మట్టితల్లి ఎదను చీల్చుకుని మొలకగా నేను పురుడు పోసుకుని
మనుషులందరికీ ఎంతో సేవ చేసుకుని మహావృక్షమై ఎదగాలని
ఆశపడితినో లేక నేను అందమైన కలనే కంటినో తెలియక పోయె
నా ఈ గుండెఘోషను తీర్చు మానవజాతే లోకంలో కొరవడిపోయె!
మమకారం మరచి అవసరానికి అన్నింటా వాడుకుని నన్ను పీకేసినా
అమ్మలా మిమ్మల్ని చూసుకుంటూ ఆకలి వేసిన నాడు ఆహారమైనా
సేదతీరేవేళ మంచమై, చేతకాని నాడు చేతికర్రగా మారి ఊతమిచ్చాను
పాడుగాలిని కడుపులో నింపుకుని ప్రాణవాయువు మీకు ఇస్తున్నాను!
మలినం లేనట్టి మనసుతో పచ్చగా ఎదిగి అందరి ఇచ్ఛా కావాలని
బ్రతుకంతా మనిషితోటే పయనమై చితిదాకా మీతో కలిసుండాలని
కంకణం కట్టుకున్న నాపైనే కక్షగట్టి నరుకుతుంటే కట్టెనై కాలుతున్నా
భగవంతుడే కలిపిన బంధములే ఇదని సర్దుకుని గాలినై వీస్తున్నా!
మతలబులతో ముడిపడ్డ మనిషి నాకు పుట్టెడు కష్టాలు కలిగించినా
ఓర్పుతో అన్నీ సహించి అక్కున చేర్చుకుని మీకు నీడను ఇచ్చినా
వేరులో దాచిన ఔషధాన్ని ఇస్తి, నా కొమ్మని నీకు ఆయుధంగా చేస్తి
ఇన్ని చేసిన నన్ను మీరు చంపుతుంటే నేలరాలుతూ లోలోన రోధిస్తి!
మంత్రం ఏదో జరిగిపోయి మాయతో రెండు చేతులు నాకు మొలిస్తే
నా ఒంటిపై నీ చేయి పడనీయక వృక్షమై నీకు భిక్ష అయ్యేటి దాన్ని
మానవా.....మనసు ఉన్న మనిషివి కదరా నీవు ఇకనైనా మారవా
అంకురార్పణ మొదలు అణువణువూ నీకే అర్పితమని తెలుసుకొనరా!
తాను ఉన్న చోటుని మరిచిపోదు
ReplyDeleteఎంత ఎదిగినా ఒదిగి చల్లని నీడను సమకూర్చే
తాను కాలాలన్నిటిలో సహనంగా ఉంటూనే
రాళ్ళతో తనను గాయ పరచినా గాని తీపి ఫలాలను సమకూర్చే
మహావృక్షమై నీడనిచ్చే చెట్టు.. కాదు ఎవరికి చేటు
గింజను ఈ రోజున నాటితే.. తరతరాలకు సేవలందించే
ప్రకృతి ఒడిలో పచ్చల హారంలా
సేవ తాత్పర్యతను ఆఖరి నిమిషం వరకు బోధించే
నైస్ థీమ్ ఆన్ ఇంపార్టన్స్ ఆఫ్ ఫోలియేజ్ కంజర్వేషన్ ఫర్ కరెంట్ యాండ్ అప్కమింగ్ జెనెరేషన్స్..
Even for the Timely Rains, Easy Season Changes, Ground Water Balance, Erosion Check, and as Pollution Filter, the Trees play a pivotal role in the Nature.
Awesome Poem, Padma Gaaru
మనిషి మనుగడకు చెట్లు ఆధారం వాటిని కాపాడుకోవడం మన ధర్మం.. చక్కగా చెప్పారు
ReplyDeleteప్రేమాయణం అంటే ముఖం మొత్తినట్లు పద్మార్పితకు
ReplyDeleteలోక సంస్కరణోద్యమము వైపు పయనించదొడిగె ఆలోచనలు👍
వృక్ష వేదన ను ఆలకించి, ఆలోచించి, ఆవేదన తో అక్షర అర్పితం చేసి అందించిన పద్మార్పిత గారికి అభినందనలు
ReplyDeleteఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు
ReplyDeleteఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు
గుండె కోతలెన్నైనా మండి పడదు చెట్టు
మమతల జాబిల్లి మూగతల్లి చెట్టు
పెంచిన ప్రేమపాశమే గంటుపడిందేమో
నేలకొరిగిన పుడమిబిడ్డ ఆ చెట్టు
ప్రాంగణం చిన్నబోయింది లేక చెట్టు
ప్రకృతి పరితపించి కలవరపడె
మౌనమూర్తియై కాలం కదలసాగె
తన పట్టులన్నీ సడలి కూలె చెట్టు
మనిషి మనుగడను మోడు చేసె చెట్టు..
