నీ అస్థిర చంచల మనసుతో తూకమేయకు నా ప్రేమను
కవాటాలే కంపించి హృదయమే కదలాడేను గారాభంతో
అంచనాలు వేసి అధికమించి దాటేయకు అనురాగకొలను
నీ అణువణువూ కరిగేను నా అనంత ప్రేమ సామ్రాజ్యంలో
వలపువలకి చిక్కిన మనసుకి వినిపించకు అలజడులను
మూగవైన భావాలు ఆగలేనని గొంతెత్తి పాడేను ఆవేశంతో
నీ స్వప్న జగత్తుకి రంగులు అద్దమనకు నా ఆశయాలను
సరిపెట్టుకోలేనంటూ విలవిలలాడేను వివరించలేక తనలో
అదే అలుసుగా గెలుపు నీది అనుకుని శాసించకు నన్ను
నీ అందలానికి నేను సోపానం కానని చింతించకు వేదనతో
తిమిరాల ప్రమిదనని తీర్పు చెప్పి నిందించకు నా ప్రేమను
సౌఖ్యాలు సమిధలైనా అణగారిపోయే కోర్కెలేం కోరుకోను...
ఇంతక్రితం మనసులే చంచలం
ReplyDeleteరాను రాను మనస్తత్వాలే అనిశ్చలం
కాలానుగుణంగా మార్పు సహజం
కాని కదిలే కాలానికి గంటలు యథాతథం
మానసిక పరిపక్వత తోడైతే కన్నీరు సైతం పన్నీరే
అయోమయం శంషయం ఎదురైతే మాట సైతం మౌనమే
పిచ్చి మనసుకు ఏవేవో కొర్కెలు
తిమిరంలో తడబడే పాదముద్రలు
సంద్రం ఇసుకరేణువులు జీవితం కాలమైతే
ఇసుక పై బాధని రాయాలనుంది.. కాలం కడిగేయగా
రాళ్ళ పై జ్ఞాపకాలను చెక్కాలనుంది.. శిల్పం రూపు దాల్చగా
అహ్నిలో అజ్యం పవిత్రతకు తార్కాణం.. ఇదే కాబోలు వేదనలో వేడుకగా కట్టే పదతోరణం..!
కలహంస చిత్రం తో పదప్రయోగం ఆమోదయోగ్యంగానుంది పద్మగారు..
ఆడవారు అపర చాణుక్యులు ఆడి వాదించి గెలవలేము హా హా హా.
ReplyDeleteఅద్భుతం మీ కవిత దానికి తగిన చిత్రం.
ReplyDeleteజీవితంలో స్థిరంగా ఉండగలమా చెప్పండి
ReplyDeleteమీరు ఉండగలరు అంటే మాకు ఓకే :)
స్థిరమై ఒకే మాటకు కట్టుబడి ఉండడానికి మనుషులు భగవంతుడు కాదు. పరిస్థితులకు అనుగుణంగా అందరూ మారవసిందే తప్పదు. అనుకున్నవి అన్ని జరగాలి అనుకోవడం కూడా ఒక విధంగా నేరమే అవుతుందేమో..
ReplyDeleteమూగవైన భావాలు ఆగలేనని గొంతెత్తి పాడే-touche chesaru
ReplyDeleteGood Post...
ReplyDeleteClick Here To 10th క్లాస్ ప్రశ్నా పత్రాలు, టీచర్ నోటిపికేషన్స్, మీకు, మీ పిల్లలకు అవసరమైన ప్రతి సామాచారం ఇక్కడ లభిస్తుంది.
నిర్ణయాలు తీసుకోవడం
ReplyDeleteఎదుటివారినుంచి ఆశించడం
ఆలోచించి చేయవలసిన విషయాలు.
