నీకు నాకున్న బంధమేమో తెలియదు
నాతో నీవుంటే నిండుపున్నమి జీవితం
నీవు దూరమైతే ఊపిరి నిండా శూన్యం!
క్షణాలన్నీ శత్రువులై పగబట్టెనని తెలీదు
మది మెదడు కలుషితమైనా కానరాలేదు
నీవులేక చెప్పుకున్న ఊసులే చిన్నబోయె
చెప్పాలనుకున్న మాటలేమో మూగబోయె!
గమ్యం దారిలో గల్లంతై అడుగు పడ్డంలేదు
నీడ కూడా వదిలేసె అందుకే వెలుగులేదు
నిర్మానుష్యం జీవితంపై పెత్తనం చెలాయించి
నాకునే అపరిచితురాలినైతి నీకై ఆలోచించి!
ఎడబాటుతో వేదనింత దగ్గరౌతుందనుకోలేదు
గుండెమంట చల్లారే మార్గం తెలియడంలేదు
నాతో నీవు లేక మరణం నన్ను తాకనంది
జీవించడం చేతకాని బ్రతుకు నరకంలాగుంది!
చిత్రంలో సుందరి ప్రియం
ReplyDeleteఆమె పలుకులు మధురం
మీకు నచ్చిందిగా...సంతోషం.
Deleteమీ కవితలో విరహం వయ్యారాలు పోతుంది..పిక్ చాలాబాగుంది!
ReplyDeleteవిరహం వంకర్లు పోతుంది అంటే బాగుంటుందేమో :)
Deleteమీ ఈ ప్రేమ భావాలు చదివి పరుగున లగెత్తుకొచ్చేను ప్రియుడు, అంత లవ్లీగా రాసినారు పద్మార్పిత.
ReplyDeleteలగెత్తుకొస్తే అప్పుడు ఇలా రాయలేనుగా :)
Delete
ReplyDeleteప్రతిక్షణం దూరం అవుతున్నట్లు అనుకుని
అనుక్షణం ఇంకా దగ్గర అవుతున్న భావన
కాలాలు మారినా కలలు మారినా...
మొదటిప్రేమ ఎప్పటికీ తరగదు చెరగదు
తొలిప్రేమ తొణకదు అంత స్ట్రాంగ్ అంటారా ;)
Deleteపలకరిస్తే పలుకే మూగబోయే
ReplyDeleteకను సైగ చాలు మతిపోయే
కాని పలకరిస్తే కదా తెలిసేది
కాని తిలకిస్తే కదా తెలిసేది
నిన్న మొన్నటి దాక పెదవులపై చిరునవ్వు
నేడేందుకనో కనురెప్పలు వాల్చింది చూసి చూడనట్టు
క్షణాలన్ని నిమిషాలు.. నిమిషాలన్ని గంటలాయే
గంటలు కాస్త రోజులు.. రోజులు నెలలాయే
ఒకటి.. రెండు.. మూడూ.. యేళ్ళు
ఒకటి.. రెండు.. మూడూ.. నెలలు
విరహాన్ని సైతం సవివరంగా వర్ణించినారు పద్మ గారు
రెట్రో ఇమేజ్.. రివైటలైజింగ్ పోయేమ్..
~శ్రీ~
గణాధ్యక్షాయ గణాధిపాయ
వో కౌన్ థా.. జో ఆయా ఉస్కే ఖయాలోఁ మేఁ
Deleteఘబ్రాయా హుఆ సా.. సికుడా హుఆ సా..
మగర్ ఏక్ అప్నాపన్ థీ ఉస్కే హరేక్ బాత్ మేఁ
సెహ్మా హుఆ సా.. అచ్రజ్ భరి ఆఁఖోఁ మేఁ సప్నా సా..
వో కౌన్ థా.. జో ఆయా ఉస్కే ఖయాలోఁ మేఁ
"అక్షరాల వెనక దాగిన భావాలు పలికే అక్షరాలకు రాదేది సాటి
Deleteభావం ముఖ్యం ఎనలేని అభిమానం తత్సమానం అదే దానికి తార్కాణం"
సార్ మీకు బ్లాగ్ లేదా?
పై వాక్యాలకు మరికొన్ని పోస్ట్లకు కమెంట్ పెట్టడం కుదరలేదు అందుకే పద్మార్పితగారి బ్లాగ్ లో రాశాను.
మీ పోస్త్లు చాలా బాగున్నాయి.
నమస్కారం కమల గారు..
Deleteవీలు చిక్కినపుడు లేదా మనసు బాగోలేనపుడు లేదా మదిలోని భావాలను అక్షరాలుగా పేర్చి కవితగా లేదా పద్మ గారి బ్లాగ్ లో ఆమే రచించే కవితలకు మరి కొన్ని బ్లాగ్ లలో కమెంటుతుంటాను.