పూలకొమ్మలతో చెట్ట్లూగుతూ చల్లగానిస్తూ
ReplyDeleteగిజిగాడి గూళ్ళు కట్టుకుని కోయిల పాటలు పాడుతూ
నిలువనీడలేని నిర్భాగ్య పసివారిని ఊయలలూగిస్తూ
మనిషిపోయినా తరం మారినా నిరంతరం నిలబడేవి చెట్లు
కాని రానురాను నిర్దాక్షిణ్యంగా వృక్షాలను నరికివేస్తుంటే
నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవడం మూర్ఖత్వం
వాటిని రక్షించి మనల్ని మనం కాపడుకోవడం మానవధర్మం
మీ కవితలో చెట్లు కూలటంలోని ఆవేదన బాగావ్రాసారు.
Trees do so much for you and me, saving them is the key, so a better future we can all see.
ReplyDeleteGood awareness poem.
చెట్లు లేకపోతే పీల్చే ప్రాణవాయువుకు లోటు
ReplyDeleteచెట్లు నరికితే వాతావరణానికి కలుగుతుంది చేటు
చెట్లను నాటి ప్రాణకోట్లను రక్షించమని చెట్టు రోధిస్తున్నట్లు బాగారాశారు.
ReplyDeleteమానవా.....మనసు ఉన్న మనిషివి కదరా నీవు ఇకనైనా మారవా
ReplyDeletemanushulu marali.....
వృక్షో రక్షిత రక్షితః
ReplyDeleteచెట్లు పలకరించవు కాని చల్లగాలిని పంచుతాయి
ReplyDeleteఎండలో నీడను ప్రసాదించి ఎండి రాలిపోతుంటాయి
మాట్లాడకుండా మనసులో మదన పడుతుంటాయి
తమ ఉనికి కరువైతే మనకు కీడు అని చెబుతాయి
Claps
ReplyDeleteClaps
Claps
ఒక్క చెట్టును నాటితే వందసార్లు కాశీయాత్ర చేసినంత పుణ్యమని ఓ నమ్మకం. పాపపుణ్యాల ప్రస్తావన పక్కన పెడితే, మొక్కను నాటితే ప్రకృతికి మంచి జరుగుతుంది. గువ్వలూ కాకులూ గూళ్లు కట్టుకుంటాయి. చీమలూ దోమలూ పురుగూపుట్రా... చుట్టుపక్కల చేరిపోతాయి. మొత్తంగా, చెట్టును నమ్ముకుని బతికే జీవాల సంఖ్య ఐదొందల దాకా ఉంటుంది. అంటే, ఒక్క చెట్టును నాటితే ఐదొందల జీవాల్ని పోషించినట్టే. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణలో వీర సైనికులే. చెట్టుమీది పక్షులన్నీ పొలాల్లోని చీడపీడల్ని తిని, రైతుకు అండగా నిలుస్తాయి. చెట్టును నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు! కన్న బిడ్డలు మోసం చేస్తే చేయొచ్చు కానీ పెంచిన చెట్లు నష్టం కలిగించవు. మంచి ఉపయోగకరమైన కవిత-హరినాథ్.
ReplyDeleteప్రకృతికి ఆధారమైన చెట్లను సంరక్షిస్తూ ప్రకృతికి ప్రాణం నరికివేతకు గురవుతున్న వృక్షాలకు పునర్జన్మను ఇద్దాం రండి.
ReplyDeleteచెట్లను కాపాడమని బాగారాసారు మాడం.
ReplyDeleteపాడుగాలిని కడుపులో నింపుకుని ప్రాణవాయువు మీకు ఇస్తున్నాను
ReplyDelete100% correct
అందరి స్పూర్తి వాక్యాలకు..పద్మాంజలి _/\_
ReplyDeleteచెట్ల విలాపం వివరణ బాగుంది.
ReplyDeleteవృక్ష ఆవేదన మనసుని తాకింది.
ReplyDeleteచెట్టు గోడు కదిలించి మనిషి వాటిని కత్తిరించరాదని ప్రార్ధన.
ReplyDeleteSave water
ReplyDeleteవృక్ష సంపదను కాపాడమని పెట్టిన పోస్ట్ చాలా బాగుంది.
ReplyDeleteసూపర్ రాసారు మాడం.
ReplyDeleteEvergreen post
ReplyDelete