పధకాల ప్రియుడు

నా రాకుమారుడవని ఎదను ఇచ్చి ఎదలోన దాగుండమంటే
పరువపు ఎత్తుపల్లాలు చూసి ఎత్తుపోతల పధకమే వేసావు!

ఉన్నతమైన ఊసులే చెప్పి ప్రేమికుడిగా ఉపాధి పొందమంటే
ఊహకందని ఊసులతో ఊపిరాడని ఉపాధి హామీ ఇచ్చావు!

మనువాడి ఆలిగా చేసుకుని అనురాగాన్ని కురిపించమనంటే
ఇదిగో అదిగో అంటూ అందీ అందని అభయ హస్తమిచ్చావు!

విజ్ఞానం ఉంది విద్యలెన్నో భోధించే వివేకవంతుడు అనుకుంటే
విర్రవీగే నైపుణ్యాన్ని చూపి విద్యోన్నతి పధకం అంటున్నావు!

సొగసుగాడి యవ్వారం చూసి శోభనంలో సున్నుండలు పెడితే
శృంగారమే కరువాయెనని పనికి ఆహారపధకం ఎందుకన్నావు!

సర్దుకుపోయి ఏదో ఒకగూటి పక్షులుగా కాపురం చేద్దామంటే
గుడిసెకన్నా గుండే పదిలమంటూ స్వగృహ పధకమనేసావు!

నేలపై నిలకడతో నిశ్చింతగా ఉండు నింగిలోకి ఎగిరిపోవద్దంటే
చేతిలో చిప్ప పెట్టి ఉడాయించి ఉడాన్ పధకాన్ని పాటించావు!

110 comments:

  1. శృంగార కావ్యానికి శ్రీకారం చుట్టక మూటా ముల్లే సర్దుకుని ఉడాయించాడన్నమాట.
    మీ కవితా నాయకిని ఇకపై జాగ్రత్త పడమని చెప్పండి..ఇలాంటి పధకాలకి మోసపోవద్దని.

    ReplyDelete
    Replies
    1. మన నాయకీ మరీ అంత తెలివితేటలు తక్కువైన ముద్దు కాదండోయ్..

      Delete
  2. Romantic with sad ending.
    Picture fantastic.

    ReplyDelete
  3. A Totally New Genre of Poem..
    It depicts the Theme in a New Way..
    Catchy Words.. Mixed Emotions..
    Usage of Schemes and Depiction in the Poem is Awesome.

    I could not give you a poetic reply this time, But overall your poem is awesome padma garu.

    ReplyDelete
    Replies
    1. తేట తెల్లమైన పదాలనల్లేటి సుమ మాలిక
      అక్షరాలన్ని పదనిసలాడే సమయానా
      మాట మరిచి పదాలను మరిచి
      పథకాలంటు ప్రాకులాడి చిట్ట చివరన మిన్నకుండేనా..

      పద్మ గారు.. ఇంత చక్కని పదాలతో అనువుగా పదాలను దెచ్చి భావములో ముంచి.. చక్కని కవిత కుసుమాలను దెచ్చి పరిమళింపజేసే మీలాంటి ఎందరో మహామహులకు తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలిపిన గౌ. కీ. శే. శ్రీ గిడుగు వెంకటరామముర్తి గారి జయంత్యోత్సవ సందర్భముగా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.

      Delete
    2. నా అక్షరాలని మీ ప్రేరణలతో ప్రకాశితం చేస్తున్నారు. మీ వ్యాఖ్యలకు ధన్యురాలిని.

      Delete
  4. వామ్మో..పధకాలు ప్లాన్స్ వేసి పడేద్దాం అనుకున్న ప్రియుడు బొక్క బోర్లా పడి పారిపోయాడు...అద్గదీ పద్మార్పిత పదాల పవర్.

    ReplyDelete
    Replies
    1. పాపం ఏదో అనుకుని ఇంకేదో చేయబోతే ఎవరి పనైనా ఇంతే అని మరో మారు తెలిసెనేమో..

