పలుకరించే పదిమందిలో నేనూ ఒకదాన్నై పలుకరిస్తే
పస ఉండదని పరిపరివిధముల యోచించి ప్రియా అన
ఉదయభానుని తొలికిరణంలా నిన్ను నేను చుట్టేసానని
వేల నక్షత్రాలు నిశిరాత్రి నందు నీ పక్కన చేరి నిదురిస్తే
ఈర్ష్య పడిన నా వయసు పిల్లగాలిలా వీచి నిన్ను తాక
నీ మనసంతా కోటికాంతుల వెన్నెలవెలుగు నింపేసానని
ఎన్నెన్నో వర్ణాలు ఏవేవో భావాలను కుంచెగా మార్చి గీస్తే
ఆగనన్న ప్రతి భావంలో నేనే వివిధ భంగిమల్లో అగుపించ
వరించిన వలపు వశం తప్పి అతిసౌందర్య రూపం నాదని
సమస్యల సాగరాన్న నిన్ను ఆటుపోట్ల అలలు ఆవహిస్తే
గాబరాపడ్డ నా మనసు నిన్ను చేరి నేను తోడున్నానన
నీ జీవితపు నావను తీరానికి చేర్చే తెరచాపను నేనేనని
నీ సర్వస్వం నేనని చెప్పలేని నీ నిస్సహాయతని ప్రేమిస్తే
నువ్వు నాకు గులామువై చేయకు సలామని నేను అన
నా ప్రతిబింబమై నన్నంటి నాలోన నిన్ను ఐక్యం చేసావు!

క్షేమమే అంటూ పోస్ట్ పెట్టి తెలిపినారు.
ReplyDeleteఅన్నీ ప్రత్యేకతలు
ReplyDeleteసొంతం కావాలనుకుంటే
ప్రేమభావం
నమ్మకం ముఖ్యం..
అవి ఉన్నప్పుడు
ఏకమై ఆనందం..
జీవితమే ఆటుపోట్ల సంద్రం
ReplyDeleteదుఃఖానికి కృంగమాకు
సంతోషానికి పొంగమాకు
సుఖదుఃఖాలే జివితపు తక్కెట
ఆడంబరమెందులకు ఆత్మీయత తోడుంటే
జీవితం లిమిటెడ్ వర్షన్.. లెట్ హ్యాపినెస్ బీ అన్లిమిటెడ్
మరల మరల రాని వసంతం.. మన జీవిత గమనం
కవిత చిత్రం రెండు బాగున్నాయి పద్మ గారు
ప్రేమ తన్మయత్వంలో ప్రేమికులు ఊగి అదే భావనలో మమ్మల్ని ఊయల ఊపినట్లుంది మీ కవితాచిత్రము.
ReplyDeleteరమ్యం
ReplyDeleteసుమధురం
ప్రేమ కవిత్వం
అసలు విడిపోయింది ఎప్పుడు? :-)
ReplyDeleteచివరి పంక్తులు మనసుని తాకే విధంగా వ్రాసావు.
ReplyDeleteచిత్రము నమ్మినట్లుంది.
ఓహ్..ఏమైనారని విచార పడితి
ReplyDeleteఇదా సంగతి..ప్రేమలో మునిగినారా..హా హా హా
LOVELY POEM
ReplyDeleteవలపు అంతా కూర్చి పేర్చినట్లుంది మీ కవిత
ReplyDeleteప్రేమలో అంతం అదేనేమో అర్పిత.
ReplyDeleteవరించిన వలపు వశం తప్పి
ReplyDeleteఎవరికి ఎలా సాధ్యం కాస్తా వివరించండి
పలుకరించే పదిమందిలో నేనూ ఒకదాన్నై పలుకరిస్తే పస ఉండదని స్పెషల్ కోసం ప్రాకులాడి ప్రేమలో మునిగిపోయె. మొత్తానికి ఏకమై కవితను సుఖాంతం చేసారు.Ha :)
ReplyDeleteపద్మార్పితం అంటే ఇదేమరి
ReplyDeleteవేల నక్షత్రాలు నిశిరాత్రి నందు నీ పక్కన చేరి నిదురిస్తే ఈర్ష్య పడిన నా వయసు పిల్లగాలిలా వీచి నిన్ను తాక, నక్ష్త్రాలకి అంత ధైర్యమా చెప్పండి...:) ప్రేమభరితం మీ కవిత.
ReplyDeleteLovely pair
ReplyDeletePadma hope everything okay.
so nice mam.
ReplyDeleteప్రేమ ఎల్లప్పుడు మధురమే మీ కవితల్లో
ReplyDeleteవిరిసిన మనసున..
ReplyDeleteమురిసిన బాసలు..!
Nice lines.
ReplyDeleteఎన్నెన్నో వర్ణాలు ఏవేవో భావాలను కుంచెగా మార్చి గీస్తే
ReplyDeleteఆగనన్న ప్రతి భావంలో నేనే వివిధ భంగిమల్లో అగుపించ..అంతటా మీరే మీరు
విడిగా రిప్లైస్ కోరుతూ ఆదరించే మీకు విడివిడిగా సమాధానం ఇవ్వలేక పోతున్నందుకు మన్నించాలి-పద్మార్పిత_/\_ అందరికీ నమస్కారములు
ReplyDelete