నిండు చంద్రుడివై నీవు నా ఎదురుగా ఉంటే
పెదవిదాటి మాటలు రాక మౌనంగా నేనుంటే
తలపుల్లో లేవనీ కాదు నీ పై ప్రేమ తగ్గలేదు!
నిలువెత్తున్న నీవు అదోలా నన్ను చూస్తుంటే
నాలో కూడా కోరికలు ఉవ్వెత్తున పడిలేస్తుంటే
ఆశను తెలుపలేనన్న నా సిగ్గుది తప్పుకాదు!
నింగిపైన విహంగిలా ఊహలెన్నో ఎగురుతుంటే
ఎదలో అలజడులు నన్ను గాబరా పెడుతుంటే
భావం బయట పెట్టలేకపోతే పిరికిదాన్ని కాదు!
నిశ్చల మదిలో వలపు ఎగసి ఎగిరిపడుతుంటే
గాయమగునని ఆలోచనలు హెచ్చరిక చేస్తుంటే
వెనుకంజె వేసే వయ్యారి వగలాడిని కానేకాదు!
నిర్మలమైన ప్రేమని ఓటమొచ్చి కౌగిలించుకుంటే
బెదిరిపోయిన నువ్వు తొణకని నన్ను కాదనంటే
ప్రేమించే మనసున్నంత కాలం లోకం గొడ్డుపోదు!
పెదవిదాటి మాటలు రాక మౌనంగా నేనుంటే
తలపుల్లో లేవనీ కాదు నీ పై ప్రేమ తగ్గలేదు!
నిలువెత్తున్న నీవు అదోలా నన్ను చూస్తుంటే
నాలో కూడా కోరికలు ఉవ్వెత్తున పడిలేస్తుంటే
ఆశను తెలుపలేనన్న నా సిగ్గుది తప్పుకాదు!
నింగిపైన విహంగిలా ఊహలెన్నో ఎగురుతుంటే
ఎదలో అలజడులు నన్ను గాబరా పెడుతుంటే
భావం బయట పెట్టలేకపోతే పిరికిదాన్ని కాదు!
నిశ్చల మదిలో వలపు ఎగసి ఎగిరిపడుతుంటే
గాయమగునని ఆలోచనలు హెచ్చరిక చేస్తుంటే
వెనుకంజె వేసే వయ్యారి వగలాడిని కానేకాదు!
నిర్మలమైన ప్రేమని ఓటమొచ్చి కౌగిలించుకుంటే
బెదిరిపోయిన నువ్వు తొణకని నన్ను కాదనంటే
ప్రేమించే మనసున్నంత కాలం లోకం గొడ్డుపోదు!
Soooper painting
ReplyDeletelovely lines.
విశాలమైన మదిలో వలపు పురివిప్పి నాట్యమాడుతుంది.
ReplyDeleteబాగుంది వలపు విశాలంగా.
చిత్రం మరింత చూడ ముచ్చటగ ఉందండి.
aha..so beautiful.
ReplyDeleteమిరజాలగలడా మీ మాటను? అంతటి సాహసం చేసి కాదనేవారు ఎవరో..హ హా హా
ReplyDeleteమీ కమెంట్ నాకు శ్రీకృష్ణసత్య లో మాట మీరగలడా సత్యాపతి అనే పాటను గుర్తుకు తెచ్చింది నందు గారు
Deleteనింగిపైన విహంగిలా ఊహలెన్నో
ReplyDeleteఅందరిలో ఇటువంటి ఊహలు సాధారణం
నెరవేరేది మాత్రం కొందరికేనండి.
"ఊహల రెక్కలపైనా ఊరేగే దారులు ఒకటే.. చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే.."
Delete1998 పెళ్ళిపందిరి మూవిలోగల ఈ పాట ఫ్లాష్ అయ్యింది..!