      Delete


  5. జత పథకమ్ముల పద్మా
    ర్పితమ్మ సోయగపు సొగసరివలె జిలేబీ
    యుతమై బావను గాంచన్
    సతతంప్రియమై సొబగుల సారంబాయెన్ :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీ జీ...
      పద్మ సోయగాలు చూడనంటూ
      పదాలను ప్రియంగా కౌగలించుకుని
      తనివితీరా గాంచకనే పోయే
      అంతలోనే ఏమాయెనో ఉడాయించెన్ ;)

      Delete
  6. ఇంతకీ మీ వాడు వేసిన స్కీములు స్టేట్వా లేక కేంద్రప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వేసాడో పాపం బోల్తా పడ్డాడు.
    రాయితీలు ఇవ్వమని ఏమైనా రాయబారానికి వస్తాడనుకుంటా...
    తస్మాత్ జాగ్రత్త పద్మార్పితా/హా హా హా హా :)

    ReplyDelete
    Replies
    1. స్టేట్ పథకాలైనా సెంట్రల్ పథకాలైనా.. సదరు మంత్రి పదవి కాలం గడువు ముగిసే నాటికి ఆ స్కీములన్ని స్కాములేమోనని వాటిని మెల్లిగా జారవిడిచేస్తారని లోకుల ఉవాచ.. కాదని అనగలమా మధు సర్.. మీకు తెలుగు భాష దినోత్సవ శుభాభినందనలు

      Delete
    2. అవునౌవును...కరెక్టే :) :)
      నీకునూ తెలుగుభాషాదినోత్సవ శుభాకాంక్షలు

      Delete
    3. థ్యాంక్యూ మధు సర్ :)

      Delete
    4. సెంట్రల్ స్టేట్ రెండూ రెండే ఆ స్కీములకు అడ్జస్ట్ కాలేక మరింత ముందుగా చెక్కేసాడేమో.. :)

      Delete
  7. మంచివాడు పాపం పారిపోయాడు..
    చేతనైన పనని కల్లబొల్లి కబుర్లు చెప్పి
    లేనిపోని రోగాలు అంటించి/అంటించుకుని
    ఆరోగ్యశ్రీ పధకం క్రింద హాస్పిటల్ పాలు చేయలేదు.

    ReplyDelete
    Replies
    1. గూహులమ్మ పుణ్యమాని.. ఈరోజుల్లో అజాగ్రత్తలు తీసుకోని వారు ఎవరు చెప్పండి. జై ఆరోగ్యశ్రీ జై గూగులమ్మ :)

      Delete
  8. నండూరి వారి ఎంకి ని మించిపోయింది మీ సరసాల కంకి,
    అందుకే కామోసు జారుకున్నాడు ప్రియుడు జంకి.

    ReplyDelete
    Replies
    1. ఎంకి.. అచ్చ తెలుగులో "ఎంకి నాయుడు బావ"
      కంకి.. "ఎర్ర జండెనియలో" లో కంకి కొడవలి
      జంకి.. బెదిరి..

      మొత్తానికి తెలుగు దినోత్సవం రోజున అచ్చమైన తెలుగు పదాల ప్రాసలో వచ్చె విధంగా చాలా బాగా వ్రాశారు.

      మీకూ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు

      Delete
    2. ఆమొక వయ్యార నెలవంకీ
      అతనొక మహామొండీ పెంకీ
      ఇంకెలా కుదిరేను లంకె??? ఇంద్రధనస్సుji ;)

      Delete
  9. Life motham jingalalaa aite :-)

    ReplyDelete
  10. (disclaimer:
    appudappudu kavitaku sambandhinchina comment tho paatugaa madhya madhyalo sarada comments chestu vuntaanu.. vaati dwaara evarini kincha parachaalani kaadu.. evari manobhaavaalanu debbateeyaalani kaadu.. urukula parugula jeevitam lo kaasepilaa blog mukhamgaa relaxation kosamani.. anthaku minchi vere ae duruddesham ledani mundugaane teliyajesukuntunnaanu mee andaritho.. padma gaaru.. idi mee blog kanuka.. edaina tappugaa raasthe tappakundaa teliyajeyyagalaru..)

    om naarasimhane namah :)

    ReplyDelete
    Replies

    1. మీరు అభిమానంతో రాస్తున్నారు..ఇక అలుక ఆగ్రహం ఎందుకు చెప్పండి ? Most welcome.

      Delete
  11. పథకం వేసిన ప్రియుడిపై తిరుగు పథకం వేసి పడేయడం పద్మార్పితగారికి చెప్పాలా ఏమిటి
    మరో పోస్ట్ లో చిత్తు చిత్తు చేసెయ్యండి మా ఓటు మీకే. అన్నట్లు చిత్రం ముగ్దమనోహరం..