నా వ్యాఖ్యలు మీకు నచ్చినందుకు సంతోషం కమల గారు.
భావాలు అక్షరాల నయగారాలై కవితల సేలయేరులా ఉప్పొంగే "కావ్యాంజలి" ఈ నవంబర్ తో పదేళ్ళు పూర్తి చేసుకోబోతోంది.
మీ తిరుగు జవాబుకు ధన్యవాదాలు.
DeleteSridhar Bukya garu..ధన్యవాదాలు అంటూ నమస్కరించడం తప్ప ఇంకేం రాయలేను
DeleteSoooooooooooooper photo.
ReplyDeleteOhhhh thankulu :)
Deleteమీ కవితలు ఆశలజడికి చిరునవ్వులా అనిపిస్తాయి.
ReplyDeleteఆశలు తీరినా తీరకపోయినా నవ్వేయండి.
Deleteకారుమబ్బులు కమ్ముతున్నా
ReplyDeleteభానుడు మండుతున్నా
పక్షులు వలసపోయినా
నువ్వెప్పుడూ నాతో ఉంటావు...
ఉక్కపోతలో చల్ల గాలిలా
బాధల్లో నాకు ఓదార్పుగా
కషాల్లో చేయూతనిచ్చే హస్తంలా
నువ్వు నాతో ఎప్పుడూ ఉండాలి...
ఉంటావు కదా...నా నమ్మకం ఉంటావు
ఇంత నమ్మకం మంచిదంటారా :)
Deleteక్షణాలన్నీ శత్రువులై పగబట్టెనని తెలీదు
ReplyDeleteమది మెదడు కలుషితమైనా కానరాలేదు
ప్రియుడిని ఇలా ఇబ్బందిలో పెడతారని తెలీదు.
ha ha ha ha ha ...:) :) :)
నేనా ఇబ్బంది పెట్టింది...ఎంతమాట :)
DeletePrema kavita nice
ReplyDeleteThankQ
Deleteకరిగిన కాలం తిరిగిరాని జ్ఞాపకం
ReplyDeleteతలచి నిలిచిపోతే సాగదు జీవితం
తిరిగిరాదు నీకిష్టమయిన గతం
ఆగిపోదు ఎన్నడూ వర్తమానం
మరి తిరిగి రాని వాటి గురించి
నీకు ఎందుకని ఇంత ఆరాటం
అనుభవించు కష్టనషష్టాల జీవితం
ఎదలోపల ఉన్నా ఎడబాటైనా
తప్పదు జీవిత ప్రయాణం...
మీ కవిత జీవిత సత్యం..ధన్యవాదాలండీ.
DeleteVery nice & artistic blog.
ReplyDeletewelcome to my blog Somashekar garu.
Deleteఅనంత అద్భుత ఆనంద సాగరానికే ఎడబాటు వేదన.....?
ReplyDeleteక్షీరసాగరముపై శేషతల్పశయనుఁడు వైకుంఠనాథుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణునికే
Deleteతప్పలేదు శ్రీమహాలక్ష్మీ ఎడబాటు వేదన.. తిరోగమిస్తు పురోగమించే సాగరుడు మినహాయింపేమి కాదుగా.. పైపెచ్చు సాక్షాత్తు అయోనిజ వేదవతి వైదేహియైన సీత సాధ్విని జనకుని ఇంట చేరవేసింది ఈ మహా సాగరుడే కద్ రాజేశ్వరి గారు..
~శ్రీ~
శేషాద్రినిలయా శేషశయన
రాజేశ్వరీ కెవిగారు మీ స్పందనలు స్పూర్తిదాయకం...ధన్యవాదాలండీ.
Deleteప్రేమ ఎంత మధురమో అంతే వేదన కూడా ఎడబాటైతే...మీ బాణీలో సాగిన ప్రేమ కావ్యం!
ReplyDeleteసంధ్యగారు థ్యాంక్యూజీ
Deleteనాతో నీవు లేక మరణం నన్ను తాకనంది-heart touching
ReplyDeletethank you
Deleteపద్మార్పితగారు నమస్కారములు.
ReplyDeleteమీ పోస్ట్లు మీ బ్లాగ్ నాకు ప్రేరణ ఇచ్చాయి. ఎంతోకాలం నుండి రాయాలని ఇప్పుడు రాయడం మొదలుపెట్టాను.
నన్ను ఆశీర్వదించి ఉత్సాహపరచండి.
నా బ్లాగ్ కు సుస్వాగతం
Deleteమీరు బ్లాగ్ ఓపెన్ చేయడం ఆనందదాయకం.
