాత్రం నైరాశ్యంతోనే ఉన్నారు. ఆ లోటును తీర్చడానికి కొంతవరకూ చేసిన ప్రయత్నమే ఈ కూడలి.క్లబ్ http://koodali.club/
కూడలి.క్లబ్ ని మీ బ్లాగులో జత చేయగలరు.
మీరు కూడలి లేని లూటును పూరించారు
Deleteమీ ఈ ప్రయత్నానికి నా హృదయపూర్వక వందనములు.
అర్పిత మనం ఆలోచించే విధానాన్నిబట్టి స్థితి మారుతుంది. జీవితం నిండా రోజూ బోలెడన్ని పజిల్స్ థ్రిల్స్ ఇంకా ఎన్నో అడ్డంకులు వాటిని ఆడడమే మన వంతు గెలుపు ఓటమి మనచెతుల్లో ఉండదు. దేన్నైనా స్వీకరించడమే తప్పదు.ఆటవస్తువును ఉపమానంగ వాడి చక్కని పోస్ట్ వ్రాసావు. అభినందనలతో-హరినాధ్
ReplyDeleteమీ అమూల్యమైన అభిప్రాయాలకు ఆశీర్వచనాలకు ధన్యవాదములు
Deleteఅదృష్టవంతులకే జీవితంలో సమస్యలు స్పష్టంగా కనబడేది లేకుంటే మాబోటి వారికి తెలియకుండానే సమస్యలు వచ్చి పడతాయి ఇష్టమైన కష్టమైన అడవలసిందే. చిత్రం చాలా చక్కగా నప్పింది.
ReplyDeleteఅదృష్టం దురదృష్టం అనుకోవడం అంతా మన ఆలోచనల్లో ఉందండీ.thank you.
DeleteMind blowing..awesome
ReplyDeletethank you
Deleteమీరెలా రాస్తారో చెప్పడానికి పైన కామెంట్లే చాలు ..కానీ మీరు ఎంచుకొనే అంశం .. వాహ్ .. మీరు స్పృశించని అంశం అంటూ బహుశ మిగలలేదు
ReplyDeleteమీరు మరీ పొగిడేస్తున్నారు
Deleteఅభిమానం అలా మీతో అనిపిస్తుంది కానీ నాకు తెలిసింది చాలా తక్కువండీ. బ్లాగ్లో మీ కమెంట్ ఆనందదాయకం. థ్యాంక్యూ
ఏ వస్తువైనా మీ కవితల్లో ఇముడయింపచేసి వాటికి ప్రాణం పోస్తారు
ReplyDeleteఅలా ఈసారి ఒక ఆటపరికరం తీసుకుని జీవితాన్ని దానితో ముడివేయడం చాలా బాగుంది పద్మగారు.
ధన్యవాదాలండీ మీ ప్రేరణా వాక్యాలే నాకు స్పూర్తి.
Deleteకను వీడిన కన్నీరు
ReplyDeleteబూడిదలో పోసిన పన్నీరు
చేజారిన స్నేహం గడచిన కాలం
నిజాయితి గల ఆత్మీయ బంధం
తాలుకు విలువ కోల్పోయాకే తెలిసేది
కాదనలేని సత్యమిది
అక్షర సత్యాలు రాసారు.
Deleteకాలితో తన్నితే కుదుటపడే కష్టాలు..నిజమైతే ఎంత బాగుంటుంది.
ReplyDeleteఅలాగని అయిన వాటినీ కానివాటినీ తన్నితే కష్టమేనండీ :)
DeleteBagundi blog kanulaku vindu chestu.
ReplyDeletethank you very much.
Deleteరూబిక్స్ క్యూబ్ ఆటలాంటిది జీవితం అన్ని సక్రమంగా గళ్ళలో ఉంచితే జీవితం పరిపూర్ణం. ఇలాంటి అద్భుతమైన ఆలోచన రావడమే తడవుగా దాన్ని అందమైన అక్షరాల్లోకి మలచి ముందుంచారు. శభాష్..మీకు మీ కవితకు దానికి అతికినట్లుగా అందించిన చిత్రానికి.
ReplyDeleteమీ అభిమానంతో కూడిన ప్రేరణా వాక్యాలకు అభివందనములు.
Deleteగిట్ల తెల్వని ఆటలు ఏం ఆడేది తెలిసిన ఆట గిల్లిదండా లెక్క జీవితమని సెప్పరాదుండ్రీ
ReplyDeleteపేరు ఏదైనా ఆట ఏదైనా జీవితం ఆడవలసిందే...నేను చెప్పేది ఏముంది సెప్పుండ్రీ. నమస్తే
Deleteబ్రతుకైనా పజిలైనా పరిష్కరించాల్సింది మనం..నైస్ లైన్
ReplyDeleteథ్యాంక్యూ గౌతమీ
DeleteWaiting 4 new post
ReplyDelete:) sabar ka phal meetha :)
Deleteజీవితమే ఒక అట
ReplyDeleteఅది వెలుగు నీడల సయ్యాట
ఆట ఆగిందా
ఒక సీటు గోవిందా
అన్నారు ఒక సినిమా కవి.
పెడ్డవారు చెప్పిన మాటలు ఆణిముత్యాలు.
Deleteఊపిరి ఉన్నంత వరకు ఆడక తప్పని ఆట జీవితం
ReplyDeleteఅది రూబిక్స్ క్యూబ్ అయినా చదరంగమే అయినా
అన్నిరంగులు సమ్మేళం అంతు చిక్కని జీవితం
ప్రణయాలు పంతాలు వ్యామోహపు చింతలు
జననం మరణం చివరికి అంతమవడమే జీవితం
శర్మగారు మీ అనుభ అమ్మూల్య అభిప్రాయాలని కాదనగలమా. మీకు శతాభివందనములు
DeleteLife is like a Rubik's cube, you go through twists and turns, but there is always a solution (జీవితం ఒక రూబిక్స్ క్యూబ్ లా ఉంటుంది, మలుపులు మరియు మెలికలు. కానీ తప్పక ఒక పరిష్కారం ఉంది)
ReplyDeleteThe game of life has two participants...spectators and players. Pick one.
మీరు స్మురించని అంశంపై నేను వ్రాయాలని కోరిక
ReplyDeleteతీరునా ఇది పద్మార్పితగారు..?
జీవితం ఇది ఒక్క ఆట కాదు అన్ని అటల సమ్మేళనము.
ReplyDeleteఈ గేం సూపర్ నచ్చింది నాకు
ReplyDeleteరూబిక్ క్యూబుకీ వేదాంతానికీ ముడిపెట్టి
ReplyDeleteభలే కవిత రాశారండీ!
పద్మార్పిత అంటేనే రమ్యార్చన కాబోలు!
ReplyDeleteరూబిక్ క్యూబుకు భళిభళి
శోభిలు వేదాంతమునకు సోకుల్మాడన్
మా బాగుగా ముడెట్టా
రే! పద్మా !మీకు సాటి రెప్పంబెవరే !
జిలేబి