    ReplyDelete
    Replies
    1. ఇలా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అవసరమా చెప్పండి :)

      Delete
  12. ఘాటుగానే పడింది మరో ఢోసు.

    ReplyDelete
  13. రాజకీయ ప్రలోభాలను ప్రేమ పర్యవేక్షణలో పెంపొందించాలి అనుకుంటే జరిగే పర్యవసానం ఇదేనేం పద్మా..
    ఏదేమైనా మంచి ఆలోచనతో పదాలను పథకాలతో యేరి కూర్చి పేర్చినావు...శభాష్

    ReplyDelete
    Replies
    1. రాజకీయాల జోలికి దూరం దూరం..అదే శ్రేయస్కరం thanksandi.

      Delete
  14. శృంగారమే కరువాయెనని పనికి ఆహారపధకం ఎందుకన్నావు-ఇలా రొమాంటిక్ టచ్లు మీకే సొంతం

    ReplyDelete
    Replies
    1. ఏదైనా పని చేసినప్పుడే నోట్లోకి నాలుగు మెతుకులు వస్తాయి అవి అరుగుతాయి...కాదంటారా?

      Delete
  15. మీ పదాల పథకాలకు పెద్ద సలాం
    మీరు పెట్టే బొమ్మలకి ఐనా గులాం
    మీ భావాల ఖజానా ఎక్కడో చెప్పండి
    ఏమైనా స్కీములుంటే సెలవీయండి..

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస రాఘవ ఇనవంశాంబుధిసోమ దామోదర హరి అచ్యుత రాధామాధవ పన్నగశయన ఆదినారాయణ త్రివిక్రమ హయగ్రీవ లక్ష్మణాగ్రజ ఆదిమధ్యాంతరహిత విష్ణు అనంతపద్మనాభ త్రిభువనాయ హరిణిప్రియ భార్గవరామ హనుమత్సేవిత ఉంజలసేవిత కేశవ యదునందన అవ్యయ

      Delete
    2. నేనేం పధకాలు స్కీములు ఇవ్వను...ఇవ్వలేనండీ

      Delete
  16. మొత్తానికి స్కీము గీసి స్కాములో ఇరుక్కున్నట్లైంది గురుడి పరిస్థితి :)

    ReplyDelete
    Replies
    1. మీరు వెక్కిరించక సపోర్ట్ ఇస్తారని వెయిటింగ్ మరి.

      Delete
  17. రాచరికపు టెక్కులు చూసి మోసపో యువతకు జాగృతిని కలిగించారు.
    ఇంతకూ చిత్రంలో నెరజాణని వదిలి వెళ్ళినవాడు వెర్రివాడు.

    ReplyDelete
    Replies
    1. జాగృతి చేస్తూ..మనం కూడా జాగ్రత్తగా ఉండాలండోయ్ :)

      Delete
  18. meru super rastunaru
    awesome postings.

    ReplyDelete
  19. ఇన్ని స్కీములు స్కాములకొరకె అని ఎందుకు గ్రహించలేదు... మీకు పిచ్చి

    ReplyDelete
    Replies
    1. పిచ్చని డిక్లేర్ చేస్తే...ఇక ఏం చెప్పినా ఎవరు వింటారు చెప్పండి :)

      Delete


  20. పథకమ్ముల పట్టి మగడి
    కథలన్ సరిజూడు కవన కంజదళముఖీ !
    విధవిధముగద జిలేబీ
    పథమున నీవిచ్చు కిక్కు పల్కుల పాగుల్ !

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. పద్యానికి జిలేబి స్కీం కింద మీకు రాయచోటి జిలేబీలు పార్షల్ చేయబడును... 😊😊

      Delete

    2. ఏమండోయ్ విష్ వాక్ సేన వారు

      రాయచోటి జిలేబుల కేమైనా స్పెషాలిటీ ఉందా ? :)

      జిలేబి

      Delete
    3. జిలేబి వారి జాంగ్రి !

      చాలా కాలం గా అదేమి ఈ పేరు జిలేబి . వీరికి జిలేబి అంటే అంత ఇష్టమా జిలేబి అని పేరెట్టు కున్నారు అని అనుకున్న వారూ ఉన్నారు !

