సెగ సలపరం

వయ్యారి నడుస్తుంటే వెనుక వెనుకే వెళ్ళి 
దాచిన దాగని వంపులకు దాసోహమయ్యి
వలపేదో పుట్టి ఒళ్ళంతా జివ్వుమన్నదని
తను తాకకనే సొగసు సెగలు రేపిందంటూ
నింద తనపై మోపి భుజం తడుముకోనేల!

కోమలి తలెత్తక తన దారిన తానెళుతుంటే
పొంగిన పసిడిపరువం పైటజార్చ పరవశించి
కన్నె ఎదపై కన్నేసి కానరాని చోట కాలగా    
చివరికి చిన్నదాని చేతికి చేపపిల్లవోలె చిక్కి
వాలుకళ్ళతో వలవేసి పట్టెనని వెటకారమేల!

సొగసరితో సావాసమని సోగ్గాడిలా ముస్తాబై
పెదాలపై నవ్వు చూసి నరాలు సయ్యిమన 
కొత్తగా శృంగారం అదుపు తప్పి గింజుకుంటే
నీలోని వేడి బండారమంతా బయటపెట్టునని  
గోటిముద్రలు తాను కోరెనని అబాసుపాలేల!

38 comments:

 1. Replies
  1. కాకతాళీయం యాదృచికం నడుమ జీవితం
   వాస్తవం కలవరం నడుమ జీవితం
   అశ అడియాశల నడుమ జీవితం
   జననం మరణం నడుమ జీవితం
   సుఖ దుఃఖాల నడుమ జీవితం
   అశాశ్వతమైన దేహం చూపించే చమత్కారం
   కపట మోసాల దగా కుట్రాల మధ్య సాగే జీవితం

   పంచభూతాల దేహానికి పంచేద్రియాల ఇంద్రజాలం
   కుళ్ళు కుతంత్రం లేని ఉచ్వాస నిఃశ్వాసల సమాహారం ఈ జీవితం

   Delete
  2. ఏడవాలనుంది రాలేకన్నీటి ధారలుగా
   మనసారా నవ్వులన్ని వసివాడిపోయాయిగా

   ఎదురుచూపులే రుజువులయ్యాయి దినదినమున
   మానవత్వమే నీరుగారిపోయి వెలవెలబోయేనా

   ఏమయ్యిందో రానంది దరికిలా
   మాటకూడా నోరుదాటి వస్తేకదా

   ఏటిగట్టు రావిచెట్టు దరిమిల
   మురిసి నడయాడే వన్నెలాడి

   ఏన్నినాళ్ళైనా ఏమార్చినా రోజులతరబడి రాజేసినా దాగేనా దాచినా
   మనసులో మౌనమై నక్కిన నిప్పుకణిక వైవిద్యభరితమైన వేదన

   Delete
  3. Just as the Monsoon is at its full Swing
   Just as the Tiny Rain Drops are in Full Latent Energy
   Apparently, Your Poem Welcomes the Season just like the Butter Pepper flavoured Pop Corn

   With The Scent of Breeze Amalgamented with Wet Soil's Fragrance and The Leaves, Flowers all look fresh with a Fresh Drizzle..
   These words bring in an Ambience of Novelty..

   Delete
  4. రగ్గు

   ఓ తింగరోడా
   చుట్టు మంచు పొగకే
   వణికిపోతున్నావు
   గజ గజ

   ఖాది షర్టు స్వెటరు
   ఇంకా కొనవా
   అయి పోతావా
   మంచు దిమ్మలా

   వేడి లేకా చెమట లేకా
   ఊసు పోదిలా కలకలం

   జుట్టు పట్టేసుకుంటా
   నిప్పు పెట్టేసి మంటా
   రాజేయనా బాబూ..