మంచి భావాలు రాస్తారు రాయాలని ఆశిస్తూ..Wishing you all the best.
Very nice painting
ReplyDeleteAwesome words.
thank you Deepak
Deleteమీకు సర్వం శుభప్రదం కావాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteమహీ కొత్తగా ఈ టైప్ కమెంట్ ఏమిటో..:)
Deleteప్రేమ పొలమరించి
ReplyDeleteతలచుకోవడం ఎక్కువై
ఇన్ని బాధలు అనుకుంటాను.
తలుచుకోకపోతే మరింత తలనొప్పేమో :)
Deleteప్రేమ ఒలకబోసారా లేక్ తిట్టారా?
ReplyDeleteఎవరిని తిట్టను చెప్పండి...నన్ను నేనే :)
DeleteLovely poetic lines.
ReplyDeletethank you
Delete
ReplyDeleteప్రేమ నొలక బోసారా ?
ఓమా పద్మార్పితమ్మ ! హోయని తిట్టా
రా? మావా యని బిల్చా
రా? మాటలు మూగబోయె ! రమణీ యబలా !
జిలేబి
ప్రేమ ఒలకబోయాలన్నా
Deleteతిట్టాలన్నా..మావ దరిలేక పోయెగదా!
పొద్దుపోక ఇలా భావాలు రాసుకుంటూ
మీతో పంచుకుంటూ...వందనాలు జిలేబీగారికి._/\_
గమ్యం దారినే గల్లంతు చేసే గమ్మతైనది ప్రేమ
ReplyDeleteప్రేమికుల మనసుల్ని గమ్మత్తుగా మాయ చేస్తుంది మీ కవిత.
ఫోటో చాలా బాగుంది .
ప్రేమికులు మనలోకంలో ఉండరుగా మాయచేయడానికి :)
Deleteక్షణాలు శత్రువులు అయి పగబట్టడం అంటే సమయం గడవలేదనా లేక గడిపోయిందంటారా?
ReplyDeleteవలపు ఎప్పుడూ ఎదో విధంగా చిక్కుల్లో పడేస్తుంది...మీ భావాల్లోను మీ కవితల్లోనూ అయినా బాగుంటుందండోయ్😄
జీవితం ప్రయాణం లాంటిది
Deleteమానవత్వం మంచితనమనేవి పట్టాలైతే
మనిషి జన్మ రైలు లాంటిది
~శ్రీ~
పన్నగశయన పెరుమాళ్
ప్రేమ ఒక పిచ్చిది
Deleteఎప్పుడు ఎక్కడ ఎలా పడేస్తుందో ఎవరికి ఎరుక :)
వేదనలకు దగ్గరగా ఉండడమే అసలైన ప్రేమ.
ReplyDeleteఅంటే ఎప్పుడూ ఏడుస్తూ ఉండమనా :)
Delete
ReplyDeleteవేదనలకు దగ్గరగా
సాధించగ మేల్కలయిక సాధ్యంబగునౌ
శోధింపని మమతా, ప్రే
మాదరణలు నెలతుకకు సమాశ్రయమగుచున్ !
జిలేబి
సాధ్యమేనంటారా :)
Deleteఈ కవిత చదువుతుంటే bedardi balma... song గుర్తుకువచ్చింది.
ReplyDeleteAs usual pic is very nice.
బహుకాలానికి విచ్చేసారు..ధన్యోస్మి
Deleteమంచి సాంగ్ ని గుర్తుచేసారు.
థ్యాంక్యూ వెరీ మచ్ నీహారికగారు.
ఎడబాటు ఇంతగా వేదిస్తుంది అనుకుని తెలిసి ఎందుకు ప్రేమించడం?
ReplyDeleteఎప్పుడు ఎలా పుడుతుందో తెలియనిదే ప్రేమ కదండీ ;)
Deleteమొత్తం ఈ రెండు ముక్కల్లో చెప్పేసారు
ReplyDeleteనాతో నీవు లేక మరణం నన్ను తాకనంది
జీవించడం చేతకాని బ్రతుకు నరకంలాగుంది
సోదిలా చెబితే నచ్చదని :)
DeleteFantastic love expression...బాగుంది పద్మ
ReplyDeletethank you sir.
Deleteతెలుగు రాసేస్తున్నారుగా....happy to see
క్షణాలన్నీ శత్రువులై పగబట్టడం చిత్రంగా ఉంది. చిత్రం చూడ ముచ్చటగా ఉంది.
ReplyDeleteధ్యాంక్యూ సృజనగారు
Deleteవేదన ఇంత వ్యధలోనూ మీ పదాల్లో అందంగానే ఉంది సుమా
ReplyDeleteధ్యాంక్యూ... :)
Deleteఅద్భుతం
ReplyDelete