      సరే , జిలేబి వారు జాంగ్రీ వేస్తే ఎట్లా ఉంటుందో మరి !?

      జాంగ్రీ కి జిలేబీ కి వ్యత్యాసం ఉందంటారా ? రెండూ స్వీటె . ఎక్కువైతే వెగటే . జిలేబి + జాంగ్రీ ఒక్కరే వేస్తే , అదే బాణలి లో వేసారను కొండి అప్పుడు ఇది జిలేబి యా జాంగ్రీ యా అన్న సందేహం కూడా రాక పోదు మరి .

      జాంగ్రీ కొంత మంద పాటి . జిలేబి సన్నపాటి . ఇదీ ఒక వ్యత్యాసమేనా ? నాలుగైదు జిలేబి లను కలిపేస్తే ఇక జాంగ్రీ అయిపోదూ ? ఆ పాటి దానికి స్పెషల్ గా జాంగ్రీ వేయాలా అన్న మాటా రాక మానదు !

      పూర్వ జమానాలో రాయచోటి లో పని జేసే టప్పుడు ఓ సాయిబు వేసే జాంగ్రీ అంటే పడి చచ్చి కొని తినే వాళ్ళం . ఈ జాంగ్రీ ని ఆ సాయెబు కోవా జాంగ్రీ అని అమ్మే వాడు . అప్పటికే అతను అరవై సంవత్సరాల పై బడి ఉన్న వాడు . ఇప్పుడు వారి సంతతి ఏమైనా ఆ కోవా జాంగ్రీ ని వేస్తున్నారేమో మరి .

      ఇంతకీ ఇట్లా తాడూ బొంగరం లేకుండా టపా పెడితే అది జాంగ్రీ అవుతుందా ? లేక జిలేబి అవుతుందా ?

      ఇక జిలేబి వారి జాంగ్రీ ఏమిటి అంటారా ?

      అసలు జాంగ్రీ వేద్దామా జిలేబి వేద్దామా అన్న సందేహం లో కొట్టు మిట్టాడి మా అయ్యరు గారి ని అడిగా ఏమండీ అయ్యరు గారు ఇట్లా జాంగ్రీ జిలేబి అంటారు గా ? ఇవన్నీ మన భారద్దేశ పిండి వంట లేనా ? లేక 'ఫారెను' వంట లా అని ?

      వారికి తోచింది వారు చెప్పేరు - ముసల్మాను లు భారద్దేశం పై దండ యాత్రల కు వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ వారితో బాటు వచ్చిన వంటకాలు అయి ఉండ వచ్చు - కాల గతి లో భారద్దేశ పిండి వంటల లో కలిసి పోయి ఉండ వచ్చు అని .

      ఉదాహరణ కి ఈ ముంత మామిడి పప్పు ఉంది చూసేరు - ఇది పోర్చుగీసు వారితో వచ్చింది - ఇప్పటి కాలం లో ఈ జీడి పప్పు వేయని పాకం ఏదైనా మన దేశం లో మరి ఉందా ?

      ఇది కాదా మరి భారద్దేశ గొప్ప దనం ? ఆంగ్లం లో అంటారు చూడండి - మెల్టింగ్ పాట్ అని అట్లా దేశం లో కి వచ్చిన ప్రతిది దేశం లో ఇమిడి పోయి మరో సరి కొత్త రూపాన్ని సంతరించు కోవడమే కదా ఈ భరత భూమి గొప్ప దనం !

      ఇస్లాము దేశ వాళీ సనాతన ధర్మం తో కలగలిసి సూఫీ - దేశవాళీ సూఫీ అవడం, ఈ రెండిటి మధ్యా ఉన్న మంచి విషయాలను గ్రహించి శిక్కు మతం ఉద్భవించ డం ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు జాంగ్రీ లు ఎన్నైనా వేయ వచ్చు !

      మరో ఉదాహరణ - దేశవాళీ తనదై చేసేసు కున్న మొబైలు !

      బయలు కెళ్ళినా మొబైలు పట్టు కునే వెళ్ళే వాళ్ళం అయ్యేంత దాకా వచ్చేసా మంటే ఇది మరో మెల్టింగ్ మెగా దేశం కాదూ మరి !