   ఎముకలు కొరికె చలిలో
   చుట్టు చీకటంత చూడూ
   నాకు సూపు పెట్టేయమంటా
   వేడి ఆవిరి పట్టేయమంటా
   ఎందుకింత తంటలంట బాబూ

   టెంట్ పెట్టేయమంట బఫె వడించమంట
   చలితెర పోయేదాక సడలక ఉండవచ్చుగా బాబూ

   జుట్టు పట్టేసుకుంటా
   నిప్పు పెట్టేసి మంటా
   రాజేయనా బాబూ..

   A Parody Song from the Movie Guru
   O Sakkanoda
   By Deekshita
   Venkatesh and Rithika Singh Starrer

   Delete
  5. ఖాది షర్టు స్వెటరు
   ఇంకా కొనవా
   అయి పోతావా
   మంచు దిమ్మలా

   వేడి లేకా చెమట లేకా
   ఊసు పోదిలా..అహా హా

   Delete
  6. Thank You Veekshana Gaaru
   Hope You Liked Those Lines..

   Delete
  7. ఏడవాలనుంది రాలేకన్నీటి ధారలుగా
   మనసారా నవ్వులన్ని వసివాడిపోయాయిగా
   ఎందుకు శ్రీధర్ గారు ఏడవడం..ఎన్ని కష్టాలు ఎదురైనా నవ్వుతూ దాటాలి.

   Delete
  8. మీరు చెప్పినది మంచి మాట అమృత గారు..

   అపుడపుడు బాధ కట్టలు తెంచుకున్నప్పుడు కవితగానే రూపుదిద్దుకుంటాయి.. అపుడపుడు సంతోషం హద్దు మీరినా కవితగానే రూపుదిద్దుకుంటాయి.. థ్యాంక్యూ అమ్ము గారు ఫర్ ది కన్సర్న్.. ఆల్వేస్ ఆబ్లైజ్డ్..

   వేదనయని భావం పసిగట్టేశారు.. ఐతే ఆ చిట్టి కవితలో మరో కోణం దాగి ఉంది.. బహుశ అది మీరు గమనించి ఉండరు.

   అన్ని లైన్లు మూడక్షరాతోనే మొదలవుతాయి భావగర్భిత మనస్సాక్షికి అక్షరాల సమాహారమే..

   Delete
  9. తప్పకుండా పాటిస్తాను అమృత గారు

   Delete
  10. Alan Walker 2015 Faded Album


   You were the shadow to my light
   Did you feel us
   I am not a Star to fade away
   Afraid our aim is out of sight
   Wanna see us.. Alive

   Where are you now
   Where are you now
   Where are you now
   Was it all in my fantasy
   Where are you now
   Were you only imaginary
   Where are you now

   I plan it
   I am dying to see
   I am dying to see
   Where are you now
   I am not a dream
   The monster's running right inside of me

   I'm faded
   I'm faded
   So lost
   I'm faded
   I'm faded
   So lost
   I'm faded

   These shallow waters, never met
   What I needed
   I'm letting go
   A deeper dive
   Eternal silence of the sea
   I'm breathing
   Alive

   Where are you now
   Where are you now

   Under the bright
   But faded lights
   You set my heart on fire
   Where are you now
   Where are you now
   (Halloween Remix)
   Where are you now
   I plan it
   I am dying to see
   I am dying to see
   Where are you now
   I am not a dream
   The monster's running right inside of me
   I'm faded
   I'm faded
   So lost
   I'm faded
   I'm faded
   So lost
   I'm faded

   https://youtu.be/60ItHLz5WEA

   Delete
  11. ఎగిసే ప్రతి అల ఒక రాగం
   పలికే ప్రతి పదం ఒక భావం
   ఇసుక రేణువు ఉప్పు నీరు కలగల్పితే సంద్రం
   చిరునవ్వు కంటిచెమ్మ కలగల్పితే జీవితం

   Delete
  12. మీకు మీ కుటుంబ సభ్యులు మరియు ఇక్కడ ఉన్న బ్లాగ్ మిత్రులందరికి పేరుపేరున తొలి ఏకాదశి శుభాభినందనలు..

   ఆ శ్రీ మహావిష్ణు ఆశిస్సులు సదా సర్వదా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను పద్మ గారు..

