నీకు సరిహద్దులంటూ ఏమీ లేవుగా
ప్రవహించు కన్నీరా ప్రవహిస్తూనే ఉండు
హృదయ వ్యధలన్నీ తీరేలా ప్రవహించు
నీవు కంట జారితే వేదనలు కరిగేను
నీకు నేనేం గిరిగీయలేదుగా పొంగుతూ
సగం ప్రవహించి ఆగే నదిలా కాక
సాగరంలా ఉప్పొంగి రోధించు...
కనుల భాషను కన్నీటి రూపంలో చెప్పి
వేదన తీరి మది భారం తీరేలా రోధించు
లోపల బడబాగ్నిని ఎవ్వరూ చూడలేరు
కనురెప్పల కదలికతో నువ్వు కాంచి చల్లార్చు!
కన్నీటికి స్వాగతం
ReplyDeleteవేదనతోనా?
వేడుకతోనా?
తెలుపలేదు.
రాగద్వేషాలకు తుది మెరుగులు
ReplyDeleteహావభావాలకు కొస మెరుపులు
బాధ నుండి బయట పడటానికి హంగులు
కన్నీటి ప్రవాహాన్ని ఆపటానికి చిరునవ్వు ఆనకట్టలు
కట్టలు తెంచుకున్న వేదనకి ఆనందపు అమరికలు
అరమరికల జీవితానా రాజితో సరిదిద్దుడు పూతలు
సంతోషాన్ని తెలుపటానికైనా చాలి చాలని చిన్ని జీవితమిది
వేల జన్మలు తపము చేసిన గాని దుర్లభమైన జీవితమిది
మిథ్య కి సత్య కి నడుమ ఊగిసలాడే చిరు జీవితమిది
కాదంటిరా పద్మ గారు..!
~శ్రీ~
మాధవ నారాయణ విష్ణు
ఏడిస్తే మనసు బరువు తగ్గునేమో కానీ కష్టాలు తీరవు మాడంజీ😢
ReplyDelete
ReplyDeleteఏడిస్తే మీ మదిలో
భారము తీరంగ వచ్చు పద్మార్పిత ! కా
నీ రవ్వంతయు కష్టము
లారవు తీరవు జిలేబి లావుల్ దప్పున్ !
జిలేబి
ఏడుపు కూడా ప్రాసలు
Deleteవీడక నేడ్వంగ వలయు విబుధా ! పద్యం
తేడాగా నేడిస్తే
బాడబులకు నేడ్పు వచ్చి పడి పడి తిడుదుర్ .
Deleteప్రాసల ఊసులు మనకే
లా! సారూ ! యేడ్పుగొట్టులకు కొదవే లే
దౌ ! సమరంబున కైనా
ఓ సామే, సరసపు సరిజోదులు గురువుల్ :)
జిలేబి
వేదనలోను వేడుకలోను వ్యధల్లో నవ్వడమే అని చెప్పి ఏడవడం ఏమిటో అంతుచిక్కకుంది.
ReplyDeleteకలువాల కన్నుల్లో కన్నీటి కాలువలా..?
ReplyDeleteమనోహర మనో వీధిలో విషాధ గీతికలా..?
ఓదార్పు నీడన నిట్టూర్పు జాడలా....?
ఏమిటీ దైన్యం, ఎందుకీ నైరాశ్యం..?
మళ్ళీ మరలి రావమ్మ వసంతమా..!
వినిపించుమా వుల్లాస కవితా సరాగమా..!
పది మార్లు పలకరించగ
Deleteతొమ్మిది మార్లు వేదన తరిమే
ఎనిమిది దిక్కులు పెక్కటిల్లే అశనిపాతపు కేకలకి
ఏడు వర్ణాల హరివిల్లు సైతం కన్నీరు మున్నీరాయే
ఆరు ఋతువులలో వర్షాకాల భీభత్సమే
పంచ భూతాలను సరిసమాన రీతిలో పలకరించ
నాలుగు మార్లు బతిమిలాడితే వినీలాకాశాన్ని
మూడు నాళ్ళ ముచ్చటగా తిరుగు పయనమయ్యే
రెండే రెండు రోజుల యెడతెరిపి
ఒక్క ముక్కలో జడివాన తుప్పెర
ఇక్కడ చిన్నపాటి కవిసమ్మేళం మరిపిస్తుంది..భళ్ళారే
Deletethe one who can view the whole world with compassion and who can visualize the whole world as a single entity is the best photographer..till date.. it is the god himself..
Deletemay all your wishes come true
good morning goutami gaaru
om atchutanantamadhavamukundaramadhavaraaghavanarayananarsimhadaamodaradaasarathivenkateswaravamana
నీ కన్నులు కైపెక్కించాలి..
ReplyDeleteకానీ కన్నీటి తెరల మాటున తడవకూడదు
నీ ముఖం తెల్లని పద్మంలా విప్పారుతూ వుండాలి
కానీ ఎర్రమందారంలో ఎరుపెక్కకూడదు..
నీ కవితలు అందరినీ అలరించాలి
కానీ దుఃఖంతో మనసు తడమకూడదు
హృదయ పలుకులు ఆవేదనలైతే
ReplyDeleteఅన్ని రాత్రులు అమావాస్యలే..