      ఈనాటి e-జాంగ్రీ తో
      చీర్స్ సహిత
      జిలేబి

      Delete
    4. సారీ ! విష్వక్సేనుడు
      గారూ ! కన్ఫ్యూజనండి కాస్త , ' జిలేబీ '
      వారెవ్వా ! హాట్ హాట్ గద !
      తీరదు నాల్క పయి దురద , తినుచుండ వలెన్ .

      Delete
    5. జిలేబోపాఖ్యానము సూపర్ అసలు.. ఇన్నాళ్ళుగా ఎవరూ కూడా ఇలా జాంగ్రీ తో కొట్టలే !

      Delete


    6. హా! జాంగ్రి ! జిలేబీ ! చీర్స్ !
      కాజూ బర్ఫీలు! బూంది! కాదన మాకోయ్ !
      చేజారనీకు పాకము
      ఓ జనులారా! పసందు నోరూరగనన్ :)

      జిలేబి

      Delete
    7. తియ్యని జిలేబీలు తినిపించ
      విశ్వాన్నంతా జాలీగా చూపించ
      జ్ఞాన పండితులంతా ఏకమై అలరించ...
      ఆనందించెదనే కానీ అంతకు మించి నేనేం రాయగలను
      నీహారిక..వెంకట రాజారావు గార్లకు నమోఃవందనములు. _/\_

      Delete
  21. పంక్తులు పదాలు అన్నీ బ్యాలన్స్ చేసి చూసి ఫిక్స్ పెట్టి కిక్ ఇచ్చి మిమ్మల్ని స్కీములతో బోల్తా కొట్టించే ధైర్యమా!!!!!!
    ఎవరక్కడ.....ఆ ఉడాయించిన ఉత్తమోత్తముడుని ఉరికి సిద్ధం చేయిది.😛😌😌😒😝😜😜

    ReplyDelete
    Replies
    1. ఓలున్నాలు.. ఓలు లేలు.. 😊

      Delete
    2. మరీ ఉరిలాంటి పెద్ద శిక్ష ఎందుకు...కొన్నాళ్ళు బ్రకనివ్వండి పాపం.

      Delete
  22. ఉడాన్ స్కీము లేకర్ బచ్ గయా సాలా 😝

    ReplyDelete
    Replies
    1. క్యా మహీ..సాలా కబ్ బనా :)

      Delete
  23. స్కీములు స్కెచ్ వేసి ఎవరు ఎవరికీ సేవలు చేసి సెక్యూరిటీ ఇచ్ఛే కాలం పోయింది.
    ఇప్పుడు అంతా సింపుల్.. ఉన్నామా ఎంజాయ్ చేసామా ఉడాయించామా...
    ఎవరికి వారే స్కెచ్ వేసుకుని సేఫ్ గా ఉండాలి అంతే...అంతే... అంతే!!!

    ReplyDelete
    Replies
    1. మీరు చెబితే అంతే..అంతే..అంతే :)

      Delete
    2. మీరు మళ్ళీ రాయడం మొదలు పెట్టడి సృజనగారు. మీ స్మృతులు సరదాగా సాగేవి.

      Delete
  24. బ్లాగ్ చాలా అందంగా అమరింది.
    భేషుకైన భాషతో అలరించావు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ..శర్మగారు _/\_

      Delete
    2. ఆయుష్మాన్ భవః

      Delete
  25. నమ్మకు నమ్మకు ఎవ్వరినీ
    మనసులో దాగిన మర్మాన్ని
    పధకాలంటూ ప్రేమంటూ
    చేసే మోసాన్ని మాటల్ని..
    బ్రతుకును మార్చేస్తాన్న వాడిని
    కౌగిలించుకుని గొంతుక పట్టేటోడిని
    వాడి జల్సాలకు నిన్ను బుగ్గిచేస్తాడు
    నమ్మి మనసు ఇచ్చి మోసపోకు..

    ReplyDelete
    Replies
    1. ఇలా జాగ్రత్తలు చెప్పేవారు అరుదు..తప్పక ఎలర్ట్ గా ఉండాలి.

      Delete
    2. మీ ఈ కమెంట్ కవితలు బ్లాగ్ లో పోస్ట్ చేయండి(అన్యధా భావించకండి...బాగున్నాయి.

      Delete
    3. అలాగే
      మంచి సూచన
      ధన్యవాదములు

      Delete
  26. వామ్మో పద్దక్క నన్ను గిట్ల బద్నాం జేస్తివి

    నేనెవల్కి సెప్పుకోను తల్లో? :( ? ! :)

    ReplyDelete
    Replies
    1. బద్నాం చేస్తే బీ తట్టుకుని ఫ్రూఫ్ చేసినోడే గొప్పోడు..