చిత్రం ఎక్సలెంట్ అండీ
మనసు మనం కావాలి అనుకున్నవి ఎప్పుడూ దూరమయ్యేటట్లు మనల్ని చేస్తుంది. ఇది అర్థం చేసుకుని కోరినవి వద్దని అనుకుంటే సరిపోతుంది. పిచ్చిమనసు ఎప్పుడు మన మాట వినదు సుమ్మీ :)
ReplyDeleteమనసుకి నచ్చేది.. ఒక్కోసారి కాలమనే వరదలో కొట్టుకుపోతుంది..మనసుకి అర్థం కాని విషయాలన్ని మనసు అర్థం చేసుకుంటుంది.. వెఱ్ఱితనమో ఏమో.. తెలిసి కూడా ప్రాకులాడుతు ఉంటుంది.. మనసు మాట మనం వినగలిగితే.. మనోగతం అవగతమౌతుంది.. లోలోపల దాచుకున్న భావాలన్ని ఊసులుగా చెప్పుకోలేక.. ఇబ్బడిముబ్బడిగా అక్షరాలన్నిటిని భావాలలో కలగాపులగం చేసి తనకి మౌనరాగమైనా నిస్తేజమైనా విషాదమైనా గాని ఓ కావ్యమా.. మాటలుగా చెప్పలేనివన్ని అక్షరాలుగా పేర్చి ఆబాలగోపాలన్ని అలరిస్తుంది.. తాను మాత్రం ఏకాకిగా మిగిలుంటుంది భావాన్వేషణలో
Deleteరాగిణి గారు.. మీ వ్యాఖ్యను చూసి నాకు తోచిన పదవిన్యాసం చేశాను.. తప్పులేమైనా ఉంటే మన్నించండి..
~శ్రీ~
వెలకట్టలేని బంగారం కూడా గనిలో రాయే
Deleteనడక నేర్చిన బాటసారికి ప్రపంచమంత ఇల్లే
గడసుతనపు ఛాయలున్నవారి మనసు వెన్నయే
అవాంతరాలొచ్చినా అధిగమించే గుణం మనోధైర్యమే
నిప్పు కణిక చిన్నదైనా లోన దాగిన శక్తి అసమానమే
నీడ వెంట వెలుగు అఖండమై ప్రజ్వలించే జ్యోతియే
మనసు ముక్కలైనా మానవత్వం కలిగుండేది మంచితనమే
మనషుల నడుమ భేదాలు తొలిగిన నాడు భూలోక స్వర్గమే
కాలం అన్ని మారుస్తుంది
ReplyDeleteకఠినంగా చేస్తుంది..
ఆనందాన్ని విషాదంగాను
విషాదాన్ని మరిచేలా చేస్తుంది
ఎక్కువగా ఆలోచిస్తే ..
వేదాంత ధోరణి వస్తుంది
అందుకే దేనికైనా చలించక
యోగిలా మారితే బాగుంటుంది..
వేడి నీరు ఒకటే
Deleteకోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది
ఆలుగడ్డను ఉడికిస్తే మెత్తబడుతుంది
రాగద్వేషం ఒక్కటే
ఆనందం కలిగినపుడు ఆనందభాష్పాలవే
దుఃఖం కలిగినపుడు కన్నీటి ఓదార్పులవే
మానవ జీవితం ఒకటే
అమ్మ పొత్తిళ్ళలో పురుడు పోసుకునేది ఇదే
చివరి మజిలిలో కాటిలో కాలి భస్మమయ్యేది ఇదే
Beautiful picture with excellent lines padma.
ReplyDeleteజీవితం సర్దుబాటు అంతే.
ReplyDeleteఏం కోరుకోను వరకు ఓకె
ReplyDeleteఅస్థిరం చంచలమని కోపం చూపితే ఇబ్బంది
సూపర్
ReplyDeleteనీ ఆనందానికి నేను సోపానం కాను కొత్తగా బాగుంది.
ReplyDeleteసాగరంలోనూ అలలు తప్పవు
ReplyDeleteమనిషిగా పుట్టినప్పుడు సర్దుబాటు తప్పదు
స్థిర తిమిరంలా ఉండిపోవడం అందరికీ చేతకాదు
పెయింటింగ్ చాలా బాగుంది.
"తడారిపోయి నేడు నేల బీటలువారిందే తప్పితే నవ వసంతాలు తనకే సొంతం."
Delete"మాటలురాక నేడు గొంతు మూగబోయిందే తప్పితే గలగల గోదావరి కృష్ణ తనకే సొంతం."
"చిరునవ్వులేక నేడు మోము చిన్నబోయిందే తప్పితే ఆత్మీయ పలకరింపులు తనకే సొంతం."
అంచనాలు వేసి అధికమించి దాటేయకు అనురాగకొలను..హెచ్చరికా?
ReplyDeleteమరెన్నో భావాలను రాసేలా ప్రేరేపిస్తున్న అందరి స్ఫూర్తి వ్యాఖ్యలకూ నమోః వందనములు_/\_
ReplyDelete