   జై శ్రీమన్నారాయణ

   Delete
 2. సూపర్ కిక్ పిక్
  పదాలు పూల బాణాలు

  ReplyDelete
 3. మీరు ఇటువంటివి తలుచుకున్నదే తడువు వ్రాసేయగలరు
  కవితానాయిక నిండుతనంతో రెచ్చగొట్టి కవ్విస్తున్నట్లుంది

  ReplyDelete
 4. So romantic mam..hip hip :) :)

  ReplyDelete
 5. Oooooh lalaa..romantic touch :-)

  ReplyDelete
 6. ఆమె నడచి వెళుతుంటే
  వయ్యారం పైరగాలితో కలిసి
  చల్లన మెల్లన వీచి రెచ్చగొట్ట
  మేను హాయిగొల్పి మది చలించ
  ఆకుమాటు పిందెనని ఆమె అన
  మనసు మన మాట వినదు
  వద్దన్నా మారాం చేయక మానదు..

  ReplyDelete
 7. కొంటెతనం మీ కవితాచిత్రం నిండు.

  ReplyDelete
 8. పరువాల చిలుక ఊసులు చెప్పినట్లుంది
  ఆమని భళ్ళున వెల్లివిరిసింది మీ కవితలో,
  తెలుగు కొంటే సొగసు చూడ తరమా చెప్పండి.

  ReplyDelete
 9. పాద పంధాలో పద్మార్పిత ..హ హా :)

  ReplyDelete
 10. శృంగారం చీర కట్టినట్టి కనులకు ఇంపు ఒసగినట్లు ఉంది కవిత. ఏవైనా మీరే వ్రాయగలరు ఇటువంటి సున్నిత శృంగారాన్ని.

  ReplyDelete
 11. Romantic feel andhra.

  ReplyDelete
 12. వలపు పుట్టి ఒళ్ళు జిల్లుమన్నది ఎవరికి?
  చదివిన పాఠకులకి ఇది తధ్యం అనుకుంటాను 😄

  ReplyDelete
 13. చేసిందంతా మీరేనైతిరి
  ...రెచ్చగొడ్తిరి
  మేం నింద ఏసినాం అనబడ్తిరి

  ReplyDelete
 14. అందమైన అమ్మాయి తనువు ఆకర్షణీయంగా ఉండి అలజడి చేసి గిలిగింతలు పెట్టడం సాధారణ విధయమే అయినా అది మీ కవితలో పదాల్లో సున్నితంగా వంపులు తిరిగింది. యుక్తవయసు వారిని రెచ్చగొడుతూ దాటిన వారికి పాత రోజుల్ని గుర్తుచేస్తుంది ఈ కవిత-హరినాధ్

  ReplyDelete
 15. యవ్వనం గువ్వలాంటిది
  ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది

  ReplyDelete
 16. కానరాని వంపులకే
  మెలితిరిగిపోగా..భామ
  వలవేసి పట్టనేల?
  వెటకారాలని నిందలేల?

  ReplyDelete
 17. మీరు ఇలాంటివి అతి సునాయసంగా సున్నితత్వాన్ని జోడించి వ్రాస్తారు. చిత్రాల ఎంపికలో మీరు మేటి.

  ReplyDelete
 18. ఎవరి బండారం బయటపడునో?

  ReplyDelete
 19. స్త్రీ బాహ్య సౌందర్యము ముందు ఎంతటి ధీరుడైనా దిగదుడుపే అంటారు.
  నిగ్రహానికి ఎక్కడా తావులేదు ఇవ్వలేదు అవునా?

  ReplyDelete
 20. చిత్రం పూర్తిగా మనసుదోచి అక్షరాలను దాచింది పద్మార్పిత.

  ReplyDelete
 21. శృంగార
  మేళవింపు
  మధురం.

  ReplyDelete
 22. mam how are you?
  eagerly waiting for your post.

  ReplyDelete
 23. ఇలాంటి పోస్ట్లు రాస్తే మా గుండె జారి గల్లంతైపోదా

  ReplyDelete