మనసులు ఎంత విశాలమైనా
ReplyDeleteవీలు కాని చోట విచారించి
సాధించేది ఏమి ఉంటుంది
మౌనం దాల్చడం ఉత్తమం,
Painting excellent
అప్పుడప్పుడు మనసు ఇరుకుగా ఉన్నప్పుడే మనోభావాలకు దగ్గరగా అనిపిస్తది ఆకాంక్షగారు.. బై ది వే దిస్ ఇజ్ నాట్ వ్యాలీడ్ ఇన్ ఆల్ ది కేసెస్.. మనోవైశాల్యత గొప్పదే.. దయగల హృదయం కోవెలతో సరిసమానం..
Deleteమనసు తెలిసినా అయోమయ స్థితి
ReplyDeleteఆశగా ఎదురు చూసినా అగమ్యగోచర స్థితి
మాటల్లో భావాలన్ని అతలాకుతలమైన పరిస్థితి
మౌనమే మిగిలే చివరాఖరికి ఏలా ఈ పరిస్థితి
తెలియని మనసైతే పరిహాసమాడినా వలదు
తెలిసి మసలుకొనుట సమాజ రీతి కలదు
ఎండ గట్టి సాధించేదేముందిక నీరుగారి
మనోమందిరానా మంచితనమే చమురు ఓ బాటసారి
మనసుని హత్తుకునేలా విరహాన్ని సైతం అభివర్ణించటం మీకే చెల్లు పద్మగారు
શાયદ વો લમ્હા પલભર હી સહી લૌટ આ જાયે જિસકી મુઝે બેસબ્રી સે ઇન્તજ઼ાર રહા હૈ.
DeletePerhaps I am waiting impatiently for that moment to get back, even for a while.
లుపుచూ రుదుఎ నిస్తారికలప
Deleteలుకాపజ్ఞా నమ డాంని దిమ
రున్నీక డాంని లన్నుక
దూక వుస్తావనీ విధమా
సేచూ చివే డువుధమా
నిన్నటి ఆ ఆకాశమే తన చేతులు చాచి
Deleteనిండు పున్నమిని ఆహ్వానించింది..
నిన్నటి ఆ అమవస నిశిధిని మెలమెల్లగా విడిచి
పౌర్ణమి వెన్నెలను కురిపింపగా నడయాడింది..
నిన్నటి ఆ పంతాలతో విసుగెత్తి పంథా మార్చి
జూన్ తొమ్మిదిన ఫుల్ మూన్ మనసారా నవ్వులోలికించింది..
ఏరువాక ఆషాఢ పౌర్ణమి సందర్భోచిత వ్యాఖ్య
00:00 09.06.2017
wah beautiful & awesome
ReplyDeleteతొణకని బెణకని ప్రేమ అజరామరం
ReplyDeleteసాగిపోతుంది జీవితకాలం..
కాంట్రాడిక్టరి స్టేట్ మెంట్ ఆశ గారు.. అజరామరమంటూనే జీవితకాలం తో పోల్చారు..
Deleteఒకరకంగా భగవంతుడు అజరామరం.. జీవాత్మ జీవితకాలం..
amazing poetry.
ReplyDeletenee dhairyaaniki vyaktitwaniki namaskaram.
keep it up my friend.
"ప్రేమించే మనసున్నంత కాలం లోకం గొడ్డుపోదు" చివరి వాక్యాలతోన్ ప్రేమకు జీవం పోసారు.
ReplyDeleteనిఖచ్చితంగా చెప్పారు ప్రేమదే పైచేయని..శభాష్
ReplyDelete....
...
..
ఢిషుం
ReplyDeleteఢిషుం
ఢిషుం
మనసు దోచారు
excellent lovely poem.
ReplyDeleteబాగుంది మీ కవితాచిత్రం.
ReplyDeleteవలపు తుంటరిది
ReplyDeleteవేదలన పుట్ట కలసిరాకుంటే
ప్రేమించే మనసున్నంత కాలం లోకం గొడ్డుపోదు ఇది నిజం.
ReplyDeleteఅందరి కమెంట్స్ కి పేరు పేరునా అభివందనములు.
ReplyDelete