      Delete
  27. అసలు మనిషి గురించి తెలుసుకోకుండా రాకుమారుడు అంటూ వెంటపడడం తప్పు 😛😌

    ReplyDelete
    Replies
    1. నేను ఒక ఇసుక పువ్వును
      అందినట్లే అంది చేజారిపోతాను

      Delete
    2. ఇసుకలో పువ్వైతే చేతికి అందుతుంది అనికేత్ గారు
      కాని చేతిని చూసుకుంటే చేతి నిండ ముళ్ళులే.. ఇసుకలో మొలిచే మొక్క క్యాక్టస్ కదా మరి.. అందుకే ఇసుకలో పూచే పువ్వులు కనువిందుగా ఉంటుంది.. వాస్తవం కదా.. పెద్ద మొక్కైతే ముళ్ళే ముళ్ళు.. అక్కడెక్కడో రంగులతో విరబూసే పువ్వు.. ఈ కమెంట్ చూసి విచ్చుకోవాలి నవ్వు..

      Delete
    3. ముఖం చూస్తే రాజకుమారుడు అనుకుంటాం...మనసులోదూరి చూస్తేనేగా తెలుస్తుంది

      Delete
  28. సర్దుకుపోయి ఏదో ఒకగూటి పక్షులుగా కాపురం చేద్దామంటే
    గుడిసెకన్నా గుండే పదిలమంటూ స్వగృహ పధకమనేసావు
    అన్ని పథకాలను చక్కగా ఇమిడించి వ్రాసారు పద్మగారు.

    ReplyDelete
  29. మనిషి జీవితం స్కీంస్ & ప్లాన్స్ పైనేకదండి నడుస్తుంది/నడిపిస్తుంది

    ReplyDelete
  30. Padma wonderful narration, well planed schemes
    Thunder & Wondered Skills you had.
    మంచిగ రాసినావు.
    నాకు చాల నచ్చింది.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానం నా అక్షరాలను అర్థం చేసుకునేలా చెస్తుంది. ధన్యోస్మీ.

      Delete
  31. పోస్ట్ పెట్టి చిత్తు చేసారు.

    ReplyDelete
    Replies
    1. ಎಲಗೆಲಗ ಎಲಗ
      :
      ಅನಗನಗನಗ ಒಕ ಕಾರಡವಿ
      ಆ ಅಡವಿಲೋ ಅಡುಗುಲೇಸ್ತು ಓ ಆಲೋಚನ ರವಳಿ.

      Delete
    2. అదేమిటండీ...చిత్తు చేసాననే బదులు చిన్ని నవ్వు తెప్పించాను అనొచ్చుగా :)

      Delete
  32. సర్దుకుపోయి కాపురం చేయడం ఏమిటో అర్థం కాలేదు ఈ స్కీం..

    ReplyDelete
    Replies
    1. జీవితం సజావుగా సాగడానికి సర్దుకు పొమ్మని సలహాలు ఇస్తారుగా..అందేదో మనమే సర్దుకుపోవాలని అలా స్కెచ్ వేస్తే.. ఇలా :)

      Delete
  33. మీరే వ్రాయగల శీర్షిక సీరియస్ కవితలు ఇవి.

    ReplyDelete
    Replies
    1. ఒక శీర్షిక పై రాయడం అప్పట్లో డిఫరెంట్ గా ట్రై చెసింది. ఇలా కంటిన్యూయింగ్, యోహంత్ తెలుగుని మరచిపోలేదు. థ్యాంక్యూ

      Delete
  34. ప్రేమ, ప్రియుడు కలల్లో ఊహాగానాల్లో బాగుంటాయి
    నిజజీవితంలో ఇవన్నీ ట్రాష్ అనుకుంటాను..

    ReplyDelete
    Replies
    1. అందుకే కదా కలల చుట్టునే కవిత్వం పరిభ్రమించేది.ఆ వూహా లోకాన్ని అయినా ఆస్వాదించనీయరా మేడం?

      Delete
    2. నిజాలు భయంకరంగా ఊహాగానాలు అహ్లాదంగా ఉంటాయి...తప్పదు.