సమస్యలు సాగరపు సునామీలైతే
సంతోషాలు మునిగే సుడిగుండాలే!
Philips 9W Cool Day Light LED Bulb.. Chesthundi Mee Prati Amavasya Nishidhini Punnamilaa..
DeleteGlobal Maritime Distress and Safety System along with Tsunami Warning and Cyclone Warning Systems will help necessitate and capture early signals of fatal Tides..!
Deleteagain sorrowful poem :(
ReplyDeleteవ్యధలు తెలియని అగాధం
ReplyDeleteఆశ అనుక్షణం పసితనం
వయసేమో నెమలి నర్తనం
నవ్వితే నిత్యము యవ్వనం
గుండె గోదారిలా పరవశం
కలలు నెరవేరితే వసంతం
మనసు వెన్నెల్లో విహంగం
జీవితం గలగలపారే జలపాతం
ప్రతీ జన్మసరిగమల సంగీతం..
కన్నీరు చాలా విలువైన
ReplyDeleteవృధాగా పోనీయ వద్దు.
సాగరంలా ఉప్పొంగి రోధించు
ReplyDeleteసముద్రమంత కన్నీరు అవసరమా మాడంజీ/
ఆనందమొస్తే ఆకాశమంత సంతోషించరు.. చిరునవ్వు నవ్వి వెంటనే నార్మల్ అయిపోతారు.. కాని అదే దుఃఖం వస్తే సంద్రమంత కన్నీరు కార్చుతారు నార్మల్ అవ్వటానికి కూడా కొద్దొ గొప్పొ టైమ్ పడుతుంది.. ఎందుకి వ్యత్యాస..
Deleteఅన్ని భావోద్వేగాలు మనసుకే సొంతం.. అటువంటప్పుడు సంతోషానికి కేటాయించని సమయాన్ని దుఃఖానికి వేదనకి కేటాయించి మథన పడతారెందుకు అని ప్రశ్నించే ప్రయత్నంలో బహుశ పద్మ గారు ఈ కవితను రాసి ఉంటారు నందుగారు..!
సుఖంగా ఉన్నప్పుడు నవ్వి కష్టాలలో ఏడవడం మానవుడి సహజ లక్షణం.
ReplyDeleteకనుల రాలే కన్నీరు..
Deleteమోవిపై పూచే నవ్వు..
సంతోషమే కాగా పన్నీరు..
దిగులేల దరిచేరేనో శెలవివ్వు..
సుఖ దుఃఖాలు జీవితం లో భాగమండి గౌతమి గారు
హృదయ వేదనలు అంతులేనన్ని :(
ReplyDeleteగిట్ల జీవితం కడదాక ఏడ్వమంటె
ReplyDeleteగెట్లా ఏం జేసేది కష్టం తల్లో
కన్నీటికి అదుపు హద్దులు లేవంటే రెచ్చిపోయి రోదనలు ఆపవు.
ReplyDeleteఅందుకే అన్నింటికీ ఒక హద్దు గిరి గీసుకుని బ్రతకడం మంచిదని నా ఉధ్ధేశం.
లోపల బడబాగ్నిని ఎవ్వరూ చూడలేరు
ReplyDeleteకనురెప్పల కదలికతో నువ్వు కాంచి చల్లార్చు..
వేదనలో వేదాంతం
ReplyDeleteచల్లని సాయంకాల వేళ
ReplyDeleteచినుకు ముత్యాల సడిలో
గర్జిస్తున్న మేఘాల మెఱుపులో
విఘ్నేశ్వర పూజ నిమిత్తం పండు పత్రిల మేళ
పాలవెల్లి మొదలుకుని అర్కపత్రం వరకు
ఆకు అలములన్ని దెచ్చి కుప్పగా పేర్చి
గణపతికి ఘనస్వాగత తోరణాలు కూర్చి
మొదటి రోజు పూజతో చివరి రోజు నిమజ్జనం వరకు
భక్తి శ్రద్ధలతో మిము కొలిచే భక్తజనసందోహం
చిన్న పెద్ద తేడాలేవి లేకుండా అయ్యేరు దాసోహం
అంగడి నుండి తెచ్చా ఇంటికి
పూజ పురస్కరం మొదలు రేపటికి
అందరు బాగుండాలి ఇదే ఇందరి మొక్కు
అందరిని కాపాడే గణపయ్య నీవే ఇక దిక్కు
పద్మ గారు.. మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికి ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు
~శ్రీ
వినాయక చవితి శుభాకాంక్షలు
Deleteమీకు కూడా కమల గారు
Deleteఅర్పితగారూ...ఓ మాంచి రొమాంటిక్ పోయం రాసేద్దురూ :)
ReplyDelete_/\_ నా వ్యధల భావాలను, వేడుకాక్షరాలను సమంగా ఆదరించి స్పూర్తినిచ్చి రాయడానికి ప్రేరేపిస్తున్న అందరికీ నా వందనములు. _/\_
ReplyDeleteవద్దు వద్దు ఇటువంటి వ్యధలు.
ReplyDeleteవేదనలు అక్షరాల్లో చదవడానికి అందంగాను హార్ట్ టచింగ్ ఉంటాయి. జీవితంలో దరి రానీయకు.-హరినాధ్
ReplyDelete