      Delete
  35. జాతకాలు చూసి పెళ్ళిళ్ళు, పథకాలు వేసుకుని ప్రేమ వ్యవహారాలు నడిపితే దాని పర్యవసానం ఇదేనని వ్రాయడం వరకూ ఓకే. ఇలాంటి పథకాలకు జనాలు లొంగిపోకుండా ఉండాలి. అప్పుడే నీ రాతలకు నీవు ఉపదేశించే నీతులకు సార్థకత అర్పిత. చిత్రంలోని గుమ్మ చూపు అమాయకంగా రెచ్చగొట్టే విధంగా బాగుంది-హరినాధ్

    ReplyDelete
    Replies
    1. మీరు ఆరోగ్యంతో కోలుకుని మరలా ఇలా బ్లాగ్ కి విచ్చేసి కమెంట్స్ పెట్టడం ఆనందం. థ్యాంకండీ

      Delete
  36. ఎత్తుపోతల పధకమే వేసి .. ఉడాన్ పధకాన్ని పాటించాడు .. ( జారిపోయాడు అంటే వాడెంత దిగ జారుడు గురుడో ... ) ..:)

    ReplyDelete
    Replies
    1. మెహదీ అలీగారూ...మీ రాక నాకెంతో సంతోషమండీ. థ్యాంక్యూ జీ.

      Delete
  37. ఉడాయించిన వాడ్ని పట్టుకుని పిస్టోల్ పెట్తి కాల్చేదా పద్మాజీ

    ReplyDelete
    Replies
    1. కాల్పించాను అన్న నేరంతో శిక్ష నాకెందుకు చెప్పండి.. వద్దు వదిలేయండి ;)

      Delete
  38. పథకాలతో మమ్మల్ని ఇలా ఆకట్టుకునే పథకాల పద్యం రాసినందుకు ధన్యవాదాలు మేడం... ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఆరాధించే మీ అనానిమస్ అభిమాని!

    ReplyDelete
    Replies
    1. కలయా నిజమా...అదృశ్యమై చాలా కాలానికి హఠాత్తుగా ప్రత్యక్షమైతిరి.
      కుశలమా? అభిమానులు మీ అడ్రస్ చెప్పమని మెసేజ్స్ పెడితే ఏమని చెప్పాలో అర్థం కాలేదండీ. నాకే తెలియదు అంటే నమ్మరుగా.
      ఏమైనా కమెంట్ చూసిన నేడు ఎంతో సుదినం.
      ఇకపై చెప్పి/నోట్ పెట్టి వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.
      మీ అభిమాన ఆరాధనలకు అభివందనములు _/\_

      Delete
    2. ఒక బ్లాగుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండడం మొట్టమొదటిసారి చూస్తున్నాను. అందునా నా అభిమాన రచయిత్రి అయిన పద్మార్పితగారిది.
      ఆశ్చర్యం
      ఆనందం
      అమోఘం

      Delete
    3. ఏమైనారు అభిమానం బ్లాగ్ సృషించినవారు ఇన్ని రోజులకు దర్శనం ఇచ్చినారు

      Delete
  39. :) :) ఇంతకంటే ఏమి చెప్పగలను. భలే ఉంది. బావుంది.

    ReplyDelete
    Replies

    1. మీ కవితలకు అప్పట్లో నేను ఫిదా...చాన్నాళ్ళుగా మీరు రాయడంలేదు. ఇక పై మళ్ళీ రాస్తారని అభిలాష. పాత బ్లాగర్స్ పలకరించడం మహదానందంగా ఉంది. ధన్యోస్మి.

      Delete
  40. ప్రేమతో మాయ చేయదం సబబు కానీ ఇదేమి స్కీముల గొడవ.
    విశ్వమంతా ఇలా ఉండదులెండి.
    మీ కవిత చిత్రము రెండూ అదుర్స్.

    ReplyDelete
    Replies
    1. పాత ఆత్మీయులంతా అనుకుని వచ్చారా అనిపిస్తుంది.
      మాయావిశ్వంగారు మరో మారు మీ మాయావిశ్వంలో మమ్ము విహరింపజేయ ప్రార్థన. థ్యాంక్యూ

      Delete
  41. సొగసుగాడి యవ్వారం చూసి శోభనంలో సున్నుండలు-గిలిగింతలు పెట్టింది

    ReplyDelete